Pages

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


విద్యాసాగర్, బెల్లంపల్లి, మంచిర్యాల
 ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మీ కోసం

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (14 మార్చి 1879 – 18 ఏప్రిల్ 1955) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ప్రతిపాదించారు ఐన్ స్టీన్. ఆయన తత్త్వశాస్త్రంలో కూడా ప్రభావవంతమైన కృషి చేశారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టారు ఆయన. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా.1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ఐన్ స్టీన్. క్వాంటం థియరీ పరిణామ క్రమం పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు ఆయన.


ఆయన కెరీర్ మొదట్లో న్యూటన్ మెకానిక్స్ సంప్రదాయ మెకానిక్స్ ను  పునరుర్ధరించలేదని భావించేవారు. దీంతో స్పెషల్ రెలెటివిటి అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1916లో సాధారణ సాపేక్షతపై పేపర్ ప్రచురించారు.  స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీల్లోని సమస్యలపై దృష్టి పెట్టారు ఐన్ స్టీన్. పార్టీకల్ థియరీ, అణువుల చలనాలపై వ్యాఖ్యానం చేశారు ఆయన. ఆయన ఉష్ణ లక్షణాల గురించి చేసిన  పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది. 1917లో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపచేశారు ఐన్ స్టీన్.


1933లో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాకా ఆయన అమెరికా వెళ్ళారు. ఆయన జ్యుయిష్ జాతికి చెందినందున తిరిగి జర్మనీ వెళ్ళలేదు. అమెరికాలో బెర్లిన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఆచార్యునిగా  పనిచేశారు. 1940లో అమెరికన్ పౌరసత్వం లభించడంతో అక్కడే  స్థిరపడిపోయారు ఆయన.రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా  అత్యంత శక్తివంతమైన బాంబులపై పరిశోధన జరుగుతోందనీ, ఇది అణుబాంబు తయారీకి దారితీస్తుందని వివరిస్తూ అప్పటి అమెరికా  అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూసెవెల్ట్ కు ఉత్తరం రాశారు ఐన్ స్టీన్. తాను  యుద్ధానికి వ్యతిరేకం కాదనీ, కొత్తగా కనుగొన్న అణుబాంబు ప్రయోగానికి తాను పూర్తి వ్యతిరేకమనీ స్పష్టం చేశారు ఆయన. అణు ఆయుధాలను ఉపయోగించకూడదంటూ బ్రిటన్ కు చెందిన తత్త్వవేత్త బెర్ట్రాండ్  రుసెల్ తో కలసి రుసెల్-ఐన్ స్టీన్ మానిఫెస్టోపై సంతకం చేశారు  ఆయన. 1955లో చనిపోయేంతవరకూ న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సెడ్ స్టడీ సంస్థలో పనిచేశారు ఐన్ స్టీన్.


ఐన్ స్టీన్ 300కు పైగా శాస్త్రీయ పత్రికలు, 150 శాస్త్రీయేతర పత్రికలు ప్రచురించారు.5 డిసెంబరు 2014న విశ్వవిద్యాలయాల్లోని ఐన్ స్టీన్ కు చెందిన 30,000 శాస్త్రీయ పత్రాలను విడుదల చేశారు.చాలా రంగాల్లో ఆయన చేసిన కృషికి తెలివితేటలకు ఆయన పేరు మారుపేరుగా మారింది.

జీవిత సంగ్రహం

తొలినాళ్ళ జీవితం, చదువు

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 14 మార్చి 1879న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించారు.ఆయన తండ్రి హెర్మన్ ఐన్ స్టీన్ సేల్స్ మేన్, ఇంజినీర్ గా పనిచేశారు. 1880లో మునిచ్ కు వారి కుటుంబం మారిపోయింది. ఆయన తండ్రీ, బంధువు జాకబ్ కలసి విద్యుత్తు పరికరాలను తయారు చేసే కంపెనీ స్థాపించారు.


సౌ జ న్య  o - whatup message