నేడు (నవంబర్ 11) జాతీయవిద్యా దినోత్సవం... విద్యా భారత నిర్మాత "మౌలానా అబుల్
కలామ్ ఆజాద్"
గారి
జయంతి.. ఈ సందర్భంగా కొన్ని విషయాలు🌹*_
👉దేశ
స్వాతంత్రోద్యమ సాఫల్యంలో, స్వతంత్ర భారత విద్యా, వైజ్ఞానిక,
కళల
వికాసానికి బహుముఖప్రజ్ఞతో విసుగు విరతి లేకుండా ప్రవహించే ఉత్తేజంలా శ్రమించిన
దార్శనికుడు,
పోరాటకారుడు, కవి, రచయిత, జర్నలిస్టు, విద్యావేత్త, పరిపాలకుడు, బహుభాషోకోవిదుడు, భారతరత్న మౌలానా
అబుల్ కలామ్ ఆజాద్. బాల్యదశ నుంచే సాహిత్యం, తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు, మానవ విమోచనాల ఉద్యమ చరిత్రపై ప్రత్యేక
అభినివేశం ఏర్పరచుకొని భారతీయ విద్యావికాసాన్ని గొప్ప ముందడుగు వేయించిన నవ్య
మానవవాది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉ఆజాద్ 1888 నవంబర్ 11 వ తేదీన అరేబియా
దేశంలోని మక్కా నగరంలో జన్మించారు. ఆజాద్ అసలు పేరు మొహిద్దీన్ అహ్మద్. ఆజాద్
అనునది కలం పేరు. మౌలానా చిన్నతనం నుండే కవిత్వం రాసేవారు. ఆ విధంగా ఆయన పేరులో
ఆజాద్ చేరింది. మౌలానా తండ్రి పేరు మహమ్మద్ ఖైరుద్దీన్. కాగా వీరి పూర్వీకులు
భారతీయులు. మౌలానా పూర్వీకుల్లో కొంత మంది అరబ్బీ, పారశీక భాషల్లో గొప్ప పండితులు కావడం
వల్ల మొగల్ చక్రవర్తి అక్బర్ తన పరిపాలనా కాలంలో వీరిని ఘనంగా సత్కరించారు.
మౌలానా తండ్రి 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు అనంతరం అరేబియా దేశానికి వలస వెళ్లడం జరిగింది.
మౌలానా 10 సంవత్సరాల
వయస్సులో తన తండ్రితో కలిసి భారత దేశానికి తిరిగి వచ్చాడు. మౌలానా కోల్‌కటా
(కలకత్తా)లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. కాగా 1905 లో ఈజిప్టు
రాజధాని కైరోలోని అజహస్ విశ్వ విద్యాలయానికి వెళ్లి ఉన్నత విద్యను పూర్తి
చేసుకొని 1908 లో భారత దేశానికి
తిరిగి వచ్చారు. మౌలానా మాతృభాష అరబ్బీ అయినప్పటికీ అరబ్బీతో పాటు పారశీక భాషలో
కూడా సాటి లేని మేటి పాండిత్యాన్ని సంపాదించి మత, ధర్మ శాస్త్రాల్లో మంచి పట్టు సాధించారు.
ఇతని పాండిత్యం వల్ల మౌలానా అనే బిరుదును పొందారు. మౌలానా అనగా పండితుడు అని, అబుల్ కలాం అనగా
భాషా జనకుడు అని అర్థం. ఈ విధంగా మొహిద్దీన్ అహ్మద్ కాస్తా మౌలానా అబుల్ కలాం
ఆజాద్‌గా మారారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉మౌలానా తన పదహారవ
ఏట లిసానస్ సిదిక్ ( సత్యవాణి ) అనే పత్రికను స్థాపించారు. ఆ పత్రికలో ధార్మిక, సారస్వత విషయాలకు
సంబంధించిన సంపాదకీయాలు రాసేవారు. వాటిని చదివిన పాఠకులు ఆ పత్రిక సంపాదకుడు వయో
వృద్ధుడైన గొప్ప విద్వాంసుడేమోనని భావించారు. ఈ నేపథ్యంలో ఒక సాహిత్య సభకు
మౌలానాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సభా నిర్వాహకుల్లో కొంతమంది ముఖ్య అతిథి రాక
కోసం ప్రవేశద్వారం వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక యువకుడు నిరాటంకంగా వేదిక వద్దకు
చేరుకొనగా నిర్వాహకులు అతనిని ఆపి అతడే ఆజాద్ అని తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు
లోనయ్యారు. ఆ రోజుల్లో ఖాజీ అల్తాఫ్ హుస్సేన్ అలీ గొప్ప విద్వాంసుడుగా పేరు
గాంచాడు. అయితే ఆయన రచనలను ఆజాద్ తన పత్రికలో నిశితంగా విమర్శించారు. దీంతో అతడు
ఆజాద్‌ను కలిసి మాట్లాడి ఆయన పాండిత్యానికి అలీ మంత్రముగ్ధుడయ్యాడు. కాగా 1912 లో ఆజాద్ అల్
హిలాల్ ( చంద్రరేఖ ) అనే ఉర్దూ వార పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ఉర్దూ
సాహిత్యంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. హిందూ ముస్లింల సమైక్యతను
ప్రోత్సహిస్తూ మౌలానా తన పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. అందులో బ్రిటిషు వారి
అక్రమాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడం జరిగింది. దీంతో బ్రిటిషు
ప్రభుత్వం అల్ హిలాల్ పత్రికను నిషేధించడమే కాకుండా మౌలానాను నాటి బీహార్ లోని
రాంచీలో నిర్బంధించింది. బ్రిటిషు వారి బెదిరింపులకు ఏమాత్రం భయపడని మౌలానా అల్
బలాగ్ ( సందేశం ) అనే మరొక పత్రికను స్థాపించి తన రచనా పరంపరను కొనసాగించారు.
