Pages

అజ్జానం పోవాలి విజ్ఞానం వికసించాలి

దేవుడూ, దెయ్యం రెండూ అబద్దమే ! అలాగే పూజారి శ్లోకాల్లో, మత పెద్దల ప్రార్థనల్లో, భూతవైద్యుని మంత్రాల్లో, పదాలు మాటలు వాటిని పలుకుతే శబ్దాలుంటాయి తప్ప, వాటికి ఏమాత్రం శక్తులుండవు, కాబట్టి మంత్ర శక్తి అనేది కూడా అబద్దమే !!

""""""""""""""""""""""""""""""""""""""""""""""""

దైవానికీ, దెయ్యానికీ రెండింటికి కూడా మంత్రాలతో సంబంధం ఉంటుంది..
దేవుడి మంత్రాలను దైవ పూజలంటారు,
దెయ్యాల మంత్రాలను క్షుద్ర పూజలంటారు..
 
దేవుడికీ, ప్రజలకు మధ్యవర్తిగా పూజారి ఉన్నట్టే,
దెయ్యానికీ, ప్రజలకి మధ్యవర్తిగా మంత్రకాడు (భూత వైద్యుడు) ఉంటాడు..
 
దేవుడికి పూజలు పగలు చేస్తారు,
దెయ్యానికి (క్షుద్ర) పూజలు రాత్రిళ్ళు చేస్తారు..
 
అక్కడ పసుపు, కుంకాలతో పాటు పూవులూ ఉంటాయ్
ఇక్కడ పసుపు, కుంకాలతో పాటు పుర్రెలు ఉంటాయ్..
 
అక్కడ కట్టేది తమలపాకు 'కంకణం'లు,
ఇక్కడ కట్టేది సత్తురేకు 'తాయెత్తు'లు..
 
అక్కడ తలకు ప్రతిరూపంగా కొబ్బరికాయ కొడతారు,
ఇక్కడ రక్తతర్పణం కోసం తలనే నరుకుతారు..
 
అక్కడ దేవుల్లకు కోళ్లు, గొర్లు మేకలను బలి ఇస్తరు,
ఇక్కడ కూడా దయ్యాలకు, భూతాలకు కోళ్లు, గొర్లు మేకలను బలి ఇస్తరు..
 
దేవుడి పూజకు ఊరి మధ్యలో గుడులు అడ్డాగా ఉంటే,
దయ్యాల పూజకు ఊరవతల నిర్మానుష్య ప్రాంతం లేదా స్మశానమే అడ్డాగా ఉంటాయ్..
 
వారికి పౌర్ణమి మంచిది, అమావాస్య చెడ్డది, గ్రహణమంటే (దేవుల్లకు) హడల్,
కాని వీరికి అంతా రివర్స్. వీరి క్షుద్ర పూజలన్నీ అమావాస్య రోజే జరుగుతాయి..
 
గ్రహణాలంటే వెలుగు నీడల సయ్యాటలు తప్ప మరొకటి కావని, రాహు,కేతువు లనేవి అసలెక్కడా లేనేలేవని ఈ రోజు ఐదో తరగతి పిల్లాడి నడిగినా చెప్తాడు కదా !
మరి అలాంటప్పుడు (సూర్య లేదా చంద్ర గ్రహణం ఏదైనా సరే) ఆ గ్రహణ సమయంలో పెద్ద పెద్ద దేవాలయాలే మూత బడతాయ్..
ఈ గ్రహణాలు దేవుళ్ళెందుకు భయపడుతున్నట్టో ?
 
ఇలా దైవానికీ, దెయ్యానికీ చాలా సారుప్యతలు ఉన్నాయి.
కానీ వాస్తవానికి రెండూ ఒక్కటె..
ఒకటి ప్రజల్ని పట్ట పగలే పీడిస్తే, మరొకటి అర్ధ రాత్రి పీడిస్తుంది..
 
మొత్తానికి దైవ పూజలైనా, క్షుద్ర పూజలైనా రెండూ కూడా అమాయక జనాన్ని పీడించేవే..
రెండూ కూడా అమాయక జనాన్ని పీడించేవే..
 
