Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్


*ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్*


*కుప్పకూలిన_శరీరం_గగనంలో_విజ్ఞాన_శిఖరం*


 ●' అర్థమయ్యేట్లు చెప్పాలంటే అసలు దేవుడు లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. నేను ప్రగాఢంగా విశ్వసించేదేమంటే, స్వర్గ నరకాలు లేవు. మరణానంతర జీవితం కూడా లేదు. అద్భుతమైన ఈ విశ్వ రహస్యాల్ని తెలుసుకోవాలంటే మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే'-అని అంత బలంగా చెప్పిన డాక్టర్‌ స్టీఫెన్‌ హాకింగ్‌కు ఆ ఒక్క జీవితం కూడా ఎంతో దారుణంగా గడపాల్సి వచ్చిందని చాలా మందికి తెలిసి వుండకపోవచ్చు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నారు. 'నా శరీరం నిస్సత్తువగా కుర్చీలో కూలబడి పోవచ్చు. కానీ, నా మెదడు విశ్వాంతరాళాల్ని శోధిస్తుంది'-అని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్పుకున్న భౌతిక శాస్త్రవేత్త హాకింగ్‌.


●1942 జనవరి 8న ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్‌ ముప్ఫయ్యేళ్లు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసి, పదవీ విరమణ చేశారు. హాకింగ్‌ తల్లి బ్రిటీష్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యురాలు. అందువల్ల స్టీఫెన్‌కు చిన్నప్పటి నుండి ప్రగతిశీల భావాలు అబ్బాయి. తండ్రి ఫ్రాంక్‌ మెడికల్‌ డాక్టరు, పరిశోధకుడు. విద్యార్థి దశలో పరిచయమైన జేన్‌ వైల్డ్‌తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి మోటార్‌ న్యూరోసిస్‌ వ్యాధి సోకింది. ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా స్టీఫెన్‌లో ఎఎల్‌ఎస్‌ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఇది ఒక మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి. ఈ వ్యాధి బయట పడినప్పుడు ఆయన కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే బతకగలడని డాక్టర్లు చెప్పారు. అంటే ఆయన తన 23వ యేట చనిపోవాల్సింది. కానీ ఇప్పుడాయన వయసు 76. బ్లాక్‌ హోల్స్‌పై పరిశీలనలు చేస్తున్న సమయంలోనే 1965లో గాన్‌విల్లి కైస్‌ కాలేజివారి ఫెలోషిప్‌ దొరికింది. దాంతో అప్లయిడ్‌ మాథమెటిక్స్‌, థియరటికల్‌ ఫిజిక్స్‌-కాస్మోలజీలో పిహెచ్‌డి తీసుకున్న స్టీఫెన్‌, మొదట్లో క్లచస్‌ ఉపయోగిస్తూ మెల్లగా నడిచేవారు. హాకింగ్‌ తన శారీరక లోపాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించేవారు కాదు. విధి రాత, దైవం వంటి వాటిని నమ్మేవారు కాదు-కాబట్టి వాస్తవ స్థితి ఎదుర్కోవడానికి సిద్ధపడేవారు. తన వైకల్యానికి సానుభూతి ప్రకటిస్తూ సహాయపడడానికి వచ్చే వారిని వారించేవారు. ఆయన తనను మొదట సైంటిస్ట్‌గా గుర్తించాలనుకునే వారు. తరువాత పాపులర్‌ సైన్స్‌ రచయితగా, ఆ తరువాత కొన్ని ఆలోచనలతో, భావాలతో, ఆశలతో, కోర్కెలతో ఉన్న ఒక మామూలు మనిషిగా గుర్తించాలని కోరుకునే వారు. 'ఆయనది గొప్ప ధ్యేయమని' కొందరంటే-'పిచ్చి పట్టుదల' అని మరి కొందరనే వారు.


భౌతిక శాస్త్రవేత్త వెర్నర్‌ ఇస్రయిల్‌ 'మోజట్‌ కంపోజింగ్‌ సింఫనీ' తెచ్చి స్టీఫెన్‌ తలకు అమర్చాడు. దాని వల్ల ఆయనకు తనను తాను వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది. దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా, తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 1970 నాటికి మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబ సభ్యులకు, అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి. 1985లో ఆయనకు నిమోనియా పట్టుకుంది. తీవ్ర అస్వస్థత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ట్రాఖియోటొమి వచ్చింది. దాంతో ఇరవై నాలుగు గంటలూ వైద్య పర్యవేక్షణలోనే ఉండేవారు.

ఆ దశలో అమెరికన్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చి ఖర్చు భరించింది. మూడు షిఫ్టుల్లో నర్సుల్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌, ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్‌. మాట పడిపోక ముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది.


