Pages

మతం - మాయాజాలం



ఏదో ఒక విషయం మీద ఒకతను టెన్షన్‌ పడుతున్నాడనుకుందాం. అతను ఏం చేస్తాడూ? అలవాటు ఉంటే బయటకి వెళ్లి ఓ సిగరెట్‌ కాల్చుకుంటాడు. లేనివాడు అలా వెళ్లిఓ కప్పు కాఫీ తాగుతాడు. అసలు రహస్యమేమంటే ఇవి బీపీ పెంచేవేగానీ, తగ్గించేవి కావు. తాత్కాలిక ఉపశమనం కోసం పోయి, దీర్ఘకాలిక సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. మరో విషయం చూడండి.

 ప్రశాంతత కావాలంటే సాహిత్యం చదవాలి.

సంగీతం వినాలి.

మరే ఇతర కళలోనైనా నిమగం కావాలి.

పోనీ కొంచెం ఐక్యూ పెంచుకోవాలనుకుంటే డిస్కవరీ, నేషనల్‌ జియోగ్రాఫిక్‌ లేదా హిస్టరీ లాంటి టెలివిజన్‌ చానళ్లు చూడాలి.

అంతేగాని రగిలిపోతూ, బుసలు కొట్టే ఆడవిలన్లతో సాగే తెలుగు టీవీ సీరియళ్లు చూస్తే టెన్షన్‌ పెరుగుతుందే గాని తగ్గదు కదా?


అలాగే చచ్చుపుచ్చు పిచ్చి వార్తలకు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తూ రోజుకు వందసార్లు చూపే తెలుగు న్యూస్‌ చానళ్ళు చూస్తూ ఉంటే బీపీ పెరుగుతుందా? తగ్గుతుందా ఆలోచించుకోవాలి.


  ప్రశాంతంగా కండ్లు మూసుకుని ఎవరికి వారు ఆలోచించుకుంటే విషయం బోధపడుతుంది. జీవితంలోని టెన్షన్‌ తగ్గించుకునే ప్రయత్నంలో తెలియకుండానే టెన్షన్‌లు పెంచుకుంటున్నామన్న సంగతి ముందు అర్థం చేసుకోవాలి!


మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోవడం కూడా ఇలాంటిదే. భారమంతా ఆ దేవుడి మీద వేసి హాయిగా ఊపిరి పీల్చుకుందామనుకుంటారు. కాని, అదంత సులభం కాదు. అది మాయాజాలంలో ఇరుక్కున్నట్టు. అది ఊబిలో దిగబడి ఇంకా ఇంకా లోతుకుపాతుకుపోతున్నట్టు. ''ప్రభూ! నాకు అన్నింటికీ నువ్వే దిక్కు'' అంటూ జనం బుద్ధిగా ప్రార్థించడంతో మొదలు పెడతారు. నిజమే! క్రమ క్రమంగా అనుకున్నవి జరగకపోయే సరికి ''నీ దేవుని మీద మన్ను బొయ్య! ఏడ సచ్చిండు? మమ్ముల అష్టకష్టాల పాల్జేయ్యవట్టె'' అంటూ నిందించేవరకు వెళతారు. ఇదంతా అవగాహనా రాహిత్యం. 'మనిషి దేవుడు కాదు, దేవుణ్ణే మనిషి సృష్టించుకున్నాడన్న' చిన్న విషయం గ్రహిస్తే... అదే, ఎన్నో ప్రశ్నలకు జవాబు చెపుతుంది. గొర్రెలు కసాయి వాడిని ఎలా నమ్ముతాయో సరిగ్గా అలాగే మనుషులు మతవిశ్వాసాల గోతిలో పడుతున్నారు. సమస్యను ఎక్కువ చేసుకుంటున్నారు. పైగా నిరక్షరాస్యులు, అమాయకులు తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటే విద్యావంతులు, తెలివిగల మహానుభావులు మాత్రం గొర్రెదాటు పోకడపోయి, విశ్వాసాల గోతిలో పడుతున్నారు. మత విశ్వాసాలలో మగ్గిపోతున్నారు. స్వతహాగా ఉన్న తమ వివేకాన్ని అణగదొక్కుకుని, కనీసం ఆలోచించకుండా మత గురువుల పనికిరాని మాటలు విని చెడిపోతున్నారు. ఒక కార్పొరేట్‌ ఆఫీసులో ఉద్యోగుల కోసం ఒక మనస్తత్వ శాస్త్రవేత్త ఉపన్యసిస్తున్నాడు. సగం నీళ్లు నింపిన గాజుగ్లాసు సభికులకు చూపించాడు. సభికులు వెంటనే ఊహించు కున్నారు. గ్లాసు ఎలా ఉంది అని అతను అడుగుతాడు. అప్పుడు మనం గ్లాసు సగం నిండుగా ఉంది అని చెప్పాలి... ఎందుకంటే అది పాజిటీవ్‌ ఆలోచన! సగం గ్లాసు ఖాళీగా ఉందనడం నెగిటివ్‌ ఆలోచన కదా? అని తీరా మానసిక నిపుణుడు ఆ ప్రశ్న అడగలేదు. దీని బరువెంతో ఊహించ గలరా? అని ప్రశ్నించాడు. కొందరు వంద గ్రాములన్నారు. కొందరు రెండు వందలన్నారు. మరికొందరు ఐదువందల గ్రాములన్నారు. అన్నీ విన్నాక మానసిక నిపుణుడు ఇలా చెప్పా డు ''అసలు ఈ గ్లాసు బరువుకు విలువేలేదు'' అని! అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడాయన ఇలా వివరణ ఇచ్చాడు.

''చూడండి - కొద్ది సేపు పట్టుకుంటే నాకు ఏమీ కాదు. ఓ గంట సేపు ఇలాగే ఎత్తి పట్టుకుంటే చెయ్యి నొప్పి పెడుతుంది. సాయంత్రం వరకు ఇలాగే పట్టుకుంటే భరించలేని నొప్పితో చెయ్యీ భుజం వేళ్లూ అన్నీ తీపు పుడతాయి. దాంతో గ్లాసు కింద ఎప్పుడు పెడదామా అని అల్లల్లాడిపోతాను. గ్లాసు బరువు మారదు. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుకే బరువుకు విలువలేదంటున్నాను. దాని నేనెంత సేపు పట్టుకుని ఉన్నానన్న దానిమీద దాని ప్రభావం నా మీద అంతగా ఉంటుంది. మానసిక కలతలు, క్షోభలు ఇదిగో ఈ నీటి గ్లాసు లాంటివే. వాటిని మెదుడులో కొద్దిసేపు మోస్తే ఫరవాలేదు. ఏమీకాదు. అలాగే ఎక్కువసేపు సాయంత్రం దాకా, రాత్రి దాకా కలతల్ని, మానసిక ఒత్తిడిని మోస్తూ ఉంటే నిద్ర పట్టదు. ఫలితంగా అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గ్లాసు బరువు ఎలా ముఖ్యం కాదో, మానసిక ఒత్తిడీ ముఖ్యం కాదు. గ్లాసును వీలైనంత త్వరగా కిందపెట్టినట్టు, మానసిక ఒత్తిడితో వచ్చే బరువును కూడా దింపుకోవాలి. తప్పదు. మనసు, మెదడు తేలికగా ఉంచుకోగలిగితేనే కొత్త ఉత్సాహంతో కొత్త ఆలోచనలు చేయగలం.
కొత్త పనులు చేయగలం.'' అని ముగించాడు ఆ మానసిక నిపుణుడు. ఒక కొత్త విషయం తెలుసుకున్నామన్న సంతోషంతో సభికులు హర్షధ్వానాలు చేశారు.కుటుంబ సమస్యల ఒత్తిడితోనో, ఆఫీసు వ్యవహారాల ఒత్తిడితోనో తలనొప్పి తెచ్చుకుని తల్లడిల్లేవారు ఒకటి ఆలోచించాలి. మానవ జాతి అంతా వేలవేల సంవత్సరాలుగా మత విశ్వాసాల ఒత్తిడితో, అవి చేసే వికృత చేష్టల ఒత్తిడితో, వాటి చుట్టూ అల్లిన బోధనల ఒత్తిడితో బతుకులీడుస్తున్నారు కదా? ఈ విషయం ఒక్కసారి సీరియస్‌గా ఆలోచించాలి. ''దేవుడి పేరుతో ఎన్నో అరాచకాలు జరిగాయి. అందరినీ ప్రేమించు. ఎవరినీ బాధించకు, చంపకు అని బైబిల్‌లో ఉంది. కానీ జరిగింది, జరుగుతున్నదీ ఏమిటీ? దేవుడి పేరుతోనే ఎక్కువమంది హింసింపబడ్డారు. చంపబడ్డారు. పవిత్రమైన ఆ దేవుడి పేరుతో సమాజాన్ని అతలాకుతలం చేసిన సంఘటన లెన్నో ఉన్నాయి'' అని అన్నాడు సోమర్‌సెట్‌ మామ్‌ (1874-1965). మానవ సంబంధాల గూర్చి 'ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌' అనే గొప్ప నవల రాసి విశ్వవిఖ్యాతుడయిన బ్రిటిష్‌ రచయిత మామ్‌. అలాంటి మహోన్నతుడి మాటల సారాంశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా? ఈ సమాజానికి మనుషులూ, మానవ సంబంధాలూ అవసరం ఉంది.

