Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

భౌతిక శాస్త్రవేత్త గెలీలియో


ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చిన గెలీలియో పుట్టిన రోజు సందర్భంగా మీ కోసం



  ఖగోళ నిజాన్ని నిరూపించాడు!
నిజాన్ని నిర్భయంగా చెప్పాడు.. మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు.. ఫలితంగా శిక్ష పడినా భయపడలేదు..
అతడే గెలీలియో గెలిలీ! ఆయన పుట్టినది ఈ రోజే!!-1564 ఫిబ్రవరి 15

మీతో ఎవరైనా 'భూమి చుట్టూ సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతున్నాయి' అని చెబితే, వెంటనే మీరు ఫక్కున నవ్వేస్తారు. కానీ కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం అలా అనే నమ్మేవారు. అంతేకాదు, కాదనే వారిని వ్యతిరేకించేవారు కూడా. అలాంటి రోజుల్లో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని నిరూపించిన శాస్త్రవేత్తే గెలీలియో గెలీలి. ఆధునిక భౌతిక శాస్త్రం, పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రాలకు పితామహుడిగా పేరొందిన గెలీలియో గణిత, తత్వవేత్తగా కూడా విజ్ఞాన శాస్త్రాన్ని మేలిమలుపు తిప్పాడు.

ఇటలీలోని పీసా నగరంలో 1564 ఫిబ్రవరి 15న ఆరుగురి సంతానంలో పెద్దవాడిగా పుట్టిన గెలీలియో 11 ఏళ్ల వరకూ తండ్రి వద్దనే విద్య నేర్చుకున్నాడు. తండ్రి కోరికపై వైద్య విద్యార్థిగా చేరినా, మధ్యలో గణిత శాస్త్ర అధ్యయనం చేపట్టాడు. టెలిస్కోపును అభివృద్ధి చేసి, దానిని అంతరిక్షం కేసి తిప్పి, తొలిసారిగా విశ్వరూపాన్ని వీక్షించిన తొలిశాస్త్రవేత్త అతడేనని చెప్పవచ్చు. అతడికి ముందే కోపర్నికస్‌ అనే శాస్త్రవేత్త సూర్యుడి చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గెలీలియో టెలిస్కోపు సాయంతో ఆ సిద్ధాంతం నిజమేనని నిరూపించగలిగాడు. సూర్యునిలో మచ్చలను, శుక్రుని దశలను, జ్యూపిటర్‌ ఉపగ్రహాలను గుర్తించడం, సామాన్యులకు ఉపయోగపడే కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులను ఎత్తగలిగే సూత్రాలను చాటి చెప్పే యాంత్రిక శాస్త్రాన్ని రచించడం, వాయు ధర్మామీటర్‌, లోతు నుంచి ఎత్తుకు నీటిని పంపే పరికరం, గణితంలో వర్గాలు, వర్గమూలాల్ని కనుగొనే కంపాస్‌ల రూపకల్పన లాంటి ఎన్నో పరిశోధనలు చేశాడు.

పీసా టవర్‌ నుంచి 1 పౌండు, 100 పౌండ్ల బరువున్న రెండు ఇనుప గుండ్లను ఒకేసారి కిందకి వదిలి అవి రెండూ ఏకకాలంలో భూమికి చేరుకుంటాయని నిరూపించి అప్పటి నమ్మకాలను తప్పని నిరూపించింది కూడా ఇతడే.

అతడు సమర్థించే సూర్యకేంద్రక సిద్ధాంతం మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహించిన మతాధిపతులు 1623లో గెలీలియో రచించిన పుస్తకాల ముద్రణను నిలిపివేయడమే కాకుండా, కారాగార శిక్ష సైతం విధించారు. కారాగారంలోనే చూపును కోల్పోయిన గెలీలియో ఆ శిక్షను అనుభవిస్తూనే తన 78వ ఏట మరణించాడు. ఆయన రాసిన గ్రంథాలలో 'టూ న్యూ సైన్సెస్‌' అనేది ఈనాటి భౌతిక శాస్త్రం (ఫిజిక్స్‌)కి మాతృక!

* గెలీలియో ఏ దేశస్థుడు--ఇటలీ.
* గెలీలియో ఏ రంగంలో ప్రసిద్ధిచెందినాడు--ఖగోళశాస్త్రం.
* గెలీలియో తన ప్రయోగాల కోసం ఉపయోగించుకున్న ప్రముఖ టవర్--పీసాటవర్.
* గెలీలియో ఏ రంగానికి పితామహుడిగా పరిగణించబడతాడు--ఆధునిక ఖగోళశాస్త్రం, ఆధునిక భౌతికశాస్త్రం, విజ్ఞానశాస్త్రం.
* గెలీలియో ఎప్పుడు జన్మించాడు--15 ఫిబ్రవరి, 1564.
* ఖగోళశాస్త్ర పరిశోధనలో గెలీలియో కమిపెట్టిన సాధనం--టెలిస్కోప్.
* గెలీలియో ఏ గ్రహానికి 4 ఉపగ్రహాలను కనిపెట్టాడు--జూపిటర్.
* గెలీలియో వలన ఖగోళశాస్త్రంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు--సూర్యకేంద్రక సిద్ధాంతం.
* గెలీలియో యొక్క ముఖ్య శిష్యుడు--బెనెడెట్టో కాస్టెల్లి.
* గెలీలియో ఎప్పుడు మరణించాడు--8 జనవరి, 1642.

సౌ జ న్య  o - whatup message