ఒకటి భక్తి వంకతోజనాన్ని దోపిడి చేస్తుంది,
మరొకటి జనాన్ని భయపెట్టి దోపిడి చేస్తుంది.
ఈ రెండు బొమ్మా బొరుసుల్లాంటివి. దొందూదొందే..
 
అమాయకత్వంతో జనం వాటిని నమ్మడం వల్లనే ఇవి రెండూ (దైవ భావం & దెయ్యం భావం) సమాజంలో బతక గలుగుతున్నాయి.
ఈ రెండింటిలో ఏదీ కూడా శాస్త్రీయంగా నిరూపితం కావు. ఇరువైపులా పెద్ద మొసమే. అంతా నటన.
ఈ రెండూ కూడా పక్కా మూఢ నమ్మకాలే..
 
మంత్రమంటే మాట అని అర్దం..
పూజారులు చదివే శ్లోకాల్లో, చెప్పేమాటల్లో,
అలాగే ఇతర మతాల యొక్క (ఆయా మతాల పెద్దలు చేసే) ప్రార్థనల్లో,
అదే విధంగా భూత వైద్యులు చదివే (క్షుద్ర) మంత్రాల్లో
ఏ మాత్రం శక్తి ఉండదు. అన్ని మతాల వ్యవహారమూ అంతే..
 
అమాయక జనాన్నిమోసగించడం మరియు వారిని లూటీ చేయడం కోసమే ఈ తతంగమంతా..
 
దైవ భావన మానవుల బలహీనతల తోనె చిరకాలం నుండి సజీవంగా ఉంటూ వస్తుంది.
ఒకర్ని చూసి మరొకరు అనుసరించడం వల్లె అది ముందుకు సాగుతుంది..
 
దేవుడున్న మాటనిజమే ఐతే అమాయక ఆ దంపతులను, మంత్రకాల్ల నెపంతో (ఆ మధ్యన సిద్దిపేట జిల్లా దగ్గరలో ఉన్న) దుబ్బాక గ్రామంలో రాజయ్య రాజేశ్వరీ భార్యాభర్తలను సజీవ దహనం జరుగుతుంటే
దుబ్బాక గ్రామంలో రాజయ్య రాజేశ్వరీ భార్యాభర్తలను సజీవ దహనం జరుగుతుంటే, వారిని ఎందుకని రక్షించలేక పోయాడు ఆ దేవుడు
రక్షించలేక పోయాడు ఆ దేవుడు ? వాల్లచే పూజించ బడ్డ దేవుళ్ళు ఆ సమయంలో ఏం చేస్తున్నట్టు ?
 
ఒక వేెళ ఆ మంత్రగాళ్ల మంత్రాలకు శక్తి ఉండే మాటే నిజమే ఐతే, ఆ అమాయక దంపతులకు నిజంగానే మంత్రాలు వచ్చు అని అనుకుంటే
వచ్చు అని అనుకుంటే, మరి ఆ మంత్రాలు, వాల్లనెందుకు కాపాడలేక పోయాయి
 
హంతకులు వారిని కరెంట్ పోలుకు కట్టేసి, కిరోసిన్ పోసి కాల్చుతుంటే వారి కొచ్చిన ఆ మంత్రాలను చదివి,
వారు తమను తామెందుకు కాపాడు కోలేక పోయారు
 
మంత్రాలకు ఏమాత్రం శక్తి ఉండదని ఈ సంఘటన వల్ల తెలిసిపోతుంది కదా !
 
ఒక వేళ దెయ్యాలే ఉంటే ఆ జంట చచ్చాక దెయ్యాలై తమని చంపిన వారిని పట్ట వచ్చు కదా.. ?
మరి ఇక ఈ పోలీసు లెందుకు, కేసు లెందుకు,
ఈ భాదలెందుకు..
 