కంప్యూటర్‌లో ఫైళ్లు పేరుకుపోతే క్లియర్‌ చేయనా? అని అది అడుగుతుంది. మీ మొబైల్‌లో నైనా సరే జెంక్‌ ఫైళ్లు పేరుకుపోతే క్లియర్‌ చేసుకో అని అది హెచ్చరిస్తుంది. మనిషి తయారు చేసిన ఒక యంత్రం తెలివిగా ప్రవర్తిస్తుంటే, స్వతహాగా తెలివిగల వాడైన మనిషి మాత్రం పనికిరాని చెత్త వదిలించుకోవడం లేదు. పైగా దేవుడి హారతిఫోటోలు, సాయిబాబా వెలుగై కదలిన వీడియోలు, సుప్రభాతాలు, ప్రవచనాలు, మంత్రాలు సేవ్‌ చేసుకుని, తమకు తామే పరమభక్తులుగా భావించుకుంటూ ఉంటారు. కంప్యూటర్లో తాము భద్రపరుచుకున్న దేవుడి ఫోటోలు, దైవ ప్రార్థనలు, కీర్తనలు, అజాలు, నమాజాలు ఎప్పటికీ 'మోక్షం' ప్రసాదించలేవు. కేవలం అది తమ భ్రమ అని గుర్తించుకోవాలి. వాస్తవంలోకి రావాలంటే భ్రమల్ని బద్దలు కొట్టుకుని రావాలి.ఫుడ్‌ మార్కెట్‌లో ఈ మధ్య కొన్ని రైస్‌ ప్యాకెట్స్‌ కనబడుతున్నాయి.

