జననం :- మార్చి 15 - 1934 ...మహాపరినిర్వాణం :- అక్టోబర్ 9 - 2006 ..
అప్పుడే కుట్టించుకున్న కొత్తబట్టలు వేసుకొని ట్రంకు పెట్టెలు చేతపట్టుకుని , సంచులు మోసుకుంటూ భార్యాబిడ్డలతో తడబడే అడుగులతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కారిడార్లలో నడుస్తున్నారు కొంతమంది వ్యక్తులు.ముఖాలు చూసి వారి కులాల పేర్లను చెప్పగల మేధావులున్న మన దేశంలో వాళ్లెవరో కనుక్కోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. వాళ్ళు అందరి బట్టలు ఉతికే చాకలి వాళ్ళు. అందరికీ సవరాలు చేసే మంగలి వాళ్ళు. దూదేకుల పింజారీ వాళ్ళు. గుర్జార్లు, వాల్మీకులు కుండలు చేసే కుమ్మరులు.అయితే వాళ్ళు అక్కడికి వచ్చింది తమ తమ కుల వృత్తులను చేయడానికి కాదు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం,జపాన్, పాకిస్తాన్ దేశాల కంటే కూడా పెద్ద భూభాగం కల రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి , ఏనాడూ తమ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లోకి కూడా వెెల్లని వాళ్లు, ఏనుగు అంబారి ఎక్కి ఉత్తర ప్రదేశ్ రాజధానికి ఎకాఎకిన వచ్చి వాలారు.నేడు ఉత్తర భారతాన్ని ఏనుగుల గుంపు చుట్టుముట్టింది.ఆ ఏనుగులకు అంబారీలను అలంకరించి మట్టికాళ్ళ మొరటు చేతుల మనుషులను, అణగారిన మనుషులను నిరంతరం అవమానాలకు, అత్యాచారాలకు గురవుతున్న మనుషులను, అంటరాని మనుషులను, పల్లెల్లో పదిమంది నడిచే రహదారుల్లో నడిచి వెళ్ళినందుకే దాడులకూ హత్యాకాండలకు గురైన మనసులను రాచవీధుల గుండా ఠీవిగా నడిపించుకు వచ్చాడు ఒక సామాన్యుడు, మాన్యుడు, అసమాన్యుడు, ఆయనే మాన్యశ్రీ కాన్షీరామ్.
"నా ప్రజలు ఈ దేశంలో పాలితులుగా కాక
పాలకులుగా ఉండాలి" అని
అంబేద్కర్ కన్న కలల్ని సాఫల్యం చేశాడు మాన్యశ్రీ కాన్షీరామ్. స్వతంత్ర భారత దేశ
చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్
రాష్ట్రానికి ఒక చమార్ మహిళను
ముఖ్యమంత్రిగా చేసి చెప్పులు కుట్టే చేతులకు రాజదండాన్ని అందించాడు.
ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు.
ఎన్నో రోజులు,
ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు సాగిన రాజకీయ వ్యవసాయం,త్యాగశీలమైన ఆచరణ, నిరంతర శ్రమ, సంఘర్షణ, ఎన్నో అవమానాలు, కాన్షీరామ్ రాజీలేని పట్టుదల, అంబేడ్కర్ ఆశయాల పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం. బహుజన సమాజం పట్ల ఉన్న
అమితమైన ప్రేమ,
ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురొచ్చినా ఎదురొడ్డి
నిలబడగలిగిన శక్తిసామర్థ్యాలు, మొండితనం
వీటన్నిటి వలన దళితులు రాజ్యాధికారాన్ని చవిచూడగలిగారు.
1956 డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మరణించేరోజు వరకూ కాన్షీరామ్ కు అంబేద్కర్ గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆయన బీఎస్సీ పూర్తిచేసి డెహ్రాడూన్లోని స్టాఫ్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. కొంతకాలం భారతీయ భూ వైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగం చేశాడు అదే సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ చనిపోయారు. కాన్షీరామ్ తో పాటు ఉద్యోగం చేస్తున్న ఆయన మిత్రుడు శ్రీ గైని అంబేడ్కర్ మరణవార్తను తట్టుకోలేక మూడు రోజులపాటు అన్నం నీళ్లు మానివేసి కంటికి మంటికి ఏకధారగా విలపిస్తుంటే కాన్షీరామ్ కదిలిపోయాడు. అప్పటివరకూ అంబేడ్కర్ పేరు వినడమే కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నడిపిన సామాజిక-రాజకీయ ఉద్యమాలను తెలుసుకొనే అవకాశం ఆయనకు రాలేదు. అయితే మిత్రుడు శ్రీగైని వల్ల కాన్షీరామ్ అంబేడ్కర్ పట్ల , ఆయన రాజకీయ ఆశయాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన జీవితాన్ని, ఉద్యమాన్ని ,రచనలని లోతుగా అధ్యయనం చేసి బాబా సాహెబ్ సిద్ధాంతాన్ని గుండెల్లో నింపుకున్న మహామనిషి కాన్షీరామ్.

