Pages

జలుబు - వైరస్

ప్రశ్న:మనకు జలుబు ఎలావస్తుంది?

వేర్వేరు ప్రాంతాల నీరు తాగడం వల్ల జలుబు చేస్తుందంటారు నిజమా?

జవాబు : భూమ్మీద సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట నిర్జీవ పదార్థాల నుంచి జీవ పదార్థాల్లో కీలక రసాయనిక ధాతువైనRNA  లేదా DNA లు రూపొందాయి.
 RNA లేదా DNA ల కున్న అణు నిర్మాణం రీత్యా, రసాయనిక ధర్మాల రీత్యా ప్రకృతిలో ఉన్న పొడవాటి తైల అణువులయిన ఫాటీ ఆమ్లాల గోడల మధ్య చిక్కుకుపోగలిగాయి.

 ఇలా సొంతంగా క్రమానుగతంగా పొర (Self Assembled Monolayer)   లాగా నూనె అణువులు పొరలాగా పేరుకుపోయాక ఆ సంచిలో RNA లేదా DNA అణువులు చేతిసంచిలో పూసలదండలాగా కణాలుగా మారాయి.

ఈ కణాలకు తమ జాతిని తమంత తాముగా గానీ పరస్పర సంపర్కం ద్వారాగానీ ప్రత్యుత్పత్తిని పొందించే లక్షణాలు లేవు.

 మరోమాటలో చెప్పాలంటే

జీవ అణువులయిన DNA  లేదా RNA లనే నిర్జీవ పదార్థాన్ని మరో జీవ అణు లక్షణాలున్న నిర్జీవ తైల పొరలో చిక్కుకున్న నిర్జీవ కణాలుగా వీటిని భావించాలి.

వీటినే వైరస్‌ కణాలు అంటారు.

 ఈ భూమ్మీద మొట్టమొదటి జీవాధార కణాలుగా, లేదా జీవకణాలకు ముడి పదార్థాలుగా వైరస్‌లను పేర్కొనవచ్చును.

భూమ్మీద గాలిలో, నేలలో, నీటిలో, ఎక్కడబడితే అక్కడ సుమారు 450 కోట్ల సంవత్సరాల నుంచి నేటి వరకూ వైరస్‌లు ఉన్నా వాటిలో ఉన్న RNA లేదా DNA (అరుదుగా)లో ఉన్న జన్యుస్మృతి (Genetic Code) ఆధారంగా కొన్ని కోట్ల రకాలుగా అవి ఉన్నా వాటి ప్రస్తావన వేదాల్లోగానీ, ఉపనిషత్తుల్లోగానీ లేదు.

పురాణ గ్రంథాలు, మత గ్రంథాల్లో వీటి మాట కూడా లేదు.

 కేవలం 19 శతాబ్దం చివరి దశకాల్లో మాత్రమే మానవ శారీరక, మేధో శ్రమల ఆధారంగా నిర్మించబడ్డ సూక్ష్మ దర్శనుల వాడకం అమల్లోకి వచ్చాకే వీటి గురించిన ఉనికి బయటపడింది.

1892 ప్రాంతంలో రష్యా శాస్త్రవేత్త డిమిట్రి ఇవనోవస్కీ (Dimitri Ivanovsky), 1898లో నెదర్లాండ్‌ శాస్త్రవేత్త మార్టినస్‌ బెజిరింక్‌  (Martinus Beijerinek) లు చేసిన అద్భుత పరిశోధనల ఫలితంగా వైరస్‌ల ఉనికి ఆవిష్కృతమయింది.

మానవాళి తరతరాలుగా ఎదుర్కొన్న లేదా ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులకు కారణం వైరస్‌లని తెలిపిన పై శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి రాకపోవడం వెనుక అమెరికా రాజకీయాలేననడంలో సందేహం లేదు. అది వేరే విషయం.

వైరస్‌లు తమంత తాముగా ప్రత్యుత్పత్తి చేసుకోలేకపోయినా జీవ కణాల మీద దాడి చేసి ఆ జీవకణాలను తమ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చుకొని తమలాంటి వైరస్‌లను రూపొందిస్తాయి.

 వైరస్‌ల దాడికి 'కాదే కణమూ అనర్హం' అనవచ్చు.

 వృక్ష కణాలైనా, బాక్టీరియా కణమైనా, అమీబా లాంటి ఏక కణాలయినా,
జంతువులు, మనుషులు తేడాలేకుండా సాధారణ జీవ కణం ఏదైనా

వాటి మీద యాదృచ్ఛికంగా వాలినప్పుడు ఆయా వైరస్‌లలో ఉన్న RNA జన్యుస్మృతికి అనుగుణంగా m-RNA ను తయారు చేస్తాయి.

 m-RNA నిర్దేశిత దర్శకత్వంలో ప్రొటీన్లు కణంలో తయారు కావడం వల్ల అవి తిరిగి వైరస్‌లో ఉన్న RNA ను తిరిగి ఉత్పత్తి చేస్తాయి.

