Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

మానవవాదులకు ఐక్యూ ఎక్కువ!

మతరహిత ప్రజలు దేశాల వారీగా ఈ విధంగా ఉన్నారు.
ఎస్తోనియా - 76.5 శాతం;
జపాన్ - 76 శాతం;
డెన్మార్క్ - 72 శాతం;
స్వీడన్ - 64 శాతం;
వియత్నాం - 62.5 శాతం;
మకావ్ - 60.9 శాతం;
జెక్ రిపబ్లిక్ - 57.5 శాతం;
హాంకాంగ్ - 57 శాతం;
ఫ్రాన్స్ - 53.5 శాతం;
నార్వే - 51.5 శాతం;
చైనా - 47 శాతం;
నెదర్లాండ్ - 47 శాతం;
ఫిన్లాండ్ - 44 శాతం;
ఇంగ్లాండు - 41.5 శాతం;
దక్షిణ కొరియా - 41 శాతం;
జర్మని - 40శాతం;
హంగరి - 39 శాతం;
బెల్జియం - 38.75 శాతం;
బల్గేరియా - 37 శాతం;
సోవేునియా - 36.15 శాతం;
న్యూజిల్యాండ్ - 34.7 శాతం;
రష్యా - 30.5


శాతం; అవెురికా - 20 శాతం. ఇంతకూ మన భారతదేశంలో మతరహిత జనాభా 0.6 శాతం.

ఈ వివరాలన్నీ ఎందుకంటే ప్రపంచదేశాలలో మనవెుక్కడున్నావున్నది బేరీజు వేసుకోవడానికి! దేవుడు - దయ్యాల భావనల్లోంచి, సంప్రదాయం, ఆచారాల పేరుతో మూఢనమ్మకాల కొనసాగింపులోంచి బయటపడి, ఇకైనెనా ఆధునిక వైజ్ఞానిక సమాజానికి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి!!

6 నవంబర్ 2015న ‘ద గార్డియన్’ ఇంగ్లీషు పత్రిక ఈ విధంగా ప్రకటించింది ‘మతరహిత సంస్కృతి, ప్రజా స్వామిక వాతావరణం ఉన్న కొన్ని దేశాల్లో నేరాల శాతం తగ్గి, కొన్ని జైళ్ళు కూడా మూసేస్తున్నారు. అంతేకాదు, ప్రపంచ దేశాల్లో జరిపిన ఒక సర్వే - మతాన్ని ఆచరించే కుటుంబాల పిల్లలతో పోల్చినపుడు... మతరహిత కుటుంబాల పిల్లలు దయగల వారుగా, నైతికంగా పద్ధతి గలవారుగా ఉన్నారని వెల్లడించింది.
ఈ కాలంలో తెలివితేటల్ని ఐక్యూ లెవెల్స్‌తో కొలుస్తు న్నాం. ఇవి దేవుణ్ణి నమ్మే వారిలో, నమ్మని వారిలో ఎలా


ఉన్నాయి అనే పరిశీలన జరిగింది. నాస్తికుల ఐక్యూ లెవెల్స్ 115-125 మధ్య ఉంది. ఇంకొందరిలో 125 కంటే ఎక్కువగా కూడా ఉంది. అదే ఆస్తికుల విషయానికొస్తే అది 85-115 మ ధ్య ఉంది. మరికొందరిలో ఇంకా  తక్కువగా 75 మాత్రమే ఉంది. మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని సరాసరి లెక్కగడితే, 90 శాతం మంది జనం ఐక్యూ 85-115 మధ్య ఉంది. ఆపైన ఉన్నవారు 5 శాతైమెతే, 85కు తక్కువ మరో 5 శాతం ఉన్నారు. దీనివల్ల కూడా ఒక విషయం తేటతెల్లమౌతోంది. దైవభ్రాంతి, దైవచింతన, దైవభక్తి లేదా దేవుడంటే భయపడే జనాభా ప్రపం చంలో అధికంగా ఉంది. మనిషి సృష్టిం చుకున్న అతి భయంకరైమెన భావన ఏమిటంటే అది - దేవుడే. అందులోంచి బయటపడాల్సింది మనిషే.

దేవుడు లేడు, లేడు, లేడు - అని ఘంటాపథంగా చెప్పిన పెరియార్ ఒక మాట చెప్పాడు. ‘నీ బుద్ధి పని చేయ డం ప్రారంభిస్తే అక్కడ భక్తి నిలవదు. నీ బుద్ధి బద్ధకిస్తే, అక్కడ నీ మీద భక్తి పెత్తనం చేస్తుందీ అని!’ ఒకసారి ఒకతను పెరియార్‌తో వాదులాటకు దిగాడు. ‘దేవుణ్ణి రాయిగా తేల్చేయకండి! అదిప్పుడు రాయి కాదు, మంత్రోచ్ఛారణతో దాన్ని దేవుణ్ణి చేశాం’ - అని అన్నాడు. ‘రాయినే దేవుణ్ణి చేయగల శక్తి గలవారు కదా? అట్టడుగు వర్ణాల వారిని మంత్రోచ్ఛారణతో అగ్రవర్ణాల వారిగా చేయండి! మనుషులంతా సమానులై సమస్యలు లేకుండా పోతాయి కదా?’ - అని ప్రశ్నించాడు పెరియార్! ఆనాటి ఆయన ప్రశ్నకి ఈనాటికీ జవాబు లేదు.

