Hi....కురుక్షేత్రంలో కౌరవులందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరకెళ్ళి
కృష్ణా....'' ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ''
'' నీ కడుపు మంట చల్లారిందా '' అన్నది.
'' నేనేం చేశాను '' అన్నాడు కృష్ణుడు.
'' చేయాల్సిందంతా చేసి.... నా కుమారులందరినీ చంపి .....నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా ''. అన్నది ఆవేశంతో ఊగిపోతూ.
'' నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు '' అన్నాడు కృష్ణుడు.
'' అంటే కారణం నేనా '' కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి.
'' ముమ్మాటికీ నువ్వే '' అన్నాడు కృష్ణుడు.
'' నేనా? ఎలా? '' గాంధారి మొహంలో ఆశ్ఛర్యం.
'' ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేశావు.
వందమంది పిల్లల్ని కన్నావు గానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా?
వాళ్ళు తోటి వారిని ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అని ఒక్కనాడైనా పరీక్షించావా?
నీ పిల్లల ఆలోచనలు, అలవాట్లు మంచివా? చెడ్డవా? అని ఒక్కనాడైనా పట్టించుకున్నావా? అన్నాడు కృష్ణుడు.
'' లేదు '' అంది గాంధారి.
'' నీ కళ్ళకు కట్టుకున్న గంతల్ని తీసి ఆనాడే నీ పిల్లలను నువ్వు సరిగ్గా పెంచి ఉంటే ఈ నాడు కురుక్షేత్రం జరిగేదీ కాదు,
కౌరవులందరూ పోయేవారూ కాదు.
ఇది నీ స్వయంకృతాపరాధమే '' అన్నాడు కృష్ణుడు.
నేడు చాలామంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా గాంధారి, దృతరాష్ట్రుల్లా ప్రవర్తిస్తూ
'' చదువులు చంపేస్తుంది '' అంటూ తప్పును చదువుల తల్లిమీద తోసేస్తున్నారు.
'' ప్రైవేటు పాఠశాలలు '' అన్న విత్తనాలను ప్రభుత్వాలు ప్రజల మీద చల్లేస్తే
వాటికి కావాల్సినంత నీరు (విద్యార్థులను చేర్పింది) పోసింది ఎవరు?? మనం కాదా??
వాటికి కావల్సినంత ఎరువులు (ఫీజులు కట్టింది) చల్లింది ఎవరు?? మనం కాదా??
అవి ఎండిపోకుండా, వాడిపోకుండా పగలనక, రాత్రనకా దాన్ని (ట్యాూషన్లు , స్పెషల్ క్లాసులు అంటూ) రక్షిస్తున్నది ఎవరు?? మనం కాదా??
ఏ ప్రైవేటు పాఠశాలైనా
ఏ ప్రైవేటు కళాశాలైనా
ఇంట్లో ఉన్న మన పిల్లల్ని మన అనుమతి లేకుండా బలవంతంగా లాకెళ్ళి చదువు చెప్పిస్తున్నారా??
పరిచయమున్న ప్రతి ఒక్కరినీ ఒకటికి పదిసార్లు ఏ స్కూల్ బావుందని అడిగి, లక్షలకు లక్షలు పోసి మరీ మనమేగా మన పిల్లలను చేర్పిస్తున్నది.
ప్రైవేటు పాఠశాలలు పెట్టే ప్రతి అడ్డమైన కండీషన్లకూ గంగిరెద్దుల్లా తలూపుతున్నది మనం కాదా??
కాస్త చదువుకునే పిల్లలైతే
కుదిరితే ఉదయం ఆరుగంటలకంతా ట్యూషన్ కు పంపుతాం
కుదరకుంటే సాయంత్రం ఆరునుండి రాత్రి తొమ్మదిదాకా ట్యూషన్ లో పడేస్తున్నాం
చదువులో కాస్త వెనకబడిన పిల్లలనైతే ఏకంగా హాస్టల్లలో కుక్కేస్తున్నాం.
పిల్లల పరిస్థితి ఎలా తయారయ్యిందీ అంటే.....
స్కూల్లో ఉన్నా చదవాలి
ఇంట్లో ఉన్నా చదవాలి
ట్యూషన్లో ఉన్నా చదవాలి
చివరికి సెలవురోజుల్లోనూ చదవాలి.
పిల్లల్ని చదువుల యంత్రాలుగా తయారుచేస్తున్నది మనం కాదా??
చేయాల్సిన తప్పంతా మనం చేసి
పెట్టాల్సిన ఒత్తిడంతా పిల్లలపై మనం పెట్టి
ప్రైవేటు పాఠశాలను ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి.
ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం??
పిల్లల భవిష్యత్తు బావుండాలనే కదా అని మనల్ని మనం సమర్థించుకోవడం అందమైన ఆత్మవంచనే అవుతుంది.
చదువు పేరుతో పిల్లల్ని పిండే కొద్దీ చివరకు మిగిలేది పిప్పే.
