1,2,3,5,7,8,9
పదిలోపు ఏడు ర్యాంకులు
వందలోపు 50 ర్యాంకులు
వెయ్యిలోపు 700 ర్యాంకులు
ఏవిరా.. ఎక్కడ?
మీరిచ్చే ర్యాంకుల చిట్టా.. జనరల్ కేటగిరిలోనా? రిజర్వేషన్లు ఉండే ఇతర కేటగిరీల్లోనా?
ఇవి చూపించి.. మల విసర్జన సమస్యలున్న వాళ్లతో వాయిస్ చెప్పించి.. నానా పబ్లిసిటీ ఇచ్చుకుని.. మీ కాలేజీల్లోకి లాగుతున్నారు కదరా?
మరి ఏవి? అందరికీ ర్యాంకులు రావేంటి?
వస్తే.. నీట్ లో ర్యాంక్ రాలేదని ఆ అమ్మాయి అంతెత్తు బిల్డింగ్ మీద నుంచి ఎలా దూకేసింది?
అంటే మీ మొత్తం బ్రాంచీల్లో పది, 15వేల మంది చేరితే, ర్యాంకులు వచ్చే ఏ పాతిక మందినో ముందుకు తెస్తున్నారు. మరి మిగతా వాళ్ల మాటేంటి? వాళ్ల దగ్గర కూడా ఫీజులు లాగుతున్నారు కదా?
బాగా చదివేవాడు ఎక్కడున్నా ర్యాంకులు కొడతాడు. ఆ విషయం బుర్రలో గుజ్జులేని కొందరు తల్లిదండ్రులకు తెలిసి చావదు.
అయినా కూడా పేరెంట్స్ మెదళ్లు వాచిపోయేలా యాడ్స్ ఇచ్చి, మీ కార్ఖానాలో వాళ్ల పిల్లల్ని తెచ్చి పడేసేలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
మీరు మాత్రం ర్యాంకులు తెచ్చుకునే ప్రతిభ ఉన్న ఓ వందమందిని ముందుగానే సెలక్ట్ చేసి.. కళ్లలో నరాలు చిట్లి పోయేలా, కళ్లకు భూతద్ధాలు వచ్చేలా గంటలకు గంటలు పుస్తకాలకు అంకితం చేసి భూతవైద్యం చేస్తున్నారు.
వస్తాయ్.. ఎందుకు రావు.. ఆ వందమందికి అటూ ఇటుగా మంచి ర్యాంకులే వస్తాయ్. వాడికి లోకం అంటే ఆ నాలుగు పుస్తకాలే.. లౌక్యం అంటే ర్యాంకులే అనేలా చేపను రుద్దినట్టు రుద్ది ట్రైనింగ్ ఇస్తుంటే ర్యాంకులు రాక చస్తాయా?
ఎలాగూ మీ చేతివాటం ఉండనే ఉంటుంది.
మరి ర్యాంకులు రాకుండా వేలల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి?
మీ రుద్దుడికి, మీ బాదుడికి.. ర్యాంకు లేకపోతే జీవితమే లేదనిపిస్తున్నారు కదరా?
వాళ్ల చావులకు పరోక్ష కారణం మీరు కాదా?
పేపర్లలో మీరిస్తున్న యాడ్స్ కయ్యే లక్షల ఖర్చు.. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం చిందిస్తే వచ్చిన డబ్బు కాదా?
ఏం చేయాల్రా మిమ్మల్ని.
మొత్తం ఏడాదిలో మీ స్ట్రెంత్ ఎంత? ర్యాంకులు వచ్చిన వాళ్లు ఎంతమంది? మీరు వసూలు చేసిన ఫీజులు ఎంత?
మీకు మిగిలిన లాభాలెన్ని? ర్యాంకులు రాక చచ్చిపోయిన మీ విద్యార్థులు ఎంతమంది? లెక్కలు బయటపెట్టే దమ్ముందా?
చంపేయండ్రా.. చంపేయండి.
మీ స్కూళ్లు, కాలేజీలు లేకపోతే చదువేలేదని, ర్యాంకులు రాకపోతే బతుకే లేదని బెదిరించి, భయపెట్టి , ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి విద్యార్థుల్ని చంపేయండి.
తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న మీకు, డ్రాకులాలకు.. రూపంలో తప్ప ఇంకా ఏమైనా తేడా ఉందా?
అసలు మూడు పూటలా తిండి ఎలా వంటబడుతోందిరా?
లక్షలు కోట్లు ఫీజులు వసూలు చేసి.. చివరికి విద్యార్థుల చావుకు పరోక్ష కారణం అవుతున్న మిమ్మల్ని ఎవడూ ఏమీ పీకలేడని ధైర్యం. మాకు తెలుసు.
ప్రభుత్వాలు మీ తొత్తులు
నాయకులు మీకు బానిసలు
ఈ ఇయర్ నీట్ లో సీట్ రాక ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో పూర్తిగా లెక్క తెలీదుగానీ.. వాళ్లవి ముమ్మాటికీ ఈ విద్యావ్యవస్థ, ఈ కార్పొరేట్ (చై.. నా..) కాలేజీలు చేసిన హత్యే అనాలి. పట్టించుకోని ప్రభుత్వాలు ఆయుధాలు అందించాయని చెప్పాలి
ఒకప్పుడు స్కూల్ అంటే మూడన్నరేళ్లకు మొదలయ్యేది
ఇప్పుడు ప్రీ నర్సరీ అంట. అంటే ఏడాదిన్నరకే ప్లే స్కూళ్ల నిర్వాహకులు గద్దల్లా వాలిపోతున్నారు.
అసలు పిల్లల్ని కంటోంది ఆ స్కూళ్ల కోసం.. సంపాదిస్తోంది ఈ కాలేజీల కోసమేనా?
ఇక బతకొద్దా?
ఏం.. ర్యాంక్ రాకపోతే బతకులేదా?
పదో తరగతిలో ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వాడు.. ఆ తర్వాత ఎక్కడా ఏ పేపర్లో ఎందుకు కనిపించడు?
ఇంటర్ లో టాపర్.. మళ్లీ ఎక్కడైనా టాపర్ గా కనిపిస్తున్నాడా?
ఎంసెట్ లో, నీట్ లో క్వాలిఫై కానివాడు.. లైఫ్ లో వేరే గోల్ కి పనికిరాడా?
సంపాదించడం లేదా? మంచి హోదాల్లో లేరా?
అసలు వందేళ్లుగా ఏ .. చై.. నా.. బ్యాచ్ ఉందని.. సర్వేపల్లి, కలాం లాంటి వాళ్లు ప్రముఖలయ్యారు?
చై.. నా.. లేకముందు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, డాక్టర్లు, ఇంజినీర్లు పుట్టుకురాలేదా?
ప్రస్తుతం సమాజానికి కావల్సింది.. ఉద్యోగాలకు, వ్యాపారాలకు కావల్సింది కమ్యూనికేషన్, స్కిల్, పాషన్ ఉన్న వ్యక్తులు. దానికి ప్రతీ ఒక్కడూ 90 పర్సెంట్ మార్కులు కొట్టాల్సిన పని, ర్యాంకులు సాధించాల్సిన పనీ లేదు.
………………………….
ఆ అమ్మాయి చావుకు భయపడలేదు..
ర్యాంక్ రాలేదని భయపడింది.. బాధపడింది..
బతుకంటే అంతలా భయపట్టేసింది ఈ మాయదారి చై.. నా..

సౌ జ
న్య o - whatup
message