Pages

ఈ దేశాన్ని శతాబ్దాలుగా ఎదక్కుండా వెనక్కి లాగుతున్న *పంచ భూతాలు*


1) *కులం* : ఇది విశ్వంలో ఎక్కడా లేని, కనబడని వింత డేంజర్ కాన్సెప్ట్. దీని బేసిక్ ప్రిన్సిపుల్ మనిషిని మనిషిగా చూడకూడదు. మనుషులను ఐదు జాతులుగా విడగొట్టి హింసించే నిచ్చెనమెట్ల వ్యవస్థ ఇది. ఈదేశం ఎదగకపోడానికి, ఈదేశం ఎదుగుదల ఆగిపోడానికి, ఈదేశం వెనుకబాటుతనానికి 99 శాతం ప్రధాన కారణమిదే. దీన్నొక్కదాన్ని రూపుమాపితే, మిగతా రోగాలన్నీ వాటికవే నయమవుతాయి.




2) *వాస్తు* : ఇదో కామెడీ  కాన్సెఫ్టు. కష్టపడి కట్టుకున్న ఇంటిలో, మూలన ఇది పెట్టు, మూలన అది పెట్టకు, దిక్కున ఇది కట్టు, ఆదిక్కున ఇది కట్టకని చెప్పి, ఒక వేళ అలా గాని చెయ్యకపోతే, కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో తగలబడ్డ గ్రహాలు, కొన్ని ప్రత్యేక దేశంలోని మనుషుల్లో,  కొన్ని ప్రత్యేక మతస్తులను మాత్రమే పసిగట్టి, పగబట్టి వేధించి, వార్నింగ్ లిచ్చి, వాటి కిరణాలను పంపించి దూలతీర్చేస్తాయట. అక్కడితో ఆగదు శాస్త్రం. గ్రహాల రివెంజ్ కి విరుగుడు కూడా తగలబడింది. ఒక్క 2000-/ కొడితే, ఇక్కడ నుంచే మన వాస్తు విద్వాంసులు, గ్రహాల ఆగ్రహాన్ని చల్లార్చి పడేస్తారు. దెబ్బతో జీవితం మారిపోతుందంటారు.

3) *జ్యోతిష్యం* : తమ జీవితాన్ని మార్చుకోలేని కొంతమంది, ఎదుటివారి జీవితాల్లో మాత్రం ఏమి జరుగుతాయో, ఏమి జరగవో, ఎవరు PM కుర్చీ ఎక్కుతారో, ఎవరు CM కుర్చీ దిగుతారో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు చావొస్తుందో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు రోగం వస్తుందోనని, 1000/- కొడితే, ఠకీ ఠకీ మని చెప్పేస్తారు.

4) *న్యూమరాలజీ* :  ఇది మరీ దగుల్బాజీ శాస్త్రం. ఎంతో అల్లారు ముద్దుగా, కన్న బిడ్డలకి పేర్లు పెట్టుకుంటే, ఒకడొచ్చి అది బాషలో పేరైనా సరే, ఇంగ్లిష్ లోనే వ్రాయిస్తూ, అమ్మ నాన్న పెట్టిన పేరుకి ఫలానా అక్షరం తీసేసి, ఫలానా అక్షరం జాయింట్ చేసి, 5000/- నా ముఖాన కొట్టి, కోటి సార్లు రాస్తే, కింగవుతావు అంటాడు.

5) *మూఢనమ్మకాలు* :  ఇక వీటి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. టైమ్ చాలదు. ఆల్రెడీ విషయంలో పాలపుంత రికార్డులు భారత్ బద్దలు గొట్టేసింది. ఒకటా రెండా మూఢనమ్మకాలు. గోవా బీచ్లో ఇసుక రేణువులన్ని తగలబడ్డాయి. పిల్లి ఎదురొచ్చినా అశుభమే. బల్లి బాడీ మీద పడ్డా అపచారమె. తుమ్ము తుమ్మినా ప్రళయమే. మంగళవారం మహా చెడ్డది. అమావాస్య రోజు కొత్త పని మొదలెడితే మొగుడు లాగి తన్నేస్తాడు. గ్రహణం రోజు బైట పాస్ కి పొతే ప్రాణాలకిముప్పు.  మొగుడు పోయిన ఆడ మనిషి ఎదురైతే అష్ట దరిద్రాలు. కుప్పల కుప్పల దేవుళ్ళు. పాము పుట్ట నుంచి, కొత్తి మీర కట్ట దాక అన్నీ దేవుళ్ళే. చేతబడి చిల్లంగి, తిరుగుబడి బాణామతి, జోగిని మాతంగి   లాంటి బంపరాఫర్లు ఎన్నెన్నో. చెప్పాలంటే చినిగి చాటవుతుంది....

సౌ జ న్య  o - whatup message