వాటిమీద యోగా చేస్తున్న అమ్మాయి ఫోటో, నాట్యం చేస్తున్న అమ్మాయి ఫోటో, ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన పరికరాలు ముద్రించి ఉంటాయి. అవి తింటే ప్రశాంతంగా ఉంటారు. చలాకిగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు అని ఆ ఫోటోల ద్వారా ప్రకటించుకోవడమన్నమాట! కాని అసలు విషయమేమంటే అందులో ఉండేవి కల్తీబియ్యం! భక్తుల మాటల్లో చెప్పాలంటే ఆ బియ్యం స్వర్గానికి దగ్గరి దారి చూపే వన్నమాట! మన చాదస్తాలు, సంప్రదాయాలు, వైదిక ధర్మాలు, అన్ని మతాల అన్ని విశ్వాసాలూ ఈకల్తీ రైస్‌ ప్యాకెట్‌ లాంటివే. అబద్ధాలు ముద్రించి మోసపూరితంగా వ్యాపారం చేసుకుంటున్నట్టుగానే ఉన్నాయి. కొంచెం లోతుగా, తీవ్రంగా ఆలోచిస్తే విషయం బోధపడుతుంది.మతం అంటే ఏమిటీ? జనాన్ని మోసపూరితంగా కట్టిపడేసేది. ఈ మోసం యుగయుగాలుగా జరుగుతూ వస్తోంది. విచిత్రం చూడండి. మనిషి డబ్బు సృష్టించాడు. దానికి బానిస అయ్యాడు. బంగారం తవ్వితీశాడు. దానికి బానిస అయ్యాడు. ఆస్తులు కూడబెట్టాడు. వాటికి బానిస అయ్యాడు. అలాగే చాలా చాలా ముందు ఒకానొక కాలంలో దేవుణ్ణి సృష్టించాడు. ఆ భావనకు బానిసైపోయాడు. ఈ అత్యాధునిక వైజ్ఞానిక యుగంలో కూడా జనం ఈ విషయం అర్థం చేసుకోలేకపోతే ఎలా? వాస్తవాలు గ్రహించుకోవాలి కదా? మనిషి మనిషిగా ప్రవర్తించడం మాని ఎంతసేపటికీ గత జన్మ, వచ్చే జన్మ అంటూ చెవుల్లో పువ్వులు పెట్టుకునే తిరుగుతారా? ఇప్పటికీ ఈ జన్మని,దీని విలువనీ గ్రహించనే గ్రహించరా?  మనిషినన్న స్పృహ మనిషికే లేకపోతే
వాణ్ణి ఇక ఎవడు బాగుచేయాలి? భక్తుడు కావడం కన్నా, మనిషి కావడం కష్టం!ఆల్కహాలుకు డ్రగ్స్‌కు జనం అలవాటు పడ్డారుబానిసలయ్యారు.ఎందుకూ? వాస్తవంలోంచి పారిపోవడానికి!

మత విశ్వాసాలకు అలవాటు పడి బానిసలయ్యింది కూడాఅందుకే నన్నది మరువకూడదు.అందుకే సిగరెట్‌, బీడీ, గుట్కా, గంజాయి, మద్యం వగైరాలు మాత్రమే కాదు, ఆ లిస్టులో చేర్చాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వారు ఆలోచించుకోవాలి! అయితే మత విశ్వాసాలు పక్కనపెడితేనే ప్రశాంతత లభిస్తుంది.

నాలుగు దేశాలు తిరిగివచ్చిన వాడికి కొంత ప్రపంచ జ్ఞానముంటుంది. లేదా తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాసతో ఎవరైనా చదివి, పరిశోధించి, అడిగి తెలుసుకుని.. ప్రపంచ జ్ఞానం, విశ్వ రహస్యాలు తెలుసుకోవచ్చు. ఇవేవీ చేయనివాడు ఓ మత గ్రంథం భట్టీయం చేసి, గుంజకు కట్టేసిన గేదెలాగా, మురికినీటి గుంటలాగా ఒకేచోట ఉంటూ 'తనంతటి మేధావి లేడు, జ్ఞానిలేడు' అని విర్రవీగితే వాడి అజ్ఞానానికి జనం నవ్విపోతారు కదా? ఎవరినో విమర్శించడం మనపని కాదు గానీ, నిరంతరం అర్థవంతంగా ఆలోచించడని జనానికి చెప్పడం మాత్రం మనందరి పనే!! అన్నింటికీ విశ్రాంతి నిచ్చే మెదడు విశ్రాంతి తీసుకోదు. మీరు నిద్రపోతున్నా అది పనిచేస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మికత, యోగ, సమాధి వంటి వాటితో బలవంతంగా మీరు మెదడును పనిచేయకుండా చేస్తున్నారు. అది అన్యాయం! నూతన ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలెవరూ యోగ, ధ్యానం చేయలేదు. సమాధిలో కూర్చోలేదు. పోనీ, అవన్నీ చేసినవారు ఈ మానవ సమాజం ప్రగతి పథంలోకి పోవడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. మానసిక వ్యధలన్నింటినీ తగ్గించే ఒక అద్భుతమైన పనిముట్టు హేతుబద్ధమైన శాస్త్రీయ విద్యావిధానమే!

