మైల మతం , ద్రోహి కులాలు
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కొలంబియా యునివర్సిటి
నుండి తన ఉన్నత చదువు పూర్తి చేసుకుని భారత దేశానికి తిరిగి వచ్చినప్పుడు తన కుటుంబం
మహారాష్ట్రలోని సాతారా లో ఉంటుంది.కావున డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు సాతారా రైల్వేస్టషేన్
లో దిగుతారు.తనతో రెండు పెద్ద పెద్ద షూటుకేసుల నిండా పుస్తకాల బరువు ఉంటుంది.రైల్వే
స్టేషన్ నుండి తన ఇల్లు 6కి.మీ. దూరంలో ఉంటుంది.కావున
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు అక్కడ ఉన్న టాంగా(గుర్రపు స్వారీ) ని ,
4 పైసలకీ ఇంటీ వరకు మాట్లాడుకుంటారు.టాంగా వాడు 2 కి.మీ.దూరంలో వెల్లీన తర్వాత, డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి కులం అడుగుతాడు ,డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మహార్ అని చెప్పడంతో టాంగా వాలా షూట్-బూట్ లో బాబాసాహెబ్
అంబేడ్కర్ ను చూసి నమ్మలేదు , మరియు బాబాసాహెబ్
అంబేడ్కర్ గారితో ఇలా అన్నాడు ఎందుకు అబద్ధం చెబుతున్నావు నిజం చెప్పు నీ కులం ఎంటి ? అప్పుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు నేను నిజమే చెబుతున్నాను , అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు అన్నారు. వెంటనే టాంగా వాలా టాంగా
దిగి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి తిట్టడం మొదలు పెట్టాడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు
నువ్వు అంటరాని వాడివని, నీ వలన నేను మైల అయిపోయాను.ఇప్పుడు
నా టాంగా కు గో మూత్రంతో శుద్ధి చెయ్యాలి , అయినా అంటరాని వాడివి నీకెందుకురా షుటు-బుటు, (వాడు మాసిపోయిన చిన్న గోసి , చిరిగిపోయిన బనియాన్ వేసుకుని ఉంటాడు ) నా డబ్బులు నాకు ఇవ్వు నేను తిరిగి వెలతానూ
అన్నాడు.సాయంత్రం సమయం మరియు బరువు గల రెండు పెద్ద షూట్- కేసులు ఉండడంతో , బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు టాంగా వాలా తో బతిమాలారు ఈ సమయంలో
ఇంత పెద్ద బరువులతో ఎలా వెళ్లగలను.నీకు రెట్టింపు పైసలు ఇస్తాను ఇంటివరకు దించమన్నారు.
రెట్టింపు పైసలకీ ఆశపడ్డ టాంగావాలా రావడానికి ఒప్పుకున్నాడు కాని ఒక షరతు అన్నాడు , వస్తాను కాని టాంగాను నువ్వు నడపాలన్నాడు , బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు తప్పనిసరి పరిస్థితులో ఒప్పుకున్నారు.కాని
బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి టాంగా ను నడిపిన అనుభవం లేకపోవడంతో ఓ2 కి.మీ.దూరం పొయిన తర్వాత టాంగా ఒక గుంతలో బొర్ల పడింది , టాంగావాలా దూకేసాడు , కాని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి మొకాలుకు బలమైన గాయమైంది ఇక టాంగావాలా ఎంత చెప్పిన
వినకుండా తన డబ్బులు తిసుకుని అక్కడి నుండి తిరిగి వెళ్ళి పోయాడు, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మాత్రం తప్పని పరిస్థితుల్లో నెత్తి
మీదా ఒక షూట్-కేసు , చేతిలో ఒక షూట్-కేసు
పట్టుకుని , మొకాలి గాయంతో కుంటుకుంటు
ఇంటి వరకు వెళ్ళి ,రమాబాయి కి పిలిచారు
చీకటి ఉండడంతో రమాబాయి దీపం తీసుకొని బయటకు వస్తుంది, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారినీ ఆ పరిస్థితిలో చూసి రక్తం కారుతున్నా మొకాలిని చూసి ,కుంటుకుంటు వస్తున్న బాబాసాహెబ్ గారినీ చూసి కంటినిండా నీళ్ళతో
"ఎమయింది సాహేబ్ " అని అడిగింది , బాబాసాహెబ్ గారు దుఖ పూరితమైన కంఠంతో " ఎం చెప్పమంటావు రాము నేను ఏ దేశం నుండి
వస్తున్నానో అక్కడి ప్రజలు నా జ్జానాన్ని చూసి , నా విద్దతను చూసి గర్వ పడుతుంటే నా దేశం మాత్రం నాకు కులం పేరిట ఈ విధంగా అవమాన
పరుస్తోంది".అని సమాధానం ఇచ్చారు.
