Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

అంతర్జాతీయ మహిళా దినోత్సవం


మిత్రులందరికీ నమస్కారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే whatsup , facebook లలో పోస్ట్
చేయుటకు ఒక అవకాశం వచ్చిందని

పోస్టు మీద పోస్టు పెడుతున్న మిత్రులారా ఒక్కసారీ  గమనించంచండి.

- వృధాప్యంలో ఉన్న తల్లిని ఆదరించి ఆమె మాటకు మనం విలువనిస్తున్నమా ?

- ఇంట్లో ఉన్న భార్యను కేవలం పిల్లలను కానీ పెంచి, ఇంట్లొ పని చేసే పనిమనిషిగా కాక
మనలో ఎంతమంది స్త్రీ కి ఆర్థిక స్వేచ్ఛ ఇష్టమైన రీతిగా బ్రతికే స్వేచ్ఛ ఇస్తున్నాం?

- మన ఇంట్లొ ఉన్న ఆడ బిడ్డలను కొడుకులతో సమానంగా అన్నిరకాలుగా
ప్రాధాన్యం ఇస్తున్నామా?

తల్లినేమో అమ్మ నీకేం తెల్వదని,
భార్యనేమో బయట ప్రపంచానికి దూరం పెట్టి ,
ఆడపిల్లనేమో మగాడిలా నీకెందుకని అనుక్షణం చిన్న చూపు చూస్తూ ఒక్క
మహిలా దినోత్సవం రోజు పోస్టు లు పెట్టగానే
ఎక్కడో ఉన్న మహిళలు సంతోషిస్తారేమో కానీ ని చుట్టూ ఉన్న మహిళలు
మాత్రం క్షోభ అనుభవిస్తారు.

పురుష మిత్రులారా ఒక ఈరోజే మహిళల దినోత్సవం కాదు ప్రతీరోజు ప్రతీ
స్త్రీ పురుషుడిలాగా పుట్టిననాడే సంతోషించే రొజు వచ్చేదాకా వెన్నంటి నిలబడండి.
అదే మనం స్త్రీ జాతికి ఇచ్చే కానుక.

మహిళలందరికి , మహిళలను విజయపధంలో నడిపిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు.

    1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులతో సమానంగాఅన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతోంది. మహిళలకు మాత్రం ఇంకా సమానత్వం సిద్ధించలేదు.

గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది.

భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం దేశంలోని పౌరులందరికీ సమన అవకాశాలను కల్పించింది. ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2015 చివర్లో వెలువడిన నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు.

ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. ముఖ్యంగా రాజకీయ, ఆర్ధిక రంగాల్లో ఈ తేడా అత్యధికంగా కనిపిస్తోంది.

భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే. ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది.

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు..

స్త్రీ'.. అంటే ఓ చైతన్యం.
అతివ.. అంటే ఓ అపూర్వం. పడతి.. అంటే ఓ ప్రగతి.
అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం చుడుతున్న మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు.

సౌ జ న్య  o - whatup message