Pages

ఎందరో వీరుల త్యాగపలం మన నేటి స్వాతంత్ర్యం


ఆ ఫలాలు ఎవరిచేతికొచ్చాయో?

నేను దేశభక్తుడిని కాను. భక్తికి వ్యతిరేకిని. దేశమంటే అభిమానం.

 దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న అన్నదే నా అభిమతం.

 దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుజులోయ్. అందుకే మనషులంటే అభిమానం.

అన్నదమ్ముల వలెను జాతులు మతములన్ని మెలగవలెనోయ్.
ఈసురోమని మనుజులంటే దేశమేగతి బాగుపడునోయ్
మనుషులను ప్రేమిద్దాం.

బోధించు - సమీకరించు - పోరాడు అన్నారు బాబాసాహెబ్. మనుషులను ప్రేమిద్దాం. బోదించుదాం - సమీకరించుదాం. దేశాన్ని ప్రేమించడమంటే ఏమిటో నిరూపిద్దాం.

 మానవులంతా సమానంగా ఉండాలని భగత్ సింగ్ కోరుకున్న సమతా రాజ్యం మన దేశం లో ఏర్పడేందుకు మన ప్రయత్నం చేద్దాం.

దేశాభిమానం భారీ జెండాలలోనో, భారీ మాటలలోనో ఉండదు. సాటివారి కోసం చేసే చిన్నపనిలో ఉంటుంది.

T.Ramesh
General Secretary,
All India People's Science Network