Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

ప్రపంచ రక్తదాతల దినోత్సవం


శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ది చెందినప్పటికీ కృత్రిమ రక్తాన్ని తయారు చేసేవీలు లేక అనసరమైన మేరకు రక్తాన్ని దానం ద్వారా మాత్రమే సేకరించే వీలు వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఎనిమది లక్షల యూనిట్‌ల రక్తం అవసరం కాగా అందులో 6 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే బ్లడ్‌బ్యాంక్‌ల ద్వారా సేకరించగలుగుతున్నారు. అవసరమైన రక్తాన్ని దాతలనుంచి సేకరించడానికి, రక్తదానం పై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఈ నేఫధ్యంలో ప్రతి సంవత్సరము జూన్‌ 14 న ' ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని' జరుపు కుంటున్నాము . రక్తాన్ని సేకరించడానికి దాతలలో అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశము . తొలి వరర్డ్ బ్లడ్ డోనార్ డే ను 2004 జూన్ 14 జరపాలని తీర్మాణము జరిగినది .

'ప్రభుత్వ అనుమతిలేకుండా ఎవ్వరూ బ్లడ్‌ బ్యాంక్‌లనుంచి రక్తాన్ని సేకరించకుండా, సేకరించిన రక్తాన్ని పరిక్షించకుండా ఎవ్వరికీ మార్పిడి చేయకుండా జాతీయ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ యాక్ట్‌2008 లో అమలు లోకి వచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లఘించిన వారికి రెండులక్షల జరినామా, ఆరునెలల జైలు శిక్ష వుంటుంది. రక్త మార్పిడితో ప్రాణాంతక మైన వ్యాధులు వ్యాప్తిచెందకుండా ఈ మేరకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. అంతే కాకుండా రక్తదానాన్ని వృత్తిగా భావించే వారిని పూర్తిగా బ్యాన్‌ చేస్తున్నామని' ఏపి ఎయిడ్స్‌ నియంత్రణ ( బ్లడ్‌ సేఫ్టీ ) జాయింట్‌ డైరక్టర్‌ ఎం.ఎన్‌ కిషోర్‌ చెప్పారు.

శరీరం లో చాలినంత రక్తం లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు . శరీరం లొ 5 - 6 లీటర్ల రక్తం ఉంటుంది . అంటే శారీకక బరువులో ఇది 8 శాతము . ఒక కిలో శరీరము బరువుకు 80 ఎం.ఎల్ . చొప్పున్న ఉంటుందన్నమాట . శరీరం లోని అవయవాలు సక్రమం గా పనిచేయడానికి సరిపడ రక్తం అవసరము .

రక్తం లో ఏమి ఉంటాయి :
55 శాతము ప్లాస్మా ,
45 శాతము సెల్స్ .... ఉంటాయి .
ప్లాస్మాలో 91% నీరే , 8% ఆర్గానిక్ మాలిక్యూల్స్ , 1% ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి .
సెల్స లో ఎర్రరక్తకణాలు (RBC),తెల్లరక్తకణాలు(WBC) , ప్లేట్ లెట్స్(platlets) ఉంటాయి .
ఒక లీటరు రక్తం లో --- ఎర్ర రక్తకణాలు =5-6 మిలియన్లు -ఆక్షిజన్ సరఫరా కు తోడ్పడతాయి ,
--------------------తెల్లరక్త కణాలు =4-11 మిలియన్లు ,--శరీరం లొ ఇంఫెక్షన్ పై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి .
-------------------ప్లేట్ లెట్స్ కణాలు=1.5 - 4 మిలియన్లు ఉంటాయి -- రక్తం గడ్డ కట్టడానికి సహకరిస్తాయి .

ఎర్రరక్త కణాలు తగ్గితే అనీమియా అంటారు . ఎర్ర కణాలు శరీరము లో ఆక్షిజన్ సరఫరాకు ఉపయోగ పడతాయి . ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ , విటమిను బి12 , విటమిను సి , తగినంత పోటీన్లు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది .

రక్తహీనత ఏర్పడినపుడు , యాక్షిడెంట్స్ వలన గాని , కొన్ని వ్యాధుల వలన గాని అధిక రక్తాన్ని కోల్పోతున్నపుడు , కొన్ని అత్యవసర ఆపరేషన్లు కు .. రక్తాన్ని ఎక్కించాలి . ప్రాణం కాపాడడానికి బ్లడ్ ట్రాన్స్ ఫూజన్ ఎంతో అవసరము . రక్త దాతల వలనే ఇది సాధ్యమవుతుంది . అవసరానికి సరిపడ రక్తం దొరకడం లేదు , రోజు రోజుకీ డిమాండ్ పెరుగు తూ ఉన్నది . కారణము రహదారి ప్రమాదాలు ఎక్కువడడమే .

అర్హతలు -- జాగ్రత్తలు :

రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యము కలిగిఉండాలి ,18 నుండి 60 యేళ్ళ మధ్య స్త్రీ ,పురుషులు ఎవరైనా రక్తదానము చేయవచ్చును ,రక్తదాత 45 కేజీ ల బరువు పైబడి ఉండాలి .

సాదారణ స్థాయిలొ బి.పి , సుగరు ఉండాలి ,మూడు నెలల వ్యవధి లో యేడాదికి నాలుగు సార్లు రక్తదానము చేయవచ్చు ,
రక్తదానము చేయడానికి 12 గంటలు ముందు , తరువాత ఆల్కహాల్ తీసుకోకూడదు ,స్త్రీలు రుతుక్రమము లోను , గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .

గ్లోబల్ థీం లొ అనేక దేశాలు సబ్యులు గా చేరాయి . బ్లడ్ డోనార్ డే ను సంయుక్తం గా 4 ప్రధాన ఏజెన్సీలు స్పాన్సర్ చేస్తున్నాయి . ఇవి " 1.వరల్డ్ హెల్త్ ఆర్గనైనేషన్(WHO), 2.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ , 3.రెడ్ క్రిసెంట్ సొసైటీలు , 4.ఇంటర్నేషనల్ బ్లడ్ డోనార్ ఆర్గనైజేషన్లు ,
ప్రతియేటా ఈ భాగస్వామ్య సంస్థలు గ్లోబల్ వరల్డ్ బ్లడ్ డొనార్ డె కు ఆతిధ్యమివ్వడానికి ఒక దేశాన్ని గుర్తిస్తాయి . జాతీయ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థల్లో స్వచ్చంద , ఆర్ధికేతర దాత పాత్ర ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే అంతర్జాతీయ మీడియా ప్రచారాన్నిక్కడ బాగా ఫొకస్ చేస్తారు . బ్లడ్ ట్రాన్స్ ఫూజన్ సర్వీసెస్ , బ్లడ్ డోనార్ ఆర్గనైజేషన్లు , ఇతర సంస్థలను బలోపేతం చేయడం ద్వారా స్వచ్చంద రక్తదాతల కార్యక్రమాలను జాతీయ స్థాయిలో విసృతపరచి స్థానికం గా ప్రచారం చేస్తారు .


అపోహలు
* రక్తదానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. కానీ శుభ్రమైన (స్టెరైల్‌) పరికరాలు వాడితే ఇన్‌ఫెక్షన్లు దరిజేరవు.

* ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మరికొందరి భావన. దీంతో ఎలాంటి అనారోగ్యమూ తలెత్తదు. రక్తదానం తర్వాత కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే చాలు.

* రక్తదానానికి ఎక్కువ సమయం పడుతుందని కొందరు వెనకంజ వేస్తుంటారు. ఒకసారి రక్తదానం చేయటానికి గంట కన్నా ఎక్కువ సమయం పట్టదు.

* రక్తదానం చేసిన తర్వాత హిమోగ్లోబిన్‌ పడిపోతుందనేది కొందరి అపోహ. ఒకసారి 400 మి.లీ. కంటే తక్కువే తీసుకుంటారు. మన శరీరం దీనిని చాలా త్వరగానే భర్తీ చేసుకుంటుంది.

సౌ జ న్య  o - whatup message