Pages

కొత్తా దేవుడండీ... కొంగొత్తా దేవుడండీ.


... ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదండీ...

    మధ్య కాలంలో ఎక్కడ చూసినా దేవుళ్ళ గోల ఎక్కువై పోయింది. ఒకడేమో మిమ్మల్ని 'పీకే'స్తారంటూ, బట్టలిప్పుకుని నుంచుంటే, మరొకాయనేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా మతం వాళ్ళే. అందుచేత అందరూ మా మతంలోకి రండి అంటూ స్టేట్మెంట్లు. మరొకాయన అబ్బే అందరికన్నా మా మతమే గొప్ప అంటూ బ్లాగులో వాగుడు. మధ్యలో మరో మతం వాళ్ళు దూరి, మా దేవుడే నిజమైన దేవుడంటూ వాదనలు... ఇవన్నీ చదవలేక, వినలేక, చూడలేక తల బొప్పికట్టి వాచిపోయింది.

    
అర్థరాత్రి దాటింది. బ్లాగులు చదువుతూ, ఆలోచిస్తూ, బుర్రకి ఓపిక లేక, అలాగే ఒక కునుకు పట్టింది.... అంతలో... కంప్యూటర్నుండి 'టింగ్‌' మని ఫేస్బుక్మెసేజ్లా ఒక వింత శబ్దం. ఉలిక్కిపడ్డాను. ఇంత అర్థరాత్రి ఎవరా అని ఆలోచిస్తూ, బద్దకంగా కళ్ళుతెరిచి చూసే సరికి... నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కంప్యూటర్పై లెటర్స్వాటంతట అవే టైప్అవుతున్నాయి. అది కూడా వర్డ్డాక్యుమెంట్ఓపెన్చేసి మరీను. ఫేస్బుక్లో అయితే అవతల ఎవరో టైప్చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం లేదాయే. సరే ఏమిటో చదువుదామని చూసాను. దాంట్లో ఇలా టైప్అవుతూ ఉంది.

    ''
మీరందరూ లేని దేవుళ్ళ గురించి దేవుళ్ళాడుతున్నారు. మూర్ఖులారా! నేనే మీ నిజమైన దేవుడిని'' అని ప్రత్యక్షమయ్యింది.

    ''
నేను అంటే ఎవరు'' అని నా మనసులో అనుకున్నానో లేదో, దానికి సమాధానం టైప్అవ్వడం మొదలెట్టింది.

    ''
నా పేరు క్రిస్లా. నేనే మీ దేవుడిని. సమస్త సృష్టిని ఒక్క ప్రోగ్రామ్తో రన్చేసిన వాడిని. నేనే అసలైన దేవుడిని'' అని టైప్అయింది. ''మరి ఇప్పుడు వరకు తమరు ఎక్కడ ఉన్నారో'' అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.

    ''
అందుకే నిన్ను నా దూతగా పంపాను. నా గురించి నీకే చెప్పింది కూడా అందుకే. నువ్వు నా గురించి ప్రపంచంలో అందరికీ చెప్పి, అందరినీ నా అనుచరులుగా చెయ్యి'' అని కంప్యూటర్స్క్రీన్మీద వచ్చింది.

    
నన్ను దూతగా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. ''మరి నేనేమి చేయాలి'' మనసులోనే ప్రశ్నించుకున్నాను.