చిన్నప్పుడు కటింగు తియ్యనని అవమానం పర్చిన
మంగలాయన,టాంగావాలా....వీరు వెనుకబడిన కులాల వారే వీరీ
ప్రగతి కొరకు బి.సి.కమీషన్ ను నియమించనందకు తన న్యాయశాఖ మంత్రి పదివికి సైతం రాజినామా
చేశారు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షతో అన్నిరంగాలలో
ముందుకు వస్తున్న వెనకబడిన కులాలు మాత్రం బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని అంటరానివాడుగా
మాత్రమే చిత్రికరిస్తున్నారు...!!!
స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావం కలిగి ఉన్న,మానవీయ విలువలు కలిగి ఉన్న బౌద్ధ ధమ్మాన్ని, 1800సంవత్సరాల పాటు తక్షశీల, నలందా , విక్రమశీల, దంతపురి ,వల్లాభి ...మెద. బౌద్ధ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచ దేశాలకు
జ్జాన బిక్ష పెట్టిన బౌద్ధ ధమ్మాన్ని మాతృ భూమి నుండి తిరష్కరించి,బ్రహ్మణ వాదము భారత దేశమును ఈశ్వరవాదం , కర్మవాదం ,పిండదానము , పునర్జన్మ, అజ్ఞానం, అంధవిశ్వాసములో నెట్టేసి ,కులమతాల అసమానతలతో దేశాన్ని వేల కులాలుగా విభజించి,చాతుర్వర్ణ సిద్దాంతం హిందూ ధర్మానికి పునాదిగా బ్రాహ్మణీయవాదము బలపడింది.
బ్రాహ్మణీయులను ఎదురించి నిలచిన వారిని అస్పృశ్యులుగా వెలవేసి
వారిని అంటరానివారిగా ,చూడరానివారిగా చిత్రికరించి
వారికి బడిని , గుడిని నిషేధించారు,అత్యధిక శాతం ప్రజలను శుద్రులుగా చిత్రికరించి వారిని బానిసలుగా
మార్చి కుల వృత్తులకు పరిమితం చేశారు.కులమతాల కుళ్ళు కంపును జనం నర నరాల్లో ప్రవహింపజేసి
అసమానతలను శాశ్వతం చేస్తు బ్రహ్మణవాదము ఈ దేశములో బల పడింది.
బ్రాహ్మణీయవాదము యొక్క కుట్రలను ధ్వంసం చేయడానికి 19వ శతాబ్దం చివరిలో 14 ఎప్రిల్ 1891సంవత్సరములో భీంరావు
రాంజీ అంబేడ్కర్ అనే మహా సూర్యుడు ఉదయించాడు.అగ్రకుల మనువాద కుట్రల్నీ ఎడమకాలితో తన్ని
నిత్య అవమానాలకు , అణచివేతకు, అవహేళనకు గురవుతున్న ప్రజల బ్రతుకుల్లో వెలుగును తెచ్చారు డా.బాబాసాహెబ్
అంబేడ్కర్ గారు.
బ్రాహ్మణవాద కుట్రలు వలన భారతదేశము లక్షల కులాలుగా, వేల జాతులుగా, వందల మతాలుగా , లెక్కలేనన్ని భాషలుగా , చిన్న చిన్న రాజ్యలుగా చీలిపోయిన భారత సమాజాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య దేశముగా రూపొందించడానికి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్
గారు ప్రసాదించిన రాజ్యాంగము కారణము.కుల, మత, లింగ, భాషా,భేదము లేకుండా ఈ దేశములో పుట్టిన ప్రతి ఒక్కరికి
ఓటు హక్కు ను కల్పించి పౌరులుగా సమాజములో గుర్తింపు ఇచ్చి రాహుల్ గాంధికైన, లింగడికైన, రామయ్యకైనా
ఒకే ఓటు ఒకే విలువ కల్పించింది బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మాత్రమే.
