Pages

బండరాయి - దేవుడు



వెళ్లే దారిలో ఒక పెద్ద బండరాయి కన్పించింది...


అర్రే దేనితో ఏదయినా చేద్దాం అని ఒక మనిషి రూపంగా చెక్కి , దాన్ని
అక్కడ వదిలేసి నా దారిన నేను వెళ్ళిపోయా...!!

ఇంకెవరో అదే దారిలో వెళుతూ, అర్రే ఈ శిల్పం చక్కగా ఉందే🤔 కానీ
కొన్ని మెరుగులు దిద్దుదాం అని, దానికి ఆభరణాలు, చేతిలో ఆయుధాలు చెక్కి,
ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి...!!

మరొకరెవరో వచ్చి, అబ్బా ఎంత బాగుంది..!! 😍 మెడ, నుదురు
బోసిగా ఉన్నాయ్ అని ఒక పూల దండ తెచ్చి, పసుపు కుంకుమతో
బొట్టు పెట్టి అతను కూడా దారి మరలి వెళ్ళిపోయాడు...!!

ఇంకో బాటసారికి ముళ్ళు గుచ్చుకుని, బాధతో నొప్పితో... సరిగ్గా ఆ శిల్పం
దగ్గర కూలబడ్డాడు.., బాధ పంచుకునే మనుషులు పక్కన లేక మనిషి
రూపంలో ఉన్న ఆ రాయితో తన నొప్పిని మొరపెట్టుకున్నాడు...!!

దూరం నుండి ఇది గమనించిన కొందరు మనుషులు...అర్రే ఈ రాయి
మనుషుల బాధలు వింటుందా ?! అని ఆశ్చర్యపోయి వాళ్ళ బాధలు
చెప్పుకుని వెళ్లిపోయారు...బాధలు లేని వాళ్లెవరు చెప్పండీ..!!!

ఇది కాస్త వాళ్ళ నోటా వీళ్ళనోట పడి, ఆ రాయిని చూడ్డానికి, దానితో
మాట్లాడటానికి గుంపులు గుంపులుగా జనాలు వెళ్తున్నారు..!! మాటలు
కాస్త పాటలయ్యాయి, పాటలు మంత్రాలయ్యాయి..!!! ఎండా వాన గాలి
నుండి ఆ రాయిని రక్షించడానికి ఒక ఇల్లు కూడా కట్టారు దానికి..!!

మనుషులుంటే ఇల్లు అంటారు, రాయి ఉంటే గుడి అంటారని, ప్రతి
ఒక్కరి గోడు వినలేక రాయికి విసుగొస్తుందని ఒక మధ్యవర్తిని పెట్టారు..
.ఆయన్ని పూజారి అంటారు...!!

జనాలు ఎక్కువయ్యేకొద్దీ ఈ మధ్యవర్తులు బ్రాంచెస్ స్టార్ట్ చేసి, వాటికి
నియమాలు, నిబద్ధతలు పెట్టేసి, ఆ రాయి వెనుక అసలు చరిత్రని,
దాచేసి, ఒక కొత్త కథని రాసుకున్నారు, దాన్ని పురాణమంటారు..!!

పురాణాలను ఇతిహాసాలను కవితలుగా కావ్యాలుగా సాగదీసి,
ఒక సమూహానికి చెప్పటం, ఆ సమూహం వాటిని పాటించాలని,
గౌరవించాలని చెప్పారు...అందరు సమ్మతించేలా చేసి దాన్ని మతం అని పిలిచారు..!!!

ఇలా కాలం గడిచాక, నేను-ఇంకా ఆ రాయిని చెక్కిన  వాళ్ళు ఆ
రాయి దగ్గరికి వెళ్ళాం యాదృచ్చికంగా..!! దానికి పూజలు చేస్తున్న వాళ్ళని అడిగాం..!!
ఈ రాయిమాది, మేము దీనికి రూపాన్ని ఇచ్చాం..!! మీరేం చేస్తున్నారు వింతగా అని..!!
దానికి ఆ మధ్యవర్తులు మాపై కోప్పడి ఇది రాయి కాదు మా దేవుడు అన్నారు...!!
మాకు ఆపుకోలేనంత నవ్వొచ్చింది..రాయివెనుక అసలు కథ చెప్పాము..!!
అది విని వాళ్ళు మమ్మల్ని నాస్తికులు అన్నారు..!!!!

జనాల్ని మోసపోవద్దని చెప్పాము..!! మమ్మల్నిహేతువాదులు
అన్నారు..!!!!

రాయి కంటే మనిషి గొప్ప వాడు..!! మనిషికి విలువ ఇవ్వండి..
రాయికి కాదు అని మొరపెట్టుకున్నాం..!!
మమ్మల్ని మానవవాదులు అని అన్నారు..!!!

నిజం చెప్పిన వాళ్ళు, సత్యాన్ని నమ్మండి అని చెప్పిన వాళ్ళు,
మనుషులే గొప్ప అని చెప్పిన వాళ్ళు, నాస్తికులు, హేతువాదులు,
మానవవాదులు..!!

ఆపదాన్ని చెప్పి, అపోహల్ని సృష్టించి వాటిని నమ్మమని చెప్పింది
మధ్యవర్తులు..!!

నమ్మే వాళ్లే అమాయకులు..!!!!!!!

ఈ కథలో నీతి లేదు, కానీ నిజం ఉంది..!! నిజాన్ని తెలుసుకోండి నా
ప్రియమైన అమాయక ప్రజలారా........ Just think about this matter.....



సౌ జ న్య  o - whatup message