హిందూ మతం గూర్చి ప్రపంచానికి మహోపన్యాసం ఇచ్చిన వివేకానందుడే ఆ తర్వాతి కాలంలో ఏమన్నాడో పరిశీలించండి. ‘ఏ హేతు పరిశీలనల వల్ల కనుగొనబడ్డ విషయాలు ప్రతి విజ్ఞాన శాస్త్రాన్ని రుజువు చెయ్యడానికి కారణభూతాలవుతున్నాయో, వాటి సహాయంతో మతమూ నిరూపించబడాలా? అంటే అవుననే నా అభిప్రాయం! ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఒకవేళ అలాంటి పరశోధనల వల్ల మతం నశించే పక్షంలో - ఇంతకాలంగా అది నిష్ప్రయోజనైమెందని, అనుచితైమెన అంధవిశ్వాసమని తెలుస్తూ ఉంది. కాబట్టి, అదెంత త్వరగా నశిస్తే అంత మంచిది. అది పోవటం కంటే మేలైన పని మరొకటి ఉండబోదని నా నిశ్చితాభిప్రాయం!

పనికిమాలిందంతా పోతుందనడం నిస్సందేహం-’
ఒకప్పుడు దైవ భావనకు మహిమలు ఆపాదించినట్టే, ఇప్పుడు వ్యాపార సినిమా హీరోలకి సాహసా లు ఆపాదించి జనం ఆనందిస్తున్నా రు. ఊహలు, అబద్ధాలు జనాన్ని ఎ క్కువగా ఆకర్షిస్తాయి. నిజాలు, వాస్తవాలు కటువుగానే ఉంటాయి. మన కు తెలుసు, వాస్తవానికి నటీనటులు సాహసవంతులు కారు. సామాన్యులు చేయగలిగే పనులు కూడా వారు చేయలేరు.

ఉదాహరణకు వందల కిలోల బరువు మోయగలిగే హమాలీలున్నారు. మండుటెండలో 20 కి.మీ. రిక్షా తొక్కే వాళ్ళున్నారు. ఐదారు కి.మీ. మంచినీళ్ళ బిందెలు మోసే గృహిణులున్నారు. నటన కాదు, తప్పని సరై వాళ్ళలా చేస్తున్నారు. ఇవన్నీ మన కమర్షియల్ సినీ హీరో, హీరోయిన్‌లు చేయగలరా? చేయలేరు - అలా ఒళ్ళు హూనం చేసుకుని బతికే వాళ్ళు కాసేపు వెండితెరమీద ఊహలు, భ్రమలు, అబద్ధాలు చూసి ఆనందిస్తారు. ఇదేవిధంగా తాము చేయలేని పనులు తాము కల్పించుకున్న భగవంతుడు అవలీలగా చేస్తాడని జనం నమ్మారు. ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఆ భావన నిలవడానికి అనాదిగా అన్ని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కథల్లో, నవలల్లో కల్పిత పాత్రలు పాఠకుల్ని ఏదో ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి కదా? ఈ దైవ భావన అంతే అని అర్థం చేసుకోవాలి!

ఎంత చదివారు? ఎంత ఎదిగారు? ఎన్ని కోట్లు కూడబెట్టారు? ఎన్ని మేడలు కట్టుకున్నారు? ఎంతటి ఖరీైదెన కార్లలో తిరిగారూ - ఇవి ముఖ్యం కాదు. కాస్త వివేకంతో కూడిన ఎదుగుదల, కాస్త విజ్ఞానంతో కూడిన ప్రవర్తన కావాలి. విచారించాల్సిన విషయవేుమంటే ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగాక అర్థం, పర్థంలేని మూఢత్వం బాగా పెరుగుతోంది. బాబాలు, స్వామీజీలు, అమ్మలు గంటల తరబడి టీవీల ద్వారా ఇంటిం టా అవివేకాన్ని, మూఢత్వాన్ని వెదజల్లుతున్నారు. అందుకే శాస్త్రీయైమెన చదువు కావాలంటున్నాం. నిరూపణకు నిలబడనివి ‘నమ్మకం’ స్థాయిలో ఉంటే భరించొచ్చు. కానీ అవి ‘అమ్మకం’ స్థాయికొచ్చేస్తున్నాయి. కాబట్టి సామాన్య జనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతి పూజలు  చేయిస్తానని, పరమాన్నంలో మత్తమందు కలిపి, 1.33 కోట్ల నగదు కాజేసిన ఒక బాబా ఉదంతం హైదరాబాద్, బంజారాహిల్స్‌లో వెలుగులోకి వచ్చింది కదా?

మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఒకైవెపున ఉంటే, ఇంగిత జ్ఞానం ఉపయోగించని ధనిక మూర్ఖ శిఖామణులు ఏ స్థాయిలో ఉన్నారనేది - మరొకైవెపున ఉంది కదా?
ఏ మతమూ శాంతికి స్వర్గధామం కాదు. హింసను ప్రోత్సహించే మౌలికాంశాలు ప్రతి మతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా గతాన్ని తవ్వి చెప్పుకోనవసరం లేదు. ఇంతెందు కూ? ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న హింసలో ఎక్కువ శాతం మతం నేపథ్యంలో జరుగుతున్నదే కదా?

అందువల్ల ఏ మతమూ నిర్దుష్టం కాదు. అన్నింటిలో లోపాలున్నాయి. ఇది మెరుగైంది. ఇది స్వచ్ఛైమెంది అని ఏ మతానికీ మొదటి స్థానం ఇవ్వలేం. మనిషి కేంద్రంగా అతను సాధించిన విజయాలు కేంద్రకంగా చేసుకుని, మానవ వాదాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో తప్పకుండా మనం చాదస్తాల్ని, మూఢనమ్మకాల్ని వదిలేయగలం. మతరహిత సమాజాన్ని ఏదో ఓ నాటికి రూపొందించుకోగలం!

వ్యాసకర్త: డా. దేవరాజు మహారాజు

సౌ జ న్య  o - whatup message