Pages

ఎవరు మహాత్ముడు?

ఎవరిని చూసినా ఏమున్నది గర్వకారణం మనం చెప్పుకుంటున్న #మహాత్ములు_జాతిపితలు_దేశభక్తులు అందరూ స్వయం ప్రకటితులే..!
"కులవ్యవస్థను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న వారినందరినీ నేను వ్యతిరేకిస్తున్నాను". అని ప్రవచించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ "మహాత్ముడు"గా, " జాతిపిత"గా, గొప్ప "దేశభక్తుడు"గా కీర్తించబడుతున్నాడు.
"చాకళ్ళకు, మంగళ్ళకు, తెలికలకు (నూనెలు తీసే వృత్తి), చెప్పులుకుట్టే వారికి, వీధులు ఊడ్చేవారికి రాజీయాలు, శాసనసభ్యత్వాలు ఎందుకో నాకు అర్థం కావడంలేదు". అంటూ... బహిరంగ సభలో ఉపన్యసించిన వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా, గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకుడిగా కీర్తించబడుతున్నాడు.

అస్పృశ్యతా నిర్మూలన ముసాయిదాపై సంతకం పెట్టడానికి నిర్మొహమాటంగా తిరస్కరించి, సాంఘిక సంస్కరణ సభా మంటపాలను పేల్చివేస్తామని ప్రకటించిన బాలగంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా కీర్తించబడుతున్నాడు.

అస్పృశ్యత బానిసత్వం కంటే నీచమైనది కాదు* అంటూ అస్పృశ్యతను సమర్థించిన లాలా లజపతి రాయ్ గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా మన్ననలు అందుకుంటున్నాడు.

డిస్కవరీ ఆఫ్ ఇండియా రచించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన రచనల్లో కులం గురించి కానీ, అస్పృశ్యత గురించి కానీ ప్రస్తావించించకుండానే ఇండియాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన నవభారత రాజ్యాంగ నిర్మాతగా, గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా జేజేలు అందుకుంటున్నాడు.
మొదటి నుండి చివరి వరకు సాంఘిక సంస్కరణలను గుడ్డిగా వ్యతిరేకించిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు డబ్ల్యు. సి.బెనర్జీ, దాదాభాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, అనిబిసెంట్ లాంటి వారు గొప్ప దేశభక్తులుగా, జాతీయ నాయకులుగా హారతులు అందుకుంటున్నారు.

హిందూ మత సంస్కృతిని భారతీయ సంస్కృతిగా* ప్రచారం చేస్తూ హిందూ మతాన్ని పరిరక్షించడానికి పూనుకున్న నరేంద్రనాథ్ దత్తు స్వామి వివేకానందగా భారతదేశానికి ఒక రోల్ మాడల్ గా, గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా కీర్తించబడుతున్నాడు.

దాదాపు నలబై సంవత్సరాలుగా ఆంగ్లేయులకు నమ్మిన బంటుగా సేవలందించి, రాజ్యసంక్రమణకు ఆంగ్లేయులు అనుమతించలేదని బ్రతిమిలాడి, భంగపడి, కయ్యానికి కాలు దువ్వి యుద్ధంలో ఓటమిపాలై పారిపోతూ చంపడిన ఝాన్సీ లక్ష్మీబాయి గొప్ప దేశభక్తురాలిగా, ఆత్మగౌరవం కలిగిన వీరనారిగా, అదర్శనీయురాలిగా కీర్తించబడుతున్నది.

అలాగే... నలబై సంవత్సరాలుగా ఆంగ్లేయులకు లొంగిపోయి సామంతులుగా రాజభరణం పొందుతూ ఆ భరణం నిలిపివేయడంతో బ్రతిమిలాడి, భంగపడి, గత్యంతరం లేక కయ్యానికి దిగున నానాసాహెబ్ గొప్ప దేశభక్తుడిగా, ఆదర్శ పురుషునిగా  చెప్పుకుంటున్నారు.

ఆంగ్లేయులు విదేశీ పాలకులు అని తెలిసి కూడా వారికి సేవకుడిగా సైనిక సేవలు అందించడానికి అంగీకరించి, మతపరమైన ఆధిక్యతలకు అనుమతించబడలేదని, ఆవు కివ్వుతో తూటాలను తయారు చేస్తున్నారని, హిందూ మతానికి ముప్పు తలపెడుతున్నారని ఉద్యోగ నిబంధనలను అతిక్రమించి ఆంగ్లేయులపై మతపరమైన యుద్ధం చేయాలని నినదించిన మంగళ్ పాండే గొప్ప దేశభక్తుడిగా, ఆత్మగౌరవం పెంచిన వీరునిగా కీర్తించబడుతున్నాడు.