మతం అవసరం ఎంత ?

ప్రపంచ జనాభా సుమారు 600 కోట్లు ..

Christian మతాన్ని follow అవ్వకుండా బతుకుతున్నవారు ఎంత మంది ఉంటారు ?
సుమారు 400 కోట్ల మంది ఉంటారనుకుందాం ?
Islam మతాన్ని follow అవ్వకుండా 450 కోట్ల మంది వరకు  బతుకుతున్నారు ..

Hindu ధర్మాన్ని follow అవ్వకుండా 500 కోట్ల మంది వరకు బతకగలుగుతున్నారు ..

మరే ఇతర మతాన్ని తీసుకున్నా ఆ మతం అవసరం లేకుండా బతుకుతున్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు ..

అసలు ఏ మతాన్ని అనుసరించకుండా బతుకుతున్నవాళ్ళు ఎన్నో  మందే ఉన్నారు ..

వాళ్ళంతా సంతోషంగా లేరంటారా ?

దేవుణ్ణి నమ్మితే మంచి జరుగుతుంది అనుకోవడంలో తప్పు లేదు..
దేవుణ్ణి ప్రార్దించి ఏదైనా పొంద వచ్చు అనుకోవడంలో తప్పు లేదు ..

కాని
దేవుణ్ణి ప్రార్ధించక పోతే బతకలేమన్న భయం మాత్రం మూర్ఖత్వం .
ఏదో ఒక మతం ముసుగు లేకుండా బతకలేమనుకోవడం అమాయకత్వం ..

నీ నమ్మకం నీ వ్యక్తిగతం ..నీ ప్రార్దన నీ  వ్యక్తి గతం ..దాని కోసం ఏదో ఒక group కట్టాల్సిన అవసరం లేదు ..
మతం నీకు ఏమి చూపిస్తుంది? ప్రార్దించే పద్దతులు? ..బతికే సిద్ధాంతాలు ?..

నీ మతం చూపించే పద్దతులు ,సిద్ధాంతాలు follow అవ్వకుండా మిగిలన జనం జీవించ గలిగినప్పుడు , మిగిలిన జీవరాశులన్నీ జీవించ గలుగుతున్నప్పుడు , వాటిని ఖచ్చితంగా పాటించాలనుకోవడం అజ్ఞానమే అవుతుంది .

ప్రతి విషయం లోనూ  మనిషిగా ప్రతి స్పందించక మతస్తుడిగా ప్రతి స్పందించడం వల్లే ప్రపంచంలో అశాంతి నెలకుంటోంది .

పక్షులు ఏ గ్రంధాన్ని చదువుతున్నాయి? చేపలు ఈ గ్రంధాన్ని అనుసరిస్తున్నాయి ?
జంతువులన్నీ  ఏ /ఎవరి సిద్ధాంతాలని పాటిస్తున్నాయి ..?
మనిషి కెందుకు ఎందుకు అవసరం ? ఎంత అవసరం ?

ఈ అశాంతిని తొలగించేందుకు
నీ మతాన్ని నీ గుమ్మం దగ్గర కట్టేయ్..మనిషిగా బయటకి అడుగు పెట్టు ...

సౌ జ న్య  o - whatup message