కాన్షీరామ్ ఉద్యమ ప్రస్థానంలో తన
తల్లికి రాసిన ఉత్తరం కానీ , ఆయన
నిర్మించిన సంస్థల చరిత్ర కానీ బామ్సెఫ్ , డీఎస్ 4,బహుజన
సమాజ్ పార్టీ నిర్మాణం కోసం ఆయన సాగించిన కృషి,సాగించిన సైకిల్ యాత్రలు, ప్రసంగాలు ఉద్యమాలను అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే.
ఇది బహుజన సమూహాలను, మొత్తంగా మానవాళిని అమితంగా ప్రేమించిన
ప్రేమ మూర్తి చరిత్ర. ఇది జాతీయ నాయకులకూ, ప్రధాన ప్రసార సాధనాలకూ కొరకరాని కొయ్యగా మారిన ఒక రాజకీయ దురంధరుడి
చరిత్ర.వందల కోట్ల రూపాయలను ఎడమచేత్తో ఖర్చుచేస్తూ స్వంత ఆస్తి లేని ఒక నిరుపేద
చరిత్ర.ఒక బౌద్ధ భిక్షువు ఏవిధంగా ఉండాలో ఆ విధంగా జీవించిన ఒక బౌద్ధ భిక్షువు
చరిత్ర.
(ఆత్మకూరి చెన్నయ్య గారు రచించిన "మాన్యశ్రీ కాన్షీరాం పోరాటజీవితం" పుస్తకానికి కలేకూరి ప్రసాద్ గారు రాసిన ముందుమాట నుండి)

వివరాల్లోకి వెళితే , బహుజన సమాజ్ పార్టీ నిర్మాత కాన్షిరామ్
సిక్కు చమార్ కులస్తులైన తేల్సింగ్, బిషన్సింగ్ కౌర్‌లకు మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్పూర్
గ్రామంలోజన్మించాడు... తన 31వ ఏటనే
అంబేడ్కర్
రచించిన 'కుల నిర్మూలన ' గ్రంథం ద్వారా ప్రేరేపితుడయ్యాడు... తన
తల్లికి ముప్పైపేజీల ఉత్తరం రాస్తూ 'ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను. నా కోసం మీరు
వెతకవద్దు' అంటూ బయటికి వెళ్లి, చనిపోయే వరకు తిరిగి ఇంటికి
వెళ్లలేదు...
1984 ఏప్రిల్ 14న బాబ్ సాహెబ్ అంబేడ్కర్ జయంతి
సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు... 'ఒక ఓటు-ఒక నోటు' అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి
వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు...
''కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని'' నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు... నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతావు?
నడువు పార్లమెంటుకు, అసెంబ్లీకి నడువు.నీ కాళ్లమీద నీవే నడువు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు... భారతదేశంలో తొలి దళిత మహిళ ముఖ్యమంత్రిగా కుమారి మాయావతిని చేశాడు... రాజకీయాధికారమనే ''మాస్టర్ కీ'' సకల సమస్యలకు పరిష్కారమని భావించిన అంబేడ్కర్ కలల సౌధం నిర్మించాలనుకున్నాడు కాన్షిరామ్... లక్ష్య సాధనలో సైంటిస్ట్ , సోషల్ సైంటిస్ట్ గా మారిపోయాడు....