ఈ రోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు,జమిందారులు కూడు గుడ్డలేని సామాన్యుడికి కూడా
వంగి వంగీ దండాలు పెడుతున్నారంటే ఆ ఓటు హక్కు కల్పించిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు
కారణం. భారతదేశంలో కార్మిక చట్టాల రూపశిల్పి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మహిళలకు ఆస్తి లో సమాన హక్కుల
కొరకు ఆ రోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే ఆనాటి ఫ్యూడల్ పాలకులు వ్యతిరేకించడముతో
తన న్యాయ శాఖా పదివికి రాజీనామా చేసినా మహిళొద్ధారకుడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు
ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలో తెచ్చిన సామాజిక రక్షణ చట్టాలు , హక్కులు చాలానే అనుభవిస్తున్న మనందరికీ తెలుసు ఇవి డా.బాబాసాహెబ్
అంబేడ్కర్ గారు పెట్టిన బిక్షా అని కాని ఈ బ్రహ్మణవాద హిందూ వ్యవస్థ డా.బాబాసాహెబ్
అంబేడ్కర్ గారిని కేవలం దలిత నాయకుడిగా ప్రచారం చేస్తున్నారు.
భారత దేశానికి రాజ్యాంగం అందించి అంటరాని
కులాల విముక్తి కొరకై అనేక చట్టాలను తెచ్చిన దార్శనికుడు ఈ దేశంలో ఆర్థికంగా ,సామాజికంగా , అణచివేతకు గురవుతున్న, దోపిడీకి గురవుతున్న
కులాల, జాతుల ప్రజల ప్రధాన శత్రువు బ్రహ్మణవాదం అని
ప్రకటించి ఈ దేశాన్ని స్వేచ్ఛా,సమానత్వం, సౌబ్రాతృత్వం నీడ కింద తెచ్చిన నిజమైన దేశ భక్తుడు డా.బాబాసాహెబ్
అంబేడ్కర్ గారు.
మనకోసం......
కులమతాల వలలో చిక్కబడి ఉన్నా ఈ అస్పృశ్య బాంధవులను ఉద్ధరించడంలో
నేను అసఫలీకృతమైతే నన్ను నేను తుపాకీతో కాల్చుకొని అంతమైపోతాను అంటు తన జాతి నిర్మాణం
కోసం , తన జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రం కొరకు పోరాటం
చెస్తున్నప్పుడు.....ఎన్ని యాతనల గాయలను సహించాడు మన కోసం ! ఎన్ని రాత్రులు మేల్కొన్నాడు
మన కోసం ! ఎన్ని కష్టాలు సహించాడు మన కోసం ! కష్టాలతో కృంగిపోయిన తన భార్య శిరస్సు
కింద ఏ ఒడినైతే ఇవ్వాలో ఆ ఒడిని అతను దుఖగ్రస్తులైన మన తల్లి తండ్రుల నెత్తి కింద ఇచ్చాడు
! పిడకలు చేసి పగలు రాత్రి సంసారపు పోయిలో పొగను ఊదే తన భార్య కన్నీళ్లను తుడవటానికీ
ఏ చేతులైతే ఎన్నడు పనికిరాలేదో , ఆ చేతులు మన తల్లిదండ్రుల ఆనంత కన్నీళ్లను తుడవడంలో వ్యస్తమై ఉండేను.కష్ట జీవితమైన
తన భార్య యొక్క పిడికెడంత శరీరాన్ని కప్పడానికి ఒంటీనిండా వస్త్రం ఇవ్వలేని ఈ మన తండ్రి
తన సర్వ జీవితాన్ని మాహా వస్త్రంగా మార్చి మన చిరిగిన దేహం పై కప్పుతుండేను ఈ విధంగా
తన పిల్లలు రమేష్ పొయాడు , గంగాధర్ పొయాడు,అమ్మాయి ఇందు కూడా మరణించింది , ఇంకా ఒడిలోనే రాజరత్న జారుకున్నాడు ఇంతటి దుఖాలనూ సహించాడు మన
కోసం.
మృత్యువు చేతిలో ఊయ్యాల దారానిఛ్చి జీవితపు జోలపాట పాడే ఈ తల్లిదండ్రులు ఎవరికోసం
త్యాగం చేశారు ? ఎవరికోసం వారి జీవితాలను
హోమం చేశారు? ఎకైక తనయుడైనమో యశ్వంత్ రావు కోసం ఎక్కడ సిఫారసు
చేయలేదు. వ్యాధిగ్రస్త వయస్సు లో కూడా ఓర్పును పాటించే సంయమాల దీపం ఎవరికోసం కాలింది..? ఒక్క బ్రెడ్ ముక్క తిని18గంటలు అభ్యాసం చేసి గ్రంథాలను రచించిన ఈ యుగంధరుడు ఎవరికోసం కష్టపడ్డాడు..?
ఎందుకు జోహార్లు కొట్టే మన చేతుల్నీ బంధన
విముక్తి చేశారు...?ఇందుకొరకే కదా మనషి మానవత్వాన్ని ధిక్కరించే
నాలుకల్నీ పీకేయగలం అని , దీనికొరకే
కదా మన మీదా అన్యాయాలు,అత్యాచారాలు చేసే వారి
గొంతను కోయగలం అని ,......మరి ఈ చేతులు ఈ రోజు
ఏమి చేస్తున్నాయి...? ఈ చేతులు కావాలి పడికెల్నీ
బిగించి యుధ్ధపూరిత నినాదాల్నీ ఇవ్వడానికి, ఈ చేతులు కావాలి శత్రువుల, నిర్దయుల దౌడల్ని
బద్ధలు కొట్టడానికి...
19-1-26 .
అంభేధ్కర్ తన కుమారుడు రాజరత్న ఆకస్మిక మరణం
తర్వాత.. స్నేహితుడు దత్తోబా రాసిన పరామర్శ ఉత్తరానికి బాబాసాహెబ్ రాసిన ప్రత్యుత్తరం...
............... లేఖ
.....................
దామోదర్ హాల్,
పరేల్, బోంబే 12,
ప్రియమైన దత్తోబాకి..డా.బి.ఆర్ అంభేధ్కర్
రాయునది...
నీ ఉత్తరం ఒకింత ఆశ్చర్యాన్నే మోసుకొచ్చింది.
శివ తర్కార్ నీకు నా కుమారుడి మరణం గురించి రాసి చాలా రోజులు గడిచిపోయినా నీ వద్ద నుండి
ఎలాంటి ఉత్తరం రాకపోయేసరికి, నువ్వు నాగురించి పట్టించుకోవడం
మానేసావేేమో అనుకున్నాను. కానీ అది నిజం కాదని, కనీసం ఇలాంటి విషాద సమయాల్లోనైనా నువ్వు నాకు ఓ సంతాప వాక్యం రాయగలుగుతున్నావంటే,
నువ్వు నన్ను పూర్తిగా మర్చిపొలేదని అర్ధమౌతుంది.
నేనూ నా భార్యా.. బిడ్డను కోల్పోయిన విషాదం
నుంచి కోలుకున్నామని చెప్తే అది అబద్ధమే ఔతుంది. బహుశా అదెప్పటికీ జరగదేమో కూడా. ఇప్పటివరకూ
మేము నలుగురు పిల్లలను సమాధిచేసాము. ఒక కూతురు, ముగ్గురు కొడుకులు, అందరూ నిజానికి చాలా
చక్కటి అందమైన, ఆరోగ్యమైన బిడ్డలే. వాళ్ళు హాయిగా జీవించాల్సిన
రేపటిసంగతి అలా ఉంచితే, వీళ్ళను బతికించుకోలేకపోయామన్న
ఆలోచనే గుండెను పిండేసేదిగా ఉంటుంది.
మా రోజులు మబ్బులుసాగినట్టుగా నిశ్శభ్దంగా
సాగిపోతున్నాయి అనడంలో సందేహంలేదు. బైబిల్లో
చెప్పినట్టు"మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు తనసారమును కోల్పోతే మరి అది దేనివల్ల సారము పొందును?"అన్నట్లుగా మా బిడ్డల మరణాలతో మేము మా జీవితపు రుచినే కోల్పోయాం.