తద్వారా సాధారణ జీవకణం తన ధర్మాన్ని కోల్పోయి వైరస్‌ కణాల్ని సృష్టించే కర్మాగారంగా మారిపోతుంది.

 ఇలా మన శరీరంలోగానీ, కొన్ని అవయవాల్లోగానీ ఇలాంటి వైరస్‌లు పుంఖానుపుంఖాలుగా పెరిగి శరీరాన్ని

అతలాకుతలం చేస్తాయి.
కానీ ఆ వైరస్‌ల కణాలు మన కణాల్లాంటివి కాదు కాబట్టి వాటిని తుదముట్టించడానికి మన శరీరంలో ఉన్న తెల్లరక్త కణాలు వాటి మీద దాడి చేస్తాయి.

ఎవరిది గెలుపయితే మరణమో, కుదుటపడటమో నిర్థారణ అవుతుంది.

చాలా వ్యాధులకు కారణమైన వైరస్‌లను ఆదిలోనే తుదముట్టించడానికి ఎన్నో విధాలయిన టీకాలను వైద్యరంగం ప్రస్తుతం వాడుతోంది.

అందువల్లనే నేడు ప్లేగు, మశూచి, పోలియో, కోరింత దగ్గు, హైపటైటిస్‌, ఇన్‌ఫ్లూయెంజా, డెంగూ, న్యుమోనియా, మెలింజిటిస్‌, చికున్‌గునియా, ర్యాబీస్‌ మొదలయిన ఎన్నో వ్యాధులకు చికిత్స లభిస్తోంది.

మీరు ప్రస్తావించిన సాధారణ జలుబు కూడా రైనో వైరస్‌ల వల్ల వస్తుంది.

జలుబునకు ఎన్నో విధాలయిన వైరస్‌లు కారణమైనా రైనో వైరస్‌లదే ప్రధాన విజయం.

హెచ్‌ఐవి వైరస్‌ను మానవ సృష్టిగా జీవాయుధాల  (Biological Arms) ఉత్పత్తిలో భాగంగానే అమెరికా ప్రయోగశాలల్లో కృత్రిమ ఉత్పాదకతకు ఉదాహరణగా పేర్కొంటారు.

జలుబుకు టీకాలు లేవు,
 హెచ్‌ఐవికి కూడా టీకాలు లేవు.

 జలుబును కలిగించే వైరస్‌ వల్ల మరణం రాదు.

అయినా అది చేసే ఇబ్బంది అంతా ఇంతా కాదు.

సాధారణంగా మలినగ్రస్తమైన
గాలి ద్వారా, నీటి ద్వారా, జలుబుతో బాధపడుతున్న వ్యక్తికి దగ్గరగా ఉన్నపుడు
రెనో వైరస్‌ మన శరీరంలోకి వెళుతుంది.
దగ్గు, ముక్కులో అదేపనిగా చీమిడి కారణం(running nose),
గొంతు బొంగురు పోవడం, తుమ్ములు,
తలనొప్పి, జ్వరం, కళ్లు కారడం వంటి లక్షణాలు జలుబు తీవ్ర స్థాయిలో
ఉంటే కలిగే లక్షణాలు.
 ప్రకటనల్లో చెప్పినట్లు ఏ మందు వాడినా,
ఏ లేహ్యం తీసుకున్నా, ఏ లేపనం వాడినా జలుబు తగ్గదు.
 శరీరంలో రక్షణ కణాలయిన తెల్ల రక్త కణాలే వీర మరణం పొంది మనల్ని జలుబునుంచి విముక్తి చేస్తాయి.
అందుకే జనవిజ్ఞాన వేదికలో కృషి చేస్తున్న వైద్య నాయకులు ఒక మాటంటారు-

 'మందులు వేసుకొంటే జలుబు వారంలో తగ్గుతుంది.

వేసుకోకుంటే ఏడురోజులలో తగ్గుతుంది"
కాచి వడపోసిన నీరును, రక్షిత మంచినీటిని తాగడం,
జలుబుతో ఉన్న వ్యక్తికి కాస్త దూరంగా వుండడం,
శుభ్రమైన వాతావరణంలో ఉండడం
జలుబు నివారణకు మంచి బిపరిష్కార చికిత్సా పద్ధతులు.

ప్రొఫెసర్‌

ఎ. రామచంద్రయ్య

సంపాదకులు, చెకుముకి,
జనవిజ్ఞాన వేదిక