చదువుకున్నవాడి అదృష్టం బావుండి ఉద్యోగం వస్తే మనం అనుకున్నట్టు వాళ్ళ భవిష్యత్తుకు ఢోకా లేదు.
పొరపాటున ఏ ఉద్యోగమూ రాకపోతే అడుక్కోవడానికి కూడా పనికిరానివాడిగా తయారు చేసిన వాళ్ళం మనమే అవుతాం..... అవుతున్నాం.....
ఎందుకంటే నేటి విద్యార్థుల్లో నూటికి తొంభైతొమ్మిది మందికి చదువు తప్ప (క్రీడలుగానీ, కళలుగానీ) మరేమీ రాదు.... మనమేమీ నేర్పే ప్రయత్నమూ చెయ్యలేదు..... చెయ్యట్లేదు.
ఒక్కమాటతో ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేకపోవచ్చు.
ఇందులోని నా ఏ ఒక్కమాటైనా
ఏ ఒక్క తల్లి ఆలోచననైనా మార్చగలిగితే
ఏ ఒక్క తండ్రి ప్రవర్తనైనా మార్చగలిగితే
ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్నైనా కాపాడగలిగితే
అంతకన్నా మహాభాగ్యం లేదు.
-------
పెరియర్ రామస్వామి పిల్లల పెంపకం ఎలా ఉండాలో
చక్కగా సూచించారు.
" మీ చెప్పు చేతల్లో పిల్లల్ని పెంచాలని,
మీ మూర్ఖపు, మూఢాచారపు భావాల్ని
వారికి అంటగట్టకండి !
దేవుడు వున్నాడని గుళ్ళూ,గోపురాలు తిప్పించి , వారిచే దండాలు, పూజలు చేయించకండి !!
పిల్లల చదువు కోసం మీరు ఎంతైనా కష్టపడండి
, అంతేగానీ అన్ని కష్టాల్ని ఆ కనిపించని దేవుడే తీర్చేస్తాడని
, పిల్లలకి లేని పోని భ్రమలు మాత్రం కల్పించి చెప్పకండి !!!
దేవుడే వున్నడని మీరు గాఢంగా నమ్మిస్తే,
మీ పిల్లల్లో స్వంత వ్యక్తిత్వ వికాసం గానీ, స్వంత ఆలోచనా విధానం గానీ వుండదు - అన్నిటికీ ఆ దేవుడు మీదే
భారం వేసే బలహీనులై పోతారు !!!!
పిల్లల్లో మేధావితనం పెరగాలి గానీ,
భక్తి భావన పెరిగినా ప్రయోజనం లేదు.
నిజానికి ---
దేవుడు వున్నాడా లేడా అని నిర్ణయించుకో వలసింది
మీ పిల్లలే , ఉన్నాడు అనే ఓ అబద్దమైన నమ్మకాన్ని మాత్రం
మీరు కలిగించకండి !
అప్పుడే మీ పిల్లలకు మీరు మేలు చేసినవారౌతారు
!!
స్వంత వ్యక్తిత్వం స్వంత మనస్తత్వం,
స్వంత ఆలోచనా విధానం లేని వాళ్ళు యీ భూమ్మీద చాలా మంది వున్నారు
-- వారిలో మీ పిల్లలు ఒకరిగా వుండ కూడదు -- ఆ మందలో కల్సిపోయి అసలే వుండ కూడదు !!
మీ పిల్లలకు మీరు మొదట్నుంచీ నేర్ప వలసింది
మంచి వ్యక్తిత్వం, మూఢ భక్తిత్వం మాత్రం కాదు !!!
--పెరియర్ రామస్వామినాయకర్.
పుట్టినప్పుడు మీరు ఏ మతం లో పుట్టారో మీకు
తెలుస్తుందా..?
పెరుగుతున్న కొద్దీ మతం , కులం అన్న విషయాలు ఇటు తల్లిదండ్రులు , అటు సమాజం నూరిపోస్తుంది.
చదువుకుని ఉద్యోగంలో స్థిరపడేవరకు కూడా మనం
తల్లిదండ్రులు సమాజం నూరిపోసిన కులమత భావజాలం లోనే బతుకుతాము.
25-30 ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తికి ఒక స్థిత ప్రజ్ఞత
వస్తుంది.
అప్పుడు చిన్నప్పటి నుండి నూరిపోసిన మూర్ఖపు
భావాలన్నీ పటాపంచలు అయి మనదైన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, ఒక ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుంది.
ఆ దృక్పథమే మనల్ని సరైన లక్ష్యం దిశగా నడిపిస్తుంది.
ఇప్పుడు కొంతమంది అభ్యుదయ వాదులు చేస్తున్నది
అదే...
సేకరణ : వాయిస్ ఆఫ్ బీసీ ఎంప్లాయీస్
ఆంధ్రప్రదేశ్.
