Pages

మతం అవసరం ఎంత ?


ప్రపంచ జనాభా సుమారు 600 కోట్లు ..

Christian మతాన్ని follow అవ్వకుండా బతుకుతున్నవారు ఎంత మంది ఉంటారు ?
సుమారు 400 కోట్ల మంది ఉంటారనుకుందాం ?
Islam మతాన్ని follow అవ్వకుండా 450 కోట్ల మంది వరకు  బతుకుతున్నారు ..

Hindu ధర్మాన్ని follow అవ్వకుండా 500 కోట్ల మంది వరకు బతకగలుగుతున్నారు ..

మరే ఇతర మతాన్ని తీసుకున్నా ఆ మతం అవసరం లేకుండా బతుకుతున్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు ..

అసలు ఏ మతాన్ని అనుసరించకుండా బతుకుతున్నవాళ్ళు ఎన్నో  మందే ఉన్నారు ..

వాళ్ళంతా సంతోషంగా లేరంటారా ?

దేవుణ్ణి నమ్మితే మంచి జరుగుతుంది అనుకోవడంలో తప్పు లేదు..
దేవుణ్ణి ప్రార్దించి ఏదైనా పొంద వచ్చు అనుకోవడంలో తప్పు లేదు ..

కాని
దేవుణ్ణి ప్రార్ధించక పోతే బతకలేమన్న భయం మాత్రం మూర్ఖత్వం .
ఏదో ఒక మతం ముసుగు లేకుండా బతకలేమనుకోవడం అమాయకత్వం ..

నీ నమ్మకం నీ వ్యక్తిగతం ..నీ ప్రార్దన నీ  వ్యక్తి గతం ..దాని కోసం ఏదో ఒక group కట్టాల్సిన అవసరం లేదు ..
మతం నీకు ఏమి చూపిస్తుంది? ప్రార్దించే పద్దతులు? ..బతికే సిద్ధాంతాలు ?..

నీ మతం చూపించే పద్దతులు ,సిద్ధాంతాలు follow అవ్వకుండా మిగిలన జనం జీవించ గలిగినప్పుడు ,
మిగిలిన జీవరాశులన్నీ జీవించ గలుగుతున్నప్పుడు , వాటిని ఖచ్చితంగా పాటించాలనుకోవడం అజ్ఞానమే అవుతుంది .

ప్రతి విషయం లోనూ  మనిషిగా ప్రతి స్పందించక మతస్తుడిగా ప్రతి స్పందించడం వల్లే ప్రపంచంలో
అశాంతి నెలకుంటోంది .

పక్షులు ఏ గ్రంధాన్ని చదువుతున్నాయి? చేపలు ఈ గ్రంధాన్ని అనుసరిస్తున్నాయి ?
జంతువులన్నీ  ఏ /ఎవరి సిద్ధాంతాలని పాటిస్తున్నాయి ..?
మనిషి కెందుకు ఎందుకు అవసరం ? ఎంత అవసరం ?

ఈ అశాంతిని తొలగించేందుకు
నీ మతాన్ని నీ గుమ్మం దగ్గర కట్టేయ్..మనిషిగా బయటకి అడుగు పెట్టు ...