ఇలా హిందూమతాన్ని, కులవ్యవస్థను కీర్తించిన, పొగిడిన, ప్రచారం చేసిన ప్రతి వ్యక్తిని గొప్ప దేశభక్తుడుగా, గొప్ప వ్యక్తిగా, చారిత్రిక పురుషులుగా, ఆదర్శ మూర్తులుగా, దేశ నాయకులుగా శ్లాఘిస్తున్నారు. అయితే... నిజంగా *భారతదేశ పేరు ప్రతిష్ఠల కొరకు, అభివృద్ధి కొరకు నిజాయితీగా, నిస్వార్థంగా కృషిచేసిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ గారిని* మాత్రం కేవలం ఒక దళిత నాయకునిగా మాత్రమే పేర్కొంటున్నారు. ఇదీ మన న్యాయ విచక్షణ స్థాయి. ఇది ఒక ఉద్దేశ పూర్వకమైన వివక్ష.

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ గారి ఆలోచనా విధానాన్ని, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారానే ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేయవచ్చు. నిజమైన దేశభక్తులు, నిజమైన ప్రజా ప్రయోజకులు ఎవరు..? అనేది ప్రజలు అర్థం చేసుకోగలరు.
#జై_భీమ్..! ✊🏼 #జై_భారత్..!!

డాక్టర్ యు. వి. రమణ
M.A Ph.D
జిల్లా కార్యదర్శి
బహుజన సమాజ్ పార్టీ
విశాఖపట్నం

నేనుకూడా, గాంధీయే "మహాత్ముడ"ని చదువుకున్నాను.దండి మార్చ్, సత్యాగ్రహ దీక్ష, ఆయన కట్టూ,అలవాట్లూ,విదేశాల్లో సైతం ఆ మొండితనం నిలబెట్టుకుని వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం.. ఇవన్నీ మన క్లాసు పుస్తకాలతో పాటూ మా నాన్నగారు రిచర్డ్ అటెంబరో సినిమా "గాంధీ" చూపించి, ఆయనెంత గొప్పదీక్షాపరుడో చెప్పడం వల్లా, మామూలుగా వచ్చేసాయ్.

" స్త్రీలు అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్టు" అన్న వాక్యమే కంఠతా పట్టాను గానీ "ఒక సమాజం ప్రగతి, ఆ సమాజంలోని స్త్రీలు సాధించిన ప్రగతిపై ఆధారపడి ఉంటుంది"అన్న అంబేద్కర్ మాటలు నేను నా రీసర్చ్ లోకొచ్చాకే తెలుసుకున్నాను.ఈ మాటలు నాకెవ్వరూ చెప్పలేదు,యే టీచర్ దగ్గరా వినలేదు..అంటే మేధావితనాన్ని సైతం తొక్కేసేంతగా  వివక్ష సమాజంలో పాతుకుపోయిందన్నమాట.

అంటే, కేవలం కొంతమందిని మాత్రమే ఇక్కడ పనిగట్టుకుని నేతల్ని చేసారన్న విషయం చాలా చక్కగా అర్ధమౌతుంది. హిందూదేశంగా ఈ దేశాన్ని చెలామణీ చేసే కుట్రలో భాగంగా, పనిగట్టుకుని కొంతమందిని మహాత్ముల్ని చేసారు. అంబేద్కర్ ని, యెంత మేధావైనా కూడా,ఈ దేశంలో కేవలం దళితులకే కాకుండా, సఫాయీ కార్మికులకు, స్త్రీలకు ఇలా దోపిడీ కాబడుతున్న అన్నివర్గాల వారి అభ్యున్నతికీ రేయింబవళ్ళు కృషి చేసినది కేవలం అంబేద్కర్ అన్నది నిజమైనా కూడా, ఆయన గురించి  "రాజ్యాంగ నిర్మాత" అన్న అన్నవిషయం తప్ప ఇంకేం చెప్పరిక్కడ.

