Pages

సీతాదేవి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ


ప్రశ్న : సీతాదేవి టెస్ట్ట్యూబ్బేబీ అనీ, నారదుడు నేటి గూగుల్కు సమానమనీ, పుష్పక విమానం నేటి విమానాలకు సమానమనీ, రామాయణ కాలం నాడే మనదేశంలో ఇవన్నీ తెలుసనీ కొందరు ప్రముఖులు ప్రకటిస్తున్నారు. ఇవెంత వరకు నిజం?


జవాబు : గతంలో చాలాసార్లు ఇదే శీర్షికలో చర్చించుకున్నట్టుగా అద్భుతమైన శాస్త్ర సాంకేతిక ఆధునిక ఆవిష్కరణలు జీవితంలో అంతర్భాగమయినపుడు, అవి కచ్చితంగా ఋజువయినపుడు ఛాయలు మాకు ముందే తెలుసని చెప్పుకోవడం ఈమధ్య మామూలవుతోంది. ఒకవేళ వాళ్లు ఉటంకించే కాలాల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక నిరూపణలకు పూర్తి భిన్నంగా ఉన్న వాటిని ప్రస్తావిస్తే 'మా మనోభావాల్ని కించపరిచారనో, అవి శాస్త్ర సాంకేతిక పరిధిలోకి రావనో' వాదిస్తారు. టెస్ట్ట్యూబ్బేబీ అనేది రెండు రకాలు. ఒకటి తండ్రి శుక్ర కణాలను, తల్లి అండాన్ని తల్లి గర్భంలో కాకుండా పరీక్షా నాళికలో సంయోగపరుస్తారు. విధంగా ఏర్పడ్డ సంయుక్త బీజకణాన్ని  కొన్ని విభజనలు అయ్యాక తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. అప్పుడిక తల్లి గర్భంలో బిడ్డ పెరిగి ప్రసవానంతరం మామూలు మనిషిలా మారుతుంది.ఇక్కడ సహజత్వానికి లేదా సాధారణతకు వేరుగా రెండు జరిగాయి. 1. తల్లిదండ్రుల సంభోగంలో పాల్గొననవసరంలేదు. తల్లి, తండ్రి ఇద్దరూ తమ శీలాన్ని కోల్పోలేదు. వారికి పెళ్లి కూడా కానవసరంలేదు. 2. పిండాన్ని మోస్తున్న తల్లి వాస్తవంగా బిడ్డకు జీవశాస్త్రం ప్రకారంగా తల్లి కానవసరంలేదు. కేవలం అద్దె తల్లి (డబ్బు తీసుకుంటుందా లేదా అన్నది వేరే విషయం). ఇలాంటి తల్లిని గర్భధారణ మాతృత్వం  అంటారు. 9 నెలలు మోయడం, కనడం తప్ప అద్దె తల్లి స్వయం అండం బిడ్డ రూపొందడంలో అంతర్భాగం కాదు. డీఎన్ పరీక్ష చేస్తే తల్లి లక్షణాలు బిడ్డలో కనిపించవు



ఇక రెండవ రకపు పరీక్ష టెస్ట్ట్యూబ్బేబీ ఏర్పడే పద్ధతి క్లోనింగ్ప్రక్రియ ద్వారా. ఇందులో తండ్రి శుక్రకణం అవసరం లేదు. తల్లి అండంలో వున్న క్రోమోజోముల అవసరమూ లేదు. కేవలం తల్లి అండపు గోడలు (ఖాళీ డబ్బాలాగా) చాలు. అందులో తన మామూలు కణంలో వున్న 23 జతల క్రోమోజోముల్ని గానీ లేదా మరో పురుషుని మామూలు కణంలో వున్న 23 జతల క్రోమోజోముల్ని గానీ జొప్పిస్తే అపుడా అండం కృత్రిమంగా తయారయిన సంయుక్త బీజకణానికి సమానమవుతుంది. అలాంటి అండాన్ని తల్లి లేదా మరో తల్లి గర్భపు గోడలపై అతికిస్తే 9 నెలల తర్వాత బిడ్డ తయారయి ప్రసవం ద్వారా బయటకు వస్తుంది. బిడ్డ రూపు రేఖలు అచ్చం ఎవరి 23 జతల క్రోమోజోముల్ని ఖాళీ అండంలో ఉంచారో వ్యక్తిలాగానే వుంటాయి. డాలీ అనే గొర్రె పిల్ల ఇలాగే పుట్టింది. గొర్రెపోతుతో సంభోగించబడకుండానే  తనలాంటి గొర్రెనే క్లోనింగ్ప్రక్రియ ద్వారా కనింది. మానవ క్లోనింగ్జరుగుతున్న వార్తలు వస్తున్నాయి గానీ వాస్తవాలు తెలీవు. జనవిజ్ఞాన వేదిక మానవ క్లోనింగ్కు వ్యతిరేకం.



