*_మానసిక ఒత్తిళ్లు_*
పరీక్షా ఫలితాలు విడుదల అవుతున్నాయంటేనే విద్యార్థుల్లో తల్లి దండ్రుల్లో , ఉపాధ్యాయులలో తీవ్రమైన ఆందోళన మొదలౌతుంది . అది నిజమే ఆయినా ప్రతి సంవత్సరం పరీక్షా ఫలితాల విడుదల తదుపరి జరిగే తీవ్ర పరిణామాలు జ్ఞప్తికి వచ్చి నన్ను ఆందోళనకు గురి చేసాయివిద్యార్థులకు , తల్లిదండ్రులకు కొన్ని సూచనలు: -
*_విద్యార్థులకు సూచనలు_* : -
* 10/10 రాలేదని ఆందోళన వద్దు .
* అనుకున్నది సాధించ లేకపోయానని బాధపడవద్దు.
* అమ్మా నాన్నల ఆశల్ని తీర్చలేకపోయానని వేదన అసలే వద్దు.
* తెలివి తేటలకు ఈ పరీక్షా ఫలితాలే కొలమానం కావని తెలుసుకోండి.
* ఆత్మహత్యల వంటివి అసలు చేయవద్దు.
* పరీక్షా ఫలితాలు జీవితంలో ఒక భాగమే కానీ ఫలితాలే జీవితం కాదు.
* అందరి ముందు తలెత్తుకుని ఎలా తిరగాలో అనే అనవసర ఆలోచనలు మానేయండి.
* ఇప్పటి ఈ నెగటివ్ ఫలితాలు మిమ్మల్ని మరింత రాటు దేల్చాలి. మున్ముందు ఘన విజయాలకు నాంది కావాలి.
* ఇనుమడించిన ఉత్సాహంతో అనుకున్న లక్ష్యాన్ని మళ్ళీ ప్రయత్నించి సాధించాలి.
* మీ అమ్మా నాన్నలకు భరోసా నివ్వండి ! నమ్మకం కల్గించండి.
* అపజయానికి కారణాలను విశ్లేషించండి !
* మలి ప్రయత్నంలో మీరు అనుకున్నది సాధించ గలమని ధైర్యం చెప్పండి ! అంతేకాని ఆత్మహత్యల వంటి అనర్థాలకు
పూనుకోకండి.
*_తల్లి దండ్రులకు సూచనలు_* :
* మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా సరే ! వారికి మీ అండ అవసరం అని గుర్తించండి.
* అనవసరంగా మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ! ఎంత డబ్బు ఖర్చు చేసాం అని నిందించవద్దు
* ఫలానా పిల్లల ఫలితాలు చూడండి అంటూ.,పోల్చి మీ పిల్లల ఆత్మాభిమానాన్ని చంపేయకండి.
* పిండి కొద్ది రొట్టె , చెట్టు కొద్ది గాలి , శ్రమ కొద్దీ ఫలితం అని మరువకండి !
* ఈ అపజయం మీ పిల్లలకు చక్కని గుణపాఠం కావాలి కానీ గ్రహపాటు కారాదు ! అంతకంటే
వారిని మీకు శాశ్వతంగా దూరం చేయరాదని గ్రహించండి.
* పిల్లలకు మీ ప్రేరణ , మీ సహకారం , ఫలితాలు సరిగా రానప్పుడే చాలా అవసరం అని
తెలుసుకుని అండగా నిలబడండి.
* అంతర్మథనం ద్వారా మార్పు వచ్చేలా మాట్లాడండి. తప్పక వారు అనుకున్న లక్ష్యం చేరుకోగలరని
ధైర్యం నూరి పోయండి.
* అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చైతన్యం కల్గించండి!
* ఫలితాలు జీవితాలకు గీటురాళ్ళు కాదనీ , తెలివి తేటలకు కొలమానాలు కాదని , కింద పడినా రివ్వున పైకి లేవాలనీ , రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను , మార్కులను గ్రేడులను సాధించవచ్చనీ ప్రేరణ కల్గించాలి.
సౌ జ
న్య o - whatup
message