ఎక్కడకు వెళ్తున్నారు ఆంటీ..?
మా బాబును చూడటానికి Hostel వెళ్తున్న.బాబు ఏం చదువుతున్నాడు.?
1 వ తరగతి
మీ వారు ఏం చేస్తుంటారు.?
Contractor (Govt) job చేస్తున్నారు.
మరి మీరేం job చేస్తున్నారు..?
Job ఏం లేదు. ఇంటి దగ్గరే ఉంటాను.
మరీ పిల్లాడిని hostel ల్లో...?
అంటే ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువైందిలే.
ఓహో...
ఆరేళ్ళ పిల్లాడు కాకుండా ముప్పై ఏళ్ల నీ మొగుడు చేస్తాడా అల్లరి (మనసులో)
మీకు తెలియని విషయం ఏంటంటే..
పిల్లాడు hostelల్లో ఉన్నంత కాలం
వాడికి
అమ్మంటే ఓ ఆయా..
నాన్నంటే డబ్బులిచ్చే Atm.. అంతే
అలా పెంచిన మీరు
రేపొద్దున్న వాడికి ముపై
మీకో అరవై ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది.
అప్పుడు
మా కొడుకు మమ్మల్ని
old age home లో పడేశాడు అని ఏడవడానికి సిగ్గుపడాలి.
పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి
15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి
25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి
మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.
అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి.ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే...? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.
అసలేం జరుగుతుంది మన దేశంలో..?
విద్యాసంస్ధలేమో లాబాల కోసం
ఉపాధ్యాయులేమో జీతాల కోసం
తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు
తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి
పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా
ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.
బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో Mobile పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..
అది కాస్తా తలుపులు వేసుకొని
బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.
మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధిచేస్తున్నారు.
గుర్తుంచుకోండి..
" మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు
సమాజాన్ని తీర్చిదిద్దే
రేపటి తరాన్ని.."
అది మర్చి పోవద్దు...
వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు .
ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు...
ఇట్లు.
మీ శ్రేయోభిలాషి..........
సౌ జ
న్య o - whatup
message