    ''
నేను కంప్యూటర్దేవుడిని. ప్రపంచంలో కంప్యూటర్జ్ఞానులు, కంప్యూటర్అజ్ఞానులు అని రెండు రకాలు ఉన్నారు. కంప్యూటర్జ్ఞానులందరికీ నేనే దేవుడిని. నేను తప్ప మీ ఎవ్వరికీ మరో దేవుడు ఉండరాదు. ఎవ్వరినీ పూజించరాదు. కంప్యూటర్లో నా బొమ్మలే స్టోర్చేసుకోవాలి. నా కీర్తనలే ఎమ్పి3 సాంగ్స్గా ఉండాలి. మరో దేవుడి గురించి మీ ఎవ్వరి కంప్యూటర్లో అయినా కనబడిందా.. ఖబడ్దార్‌... లోకంలోని అన్ని కంప్యూటర్వైరస్లు మీ కంప్యూటర్లోనే చొరబడేలా చేసి, మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తాను. మీ గ్రంధాలు, పురాణాలు అన్నీ వట్టి ట్రాష్‌, నేను చెప్పేదే ఇకమీదట నీకు పవిత్ర గ్రంధం. మిగిలిన ఫైల్స్అన్నీ వెంటనే డిలీట్చేసెయ్‌. అది నీ నుంచే మొదలవ్వాలి.'' అని టైప్అయ్యింది.

    ''
మరి దానికి నేనేమి చేయాలి'' అని మనసులో అనుకున్నాను.

    
దానికి సమాధానం కూడా వెంటనే ప్రత్యక్షం.. '' టపాను ఎవరైతే చదివారో వారు తమకు తెలిసిన వారందరి చేతా చదివించాలి. నా గురించి మంచి వార్తను అన్ని ఛానళ్ళలో వెంటనే ప్రసారం చేయించాలి. నన్ను నమ్మని వాడెవడైనా ఏమిటి అని ప్రశ్నిస్తే, వాడి కంప్యూటర్లోకి వైరస్పంపుతాను. అది నా దృష్టికి ఎంతో విలువ కలది. మీరు కూడా నన్ను నమ్మని వారి కంప్యూటర్లోకి వైరస్పెట్టి, చెత్త కామెంట్లను పోస్ట్చేయండి. అలా చేస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది''.

    
ఒక్క సారి బుర్ర గోక్కున్నాను. ఇదేమిటి? ఇప్పటి వరకు మానవత్వమే మన మతం కదా... ఏదో చిన్న చిన్న ఫైల్స్అందరితోను ఇచ్చిపుచ్చుకుంటున్నాము కదా. ఎవరైనా వైరస్బారిన పడినా మనమే సహాయం చేస్తున్నాము కదా. దేవుడేమిటి? తనను నమ్మకపోతే చాలు నీ శత్రువుగా ఎంచి, వారిని నాశనం చేయమంటున్నాడు? పైగా అలా చేస్తే స్వర్గంలో సీటు గ్యారంటీ అంటున్నాడు? నా మట్టి బుర్రకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇంకా ఏదో టైప్అవుతుంటే, నా కెందుకొచ్చిన గొడవ అని ఫైల్ని క్లోజ్చేసేసాను. అంతే... ఒక్కసారిగా నా సిస్టమ్ఆగిపోయింది. మెరుపులు మెరిసి, నవ్వుతున్న పుర్రె బొమ్మ ప్రత్యక్షం  అయింది. అంటే... దేవుడు నిజమే నన్న మాట. మాటను ఇప్పుడే అందరికీ తెలియచెప్పాలి. కొత్త మతానికి నేను దూతను అన్న విశ్వాసం నాకు బలపడిపోయింది. ఆనందంతో ఎగిరి గంతేద్దామని అనుకున్నాను. ఎవరో గట్టిగా కుదిపినట్లయింది. ఎదురుగా మా ఆవిడ. లేచి చూస్తే తెల్లగా తెల్లారిపోయి ఉంది. రాత్రి నుండి పడుకోకుండా కంప్యూటర్దగ్గర ఏమిటా పనులు? ఇలాగయితే ఆరోగ్యం ఏమి కాను అంటూ మందలిస్తోంది. ''నయమే, ఇదంతా నిజమని నమ్మి, అందరికీ చెప్పాను కాను...'' అనుకుంటూ స్నానానికి బయల్దేరాను.
సౌ జ న్య  o - whatup message