మంత్రాల గురించి మరో మాట.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాయకులైన అబ్రాహం లింకన్, మహాత్మా గాంధీ, జాన్ ఎఫ్ కెన్నెడీఇందిరా గాంధీ ఇంకా రాజీవ్ గాంధీ, బెనజీర్భుట్టో తదితరు లంతా హత్యశగావింప బడ్డవారే, వారిని చింపిన లేదా చంపించిన వారెవరూ మంత్రాలపై ఆధారశపడకుండా,నేరుగా బాంబులనో తుపాకులనో ఆశ్రయించి వారిని పొట్టన బెట్టుకున్నారు కదా..
 
మరి ఆ నాయకులపై మంత్రాలను ప్రయోగించి హంతకుల చేతికి మైల అంటకుండానే, వారిని ( ఆ నేతలను) సులభంగా అంతం చేయొచ్చు కదా ! అలా చేయలేదంటే
చేయొచ్చు కదా ! అలా చేయలేదంటే, మంత్రాలకు ఏ శక్తులూ లేవనే కదా అర్థం !!
 
ఒక దేశం మీద ఇంకోదేశం బాంబులేసి యుద్ధం చేయడమెందుకూ, ఎవడికి వాడు శతృ దేశం మీద మంత్రాలు ప్రయోగించొచ్చు గదా
ప్రయోగించొచ్చు గదా, వారి సైనికులపై చేతబడి చేయొచ్చు కదా ! కాని ఎవరూ అలా చేయడం లేదు ఎందుకని ?
 
అలా జరుగడం లేదంటే మంత్రాలకు శక్తి ఉండదనేగా అర్థం !
 
దెయ్యం గూర్చి మరో చిన్న ప్రశ్న..
 
అందరూ, దెయ్యాలంటె తెల్లచీర, మల్లె పూలు, కాల్లకు గజ్జెలు ఇంకా ఏవేవో ఊహిస్తారు కదా !
 
మరి అసలే కళ్ళు కనపడని గుడ్డివారికి దయ్యం ఏ రంగు చీరతో కనపడుతుంది ?
మీ కేమో దయ్యం రాత్రి మాత్రమే కనిపిస్తుంది, రాత్రైందంటే దెయ్యం భయంతో వణికి చస్తారు కదా !
మరి పుట్టు గుడ్డివాల్లకు దెయ్యం ఎప్పుడు కనిపిస్తుంది ? ఈ గుడ్డి వారు దయ్యానికి ఎప్పుడు భయపడుతారు ?
రాత్రా, పగలా ?
 
భగత్ సింగ్ ని ఉరితీసాక చని పోయిన వెంటనే దయ్యమై బ్రిటీష్ వాల్లని పట్టలేదెందుకని ?
 
ఇప్పుడు టీవీ సీరియల్లలో చని పోయిన వాల్లు దయ్యాలై పడుతున్నారు కదా !
మరి పూర్వం యుద్దాల్లో చని పోయిన వారు దయ్యాలై శతృ దేశ సైన్యాన్ని లేదా రాజుల్ని ఎందుకని పట్టలేదు ?
 
ఐనా దెయ్యాలెప్పుడూ తెల్ల చీరలే కడతయా ? లంగా జాకెట్టో, రంగు చీరలో లేదా చుడీదార్ ఫైజామా కుర్తానో
కుర్తానో, లేకపోతే లేటెస్టుగా జీన్ ప్యాంటూ టీ షర్టులో ఎందుకు ధరించవు, వాటికి డ్రెస్ కోడ్ పెట్టిందెవరు
 అదీ గాక అందరికీ "ఆడ దెయ్యాలే" ఎందుకు
కనబడతున్నయ్, చచ్చిన మగవాల్లందరూ ఏమౌతున్నరు ? మొగ దయ్యాల గురించి ఒక్క కథ కూడా ప్రచారంలో లేదు ఎందుకని ? లుంగీ, దోతీ లేదా ప్యాంటు వేసుకుని తిరిగే మగ దెయ్యం ఒక్కటి కూడా కనపడదు ఎందుకు ?
అసలు మొగ దెయ్యిలు ఉండనే ఉండవా ?
 
