గాలి, నీరు, నిప్పు, నేల, అంబరం, వనం లేకపోతే ప్రకృతే లేదు. ఇందులో ముఖ్యంగా నేలపై చూసేది మనకు నిత్యం కనపడేటివి నీరు, నేల, అడవి. ఇవి సమృద్ధిగా ఉండేది మన దేశంలోనే. మన దేశంలో అడవులు, అడవులతోబాటు వన్యప్రాణులు, సెలయేళ్ళు. ముఖ్యంగా మన దేశంలోని అడవులలో వివిధ రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని పర్యావరణ శాస్త్రం చెపుతోంది. వీటిగురించి తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
మనిషికి వన్యప్రాణులతో చాలా దగ్గరి సంబంధం ఉంది. వన్యప్రాణులు లేకుంటే పర్యావరణం కారణంగా మనిషి ఆర్థిక వృద్ధి జరిగేదే కాదు. దీనికి తోడు జనాభా ఓ వైపు పెరిగిపోతోంది. జనాభా పెరిగిపోతుంటే ఆ ఫలితం వన్యప్రాణులపై పడుతోంది.
వృక్షో రక్షతి రక్షిత: ప్రస్తుతం పర్యావరణం అతలాకుతలమౌతోంది. అడవులు అత్యధికంగా ఉన్న మన దేశంలోనే అడవులను నరికివేస్తున్నారు. అందులోనున్న కలపను తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. దీంతో అడవులు తరగిపోతున్నాయి. దీనికి తోడు వన్యప్రాణుల సంఖ్యకూడా అంతరించిపోతోంది.
పర్యావరణంలో వస్తున్న మార్పులకారణంగా సరైన సమయానికి వర్షాలు రావడం లేదు. వర్షాలు కురవక పోవడంతో సరైన పంటలు చేతికి అందడం లేదు. ప్రకృతి పరంగా వచ్చిన మార్పుల కారణంగా పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో ప్రకృతి పరంగా లభించే నీటిని ప్రస్తుతం డబ్బులిచ్చి కొనుక్కునే దుస్థితికి మానవుడే ప్రధానమైన కారణం. దీనికి నేను అడవిగా చాలా బాధపడుతున్నాను.
రోజురోజుకు పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతోంది. అడవులున్న చోట నేడు ఇండ్లుంటున్నాయి. మానవ స్వార్థం కారణంగా ఇలా జరుగుతోంది. చెట్లను నరికిన తర్వాత మళ్ళీ మొక్కలను నాటాలనే ఆలోచన నేటి మానవాళికి లేకపోవడమే ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా మారుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన చెందుతున్నారు.
దీనికి మనిషి తన కర్తవ్యంగా చేయాల్సిన పని ఏంటంటే... మీరు ర్యాలీలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. ప్రతి ఒక్కరుకూడా మీ ఇంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వీలైనంత ఎక్కువగా మొక్కలు నాటి వాటి పెంపకం బాధ్యతను కూడా మీరే తీసుకోండి.
మీ ఇంటి చుట్టూ మొక్కలు పెంచండి. దీంతో మీ ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. వేడి, దుమ్ము, ధూళినుంచి మిమ్ములను మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో మొక్కలు, చెట్లు ఉంటే వాటిపై వచ్చి వాలేందుకు పక్షులుకూడా వస్తాయి. ఇలా పక్షులకు మీరు పరోక్షంగా ఆశ్రయమిచ్చినవారవుతారు. వాటికి ఆహారంకూడా అందించినవారవుతారు.
ప్రముఖంగా పట్టణాలు, నగరాలలో నివసించేవారు పక్షులపై ప్రత్యేక శ్రద్ధను కనపరచండి. అలాగే పెంపుడు జంతువులపైకూడా కాస్త దృష్టిని సారించండి. ఉదాహరణకు రామచిలుకలు, పావురాలు, కాకులు, గ్రద్దలు, నెమళ్ళు, చిలుకలు, పిచ్చుకలు, ఇతర పక్షిజాతి. అలాగే పశువులు.. దేశంలో ప్రముఖంగా పూజింపబడే పశువు ఆవు, ఇంటి యజమానికి విశ్వాసంగా ఉండే జంతువు కుక్క, గుర్రం, గాడిద, మిగిలిన పెంపుడు జంతువులకుకూడా చోటు కల్పించి వాటి పోషణ భారాన్ని మీరు చేపట్టండి. చెట్లను పెంచండి. అవి మిమ్మల్ని కాపాడుతాయి.
సౌ జ
న్య o - whatup
message