లేదా ఇంకెంత కాలం మనకు వెలుగు నిస్తాడు ?
"""""""""""""""""""""""""""""""""""""""""""మన సూర్యుడు పుట్టి సుమారు 500 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా మన సూర్యుడిలో ఇపుడు మిగిలి ఉన్న హైడ్రోజన్ నిలువలు సుమారుగా మరో 500 కోట్ల సంవత్సరాల వరకు మండడానికి సరిపోతాయి..
అక్కడ సూర్యునిలో ఒక సెకనుకు 40 లక్షల టన్నుల చొప్పున హైడ్రోజన్, న్యూక్లియర్ ఫ్యూజియన్ పద్దతిలో మండిపోతూ, హీలియంగా మారిపోతుంది. ఇలా సూర్యునిలోని హైడ్రోజన్ అంతా మండుతూ, మండుతూ మరో 500 కోట్ల సంవత్సరాలలో మొత్తం హీలియంగా మారిపోతుంది..
అపుడు మన సూర్యుడు, 'అరుణ మహాతార' (Red giant star)గా అవతరిస్తాడు. అపుడు సూర్యుడు తన సైజును పెంచుకుంటూ, పెంచుకుంటూ క్రమ, క్రమంగా బుధ గ్రహం, శుక్రగ్రహం, ఆతర్వాత భూమి తదితర గ్రహాల నొక్కొక్కదాన్ని తనలో కలిపేసుకుంటాడు..
అరుణ మహాతార (Red giant Star) లోని హీలియమంతా మండిపోయి, కార్బన్ & ఆక్సీజన్ కేంద్రకాలుగా ఏర్పడ్డం వల్ల విపరీతంగా పెరిగి పోయిన సూర్య బింబం పై పొర పేలిపోతుంది. అపుడది శ్వేత కుబ్జ తారగా (వైట్ డ్వార్ఫ్ స్టార్ గా) మారిపోతుంది, అందులోని మిగిలిన పదార్థం మండుతూ, మండుతూ చివరగా కృష్ణ కుబ్జ తారగా (డార్క్ డ్వార్ఫ్ స్టార్ గా) మారి అటు తర్వాత ఇకపై వెలగడం ఆగిపోతుంది. అంటే మన బాషలో సూర్యుడు చనిపోతాడని అనుకోవచ్చు..
ఐతే సూర్యుడు మన భూమిని తనలో కలిపేసుకోక ముందే, రాబోయే అరుణ మహాతార వేడిని తట్టుకోలేక, ఇక్కడి జీవ పదార్థం ఎపుడో మాడి మసై, అంతా ఆవిరైపోతుంది..
ఐతే అది ఇపుడపుడే జరుగదు. భయ పడకండి. దానికి ఇంకా 500 కోట్ల సంవత్సరాల టైముంది..
--- చెలిమెల రాజేశ్వర్, జేవీవీ, తెలంగాణ.