ప్రేమించడం మీకు ఎలాగూ చేతకాదు... కనీసం వీళ్ళనైనా ప్రేమించనీయండిరా!!!
అవునులే.. సాటి మనుషులను అంటరానివారిని చేసి ఊరికి దూరంగా వెలివాడల్లో ఉంచిన మీకు ప్రేమంటే ఎలా తెలుస్తుందిలే???
అవునులే... పురుషులతో సమానంగా పుట్టిన మహిళలకు సమాజంలో రెండో స్థానం ఇచ్చి వారిని చదువుకు దూరం చేసి కేవలం వంట ఇంటికే పరిమితం చేసిన మీకు ప్రేమంటే ఎలా తెలుస్తుందిలే???
అవునులే... ఒక జంతువు అవుకు ఇస్తున్న విలువ కూడా సాటి మనుషులకు ఇవ్వలేనటువంటి మీకు ప్రేమంటే ఎలా తెలుస్తుందిలే???
అవునులే... ప్రకృతి సహజ సిద్ధంగా ప్రతినెలా వచ్చే నెలసరి పీరియడ్స్ ను కూడా అంటరానివాటిని చేసి.. ఆ మూడు రోజులు మహిళలందరినీ కొన్నింటికి దూరం చేస్తున్న మీకు ప్రేమంటే ఎలా తెలుస్తుందిలే???
అవునులే... ఆడది అంటే ఒక మనిషని.. మహిళ ఒక వస్తువు కాదని.. ఆమెకూ ఆలోచనలు, అభిప్రాయాలూ ఉంటాయని అర్థం చేసుకోలేని మీకు ప్రేమంటే ఎలా తెలుస్తుందిలే???
అవునులే.. ఈ దేశం ఒక మతానికి చెందినది కాదని.. అన్ని మతాల ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కలిగిఉంటారని అర్థం చేసుకోలేని మీకు ప్రేమంటే ఎలా తెలుస్తుందిలే???
నిజమే... ప్రేమించడం మీకు ఎలాగూ చేతకాదు.. కనీసం వాళ్ళనైనా ప్రేమించనీయండిరా..
ప్రేమించనీయండిరా
ఊరూ వాడ ఒక్కటయ్యేదాక...
ప్రేమించనీయండిరా
మహిళలూ పురుషులూ సమానమయ్యేదాక...
ప్రేమించనీయండిరా
మనుషులంతా సమానమయ్యేదాక...
ప్రేమించనీయండిరా
కులాలన్నీ సంకరణం అయ్యేదాక...
ప్రేమించనీయండిరా
మతాలన్నీ సంకరణం చెందేదాక...
ప్రేమించనీయండిరా
కులాలు మతాలు సమసిపోయేదాక..
ప్రేమించనీయండిరా
దేశాలూ ఖండాలు ఒక్కటయ్యేదాక...
ప్రేమించనీయండిరా
సమసమాజం ఆవిర్భవించేదాక...
- డాక్టర్. లక్కం. ప్రభాకర్
సౌ జ
న్య o - whatup
message