Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

స్వాతంత్ర్య సమరయెాధుడు - షంషేర్ ఉద్దామ్ సింగ్ .

*పగ కూడా మనిషిని బతికిస్తుంది...కొన్ని సార్లు"*


అది 1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ .....అక్కడ ఓ చిన్నతోటలో  .... రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.


ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది.  దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..


ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు. 


దీనికి కారకుడైన  జనరల్ ఓ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవకార్యక్రమా లలో పాల్గొన్నాడు..


జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయన మవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు.తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడ సాగాడు.. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.


ఆరోజు 1940 జూలై 13....

ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. ఆ సమాచారం  ఆయువకునికి అందింది...  వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్  సంపాదించాడు ..  


ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో  ఫిస్టల్  దాచాడు.. అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు 

ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు... 


సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు, ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు...


అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..


రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.. కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు...


ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. 


ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు...


నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ  అప్రమత్తమ య్యేందుకు లేచాడు. 


అంతే ఆయువకుడు  పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు.. 

భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు....


వేలమందిని చంపి భారతీయులు  నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... ఆతను జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు. 


ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడాయువకుడు...ఆ విప్లవవీరుడి జయంతి నేడు.


ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా???? 


*షంషేర్ ఉద్దామ్ సింగ్ ....*

స్వాతంత్ర్య సమరయెాధుడు.


*"జోహార్ ఉద్దాం సింగ్ ...జోహార్ "*


ఇలాంటి దేశభక్తుల కథలను మనం చదువుదాం. మన పిల్లలకు కూడా అందిద్దాం.


No comments: