Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

ఓ నాగ భక్తులారా, మా పాముల బాద వినండి !

మాకు మీ పాలూ, పలహారాలు వద్దు !! అవి మేము అరిగించుకోలేమండీ !!!
"""""""""""""""""""""""""""""""""""""

మీరు మాకు బలవంతంగా పాలుపోస్తే అవి అరగక మేము చేస్తాం !! దయచేసి మాకు పాలు పోయకండి, పలహారం వేయకండి మీ ఆహారాన్ని మీరే వృధా చేయకండి ప్లజ్ !!!

మీ జొన్న పేలాలూ, ఇతర ప్రసాదాలు మీము తినలేము. మాంసాహారమే మాకు ఇష్టమైన ఆహారం. ఎలుకలు, కప్పలు, ఉడతలు, తొండలు వగైరా చిన్న చిన్న జంతువులను మింగేస్తాం..

మీరు మా పై వేసే పసుపు కుంకాలు మాకు డస్ట్ ఎలర్జీని కలిగిస్తాయి.. వాటితో కలకలిసి పోయిన గాలిని పీలుస్తే మేము ఊపిరాడక చేస్తాం. అందుకే మాపై పసుపు కుంకాలు వేయకండి..

మేను పాలు తాగము.. పాలను నోటితో పీల్చుకోవడం మాకు రాదు.
పాలు తాగడం మా సహజ లక్షణం కాదని మీకు  తెలుసా ? మాకు ద్రవపదార్థాలను పీల్చుకునే దవడల నిర్మాణం మా నోటిలో ఉండదు..

మీరు మాకు బలవంతంగా పాలు పట్టిస్తే ఆ పాలు మా పొట్టలోకి పోయి, అవి అరగక మేము ఎంతో భాదను అనుభవిస్తూ విల విలలాడుతూ చచ్చిపోతామనీ మీకు తెలుసా ?

మీరనుకోవచ్చు...
సినిమాల్లో, సీరియల్స్ లో పాములు పాలు తాగుతాయి కదా అని.. కానీ అదంతా గ్రాఫిక్స్ మాయాజలం.. కెమెరా టెక్నిక్స్..

అంతెందుకు..
పాముల వాడు దగ్గర ఉండే మా పాము సోదరులకు మీ మెప్పు కోసం వాడు మాకు పాలు బలవంతంగా పోస్తాడు. కాని మాకు మేముగా పాలు పీల్చుకోము, తాగము.

ఎక్కడో అడవుల్లో, పుట్టల్లో, కలుగుల్లో ఎలుకలు, కప్పలు, గుడ్లు తిని హాయిగా నివసించే మిమ్మల్ని పాలు పోసి, పలహారాలు వేసి,  ఇలా పండగల పేరుతో మిమ్మల్ని  హించడం మీకు భావ్యమా ?

అసలు మమ్మల్ని శివుడి మెడలో వేసిందెవరో తెలియదు గాని, ఆ రోజు నుండి మా చావుకొచ్చింది. మమ్మల్ని మీరు పూజల పేరుతో హింసంచడం చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి మాది..

మాకు తెలియక అడుగుతున్నాము, మీరందరూ మమ్మల్ని దేవతలుగా కొలుస్తూ, మా పైన కొత్త కొత్త సీరియల్స్, సినిమాలు తీస్తారు ! చాలా గొప్పగా చిత్రీకరిస్తారు !!

కానీ పొరపాటున ఎక్కడైనా మీ ఇంటి పరిసరాల్లో మాలో ఏ ఒక్కరు కనిపించినా చంపే వరకు వదిలిపెట్టరు కదా !

అలా ఎందుకని చేస్తారు ?
అసలు మీరు మాకు నిజమైన భక్తులేనా ?
లేక మాకు భయపడి ఉత్తిత్తి భక్తులుగా నటిస్తున్నారా ?

మీకు ఇంకో విషయం తెలుసా ? మాకు ఎవ్వరినీ పగబట్టే స్వభావం అసలు లేదు.. మా మెదడు మా ఇల్లునే గుర్తు పెట్టకోదు.. ఇక మిమ్మల్నేం గుర్తుంచుకుంటాం మరి ? ఇదంతా మా జాతి పైన ఎవరో అల్లిన కట్టుకథ.. మేం పగబట్టేది లేదు, వెంటబడి ఎవర్నీ చంపేది లేదు ! మా (పాము) పగ అబద్ధం నమ్మకండి !

పాముల వాడు ఊదే నాగస్వరానికి మేము నాట్యం చేయడం అనేది కూడా అబద్దమే ! ఎందుకంటే వాడు ఊదే నాగస్వరం మాకు ఏమాత్రం వినపడదు, మాకు బండ చెవుడు !

అసలు ఏదైనా వినడానికి మాకు చెవులుంటే కదా ? పాముల వాడు, వాడి బూరతో మపై ఏ వైపు నుండి దాడి చేస్తాడోనని భయపడి చస్తూ మేము అటూ ఇటూ ఊగుతుంటే దాన్నే మీరు మేం నాట్యం చేస్తున్నాం అని అనుకుంటారు.

ఇక చివరగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ ప్రకృతిలో మీకు జీవించే హక్కు ఎంతైతే ఉందో, అంతే హక్కు మాకు కూడా ఉంది. ఈ రోజు మాకు పాలు పోసి తమ భక్తిని ప్రదర్శించే వాళ్ళలో గొప్ప చదువులు చదువుకున్న టీచర్లు, డాక్టర్లు, సైంటిస్ట్ లు మొదలైన వారు ఉన్నారు.

మీ అందరికీ మేము చెప్పేది ఒక్కటే పాలు పోసి మమ్మల్ని చిత్ర హింసలకు గురిచేయకండి.
మీ భావితరాలకు మా గురించి, మా మనుగడ గురించి, మా వల్ల కలిగే పర్యావరణ సమతుల్యత గురించి గొప్పగా అర్థమయ్యే విధంగా చెప్పండి చాలు.

అదే విధంగా మేము పొరపాటున మీ పరిసరాల వైపు వస్తే చంపకుండా, మమ్మల్ని ప్రాణాలతో మాకు అనువైన ప్రదేశాలలో వదిలేసి మీకు మా పట్ల ఉన్న నిజమైన భక్తిని, ప్రేమను చాటు కొండి !

మీ మనుషుల మధ్య బ్రతుకుతున్నందుకు గర్వంగా భావించే రోజు ఒకటి వస్తుందని మేము గర్వంగా చెప్పుకునేలా మీరు ప్రవర్తిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.. !

ఇట్లు
సమస్త నాగజాతి.

పండగల పేరుతో జీవ హింస చేయడం ఒక అమానవీయ చర్య. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా జనాల్లో ఒక మంచి అవగాహన కల్పించటం కోసం మీరంతా నాకు తోడుగా ఉంటారనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ..
--- చెలిమెల రాజేశ్వర్, జేవీవీ, తెలంగాణ.