ఈ వాక్యాల్లోని నిజాన్ని నా శూన్యం నిండిన ఈ జీవితపు ప్రతీ క్షణమూ అనుభవిస్తున్నాను.
నా ఆఖరి కొడుకు చాలా చక్కటివాడు, నేనలాంటి బిడ్డను ఎక్కడా
చూడలేదు. వాడుపోవడంతో నాజీవితం ఇకపై కలుపుమొక్కలతో
నిండిన తోటలాంటిదే. సరే ఇక ముగిస్తాను. దుఖ్ఖం కమ్ముకొస్తుంది. ఇకరాయలేను.
అన్నీ పోగొట్టుకున్నవాడి శుభాశీస్సులతో..
మీ..బి.ఆర్. అంబేట్కర్.
డా.బి.ఆర్.అంబేడ్కర్ జీవించింది
నిండా 65 యేళ్ళు మాత్రమే. అంబేడ్కర్ 6 డిశెంబర్ '1956 న మరణించారు.
తన జీవితములో అంబేడ్కర్ అనేక సభలు సమావేశాలలో సందేశాలు ఇచ్చినా, తన జీవిత చరమాంకములో అనగా 18 మార్చ్ 1956 న ఆగ్రా లో ఇచ్చిన సందేశాన్ని చారిత్రాత్మక
సందేశముగా చెపుతూ ఉంటారు.
ఆ సందేశములో, దళిత బహుజన ప్రజలకు,
యువతకు, భూములు లేని శ్రామికులకు,రిజర్వేషన్ లతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారికి, విద్యార్ధులకు,
వివిధ సంఘాల నాయకులకు, విడివిడిగా సందేశమిచ్చారు.
అందులో, ప్రాముఖ్యముగా., రిజర్వేషన్ లతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారిని
ఉద్దేశించి ఈ క్రింది మాటలు చెప్పారు.
"Our society has progressed a little bit with
education. Some persons have reached high posts after getting education. But
these educated persons have betrayed me. I expected that they would do social
service after getting higher education. But what I see is a crowd of small and
big clerks who are busy in filling their own bellies. Those who are in
government service have a duty to donate 1/ 20th part of their pay for social
work. Only then the society will progress otherwise only one family will be
benefitted. An educated social worker can prove to be a boon for them.”
ఈ మాటలు చెప్పినది 1956 లో., అంటే.., షుమారు 61 సంవత్సరాలు దాటిపోయింది.
ఆంబేడ్కర్ గారు ఆనాడు అన్న ఆ మాటలు నేటి తరములో
ఉన్న మనకు ఎంతవరకు applicable అని ఇప్పుడు మనం అర్ధం
చేసుకోవాలి.
ఆనాటి కాలములో ఉన్న మొత్తము ప్రభుత్వ ఉద్యోగాలు,
నేటి సంఖ్య తో పోల్చుకుంటే చాలా తక్కువ, అప్పటికి ఇంకా ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్, బి.సి.లకు, మహిళలకు రిజర్వేషన్స్
వంటివి ఇంకా పఠిష్టం గా అమలు కాని రోజులు. అంటే, అంబేడ్కర్ గారి ఈ మాటలు అనాటి తరానికంటే నేటి తరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు more applicable అనమాట.
అవును, అంబేడ్కర్ గారు అన్న ఆ మాటలు లోతుగా ఆలోచించాలి.,
అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.
ఆ మాటలు అర్ధమవ్వాలి అంటే.,
(1) తరతరాలుగా ఉన్న తాత ముత్తాత ల చరిత్ర అర్ధమవ్వాలి.
(2) తాత ల చరిత్ర వేరు, నేను వేరు అనే ధోరణి ఉండకూడదు.
(3) ఈ దేశములో నివసిస్తున్న ప్రతి దళితుడు,
మూడు తరములు వెనక్కి వెళ్ళి అప్పుడున్న ముత్తాత, అంతకుముందున్న తరముల పితృ సమానులైన వారంతా, అంటరానివారిగా జీవించి, ఎవరూ చేయలేని కులవృత్తులైన పాకిపని,పెంటపని చేసినవారనే
విషయము తెలుసుకోవాలి.
(4) ఇరవయ్యొవ శతాబ్దములో., డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు పుట్టకుండా ఉంటే., మనమంతా, ఇంకా అదే కుల వృత్తులలో
కొనసాగేవారమని గుర్తించాలి.
