Pages

ఆల్ ది బెస్ట్..

ఆమీర్‌పేట సత్యం థియేటర్ రోడ్‌లో చేతిలో బుక్ పట్టుకుని వెళ్తున్నాడో కుర్రాడు..


అన్నా, వదినల దగ్గరో, బంధువుల ఇంట్లోనో.. హాస్టల్‌లోనో ఉంటూ పొద్దున్నే లేచి ఆకలి వేస్తున్నా టిఫిన్ తినకుండా ఓ టీ తాగి క్లాసుకెళ్తున్నాడు..


ఇంజనీరింగ్ నాలుగేళ్లు ఎలా గడిచిపోయిందో తెలీదు.. ఇప్పుడు చూస్తే భవిష్యత్ అంతా కన్‌ఫ్యూజ్డ్‌గా గడుస్తోంది. ఖర్చులకు డబ్బు కావాలని ఇంటికి ఫోన్ చేయాలంటే సిగ్గేస్తోంది... కానీ తప్పదు!


ఎన్నాళ్లని ఇలా.. ఏ ఉద్యోగం లేకుండా? నాలుగేళ్లు ఇంజనీరింగ్‌లో క్లాసుల్లో సరిగ్గా చెప్పింది ఏమీ లేదు.. ఫ్రెండ్స్ అంతా సరదాగా గడిపేస్తూ తాను చదివిందీ పెద్దగా లేదు. ఇప్పుడు అంతా క్వశ్చన్‌మార్క్. దగ్గరకు తీసుకుని కొద్దిగా ధైర్యం చెప్పే వారు ఉండరు. ఏ చీకట్లోనో అపార్ట్‌మెంట్ పైన ఓ మూలన కూర్చుని ఆకాశంలోకి చూస్తుంటే కళ్లమ్మట చుక్కలు రాలుతున్నా వాటిని తుడిచే వారు ఉండరు. 


అసలు ఎంతమంది యువత ఇలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో ఎంతమందికి తెలుసు?

ఎంతవరకూ మన అస్థిత్వం, మన రాజకీయాలు, మన వివాదాలూ.. యువతని తమ చుట్టూ తిప్పుకుని గొప్పలు పోయే వాళ్లే కానీ వారి భవిష్యత్ గురించి ఆలోచించే నాయకులు ఎంతమంది? సరిగా చదువుకోమనీ, కష్టపడమనీ, స్కిల్క్ డెవలప్ చేసుకోమని, ఆ పాత్‌లో వెళ్లమనీ, అక్కడ తెలిసిన రిఫరెన్స్ ఉందనీ.. ఇలా నిరంతరం అండగా ఉండే వాళ్లెవ్వరు?


ఈ దేశానికి ఉన్న ఒకే ఒక ఆశ యువత. కానీ ఆ యువతకి ఇప్పుడు మంచి చెప్పే వారు లేరు. యూట్యూబ్‌ల నిండా గంటల తరబడి వీడియోలు చూసుకుంటూ, Facebook, Whatsappలలో గంటలు గడిపేస్తూ అసలు లైఫ్ ఏంటో తెలీకుండా టైమ్‌పాస్ చేసేస్తున్నారు. ఇది కాదు జీవితం.. ఓ లక్ష్యం ఉండాలి, పట్టుదలగా కష్టపడాలి. ప్లానింగ్, టైమ్ మేనేజ్మెంట్ ఉండాలి. చూస్తున్నారుగా మాబోటి వాళ్లం పనికిమాలిన వివాదాల్లో టైమ్ వేస్ట్ చేస్తుంటాం. మమ్మల్ని కాదు ఆదర్శంగా తీసుకోవలసింది.. స్వామి వివేకానందలను, అబ్ధుల్ కలాంలను తీసుకోండి. సాధించండి.. మీరు అకడమిక్ టైమ్‌లో ఏం నేర్చుకోలేకపోవచ్చు.. ఈరోజు మొదలుపెట్టండి.. Youtube appలో హిస్టరీ క్లియర్ చేసి, దాన్ని డిసేబుల్ చేసి చెత్త వీడియోలకు దూరంగా ఉండండి.. మీ సబ్జెక్ట్‌కి చెందిన ఎడ్యుకేషనల్ వీడియోలు చూడడం మొదలుపెట్టండి. మీరు ఎంత సబ్జెక్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అంత గొప్ప జీవితం మీ ముందుంటుంది..


భవిష్యత్‌ని తలుచుకుని ఈరోజు నీ కళ్లమ్మట నీళ్లు రావచ్చు.. కానీ ఒక్కటి చెప్తున్నా విను... నువ్వు కష్టపడడం మొదలెడితే నీ గుండెల్లో ఎంత ధైర్యం వస్తుందో, అన్నీ నీ వెంట ఎలా వస్తాయో నువ్వే ఆ కన్నీళ్లు పెట్టుకున్న కళ్లతోనే స్వయంగా చూస్తావు. ఆల్ ది బెస్ట్.. నీ విజయాన్ని సదా కోరుకుంటూ..

Unknown well wisher..



No comments: