1 ప్రశ్న :-. కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు
కోల్పోతారు?
జవాబు :- కరోనా మన శరీరం లో ప్రవేసంచాక అది మన
శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.
మన శరీరం లో proteins, amino acids..
Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు.
Glycin వెన్నెముక నుంచి
మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది.
అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది.
అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin
లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు.
2వ ప్రశ్న :-. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?
జవాబు:- శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు.
మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం
కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా
మన శరీరం కరోనా తో పోరాడ గలదు.
3వ ప్రశ్న:-. Glycin ఎలా తయారవుతుంది?
జవాబు:+ Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm
వరకు తీసుకోవాలి.
Glycin కి ఉపయెాగ పడేవి
1. తోటకూర
2. . ఆవాలు
3. నువ్వులు
పోషకాహారాలు
4. కరివేపాకు
5. మునగాకు
సి విటమిన్
6. నిమ్మ
7. ఉసిరి
వీటి ద్వారా proteins Amino Acids తయారవుతాయి. వీటి ద్వారావెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే Glycin తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్ ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి
వస్తుంది. కాబట్టి
పైన చెప్పిన పదార్దములు ప్రతి రోజు తినడం ద్వారా కరోనా
నుంచి మనల్ని మనం కాపాడుకో
గలం.
-------------------------------------
భాగ్యనగరి వచ్చి బాగు పడతమని
బయలుదేరె జనము బాట బట్టి
మాయదారి జబ్బు మాయ మాయగ రాగ
ఆగమాగమాయె ఆశలన్ని
దారులన్ని మూసె దా రితెన్ను యు లేదు
దరువు చెడ్డ మనసు దరిని జేర్చ
దయ గలిగిన వారు దారిచూపుదురని
ధీరులైనజనముదీను లైరి
యెట్లు పోదు మనచు యేడ వుందు మనచు
ఏడ్చె చుండె జనము ఎదలు పగిలి
వలస జీవి ఆశ వడగండ్ల పాలయె
మాన్యులార వినుడి మధుర వాక్కు
పిల్ల పాపలంత పల్లెల నుండగ
ముసలి తల్లి కింత ముద్ద లేదు
దయ గలిగిన వారు దారిచూపు తురంచు
ధీరులైనజనులు దీనులైరి
కట్ల మధుసూదన్ - తెలుగు పండిట్
-------------------------
*ప్రణామాలు*
దిగులో ... బాధో
ఎదో తెలియని
వెలితి మనసంతా...
రహదారులపై
రివ్వు రివ్వున
పరుగెత్తే వాహన
రొదల స్థానంలో
వలస కూలీల
రోదనల ఆక్రమణలు
చూసినప్పుడల్లా...
మలమల మండే ఎండల్లో
చంకనున్న చంటిపిల్లల్ని
చూసినప్పుడల్లా...
పాలైనా తాగుతున్నారో
లేదో ఈ పసికూనలు
అని తలచినప్పుడల్లా....
ఆపుకోలేని పూనకం...
రైలు పట్టాలు నడుమ
మొనదేలిన కంకరరాళ్ల
పైన పగులిచ్చిన
కాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా
గుండెల్లో ముల్లు
కదులుతున్న భావన..
ఉన్న చోట ఉండలేక
కడుపునిండే జాడ
తెలీక పరిగెత్తే
ఆశా వాదుల
ప్రయాణానికి
నిర్వచనం చెప్పలేక
తల్లడిల్లే భావన
మనసంతా...
ఎంత చెప్పినా
ఏమిచేసినా
తక్కువేననిపించే
కష్టానికి...
కబళించే కాలానికి
కరుణ కరువైన
లోకాన్ని చూడలేక
చూస్తూ.....
చేతులెత్తి మొక్కుతున్నా
వలస కూలీలకు
క్షమించడమ్మా...
మీ కష్టం మానవాళి
సౌఖ్య ప్రతిరూపం...
మీ దైన్యజీవితం
పాలకుల
నిర్లక్ష్యానికి
సంకేతం....
73 ఏళ్ళ స్వతంత్రభారతిలో
రెండు నెలల లాక్డవున్ కే
చేతులెత్తేసిన డొల్లతనాన్ని
చుస్తున్నప్పుడల్లా
కట్టలుతెంచుకుంటున్న
ఆవేశం....
ఇంత కష్టంలోను
బావిభారతాన్ని
చంకనెత్తుకుని
పరుగెడుతున్న
మీ ఆశావాద పయనానికి
మరోమారు
ప్రణమిల్లుతున్నానమ్మ..
🙏
గోలి మధు..13.5.20
మానవ వికాస మండలి
9989186883
---------------------------
చెప్పుల్లేని కాళ్లతో,
భుజాలపై బరువుల్తో,
జారిపోయిన గుండెల్తో,
కారిపోతున్న నెత్తుటితో,
దేశం "నడుస్తుంది".
ఆ రోడ్లపై
ఈ ఎండలో
అన్నం లేక
పసి నోళ్ళకి
పాలు లేక,
ఆగే దిక్కు లేక
అడిగే హక్కూ లేక
ముక్కుకుంటూ
మూలుగుతూ
బతుకేదో
చావేదో
తేడా తెలియక,
పట్టాలపై
అలసి
సొలసి
నిద్రపోతూ,
నిద్ర నటిస్తున్న
మీ కళ్ళ సాక్షిగా
ఆ వలస దేహం
చావై నడుస్తుంది.
విజయ్ మాల్యా కు, రాయపాటి కి, రాందేవ్ బాబా లకు వేల కోట్లు మాఫీ చేస్తారు..
కానీ మట్టి పిసికి సంపద సృష్టిస్తున్న శ్రామిక జీవులను మాత్రం గాలికి
వదిలేసారు.
దేశం "నడుస్తుంది"
దేశం "నడుస్తుంది"
అవును "నా దేశం నడుస్తూంది"!!
No comments:
Post a Comment