Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

చట్టాల పట్ల గౌరవం లేకపోవడానికి కారణం కులవ్యవస్థ



తన కూతుర్ని తక్కువ "కులం" వాడు పెండ్లి చేసుకున్నాడనే కారణంగా కూటికి గతి లేని ఒక కంసాలి అల్లుడిపై కత్తి దుయ్యగా, కోట్లకు పడగెత్తిన కోమటోడు అల్లడిపై కక్ష్య పెంచుకుని తీవ్రవాదులతో చేతులు కలిపి పట్ట పగలు దారుణంగా హతమార్చాడు. నిందితులు కంసాలిని, కోమటోన్ని పోలీసులు అరెస్టు చేసి ఊచలు లెక్కబెట్టిస్తుండగా.., కుల తత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న పలువురు కులోన్మాదులు "తండ్రి పేమ" అంటూ రకరకాల వక్ర భాష్యాలను సృష్టించి సభ్య సమాజం తల దించుకునేలా నిసిగ్గుగా వాదిస్తున్నారు. అదీ కూడా చాలదన్నట్లు *"ప్రణయ్" హత్య కేసులో ప్రధాన నిందితుడు, కులోన్మాద హంతకుడు మారుతీరావుకు మద్దతుగా వందలాది మంది కులోన్మాదులు నిసిగ్గుగా బహిరంగ ప్రదర్శనలో పాల్గొనడం, దాన్ని మనువాద మీడియా నైతిక విలువలను పక్కనపెట్టి ప్రచురించడం చూస్తుంటే వీరికి చట్టాలు అంటే ఏమాత్రం గౌరవం లేదని తేలిపోయింది. దీనికి కారణం "కులవ్యవస్థ" అని చెప్పక తప్పదు.

రాజ్యాంగ శాసనాలను, చట్టాలను అతిక్రమించి దుర్వినియోగపర్చడం, వక్రీకరించి నిర్వీర్యం చేయడంలో దోపిడీ కులాల వారిని మించిన వారు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరు ఇంతలా బరితెగించడానికి ఒకే ఒక్క కారణం "కులవ్యవస్థ". కులం పట్ల వారికున్న మమకారం. *రాజ్యాంగానికి పునాది "సమానత్వం". కులవ్యవస్థకు పునాది" అసమానత్వం".* సమానత్వం అనేది ప్రజాస్వామ్య బద్దమైనది కాగా అసమానత్వం అనేది నియంతృత్వ పూరితమైనది. "రాజ్యాంగం" మానవ నిర్మితం కాగా "కులవ్యవస్థ" దేవుడు సృష్టించినట్లు చెప్పబడుతుంది. *రాజ్యాంగాన్ని అనుసరించాలని మానవత్వం ఉన్న మనుషులు చెబుతుండగా.., కులాన్ని పాటించాలని దేవుడిచే రాయబడినవని చెబుతున్న హిందూ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.* వాటిని ఋషులనే మానవాతీత శక్తులు కలిగినట్టి మహా జ్ఞానులు ప్రబోధించారనే నమ్మకం ఉంది. అందువల్లనే "కుల శాసనాన్ని" ధిక్కరించడం పాపమనే నమ్మకం ఉంది.

*రాజ్యాంగ శాసనాలు కుల శాసనాలకు అనుగుణంగా కాక భిన్నంగా వ్యతిరేకంగా ఉండటం వలన రాజ్యాంగ శాసనాల పట్ల గౌరవం ప్రకటించడం లేదు. గౌరవం లేకపోవడం వల్ల శాసనాలను వక్రీకరించడం, నిర్వీర్యం చేయడం, అతిక్రమించడం, దుర్వినియోగం చేయడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.

*జై భీమ్..! ✊🏼 జై భారత్..!!*
*మార్షల్ చిలుక రాందాస్*
 (బహుజనవాది)
సౌ జ న్య  o - whatup message