అమాయకత్వం కాకపోతే చచ్చినంక దయ్యమై పడతారంటే ఎవరైనా, ఎవరినైనా హత్య చేస్తారా ?
కుట్రజేసి ఎవరైనా, ఇంకా ఎవరినైనా చంపేస్తారా ?
 
ఇక దేవుల్ల సంగతి..
ఈ దేవుల్లు మన కష్టాలు కోరికలు తీర్చే మాట నిజమే ఐతే మరి రోజూ దేవుడి పక్కనే ఉండి
పూజలు చేసే పూజారుల కష్టాలెందుకు తీర్చరు ?
 
పూజారులు, తాము కష్టాల్లో ఉన్నామని చెప్పి,
దేవాదాయశాఖ మంత్రినో లేక ముఖ్యమంత్రినో కలిసి తమ డిమాండ్స్ నెరవేర్చుమని వినతిపత్రాలు ఎందుకు ఇస్తున్నారు ?
వారి మొర ఆ దేవునికి చెప్పుకుంటే లాభం లేదనేగా అర్థం !
 
తనని రోజూ పూజించే పూజారులకే దేవుడు ఎప్పుడూ ప్రసన్నంకాడు. పూజారులకు ప్రజల సొమ్ముతోనే
జీతాలివ్వాల్సి వస్తుంటె ఇక ఆ దేవుడు ఎవరికి ఉపయోగ పడుతాడు ?
 
సంఘ వ్యతిరేక శక్తుల నుండి మనల్ని దేవుడే రక్షించి, దోషులను దేవుడే శిక్షించే మాటైతే,
ఇంకా ఈ పోలీస్వ్యవస్త ఎందుకు ?
కోర్టులెందుకు, న్యాయ విచారణలెందుకు, తీర్పులెందుకు ?
 
దేవునికి ముడుపులు కట్టడం వల్ల లేదా ప్రార్థనలు చేయడం వల్ల రోగాలు నయమయ్యే మాటైతే..
ఇక ఈహాస్పిటల్లెందుకు, మెడికల్ షాప్ లెందుకు, మందు లెందుకు, అవి రాసిచ్చే డాక్టర్లెందుకు,
వారిని తయారు చేసే మెడికల్ కాలేజీలెందుకు ?
 
ఇకనైనా ఈ అజ్జానం పోవాలి విజ్ఞానం, వికసించాలని కోరుతున్నాను..
 
చివరగా దేవుడూ దెయ్యం రెండూ అబద్దమేనని చెబుతున్నాను..
 
అలాగే మంత్రాలకు, పూజలకు, ప్రార్థనలకు ఎటువంటి శక్తులు ఉండవని కూడా తెలియ జేస్తున్నాను..
రచన: భైరి నరేష్ 2017 లో దుబ్బాకలో
జరిగిన జంట హత్యల సందర్బంగా రాసింది.
మీ
భైరి నరెష్ 7013160831
భారత నాస్తిక సమాజం


ఆల్ ది బెస్ట్..

ఆమీర్‌పేట సత్యం థియేటర్ రోడ్‌లో చేతిలో బుక్ పట్టుకుని వెళ్తున్నాడో కుర్రాడు..


అన్నా, వదినల దగ్గరో, బంధువుల ఇంట్లోనో.. హాస్టల్‌లోనో ఉంటూ పొద్దున్నే లేచి ఆకలి వేస్తున్నా టిఫిన్ తినకుండా ఓ టీ తాగి క్లాసుకెళ్తున్నాడు..


ఇంజనీరింగ్ నాలుగేళ్లు ఎలా గడిచిపోయిందో తెలీదు.. ఇప్పుడు చూస్తే భవిష్యత్ అంతా కన్‌ఫ్యూజ్డ్‌గా గడుస్తోంది. ఖర్చులకు డబ్బు కావాలని ఇంటికి ఫోన్ చేయాలంటే సిగ్గేస్తోంది... కానీ తప్పదు!


