Pages

బంగారం - స్వచ్ఛత

ప్రశ్న:- బంగారంలో ఆ తేడాలెందుకు ? 916 కేడియం బంగారం అంటే ఏమిటి ??

జవాబు: కేడియం అంటే కాడ్మియం అనే మూలకానికి మారుపేరు. గ్రీకుభాషలో కాడ్మియం లోహాన్ని కేడియం అంటారు. పొట్టిగా KDM అనే ఆంగ్ల అక్షరాలతో కలిపి చదువుతారు. నిజానికి దాన్ని Cadmium(ఆంగ్లం) లేదా Kadium (గ్రీకు) అనాలి. ఎస్‌.ఎం.ఎస్‌ భాషలో Yourని UR అని కుదించినట్టే Kadiumను KDM అని కుదించి చదువుతారు. ఈ మధ్య బంగారు ఆభరణాలు చాలా డిజైన్లలో సూక్ష్మస్థాయి విన్యాసాలతో వస్తున్నాయి. అంత సూక్ష్మ స్థాయిలోకి బంగారాన్ని వంపుసొంపులు తిప్పాలంటే దానికి మృదుత్వం బాగా రావాలి. పైగా చిన్న చిన్న ముక్కల్ని బలమైన బంధంలో సంధానం చేయాలి. గతంలో వెండి లేదా రాగి లోహాల్ని ఇలా సంధానం చేయడానికి ఉపయోగించేవారు. అలా వాటిని వాడాలంటే 24 క్యారట్ల 100 శాతం స్వచ్ఛంగా ఉన్న బంగారంలోకి కనీసం 2 శాతమైనా రాగి తదితర ఇతర లోహాల్ని మిళితం చేయాలి. అలాంటి బంగారంలో 22 క్యారట్ల స్వచ్ఛ బంగారం పాలు ఉంటుంది. 24 క్యారట్లు 100 శాతమైతే 22 క్యారట్లు 91.6 శాతం అవుతుందన్న వాదనలోంచే 916 వచ్చింది. పూర్తి స్వచ్ఛమైన బంగారాన్ని వెండి లేదా రాగి లోహాల్లో సంధానం చేయాలంటే వీలు కాదు. ఒకవేళ చేయాలన్నా అధిక ఉష్ణోగ్రత అవసరం. పైగా సన్నని మూలల్ని, చివరల్ని అతికించలేము.

తక్కువ ఉష్ణోగ్రత దగ్గర స్వచ్ఛమైన బంగారాన్నయినా సన్నని చివర్లను కూడా సంధానం చేయగల లక్షణం కాడ్మియం లోహానికి ఉంది. కాబట్టి కాడ్మియంను వాడి బిగించిన బంగారు ఆభరణాల్ని KDM బంగారు నగలు అంటారు. కాడ్మియం చాలా ప్రమాదకర లోహం. సిగరెట్టు పెట్టెల మీద చట్టబద్ధ హెచ్చరిక ఉన్నట్టే KDM బంగారు నగల మీద KDM లక్షణాల్ని సూక్ష్మ స్థాయిలో గీకుతారు. ఇక రెండింతలు లోహం రావాలంటే 916 బంగారాన్ని కాడ్మియంలో సంధానించితే ఆ ఆభరణాన్ని 916 కేడియం బంగారు నగలు అంటారు. చాలా దేశాల్లో కాడ్మియం వాడకాన్ని నిషేధించారు. ఆరోగ్యం కన్నా అలంకరణలున్న బంగారం కోరుకుంటే 916 కేడియం బంగారు సింగారాలకు భంగం వాటిల్లదు.

- ప్రొ॥ ఎ.రామచంద్రయ్య,  నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,  శాస్త్రప్రచార విభాగం. జనవిజ్ఞానవేదిక, తెలంగాణ
సౌ జ న్య  o - whatup message