స్పెల్లింగ్‌ కార్డ్‌ మీద అక్షరాల్ని ఎంపిక చేసుకోవడానికి మొదట ఆయన తన కనుబొమలు కదిలించేవారు. తర్వాత 1986లో ' ఈక్వలైజర్‌' కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా అమర్చిన సాఫ్ట్‌వేర్‌ వల్ల 2,500-3,000 వరకు అక్షరాలు, పదాలు, వాడుక మాటలు అన్నీ ఒక చిన్న మీట నొక్కితే అందుబాటులోకి వచ్చే విధంగా ఉండేవి. నిమిషానికి పదిహేను పదాలు టైపు చేయగల సామర్థ్యం ఆ సాఫ్ట్‌వేర్‌కి ఉండడం వల్ల, ఆయన ఉపన్యాసాలు, వ్యాసాలు, రచనలు అన్నీ తయారవుతూ ఉండేవి. ఉపన్యసించాల్సిన చోట ఆ విషయాల్ని ముందుగానే స్పీచ్‌ సింథసైజర్‌కు పంపి సిద్ధంగా ఉంచుకొనేవారు. దీంతో అక్కడ ఆయనే స్వయంగా మాట్లాడుతున్నట్లు ఉండేది. స్టీఫెన్‌ హాకింగ్‌ కేవలం మనిషి ఆత్మ విశ్వాసాన్ని నమ్మిన శాస్త్రవేత్త. మేధావి. ఆయనను కాపాడుకోవడానికి కుటుంబమే కాదు సమాజమే కదిలి వచ్చింది. మనిషి కోసం మనుషులు కదిలి వచ్చి నట్టయ్యింది. అంతటి దయనీయ స్థితిలో కూడా ఆయన దేవుణ్ణి తలవలేదు. ముడుపులు కట్టలేదు. పైగా 'వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేద'ని అన్నారు. మనిషి చేస్తున్న ఆవిష్కరణలు, సాధిస్తున్న విజయాలు-లేని దేవుడి-ఖాతాలో వేస్తూ బతికే పలాయన వాదులున్నంత కాలం మార్పు రాదు. ఈ విషయం చెప్పడానికే స్టీఫెన్‌ హాకింగ్‌ శారీరక బలహీనత గూర్చి, ఆయన అచంచల ఆత్మ విశ్వాసం గూర్చి ఇక్కడ వివరించాను. 2005లో ఆయన తన పరికరం వాడడానికి చెంప కండరాలు కదిలించేవాడు. నిమిషానికి అది ఒక పదం మాత్రమే తీసుకునేది. అది ఇబ్బందిగా అనిపించడం వల్ల ఇన్‌టెల్‌ పరిశోధకుల సహకారంతో లండన్‌లోని షిఫ్ట్‌ కీ కంపెనీ ముందుకొచ్చింది. అంతకు ముందు స్టీఫెన్‌ హాకింగ్‌ రాసిన పరిశోధనా పత్రాల్లోని పదాల్ని, వాక్యాల్ని, విషయాల్ని తరచుగా వాడే వాడుక మాటల్ని అది గుర్తుపెట్టుకొని టైప్‌ చేసేది ఈ పద్ధతి మనం రోజూ వాడే స్మార్ట్‌ ఫోన్‌లలో కూడా చూస్తున్నాం.


●2009 నాటికి ఆయన తన వీల్‌ ఛైర్‌ను నడుపుకోలేని స్థితి వచ్చింది. మళ్లీ హాస్పిటల్లో కూడా చేరాల్సి వచ్చింది. అలాంటి స్థితిలో కూడా ఆయన మానవ జాతి గురించే ఆలోచించారు. 'రాజకీయంగా, సామాజికంగా, పర్యావరణపరంగా ధ్వంసమౌతున్న ఈ సమాజంలో మానవజాతి మరో వందేళ్లు కొనసాగేదెట్లా?' అని బెంగ పెట్టుకున్నారు. యవ్వన దశలోనే వైద్యపరమైన శారీరక సమస్యలకు గురైన స్టీఫెన్‌, తన జీవితంలో నిశ్శబ్దంగా అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. నిస్సత్తువగా మారిన తన శరీరంతో తాను పోరాడుతూ, జ్ఞాన కాంక్ష కోసం పోరాడుతూ, డెబ్భై ఆరెేళ్ల వయసులో కూడా అచంచల ఆత్మవిశ్వాసంతో ఒక జ్ఞాన శిఖరంగా నిలబడడం ఆయన ప్రత్యేకత! మెదడు ఒక్కటి తప్ప మిగతా శరీరమంతా కుప్పకూలి ఉన్న హాకింగ్‌, తన ధ్యేయాన్ని క్షణ కాలమైనా మరువ లేదు. విశ్వ విజ్ఞానానికి తన వంతుగా కొత్త విషయాలను అందిస్తూనే వచ్చారు.


మృత్యువు అంచుమీద శ్వాసిస్తూ కూడా, మనిషి విజయ పరంపర గూర్చి మాత్రమే ఆలోచించారు డా|| స్టీఫెన్‌ హాకింగ్‌. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా కనిపిస్తున్న దుర్భలులైన కోట్లాది జనం కంటే హాకింగ్‌ దృఢ సంకల్పుడు. మానసిక బలశాలి. ఆయన ఆకాశమే హద్దు అనుకోలేదు. ఆ ఆకాశాన్ని ఇంకొంచెం పైకి ఎదగమని ..విసరకనే సవాల్‌ విసిరారు.


సౌ జ న్య  o - whatup message