బ్రిటిషు ప్రభుత్వం ఆ పత్రికపై కూడా నిషేధాన్ని విధించి పత్రికా స్వాతంత్ర్యాన్ని
హరించింది. మౌలానా అరెస్టై బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా 1920లో మౌలానా
మహాత్మాగాంధీని మొదటిసారిగా ఢిల్లీలో కలుసుకున్నారు. గాంధీ మార్గంలో నడచి సహాయ
నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమ ప్రచారానికై దేశ సంచారం చేసి నాయకుల్లోని
భేదాభిప్రాయాలను నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో గాంధీజీకి ముఖ్య
అనుచరుడుగా మారారు. కాగా 1923 లో మౌలానాఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా
ఎన్నికయ్యారు. జమియత్ ఉల్ ఉలేమాకు 1924 లో అలాగే 1929 లో జాతీయ వాద ముస్లిం సదస్సుకు అధ్యక్షత
వహించారు. 1937 లో పార్లమెంటరీ
బోర్డ్ సభ్యుడుగా కాంగ్రెస్ మంత్రిత్వ శాఖల పనితీరును నిర్దేశించారు. కాగా 1940 నుండి 1946 వరకు తిరిగి భారత
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా వ్యవహరించారు. 1946 లో రాజ్యాంగ సభకు సభ్యుడుగా ఎన్నికయ్యారు.
స్వాతంత్ర్య పోరాట సమయంలో జాతీయోద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలు శిక్షను
అనుభవించారు. ఇండియా విన్స్ ఫ్రీడం అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో భారత
దేశం తప్పక స్వాతంత్ర్యాన్ని సాధించితీరుతుందని మౌలానా గట్టిగా అభిప్రాయపడ్డారు.
కాగా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 1947 ఆగష్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. మొట్ట మొదటి
భారత ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఏర్పడింది.
నెహ్రూ తన మంత్రి మండలిలో ఆజాద్‌కు విద్యాశాఖామంత్రి గా స్థానం కల్పించి
గౌరవించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖతో పాటు సహజ వనరులు, శాస్త్ర పరిశోధన
శాఖలను కూడా నిర్వహించారు. మౌలానా విద్యాశాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు.
మంత్రి పదవిలో ఉండగానే 1958 లో మౌలానా కన్నుమూశారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉గొప్ప వక్త, విద్యావేత్త, రచయిత, దూరదృష్టి గల
రాజనీతిజ్ఞుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత జాతీయ జీవనంలో లౌకికవాదం, ఏకత్వ భావనలకు
ప్రతీకగా నిలచారు. కాగా విద్యా రంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తింపుగా భారత
ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించి గౌరవించడం ఎంతో
జరుగుతున్నది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్ ఇండియా
ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించి, ఉద్యమక్రమంలో నాయకత్వ పెఢధోరణులను, చీలికలను
నివారించి, భిన్నమైన
ఆకాంక్షలున్న ఉద్యమ శక్తులను ఏకతాటిపై నడిపించాడు. ఉద్యమ జీవితంలో పదకొండు
సవంత్సరాల జైలు జీవితాన్ని గడిపిన ఆజాద్ మాతృదేశ విముక్తి పోరులో చిరస్మరణీయ
పాత్రను పోషించి, దేశభక్త లౌకకవాదానికి ప్రతీకగా నిలిచారు. 1947–52 వరకు విద్యాశాఖమంత్రిగా, 1952–58 వరకు విద్యా, ప్రకృతివనరుల, శాస్త్ర సాంకేతిక
మంత్రిగా,
1956 లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్ అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి
కృషిచేసారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉వలసపాలకుల
అవసరాలకు తోడ్పడుతూ వచ్చిన విద్యావ్యవస్థను సమూలంగా మార్చడం కోసం, విద్య పునాదిని
విప్లవకీకరించడం కోసం దేశీయవనరులు, అవసరాలకు అననువైన ప్రజాతంత్ర విద్యను
రూపొందించడం కోసం మౌలానా నిపుణులతో కమిటీలను వేసి వారి సిఫారసులను అమలుచేసాడు.
