Pages

రజస్వలోత్సవ వేడుకల అవసరం ఏమిటి?


ఆడపిల్ల తొలిసారి బహిష్టు కావడాన్ని వాడుకలో రజస్వల అయింది, రవీశ్వరాలు అయింది, పెద్దమనిషి అయింది అంటుంటారు. వాస్తవానికి సంగమానికి, సంతానోత్పత్తికి ఆడపిల్ల శారీరక సన్నద్ధతకు సూచన ఇది! ప్రత్యేకంగా ఏదో ఒక లోపం లేకపోతే; ఆడపిల్ల అన్నాక రజస్వల కావడం, పెళ్లికావడం, పిల్లల్ని కనడం మామూలుగా జరిగేవే. అలాంటప్పుడు ఆడపిల్ల తొలిసారి బహిష్టు అయినప్పుడు ఆ కార్యక్రమాన్ని ఒక వేడుక లాగా ఎందుకు జరుపుతున్నారు? పెళ్లి లాగా దీన్నికూడా అంత ఆర్భాటంగా జరపాల్సిన అవసరముందా? పరిశీలిస్తే దీని వెనుక ఒక చారిత్రక కారణం వుందని  తెలుస్తోంది!

ఒక 100 సంవత్సరాలు వెనక్కు పోతే, మన దేశంలో బాల్య వివాహాలు అధికంగా సాగేవి. చరిత్రను పరిశీలిస్తే పాలు తాగుతున్న పసివయస్సులో కూడా కొన్ని పెళ్లిళ్లు జరిగేవని తెలుస్తోంది. అంటే, పసి ప్రాయం నుంచి బాల్యావస్థలో వుండగానే; అంటే అమ్మాయి రజస్వల కాక పూర్వమే అనేక పెళ్లిళ్లు జరిగి పోయేవి. ఆడపిల్లకు బాల్యంలోనే పెళ్లి అయిపోయినా, సంగమించే వయస్సు వచ్చేవరకు ఆ పిల్ల తల్లిదండ్రుల సంరక్షణ లోనే ఉండేది. రజస్వలానంతరం ఆ అమ్మాయిని భర్త దగ్గరకు పంపేవారు. ఇందులో భాగంగా వునికిలోకి వచ్చిందే రజస్వలోత్సవ వేడుక. అమ్మాయి తొలిసారి బహిష్టు అయితే, ఆ పిల్లను ఇక కాపురానికి పంపించవచ్చన్న సంతోషం కుటుంబీకులకు కలిగేది. ఆ ఆనందాన్ని పది మందితో పంచుకునేందుకు, బంధుమిత్రులందరికీ ఆ విషయాన్ని తెలియ బరిచేందుకు ఎంచుకున్నదే ఈ ఉత్సవం!

బాల్య వివాహాలు  మనదేశంలో మాత్రమే గాక ప్రాచీన కాలంలో అనేక ప్రాంతాల్లో వాడుకలో ఉండేవి. ఇస్లాం పుట్టుకకు కారణ మైన మహమ్మద్ ప్రవక్త 11 వ పెళ్లి ఆయేషా తో జరిగేటప్పటికి ఆ పిల్ల వయస్సు 6 సం. లు. ఆయేషాకు 9 ఏళ్ళు వచ్చాక భర్త దగ్గరకు సంసారానికి పంపించారు.

నేడు బాల్యవివాహాలు లేదా రజస్వలాత్పూర్వ వివాహాలు ఆగిపోయినా రజస్వలోత్సవ వేడుకలు ఇంకా పూర్తిగా ఆగలేదు. అక్కడక్కడా మాత్రం దీన్ని పాటించనివారు కొందరు కనిపిస్తున్నారు.
              ...పీయస్సార్.

సౌ జ న్య  o - whatup message