Pages

రసాయనిక ఎరువులు


💐👌💐👌 ఈ దేశం లోని రైతులు కొన్ని విషయాల్లో మేధావులు, correct గా బుర్ర ఉపయోగిస్తున్నారు. 1970 సంllలో దేశంలోకి రసాయనిక ఎరువులు దిగుమతి అయినవి. 2 బస్తాల ధాన్యం పండించే చోటునా, 4 బస్తాలు పండించాలని - దిగుబడి పెంచాలని, సంప్రదాయక పశువుల పేడను (సేంద్రియ ఎరువులను) ప్రక్కన పడవేసి, రసాయనిక ఎరువులను వాడడం మొదలు పెట్టారు. దిగుబడి పెరిగినది వాస్తవమే కానీ, దీని వలన అనేక కొత్త సమస్యలను కొని తెచ్చుకొన్నాము.  పంట భూములు కెమికల్స్ తో నిండి సేద్యానికి పనికిరాకుండా పోయాయి. చీడ పురుగులకు resistance power పెరిగి ఏ ముందుకు కూడా చావక ఏకయి మేకాయి కూర్చున్నాయి. పండించిన పంటలో పోషకాల విలువ తగ్గిపోయి, రుచి పచి లేకుండా ఉన్నవి. అంటే మనము కూడా chemicals ను తింటున్నట్లు అయిపోయింది.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనట్లు, ఆ తరువాత పశువుల పేడ విలువ తెలిసింది. Cheep ఐన సేంద్రియ ఎరువులను వేసి రైతులు పోషకాహార విలువలు కలిగిన పంటలను పండించటం మొదలుపెట్టారు.  ఇవి తింటే కండ పుష్టి కలదు అని రైతులకు జ్ఞానోదయం అయింది. 


కాబట్టి, చాల మంది రైతులు ఒక పంటను వర్షాకాలంలో సేంద్రియ ఎరువులను వేసి పండిస్తున్నారు. ఈ పంటను మార్కెట్లో అమ్మరు. కేవలం వారు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తింటారు.  ఇటీవల వరంగల్ జిల్లాలో ఒక రైతును సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యాన్ని అమ్ము అని ప్రాధేయ పడిన, చచ్చిన బయటివారికి అమ్మనన్నాడు. కిలో బియ్యానికి రెండింతలు అంటే 100 రూపాయలు ఇస్తానని అన్న ఒప్పుకోలేదు.  ఎరువులు వేసిన పంటలను మేము తింటే మా ఆరోగ్యాలు పడుఅవుతావి అని, తాము కష్ట పడి పనిచేయలేమని తెలిపాడు. రెండవ పంటను రసాయనిక ఎరువులు వేసి పండించి మార్కెట్లో అమ్ముతున్నారు. వ్యవసాయం లేని వాండ్లు, మార్కెట్లో అమ్మిన పంటలను కొనుక్కొని తింటున్నారు. రోజువారీ కూరగాయలను కూడా కొందరు రైతులు సేంద్రియ ఎరువులు వేసి పండించి తమ కుటుంబ అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తున్నారు.  Organic పంటలు అని మార్కెట్ లో అమ్మి తెలివిగా మోసం చేస్తున్నారు కొందరు వ్యాపారులు.


సౌ జ న్య  o - whatup message