ఈ నాలుగు విషయాలు గురించి నాలుగు నిమిషాలు
ఆలోచిస్తే., ఆయన చెప్పిన payback 1/20 part యేంటి,
½ part అయినా సమజానికి
వెచ్చించాలని అనిపిస్తుంది.
అంబేడ్కర్ వ్రాసిన మరికొన్ని books
చదివితే మరొక విషయము అర్ధం అవుతుంది. అదేమిటంటే..,ఆయన చెప్పిన payback కేవలము డబ్బును donate చెయ్యడము గురించి
కాదు. ఆయన payback చెయ్యమని చెప్పినది మూడు వస్తువులను., అవి.,
(1) Treasure
(2) Time
(3) Talent
[All these three terms starts with ”T”]
వివరణలు:
(1) TREASURE : నీ జీతము [Gross salary] నెలసరి రూ.30000/- అయితే షుమారు రూ.1500/-
మన దళిత సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఆ రకముగా., మన Car
Loan, Home Loan లకోసం కట్టే EMI
లను సర్దుబాటు చేసుకోవాలి.దీనర్ధం, SC.ST సంఘాలకు donations ఇవ్వాలనికాదు. ఈ క్రింద చెప్పిన విధముగా కూడా చెయ్యవచ్చును
(A) మీ సమీప గ్రామాలలో తినడానికి తిండి లేని దళిత
కుటుంబాలలో పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు, సైకిల్ కొనిస్తే చాలు.
(B) సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న విద్యార్ధులకు
స్కూల్ లేదా కాలేజ్ యూనిఫాం కొనిస్తే చాలు.
(C) మన బంధువులలోనే ఉన్న కడుపేద కుటుంబాలకు నేలకు
ఈ రూ.1500/- donate చేస్తే చాలు.
(2) TIME : ఇది చాలా విలువైనది.
మన సమయాన్ని, నెలకు ఒక రోజు మన సమాజములో గడపాలి. SC/ST
Associations వారు పెట్టేసభలు సమావేశాలకు హాజరవ్వాలి. అది
తరువాత తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మన
“Target group” అనేది “దళిత విద్యార్ధులు” అవ్వాలి. TIME
అనే విషయములో మనందరికంటే ఎంతో ధనవంతులు. వారి జీవితాలు చాలా
పెద్దవి.
(3) TALENT : “నేలకు గట్టిగా అణిచివేయబడిన
బంతి ఎక్కువ ఎత్తు ఎగురుతుంది” అనే సూక్తి,
నేటి దళితులకు talent ఎక్కువ అని చెపుతుంది. వీరికి సహజంగానే క్రమశిక్షణ, పెద్దలంటే భయము, శ్రమ చెయ్యగల దేహ ధారుడ్యం ఎక్కువగా ఉంటాయి.
అన్నిటికంటే మించి, "మనుగడ కోసం పోరాటం"
అనే అవసరం. వీటి వలన talent
అనేది కూడా బాగనే ఉంటుంది. ఈ talent ను కూడా మన
సమాజానికి పంచి ఇస్తే, మన యొక్క ఆ talent పెరగడమే కాకుండా.,
మన సమాజం కూడా వృధి చెందుతుంది.
ఈ
Treasure,Time,Talent లను మన సమాజమునకు 5% పంచి ఇస్తే.,
ఆంబేడ్కర్ కలలు కన్న కులరహిత సమాజం ఎంతో దూరాన ఉండదు.
దయచేసి గమనించండి: నా ఈ పోస్ట్, ఈ మాటలు చదువుతున్న వారిని ఉద్దేశించి కాదు. ఈ పోస్ట్ చదివారు
అంటే., మీరు ఇప్పటికే అంబేడ్కర్ చెప్పిన దారిలోనే
ఉన్నారని అర్ధము. ఎందుకంటే., ఈ పోస్ట్ చదివి ఇప్పటికే
అన్నిటికంటే అమూల్యమైన మీ సమయాన్ని payback చేశారని అర్ధం. నేనైతే, రోజుకొక్క సారైనా,
మా అమ్మయి తో, నా వైఫ్ తో
కలిసి అంబేడ్కరిజం గురించి చర్చించుకుంటాము.
