Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

జీవిత గమనం ..



జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు

*ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం*

*మౌనం మనస్సుని  శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్దిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్నీ శుద్ది చేస్తుంది అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ది చేస్తుంది*

*ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం జాగ్రత్త*

*నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి*

*సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి*

*జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదుచాలానే చూడాల్సివస్తుంది వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం*

*కరుగుతున్న కాలానికి జరుగుతున్న సమయానికి అంతరించే వయసుకి మిగలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణ0*

*అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు చేతినిండా పని కడుపునిండా తిండి కంటినిండా నిద్ర అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం*

*మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించిన వ్యర్ధమే*

*మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్ధం అవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవిత0*

*నిరంతరం వెలిగే సూర్యూన్ని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది*

*ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండలని భావించకు నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో అలాగే నీకన్న తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు పై స్థాయి వారిని  చూసి లక్ష్యమేర్పరచుకో.*

*నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు*

*జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.*


సౌ జ న్య  o - whatup message