బి.జి.ఖేర్ కమిటీ (1947) సిఫారసుల మేరకు విద్యారంగానికి కేంద్రబడ్జెట్‌లో 10%, రాష్ట్ర బడ్జెట్‌లో
30% కేటాయింపులను
అమలు చేయించారు. నళిని రంజన్ సర్కార్ కమిటీ (1947) సూచనల మేరకు
శాస్త్ర సాంకేతిక రంగంలో స్వయం స్వాలంబన కోసం ప్రతిష్టాత్మక ఐఐటీలను స్థాపించాడు.
లక్ష్మణస్వామి మొదలియార్ (1952) కమిటీ సూచనలు స్వీకరించి పాఠశాల విద్యను
గుణాత్మకంగా మార్పు చేసి, వృత్తి విద్యను, క్రీడా విద్యను ప్రవేశపెట్టాడు. విజ్ఞాన విహారయాత్రలను తప్పనిసరిగా
నిర్వహించాలని సూచించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉రాధాకృష్ణన్ (1948) కమిషన్ సిఫారసుల
మేరకు యూజీసీని ఏర్పాటుచేస్తూ ఉన్నత విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను
స్థాపించాడు. ఇవి దేశ నాగరికతని అభివృద్ధి పథంలో నడపగల మేధాపరమైన మార్గదర్శకుల్ని
గుర్తించి, శిక్షణ ఇచ్చి, వివిధ రంగాల
నిర్వహణకు అవసరమైన నిపుణులను తయారు చేయడంలో ప్రధానపాత్ర నిర్వహించాలని కోరారు.
ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను ప్రారంభిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు స్నేహితుడుగా, మార్గదరర్శకుడిగా
ఉంటూ జ్ఞాన ప్రసారాన్ని, వ్యక్తిత్వ నిర్మాణం చేయాలన్నాడు. అక్షరాస్యత పెంపు కోసం వయోజన విద్యను
ప్రారంభించి,
పరిశోధనాభివృద్ధి
కోసం కౌన్సిల్ అండ్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్‌ను స్థాపించి దీని
పరిధిలో దేశవ్యాప్తంగా 50కి పైగా పరిశోధనా సంస్థలను నెలకొల్పి ఆధునిక విద్యా భారత నిర్మాతగా చరిత్రలో
నిలిచాడు. బ్రిటిష్ ఇండియాలో తీవ్ర నిర్లక్ష్యానికి లోనైన భారతీయ సంస్కృతి, కళలు, సంగీతం, సాహిత్యాల
వికాసానికి సాంస్కృతిక ఉద్యమ సేనానిగా పనిచేసారు. ప్రజల్లో సర్వవ్యాప్త ప్రేమను, అందం, ఆనందాల
క్రియాశీలతనే కలిగించే సృజనాత్మక వ్యక్తీకరణే కళ అని వాటి అభివృద్ధికి స్వయం
ప్రతిపత్తి గల భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమి, సాహిత్య అకాడమి, ఆర్ట్స్
అకాడమిలను స్థాపించాడు. స్వయంగా సాహిటీవేత్త ఐన మౌలానా గుబార్–ఎ–ఖాఅర్, తర్జుమన్ ఉల్
ఖురాన్‌ల ‘‘ది డాన్ ఆఫ్
హోప్’’తో పాటు
స్వీయచరిత్ర
‘ఇండియా
విన్స్ ఫ్రీడమ్’ను రాసాడు. సామాజిక ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించాలనే రాజ్యాంగ లక్ష్యాల
వెలుగులో ఆజాద్ రూపాందించి అమలుచేసిన విద్యా వ్యవస్థ మార్గదర్శక సూత్రాలను
పూర్తిస్థాయిలో అమలు చేయించకోవలసిన భాద్యత పౌర సమాజం స్వీకరించాలి. అప్పుడే విద్య
ప్రజాస్వామికీకరించబడి అందరికీ సమానంగా అందించబడి సామాజిక న్యాయం జరిగి, సాంఘీక ఆర్థిక
అసమానతలు నివారింపబడి సృజనాత్మక, జ్ఞాన, లౌకిక భారతదేశం నిర్మింపబడుతుంది.@ Sreenivas@