కాని రిజర్వేషన్ లో ప్రభుత్వ ఉద్యోగం పొంది., అంబేడ్కర్ అంటే ఎవరో తెలియని మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారికి ఈ పోస్ట్ చేరాలి.
*అవి బాబాసాహెభ్ తన చివరి రచన " Buddha and his Dhamma" రాస్తున్న రోజులు...*
*ఆ సమయం లో బాబాసాహెభ్ అంబేద్కర్ ఢిల్లీ లోని అలీపూర్ రోడ్ లోని 26 నెం.*
*బంగళా లో నివాసం ఉంటుండేవారు.*
*ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత 8గంటల సమయం లో తన రీడింగ్ రూం లో కూర్చొని తన పుస్తకం రాయడం లో నిమగ్నమైపోయాడు.*
*బాబాసాహెభ్ అనుయాయుడు 'నానక్ చంద్ రత్తు' ఆరోజుకి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి, బాబాసాహెభ్ టేబుల్ దగ్గరగా నిలబడి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు.*
*కాసేపటి తర్వాత బాబాసాహెభ్ రత్తూతో "ఇక నువ్వు వెళ్లి పడుకొని పొద్దున్నే రమ్మని చెప్తారు.*
*ఎప్పటిలాగే పొద్దున్న 8 గంటలకి బాబాసాహెభ్ దగ్గరికి వచ్చిన నానక్ చంద్ రత్తూ రాత్రి వెళ్లేటప్పుడు ఎలాగైతే పుస్తక రచన లో నిమగ్నమైన బాబాసాహెభ్ అప్పటికీ కూడా అలాగే కుర్చీలో కూర్చొని పుస్తకాన్ని రాస్తూనే ఉన్నాడు అంటే గత 12 గంటలుగా పుస్తకం రాస్తూనే ఉన్నాడు.*
*నానక్ చంద్ రత్తూ గారు నిశ్శబ్దం గా బాబాసాహెభ్ పక్కనే చూస్తూ నిలబడి పోయాడు.*
*అలా నిలబడి చాలాసమయం గడిచిపోయింది కానీ బాబాసాహెభ్ తలెత్తి చూడను కూడా లేదు...తన పరిసరాలని కూడా గమనించలేనంతగా బాబాసాహెభ్ తన రచనలో నిమగ్నమైపోయారు.*
*బాబాసాహెభ్ దృష్టి మరల్చడానికి నానక్ చంద్ రత్తూ టేబుల్ మీద ఉన్న పుస్తకాలని సర్దుతూ ఉండగా బాబాసాహెభ్ చూసి "రత్తూ నువ్వింకా వెళ్లలేదా" అనగానే కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా బాబాసాహెభ్ కాళ్ళ దగ్గర కూర్చొని* *"అయ్యా...ఉదయం 8:30 అవుతుంది, గత 12 గంటలుగా రాస్తూనే ఉన్నారు...*
*అసలెందుకు ఇంతగా కష్టపడుతున్నారు" అనడం తో బాబాసాహెభ్ "రత్తూ...*
*నా ప్రజలు ఇంకా వెనకబడే ఉన్నారు, ఏ దారిలో నడవాలో స్వంతంగా నిర్ణయాలు తీసుకునేస్థితిలో కూడా లేరు, నేనుచనిపోయిన తర్వాత నా పుస్తకాలే వారికి సరైన దిశానిర్దేశం చేస్తాయి, ప్రతి ఇంటికి నేను వెళ్లలేను కానీ నా సాహిత్యం మాత్రం వెళ్తుంది.*
*నా రచనలు చదివిన వారికి నా ఆలోచనలు అర్థం అవుతాయి, నా సిద్దాంతం, ఆలోచనలు నా పుస్తకాల ద్వారానే తెలుసుకుంటారు...*
*నా ఆలోచనలు అర్థం చేసుకున్న ప్రజలు తమ కర్తవ్యం ఏంటో తెలుసుకొని పని చేస్తారు..*
*అందుకే నేనింత కష్టపడుతున్నాను"*
*(నానక్ చంద్ రత్తూ రచించిన - डॉ. अम्बेडकर - कुछ अनछुए నుండి)*
