Pages

విచిత్రం ఏమిటంటే


*✅ అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం.*


*✅ ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.*

*✅మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.*

*✅ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.*

*✅ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.*

*✅ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.*

*✅ దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు - ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.*

*✅ విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.*

*ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.!*
నిజమనిపిస్తే #share చేయండి
సౌ జన్య  o - whatup message