Pages

జీవితం ..

జీవితాన్ని జీవించండి


ఏదో చెప్పాలంకుంటాం
మరేదో మాట్లాడుతుంటాం
కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్

ఏదో విన్నామనుకుంటాం
మరేదో అర్ధమవుతుంది
తొందరపాటుతనం

అంతా మనవాళ్లే అనుకుంటాం
కాదని సడన్ గా అర్ధమవుతుంది
వాస్తవం

మనం సరైన దారిలోనే వెళుతున్నామనకుంటాం
సగంలో అడ్డు గోడ వస్తుంది
అజ్ఞానం

ప్రేమ, కోపం, అభిమానం, అభ్యంతరం, చూపించాల్సిన సమయంలో చూపించo.
మొహమాటం

మనకేం కావాలో మనకే తెలియదు
మనం ఏం కోరుకుంటున్నామో మనకే తెలియదు
అయోమయం

జీవితాన్ని ఆనందంగా ఎలా ఉంచుకోవాలో తెలియదు
నవ్వాలనుకున్నప్పుడు నవ్వలేం
ఏడవాలనుకున్నప్పుడు ఏడవలేం
కానీ, కాలం గడిచిపోతూనే ఉంటుంది,

కాలండర్ లో పేజీలు మారిపోతుంటాయి
రోజులు సంవత్సరాలుగా మారిపోతాయి
ఒక గమ్యం ఉండదు, ఒక సంతోషం ఉండదు,
మనసులోని భావాలు మనసులోనే సమాధి అయిపోతాయి

ఏమి లేకుండానే
పెద్దవాళ్ళం ఐపోతాం, ముసలివాళ్ళం ఐపోతాం
ఒక రోజు పోతాం
మరి జీవితం లో ఎం సాధించాం

మన జీవిత పుస్తకంలో
మనకంటూ నాలుగు పేజీలైనా ఉన్నాయా!

ఆ నాలుగు పేజీలలో
మనల్ని మనం సంతోషంగా ఉంచుకున్న క్షణాలు ఏవైనా ఉన్నాయా ?

చూసుకుంటే బాధ వేస్తుంది కదూ

చిన్న చిన్న ఆనందాలు,
చిన్న చిన్న సంతోషాలు,
ఎన్ని మిస్ చేసుకున్నామో చూసుకుంటే దిగులేస్తుంది కదూ

అందుకే మనసుని చూడండి

ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో
చుట్టూ వున్న ప్రకృతిని చూడండి
ప్రకృతి లోని ప్రతీ ప్రాణి అంత సంతోషంగా ఎలా జీవిస్తున్నాయో చూడండి

మంచి పుస్తకాలు చదవండి

మనసుకు నచ్చిన వాళ్లతో మనసు విప్పి మాట్లాడండి

హాయిగా నవ్వండి,
మనసారా ఏడవండి
జీవితాన్ని జీవించండి


సౌ జ న్య  o - whatup message