ఇందులో కూడా రెండు అసహజ విషయాలు లేదా సాధారణత్వానికి భిన్నంగా వున్నాయి. 1. మగజాతి అవసరమే లేకుండా మానవుల్ని ఉత్పత్తి చేయగలం. 2. తల్లిదండ్రులు సంభోగంలో పాల్గొననవసరంలేదు. కాబట్టి తల్లి శీలం చెడిపోలేదు



రామాయణ గాథలో సీతను 'అయోనిజ' అంటారు. అంటే యోని  ద్వారా అందరిలాగా పుట్టలేదు. సిజేరియన్ఆపరేషన్ల ద్వారా పుట్టేవారు కూడా అదే అర్థంలో అయోనిజులే. కానీ రామాయణ కథా రచనాకాలంలో (ఎందుకంటే రామాయణం గ్రంథోపగతికంగా మానవ చరిత్రలో భాగమైనట్టుగా దాఖలాలు లేవు.) సిజేరియన్ఆపరేషన్లు తెలీవు కాబట్టి, సహజ ప్రసవాలు  మాత్రమే తెలుసు కాబట్టి సీతను 'అయోనిజ' అన్నారు. కానీ సీత పుట్టుకకు తల్లి, తండ్రి లేరు. కథలో తనంత తానుగా లక్ష్మీదేవి సీత రూపంలో శిశువుగా నేలలో పెట్టెలో ఏర్పడుతుంది. జనకుడు పొలం దున్నుతుండగా (రాజులు అప్పుడప్పుడు హాబీగా పొలం వైపు వెళ్తారు. వారి ప్రధాన వృత్తి రాజ్య విస్తరణ, శృంగారక్రీడ, జంతువుల వేట, అలంకరణ, యజ్ఞయాగాదుల నిర్వహణ, పన్నుల సేకరణ వంటివి) నాగలికి సీత ఉన్న పెట్టె దొరుకుతుంది. ఆమెను పెంచి పెద్దచేసి రాముడితో కళ్యాణం జరిపిస్తారు. ఇక్కడ మీరన్న మేధావి పెట్టెనే టెస్ట్ట్యూబ్గా భావించాడనే అనుకొందాం. కేవలం తండ్రి అవసరంలేకుండానే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే జన్మించినదన్న ఒకేఒక్క ఊహ ద్వారానే ఆయన అపుడే (ఎన్ని సంవత్సరాల క్రితం అన్న లెక్క వారు చెప్పరు) టెస్ట్ట్యూబ్బేబీ అన్నారు. కానీ వాస్తవంగా టెస్ట్ట్యూబ్బేబీ ఆధునికతలో ఎంతో జీవశాస్త్ర పరిజ్ఞానం వుంది. డీఎన్ నిర్మాణం వుంది. దాన్ని తెలుసుకొనేందుకు ఎక్స్రే విశ్లేషణ పరిజ్ఞానం వుంది. పరమాణువు నిర్మాణాన్ని గురించిన అవగాహన, వర్ణ పట విశ్లేషణలు, అణు నిర్మాణం, శవ రసాయనిక ధర్మాలు యిలాంటి ఎన్నో సునిశితమైన పరిశోధనలు, ఆవిష్కరణల పర్యవసానంగా గతితార్కిక పద్ధతితో వరవడిలో డీఎన్ నిర్మాణం తెలియవచ్చింది.డీఎన్ నిర్మాణం, కణ విభజన, ప్రత్యుత్పత్తి విధానాలు, కణ విభజనలో మియాసిస్విభజన, మైటాసిస్విభజన, సంయుక్త బీజకణం ఏర్పాటయ్యే అంతర సంఘటనల గురించి సవివరంగా బోధపడ్డాకే క్లోనింగ్ప్రక్రియకు మార్గం సుగమం అయింది. విజ్ఞానశాస్త్ర చరిత్రలో గానీ, మానవ సామాజిక చరిత్రలో ఏదీ మంత్రాలతో గానీ యాగాలతో గానీ జరగలేదు. 'హాం ఫట్‌' అంటే శిశువు పెట్టెలో ఏర్పడదు. అవన్నీ కేవలం ఊహాజనిత కథలు. కథలు చాలా బాగా ఉంటాయి. బాలనాగమ్మ కథలో మాయలఫకీరు ప్రాణం చిలుకలో వుందని అంటే కథే కదా అని సరిపెట్టుకొంటాం. మీరన్న ప్రముఖుడు ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా ప్రతి మనిషి ప్రాణం రాయిలోను, చిలుకలోను, బొద్దింకలోను ఉందంటే... 'ఇలాంటి పెద్దమనుషుల చేతిలో దేశమేగతి బాగుపడునోయి' అని ఖిన్నుల వుతాము. ఒకవేళ వీరికి ఇవన్నీ కూడా తెలుసనే అనుకుందాం. భూమాత గర్భం ఎక్కడీ బిడ్డకు ప్లాసెంటా ఏది? ఎలా ఎదిగింది? పెట్టెలో గాలి, ఆహారం ఎలా దొరికాయి? అగ్నిలో దూకితే కూడా కాలిపోకుండా ఉండగలరా? మనిషి (ఆంజనేయుడు) గాలిలో ఎగరగలడా? ఇలాంటి ప్రశ్నలు వేస్తే 'మనోభావాలు' అంటూ వాదనకు/ దాడికి వస్తారు.



ప్రొ. . రామచంద్రయ్య, సంపాదకులు, చెకుముకి,జన విజ్ఞాన వేదిక