*బాబాసాహెభ్ రచనలు చదివి, ఆలోచనలు అర్థం చేస్కొని వాటిని సాధించేదిశగా అడుగులేసేవారే నిజమైన అంబేడ్కరిస్టులు...*
*జై భీమ్ జై భారత్*
*ఆ సమయం లో బాబాసాహెభ్ అంబేద్కర్ ఢిల్లీ లోని అలీపూర్ రోడ్ లోని 26 నెం.*
*బంగళా లో నివాసం ఉంటుండేవారు.*
*ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత 8గంటల సమయం లో తన రీడింగ్ రూం లో కూర్చొని తన పుస్తకం రాయడం లో నిమగ్నమైపోయాడు.*
*బాబాసాహెభ్ అనుయాయుడు 'నానక్ చంద్ రత్తు' ఆరోజుకి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి, బాబాసాహెభ్ టేబుల్ దగ్గరగా నిలబడి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు.*
*కాసేపటి తర్వాత బాబాసాహెభ్ రత్తూతో "ఇక నువ్వు వెళ్లి పడుకొని పొద్దున్నే రమ్మని చెప్తారు.*
*ఎప్పటిలాగే పొద్దున్న 8 గంటలకి బాబాసాహెభ్ దగ్గరికి వచ్చిన నానక్ చంద్ రత్తూ రాత్రి వెళ్లేటప్పుడు ఎలాగైతే పుస్తక రచన లో నిమగ్నమైన బాబాసాహెభ్ అప్పటికీ కూడా అలాగే కుర్చీలో కూర్చొని పుస్తకాన్ని రాస్తూనే ఉన్నాడు అంటే గత 12 గంటలుగా పుస్తకం రాస్తూనే ఉన్నాడు.*
*నానక్ చంద్ రత్తూ గారు నిశ్శబ్దం గా బాబాసాహెభ్ పక్కనే చూస్తూ నిలబడి పోయాడు.*
*అలా నిలబడి చాలాసమయం గడిచిపోయింది కానీ బాబాసాహెభ్ తలెత్తి చూడను కూడా లేదు...తన పరిసరాలని కూడా గమనించలేనంతగా బాబాసాహెభ్ తన రచనలో నిమగ్నమైపోయారు.*
*బాబాసాహెభ్ దృష్టి మరల్చడానికి నానక్ చంద్ రత్తూ టేబుల్ మీద ఉన్న పుస్తకాలని సర్దుతూ ఉండగా బాబాసాహెభ్ చూసి "రత్తూ నువ్వింకా వెళ్లలేదా" అనగానే కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా బాబాసాహెభ్ కాళ్ళ దగ్గర కూర్చొని* *"అయ్యా...ఉదయం 8:30 అవుతుంది, గత 12 గంటలుగా రాస్తూనే ఉన్నారు...*
*అసలెందుకు ఇంతగా కష్టపడుతున్నారు" అనడం తో బాబాసాహెభ్ "రత్తూ...*
*నా ప్రజలు ఇంకా వెనకబడే ఉన్నారు, ఏ దారిలో నడవాలో స్వంతంగా నిర్ణయాలు తీసుకునేస్థితిలో కూడా లేరు, నేనుచనిపోయిన తర్వాత నా పుస్తకాలే వారికి సరైన దిశానిర్దేశం చేస్తాయి, ప్రతి ఇంటికి నేను వెళ్లలేను కానీ నా సాహిత్యం మాత్రం వెళ్తుంది.*
*నా రచనలు చదివిన వారికి నా ఆలోచనలు అర్థం అవుతాయి, నా సిద్దాంతం, ఆలోచనలు నా పుస్తకాల ద్వారానే తెలుసుకుంటారు...*
*నా ఆలోచనలు అర్థం చేసుకున్న ప్రజలు తమ కర్తవ్యం ఏంటో తెలుసుకొని పని చేస్తారు..*
*అందుకే నేనింత కష్టపడుతున్నాను"*
*(నానక్ చంద్ రత్తూ రచించిన - डॉ. अम्बेडकर - कुछ अनछुए నుండి)*
*బాబాసాహెభ్ రచనలు చదివి, ఆలోచనలు అర్థం చేస్కొని వాటిని సాధించేదిశగా అడుగులేసేవారే నిజమైన అంబేడ్కరిస్టులు...*
*జై భీమ్ జై భారత్*
సౌ జ
న్య o - whatup
message