Pages

కు‌లనిర్మూలన కోరుకునేవారికోసం


■ వృత్తులు - వృత్తిసంఘాలు - కులాలు - కులవృత్తులు : పరిణామక్రమం
●●●● ★ ఆర్యులు రాకపూర్వం :
విదేశీ ఆర్యులు మనదేశం ఆక్రమించి పరిపాలన చేయకముందు ఇక్కడ కులాలు లేవు , మతాలు లేవు , కానీ ఇక్కడ "వృత్తులు"న్నాయి. వారి వృత్తిసమస్యలను పరిష్కరించుకోడానికి "వృత్తిసంఘాలు" (Guilds) కూడా ఏర్పాటుచేసుకున్నారు. అప్పటి కుటుంబవ్యవస్థలోని సభ్యులు తమకు "నచ్చిన" వృత్తులు చేసుకునేవారు. అనగా ఒకే కుటుంబంలో సభ్యులు ఒకే వృత్తికి పరిమితం కాకుండా వివిధవృత్తులు చేసుకునేవారు.
★ ఆర్యుల పరిపాలనలో : ఆర్యపాలకుల పాలనలో చాలాకాలం ఇదేవిధానం కొనసాగింది. తమకు బానిసలుగా దొరికిన ఈ దేశ భూమిపుత్రులను సందర్భానుసారంగా దాసులు , దస్యులు , శూద్రులు, రాక్షసులు మొదలగు పేర్లతో పిలిచారు. వీరిమీద పెత్తనం చేయడానికి తమలో తాము (ఆర్యుల్లో) బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్యులుగా మొదట కులవిభజన చేసుకొని,
ఆ క్రమంలో సమాజం (శూద్ర బానిసలు) మీద ఎక్కువ నియంత్రణ కోసం వైదీక మతాన్ని సవరించి , అనగా క్షత్రియులు, వైశ్యులకు కూడా చోటుకల్పించి, "బ్రాహ్మణం / బ్రాహ్మణమతం" గా పేరుమార్చారు.
తద్వారా " పనివిభజన " చేసుకొని పాలించారు. ఆ పనివిభజనే వారి "కులవృత్తులు" గా మారాయి. బ్రాహ్మణులు తమకే పరిమితమైన "వైదీక వ్యవస్థ(మతం)" ఏర్పాటు చేసి సమాజం మొత్తంమీద తమ నియమనిబంధనలు అమలుజరిపారు. పాలనలో సౌలభ్యంకోసం వారు "గణతంత్ర వ్యవస్థ" (ఆర్యులు రాకముందే సింధు/ద్రవిడ నాగరికతలో ఉన్నదే) , ఆ తదనంతరం "రాచరిక వ్యవస్థ" ఏర్పాటు చేసుకున్నారు. "ఆహార సేకరణ" దశనుంచి సమాజం "ఆహార ఉత్పత్తి" దశకు చేరుకుంది. ★ శూద్ర కులాల ఏర్పాటు :
4. సమాజంలో "సమతుల్యత" కోసం ఏ కులానికి కేటాయించబడిన కులవృత్తిని ఆ కులస్థులే నిర్వహించాలి.
మగధ సామ్రాజ్యాధినేత మౌర్య వంశస్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో మహామంత్రి చాణక్యుడు తాను "కౌటిల్యుడు" పేరుతో రాసిన "అర్ధ శాస్త్రం" అనబడే రాచరిక ప్రభుత్వాలు ఆచరించాల్సిన "రాజ్యాంగం" ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా శూద్రులపై పూర్తినియంత్రణ కోసం "శూద్ర కులవిభజన" సృష్టించాడు. ఈ శూద్ర కులవిభజన ప్రకారం : 1. ఒకేవృత్తి చేసేవారంతా ఒకేకులం. 2. ఒక కులానికి కేటాయించబడిన వృత్తి వారి "కులవృత్తి". 3. కులవృత్తి వంశపారంపర్యంగా ఆచరించాలి. 5. వృత్తి రక్షణ చర్యలు :
ఘనీభవించిన "నిచ్చెనమెట్ల" కులవ్యవస్థ వలన కులాలమధ్య , వృత్తిదారులమధ్య ఘర్షణలు పెరిగి ప్రజలమధ్య అనైక్యతకు దారితీసింది.
కులవృత్తి పై పూర్తి అధికారం ఆ కుల వృత్తిదారులకే ఉంటుంది. (Patent Right). ఒక కులానికి కేటాయించబడిన వృత్తిని వేరొక కులానికి చెందినవారు దొంగచాటుగా కూడా చేపట్టరాదు. వృత్తి ఆక్రమణదారులు కఠినంగా శిక్షించబడుదురు. (మరణశిక్షలు విధించిన సందర్భాలు కూడా చరిత్రలో కొన్ని ఉన్నాయి.) 6. కులవృత్తులకు భవిష్యత్తులో లోటు రాకుండా , వర్ణసంకరం జరక్కుండా ఒకే కులంలో వివాహాలు జరుపుకోవాలి. ఈ నియమాన్ని అతిక్రమించినవారు సంఘబహిష్కరణకు గురికావడం జరుగుతుంది. ఈ కుల నిబంధనలతో సమాజమే కాదు, వివిధ వృత్తులు ఆచరిస్తున్న "ఒకే కుటుంబ సభ్యులు ", "ఒకేతల్లిబిడ్డలు ", "సొంత అన్నదమ్ములు " కూడా కులాలవారీగా నిట్టనిలువునా చీలిపోవాల్సివచ్చింది.
--భారతీయుడు.
★ కులవ్యవస్థ, ముఖ్యంగా శూద్రకులవిభజన, పాలకులు కోరుకునే "విభజించు - పాలించు " సిద్ధాంతం ఆచరణను సరళీకృతం చేసింది. ★ శూద్రకులాలవిభజన చంద్రగుప్త మౌర్యుడి పాలనా కాలం ( క్రీ.పూ. 323 )లో బ్రాహ్మణమతం సారధ్యంలో చాణక్యుడునాయకత్వంలో జరిగింది. అప్పటికి హిందూమతం ఆవిష్కరణ ఇంకా జరగలేదు. ★ అక్బర్ పాలనాకాలంలో (షుమారు క్రీ.శ. 1576 ప్రాంతంలో) ముస్లింలకంటే జనాభాను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఆర్యకులాలకు తోడుగా శూద్రకులాలను కలుపుకొని "బ్రాహ్మణమతం"పేరు"హిందూమతం"గా ఆవిష్కరణ చేశారు. ★ " కులాల పుట్టుక " తెలిసినోళ్ళే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించిన " కులనిర్మూలన " కు నడుంకడతారు. ముఖ్యంగా హేతువాదులు, నాస్తికులు ఐన ఫూలే - అంబేడ్కరిస్టులవల్లే అది సాధ్యం. అలాంటివారికోసమే ఈ వ్యాసం. జై ఫూలే ! జై భీం !! జై భారత్ !!!