రక్తపు బొట్టు నేలరాలకుండానే భారతదేశంలో బ్యాలెట్ పద్దతిలో రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించాడు. ''ఈ దేశానికీ కాబోయే పాలకులం, నోట్ల రాజ్యాన్ని చెరిపి ఓట్ల రాజ్యం స్థాపించడం మనకర్తవ్యం " అనే స్పృహను కల్పించాడు.
''ఆత్మగౌరవం, సమానత్వం, కుల రహిత సమాజం కొరకు పోరాటం నడిపాడు....
ఒక్కడిగా మొదలై, 25 మందితో మొదటి సమావేశంతో కదిలి లక్నోలో 25 లక్షల మంది ప్రజలతో బహుజన మహా సభలు నడిపించాడు.... రెండు పాదాలు- రెండు చక్రాల (కాళ్లు, సైకిల్ )తో భారతదేశమంతటా పర్యటించి, సామాజిక చైతన్య ఉద్యమం నడిపించాడు. సాంస్కృతిక ఉద్యమానికి తెరలేపారు...
సామాజిక విప్లవకారులైన గౌతమ బుద్ధుడు, అశోకుడు , శివాజీ , మహాత్మాజ్యోతిరావు ఫూలే, సంత్ రవిదాస్, ఛత్రపతి సాహుమహారాజ్, డా బీఆర్ అంబేడ్కర్ , పెరియార్ రామస్వామి, నారాయణగు రు, సావిత్రీబాయి ఫూలే జీవిత చరి త్రలు, వారి త్యాగాలను గురించి ప్రజల మధ్య చర్చించే వారు. దేశానికీ కావలిసింది వక్తలు కాదు సమీకరించేవారు కావాలని నొక్కి చెప్పేవారు..... బహుజనుల విముక్తికి పరిష్కారం రాజ్యాధికారమేనని నమ్మాడు..........

లక్ష్య సాధనకు ఉద్యోగం ఆటంకంగా ఉందని
భావించి సైంటిస్ట్ ఉద్యోగం వదిలేసాడు.
కరపత్రాలు చేతబట్టుకుని పల్లెలవైపు నడిచాడు. కాన్షిరామ్ గారి రాజకీయ పోరాటానికి ఢిల్లీ వేదికయ్యింది...
కాన్షిరామ్ దృష్టి ఢిల్లీ పీఠం మీదనే ఉండేది. కాబట్టి సైకిల్ యాత్రలు ఎక్కడ నుంచి మొదలుపెట్టినప్పటికీ చేరుకునేది ఢిల్లీకే.... ఉద్యమానికి అవసరమైన నిధులకోసం ఉద్యోగులను సమీకరించాడు. వారితో బామ్ సెప్ ను 1978లో ప్రారంభించాడు... ''నీవు జన్మించిన సమాజానికి బదులుగా కొంత ఇవ్వు'' అనే నినాదంతో సుమారు 20 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులను సమీకరించాడు. ( Pay Back to the Society ) చెప్పులుకుట్టేవారు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు నెలజీతంలో నుంచి, రోజువారీ పనిలో నుండి కొంత దాచిపెట్టి ఇచ్చిన డబ్బును సమీకరించాడు... దళిత్ శోషిత సమాజ్ సంఘర్షణ సమితిని 1981లో ప్రారంభించి బహుజనులందరిని ఏకం చేసాడు.... అంబేడ్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 , 1984 లో బహుజన సమాజ్ పార్టీ అనే రాజకీయ పార్టీని రూపొందించి, బహుజనులకు రాజ్యాధికార దిశను కల్పించాడు.
బహుజన రాజ్యాధికారం అనే సమరంలో కార్యకర్తలు నిజాయితీ పరులుగా, ప్రజలకు విధేయులుగా ఉండాలని చెప్పేవారు. ఎప్పుడు కూడా ఎవరికి లొంగిపోకూడదని నొక్కి చెప్పేవారు... చెంచాయుగం అనే పుస్తకాన్ని రచించాడు
విధేయత, లొంగిపోవడం వేరు వేరు అర్దాలు. విధేయత అనేది ప్రజలపట్ల నిబద్దత కాగా లొంగి ఉండటం బానిసత్వం అని అనేవారు. కాన్షిరామ్ మాటలతో పాటు ఆచరణకు ప్రాధాన్యతనిచ్చేవాడు.. ఈ సమాజానికి కావలసింది త్యాగధనులు అని అనేవాడు.. ప్యాంటు చొక్కా వేసుకునీ, విజ్జ్ఞానవంతులు పల్లెలకు వెళ్లి తమ సమాజమును ఏకం చేయాలనీ కాన్షిరామ్ ఆచరించి చూపించిన మహానీయుడు కాన్షిరామ్ అక్టోబర్ 9, 2006 న గుండెపోటుతో న్యూఢిల్లీలో మరణించాడు...

( Source :- సేకరణ WhatsApp , Facebook ) నుండి పదవులు ముఖ్యం కాదు బహుజన సమాజ
నిర్మాణమే నా కర్తవ్యం - అని
ఆచరణ లో
చూపిన
మాన్యశ్రీ కాన్షీరాం.
🙏✊JAI BHEEM ✊🙏