ఎన్నాళ్లని ఇలా.. ఏ ఉద్యోగం లేకుండా? నాలుగేళ్లు ఇంజనీరింగ్‌లో క్లాసుల్లో సరిగ్గా చెప్పింది ఏమీ లేదు.. ఫ్రెండ్స్ అంతా సరదాగా గడిపేస్తూ తాను చదివిందీ పెద్దగా లేదు. ఇప్పుడు అంతా క్వశ్చన్‌మార్క్. దగ్గరకు తీసుకుని కొద్దిగా ధైర్యం చెప్పే వారు ఉండరు. ఏ చీకట్లోనో అపార్ట్‌మెంట్ పైన ఓ మూలన కూర్చుని ఆకాశంలోకి చూస్తుంటే కళ్లమ్మట చుక్కలు రాలుతున్నా వాటిని తుడిచే వారు ఉండరు. 


అసలు ఎంతమంది యువత ఇలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో ఎంతమందికి తెలుసు?

ఎంతవరకూ మన అస్థిత్వం, మన రాజకీయాలు, మన వివాదాలూ.. యువతని తమ చుట్టూ తిప్పుకుని గొప్పలు పోయే వాళ్లే కానీ వారి భవిష్యత్ గురించి ఆలోచించే నాయకులు ఎంతమంది? సరిగా చదువుకోమనీ, కష్టపడమనీ, స్కిల్క్ డెవలప్ చేసుకోమని, ఆ పాత్‌లో వెళ్లమనీ, అక్కడ తెలిసిన రిఫరెన్స్ ఉందనీ.. ఇలా నిరంతరం అండగా ఉండే వాళ్లెవ్వరు?


ఈ దేశానికి ఉన్న ఒకే ఒక ఆశ యువత. కానీ ఆ యువతకి ఇప్పుడు మంచి చెప్పే వారు లేరు. యూట్యూబ్‌ల నిండా గంటల తరబడి వీడియోలు చూసుకుంటూ, Facebook, Whatsappలలో గంటలు గడిపేస్తూ అసలు లైఫ్ ఏంటో తెలీకుండా టైమ్‌పాస్ చేసేస్తున్నారు. ఇది కాదు జీవితం.. ఓ లక్ష్యం ఉండాలి, పట్టుదలగా కష్టపడాలి. ప్లానింగ్, టైమ్ మేనేజ్మెంట్ ఉండాలి. చూస్తున్నారుగా మాబోటి వాళ్లం పనికిమాలిన వివాదాల్లో టైమ్ వేస్ట్ చేస్తుంటాం. మమ్మల్ని కాదు ఆదర్శంగా తీసుకోవలసింది.. స్వామి వివేకానందలను, అబ్ధుల్ కలాంలను తీసుకోండి. సాధించండి.. మీరు అకడమిక్ టైమ్‌లో ఏం నేర్చుకోలేకపోవచ్చు.. ఈరోజు మొదలుపెట్టండి.. Youtube appలో హిస్టరీ క్లియర్ చేసి, దాన్ని డిసేబుల్ చేసి చెత్త వీడియోలకు దూరంగా ఉండండి.. మీ సబ్జెక్ట్‌కి చెందిన ఎడ్యుకేషనల్ వీడియోలు చూడడం మొదలుపెట్టండి. మీరు ఎంత సబ్జెక్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అంత గొప్ప జీవితం మీ ముందుంటుంది..


భవిష్యత్‌ని తలుచుకుని ఈరోజు నీ కళ్లమ్మట నీళ్లు రావచ్చు.. కానీ ఒక్కటి చెప్తున్నా విను... నువ్వు కష్టపడడం మొదలెడితే నీ గుండెల్లో ఎంత ధైర్యం వస్తుందో, అన్నీ నీ వెంట ఎలా వస్తాయో నువ్వే ఆ కన్నీళ్లు పెట్టుకున్న కళ్లతోనే స్వయంగా చూస్తావు. ఆల్ ది బెస్ట్.. నీ విజయాన్ని సదా కోరుకుంటూ..

Unknown well wisher..