సౌ జ
న్య o - whatup
message
పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు అభ్యర్ధన
1. రాత్రి 8 గంటలకు టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, 8 తర్వాత TV లో మీ బిడ్డ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.
2. 30-45 నిముషాలు మీ బిడ్డ హోం వర్క్ తనిఖీ చేసి అతనికి సహాయం చేయండి
3. రోజు అతని చదువుని పరిశీలించి వెనకబడిన సబ్జెక్టులో సహాయం చేయండి.

4. 5 వ/10 వ తరగతి లోపు చదివే ప్రాథమిక విద్య వారి జీవితానికి ములస్తంభం అని గుర్తించండి.
5. ఉదయం ఉదయం 5:30 గంటలకు మేల్కొవడం వారికి అలవాటు చేయండి. ధ్యానం చేయడం నేర్పండి.
6. మీరు ఏ పార్టీలు లేదా పెళ్లిళ్లకు హాజరు అయి ఆలస్యంగా మీ పిల్లలు నిద్రిస్తే మీ బిడ్డకు మరుసటి రోజు విశ్రాంతి ఇవ్వండి. లేదా మీరు వారిిని తరువాతి రోజు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటే కనీసం ఇంటికి 10:00 గంటలకు ఇంటికి రండి.
7. చెట్లను నాటడానికి మరియు వాటిని పెంచే అలవాటును పిల్లలకు నేర్పండి.
8. మీ పిల్లల పంచతంత్ర, అక్బర్ బిర్బల్, తెనాలి రాము వంటి కథలు పడుకునే సమయంలో చెప్పండి.
9. ప్రతి సంవత్సరం వేసవి సెలవులు మీ బడ్జెట్ ప్రకారం ఒక పర్యటనకు ప్లాన్ చేయండి. (ఇది వేర్వేరు వ్యక్తులకు మరియు ప్రాంతాలకు అలవాటుపడే యోగ్యతను వారిలో మెరుగుపరుస్తుంది)
10. మీ బిడ్డలో ప్రతిభను కనుగొని, దానిని మరింతగా మెరుగపర్చడానికి అతనికి సహాయపడండి (ఏదైనా విషయం, సంగీతము, క్రీడలు, నటన, డ్రాయింగ్, నృత్యం మొదలైన వాటికి ఆసక్తి ఉండవచ్చు) ఇది వారి జీవితాన్ని అందంగా చేస్తుంది
11. ప్లాస్టిక్ వాడకూడదని నేర్పండి (కనీసం ప్లాస్టిక్ లో వేడి పదార్థాలు వాడకూడదని)
12. ప్రతి ఆదివారం వారికి ఇష్టమైన వంట తయారు చేసేందుకు ప్రయత్నిoచండి. మరియు తయారుచేయడంలో సహాయం చేయమని వారిని అడగండి (వారు ఆనందిస్తారు)
13. ప్రతి శిశువు జనమతః ఒక శాస్త్రవేత్త. వారు మనం జవాబు ఇవ్వలేని అనేక ప్రశ్నలను అడుగుతారు. కాని మా అజ్ఞానం తో వారిపై మనకోపాన్ని చూపించకూడదు (సమాధానాలను కనుగొని, వారికి తెలియజేయండి)
14. వారిని క్రమశిక్షణ మరియు మంచి జీవన విధానాన్ని బోధించండి (తప్పుచేస్తే శిక్షించండి).
15. పాఠశాల విద్య లేదా పాఠశాలలో పాస్పెర్సెంటేజ్ ఆధారంగా లేదా మీ సహోద్యోగులు, మీ పొరుగువారు లేదా స్నేహితులు చెప్పారని లేదా ప్రయివేటు స్కూళ్లప్రచారం చూసి అత్యుత్తమ పాఠశాలగా నిర్ణయించకండి. మీ బడ్జెట్కు సరిపోయేదే మీ పిల్లలకు సరైన పాఠశాల అని గుర్తించండి. ఏ రోజుల్లో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో మీ పిల్లల విద్య కోసం మీరు మరింత ఖర్చు చేయాలి, ఈరోజు మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవాలి, నేడు మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం, మీ ప్రస్తుత బాధ్యతలు. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేయండి.
16. తమను తాము చదవడం మరియు నేర్చుకోవడo అలవాటు చేయండి.

17. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను వారికి ఇవ్వకండి. (ఎందుకో ప్రతి ఒక్కరికి తెలుసు)
18. మీ పనుల్లో మీకు సహాయపడమని మీ బిడ్డను అడగండి. (వంట చేయడం, ఇంటిని/బైక్/కార్ కడగడం, బట్టలు ఉతకడం లాంటివి)
మీ
శ్రేయోభిలాషి 🌷
18. మీ పనుల్లో మీకు సహాయపడమని మీ బిడ్డను అడగండి. (వంట చేయడం, ఇంటిని/బైక్/కార్ కడగడం, బట్టలు ఉతకడం లాంటివి)
మీ
శ్రేయోభిలాషి 🌷