నిజమైన స్వాతంత్య్రం స్త్రీలు అర్ధరాత్రి సంచరించి నప్పుడే అన్న మహాత్ముడు,వాళ్ళలా సంచరించగలగడానికి యేంచేసాడో తెల్సుకోవాలనుంది.స్త్రీ జాతికి ఆర్ధిక స్వేచ్చనిచ్చే హిందూ కోడ్ బిల్లును నిరవధికంగా వ్యతిరేకించి, నెహ్రూ పై ఒత్తిడితెచ్చి,ఆ బిల్లును పాస్ కాకుండా చేసిన ఘనత, ఈ పురుషాధిక్యత యెప్పటికీ "ఇలానే" ఉండాలని కోరుకున్న కొంతమంది "మహాత్ములదే".హిందూత్వాన్నీ, దానితోపాటే వచ్చిన అసమానతల్నీ నిర్మూలన చెయ్యలనే ఉదేశ్యం గాంధీ కి లేనేలేదు మరి భారతీయ సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేసిన మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించిన అంబేద్కర్ దాన్ని తగలబెట్టడానికి వెనుకాడలేదు. స్త్రీలనుబానిసలకన్నా హీనంగా చూడాలని, లేదంటే వాళ్ళు అనర్ధాల్ని తెచ్చిపెడతారనీ, అన్నో తమ్ముడో కూడా ఒక స్త్రీతో ఒంటరిగా ఉంటే, ఆమె కుటిల బుద్ధితో వాళ్ళను వశపరుచుకోంటుందనీ" మనువు రాసిన అహంకారపు రాతల్ని అంబేద్కర్ తీవ్రంగా దుయ్యబట్టి, హిండూ కోడ్ బిల్లు రూపకల్పనచేసి, (స్త్రీలకు సమాన ఆస్తి హక్కు, హింసాపూరితమైన వివాహంలో విడాకులు కోరే హక్కు, ప్రసవానికి ముందూ, అనంతరం విశ్రాంతికోరే హక్కూ, నిర్ణీత పనివేళలు,పురుషులతో పాటూ సమాన వేతనాలూ), అది పాస్ చేయించటానికి ఎంతో పోరాటం చేసారు.

 ఐతే, స్త్రీకి స్వేచ్చ వస్తే, ఆమెను, ఆమె లైంగిక, ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని సమాజన్ని నడిపిస్తున్న హిందూ వ్యవస్థ కుప్పకూలిపోతుందనే అలోచనతో అప్పటి హిందూ చాందస వాదులు ఆ బిల్లు పాస్ కాకుండా చేసారు.ఆ వెంటనే అంబెద్కర్ రాజీనామా చేసారు.

గాంధీ ఆలోచనలు ఇప్పటి సమాజంలోనూ యధేచ్చగా రాజ్యమేలుతున్నాయ్.ఉద్యోగాలు చేసినా, జీతమంతా గుమ్మంలోనే లాక్కునే భర్తలున్నారు,పెళ్ళైపోయి అత్తారింటికెళ్ళాక, పుట్టింటికి చుట్టమే లాంటి స్టేట్మెంట్లు, చెత్తసినిమాల ద్వారా మరియెక్కువగా భారతదేశంలో తిష్టవేసుకుని, ఆమెకు ఒక ఆలంబనంటూ లేకుండా చేస్తున్నాయ్.బాధలు భరించలేక, ఆదరించేదారిలేక, పసిబిడ్డలతో పాటుగా రైలు పట్టాలకో పాడుబడ్డబావులకో, జీవితాన్ని అర్పించే స్త్రీలను రోజుకెంతమందినో చూస్తున్నాం.

హిందూ సమాజం, తాగుబోతు, తిరుగుబోతు భర్తలను సేవించిన స్త్రీలను పతివ్రతలుగా కొనియాడింది.యెంత వెధవ భర్తగా వచ్చినా..వాణ్ణి మార్చుకోవాలనీ, గుళ్ళూ గోపురాలూ తిరిగి, వ్రతాలూ నొములూ చేసి అతణ్ణి దారిలోకి తెచ్చుకోవాలనే చెప్పింది తప్ప, భార్య అనారోగ్యంతో ఉంటే.. భర్తకూడా ఓర్పువహించి ఆమెను బాగుచేసుకోవాలని, యే గ్రంధమూ చెప్పలేదు."మగవాడెన్నైనా చేస్తాడు, యెలాగైనా వుంటాడు, ఇల్లాలిగా ఆమె చక్కబెట్టుకోవాలని" రాసిపారేసి, ఆమెను విపరీతమైన వత్తిళ్ళకు గురిచేసింది.

స్త్రీ స్వేచ్చంటే, షరతులతో కూడింది కాదు,పురుషుడెలా పూర్తి స్వేచ్చతో ఉంటున్నాడో అలాంటి స్వేచ్చకు ఆమెకూడా పూర్తిగా అర్హురాలు, అలాంటి స్వేచ్చను కాంక్షించిన ఒకేఒక భారతీయ మేధావి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్,ఈ విశాల దృక్పధం ఆయనకు విభిన్న సంస్కృతులు పరిశీలించడంవల్ల,  విరామం లేకుండా యెన్నో  గ్రంధాలు చడవడంవల్లా, అసమానతలు లేని సమాజంకోసం కలలుకనడంవల్లా అలవడిందని అంటాన్నేను.ఇంకా హిందూ కోడ్ బిల్లు తదనంతర సంఘటనలు, నిజానిజాలు తెలుసుకోవాలనుకునే వారు యెన్నో వ్యాసాలు వెబ్సైట్స్ లో ఉన్నాయి.చదివితెలుసుకోగలరు.
(written in 2015.)

#Mahatma #Ambedkar
సౌ జ న్య  o - whatup message