Pages

మనసే ఆన్నిటికి మార్గం


*అన్ని రోగాలకూ విరుగుడు మనసే!*

మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్: కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట. మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !

ఆవేశ కావేశాల వల్లే అధికరక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే  అధికరక్తపోటు ఎక్కువట !

అతిబద్ధకం వల్ల చెడుకోలెస్టరాల్: కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!

మధుమేహం సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !

అతివిచారం వల్ల ఆస్త్మా: ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తా వస్తుందట.

ప్రశాంతత లేక గుండెజబ్బులు: ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం

50% ఆధ్యాత్మికత లోపంవల్ల
25% మానసిక కారణాల వల్ల
15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల
10% శారీరక కారణాల వల్ల

రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపుమాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే
స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి
కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి.

సౌ జ న్య  o - whatup message

సంబంద భాందవ్యాలు


మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయం  గా భావిస్తారు.
" ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం "

అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా, మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ  సంతోషంగా ఉండాలని అనుకుంటాం.

కానీ నేడు మన బృందావనం  బీటలు వాలి చివరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది.
ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మన వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల ఆలోచనలో చాలా  మార్పులు వచ్చాయి.
దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి  మనిషిలో పెరుగుతున్న స్వార్ధం. ఎందుకంటే మన చిన్నతనంలో
"కలసి ఉంటే కలదు సుఖం" అని చెప్పేవారు,
కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం మేలు". అంటున్నారు.
ఇది భౌతిక , కుటుంబ ఎడబాటు అయితే అంత ఇబ్బందేమీలేదు. కాని
చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.
"వెన్నలాంటి  రాత్రులలో చందమామ మిస్ అవ్వలేదు కానీ చందమామ కధలు చెప్పేవారు మిస్ అయ్యారు.
ఎండా కాలంలో వేసవి సెలవులు మిస్ అవ్వలేదు కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదినీ ఒక దగ్గర చేర్చే పెద్ద దిక్కు మిస్ అయ్యారు.
ప్రతి సంవత్సరం  వచ్ఛే పండగలు మిస్ అవ్వలేదు కానీ ఏ పండగ నాడు
ఏ తీపి వంటకం వండాలో చెప్పే మనిషి మాత్రం మిస్ అయ్యారు".
దీనికి కారణం నేటి తరానికి కధలు చెప్పడానికి ట్యాబ్లు, యూ  ట్యూబ్లు ఉన్నాయి. అదే వేసవి సెలవులు వస్తే సమ్మర్ కోర్సులు, క్రాష్ కోర్సులు ఉన్నాయి. అలాగే పండగలు వస్తే తినడానికి రెస్టారెంట్స్, తిరగడానికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
అందుకే నేటి తరానికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు అవసరం లేదు. అందుకే మన భారత దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు శాతం తగ్గుముఖం  పడుతుండగా చిన్న కుటుంబాల శాతం పెరుగుతూ ఉంది.
నేటి తరానికి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళని ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేస్తారు.ఇలా చివరికి వ్యక్తిత్వ వికాసం కూడా కోర్సుల్లో జాయిన్ అయి నేర్చుకుందుకు ప్రయత్నిస్తారు..
వాళ్ళు వృత్తిలో రాణించడానికి పాఠాలు చెప్పగలరేమో గాని జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేరని తెలియడం లేదు.
ఒక అర్ధ శాస్త్రవేత్త చెప్పిన
మాటను గుర్తుచేస్తాను
" All human relations are commercial relations"
అంటే
" మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే".
ఏమో కొన్ని సార్లు ఈ మాట నిజమనిపిస్తుంది. నేటి సమాజంలో మనిషి బంధాలను ప్రేమతో కాక డబ్బుతో ముడి వేస్తున్నారు. ఎక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందో ఆ బంధాలు దృఢంగా ఉంటాయి.
ప్రేమ, అభిమానాలు వ్యక్త పరచడానికి ఇచ్చిపుచ్చుకోవడమనేది ఒక పద్ధతి. అంతే కానీ పుచ్చుకొనే ధోరణితో బంధాలు ఏర్పడితే అవి ఎక్కువ కాలం నిలబడవు.
ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బు ఉంటుంది.కానీ డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమ నిలబడదు.
కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం.
" ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ,మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం "
ఈ మాటలు నిజం . ఎందుకంటే.......
"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".  

అందుకే మన జీవితంలో
ఉన్న ప్రతీ బంధాన్ని  నిలబెట్టుకోవాలి. ఎందుకంటే "
When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'.
Let's have a smooth relationships. 🙏🙏


ఏప్రిల్ 2009లో జరిగిన సంఘటన. నేను ఢిల్లీ నుంచి విమానంలో తిరిగి వస్తున్నాను. నా పక్కనే రామకృష్ణ మఠానికి చెందిన ఒక స్వామీజీ కూర్చుని ఉన్నారు. అటుపక్కన అమెరికాకు చెందిన ఒక విలేకరి ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం స్వామి పక్కన ఉన్న విలేకరి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. విలేకరి:  “స్వామీజీ ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో బంధాలు అనుబంధాల గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా?” దానికి స్వామీజీ నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తూ విలేకరిని తిరిగి ఇలా ప్రశ్నించారు “మీరు న్యూయార్క్ నుంచి వస్తున్నారా?” విలేకరి: “అవును.” స్వామీజీ : “మీ ఇంటిలో ఎవరుంటారు?” ఈ ప్రశ్న పూర్తిగా వ్యక్తిగతము మరియు అసంబద్ధం కావడంతో విలేకరి స్వామీజీ తన ప్రశ్నను దాటవేస్తున్నారు అనుకున్నారు. అయినప్పటికీ విలేకరి చెప్పసాగాడు “అమ్మ చనిపోయారు. నాన్న అక్కడే ఉంటున్నారు. ఇంకా నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహం అయింది.” ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా స్వామీజీ గారు మళ్లీ ఇలా అడిగారు “నీవు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా?” విలేకరి ముఖకవళికలు మారటం మొదలైంది. స్వామీజీ: “ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు?” జేవురించిన ముఖంతో విలేకరి ఇలా చెప్పాడు “సుమారు ఒక నెల అయి ఉండొచ్చు.”. స్వామి గారి ప్రశ్నల పరంపర కొనసాగింది. “మీ అన్న చెల్లెళ్ళ ను ఎంత తరచుగా కలుసుకుంటారు? ఆఖరిసారిగా కుటుంబమంతా ఎప్పుడు కలిసి ఉన్నారు?” ఆ సమయంలో విలేకరి నుదుట నుంచి చెమట  కారణం స్పష్టంగా కనిపించింది. అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. స్వామీజీ నా? లేక విలేకరా? నాకైతే స్వామీజీ విలేకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది. ఒక నిట్టూర్పు తో విలేకరి చెప్పాడు “సుమారు రెండు సంవత్సరాల క్రితం … క్రిస్మస్ సందర్భంలో మేమందరము కలిశాము.” స్వామీజీ : “మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు?” నుదుటన స్వేదబిందువులు తుడుచుకుంటూ విలేకరి అన్నాడు “మూడురోజులు.” స్వామీజీ : “ఎంతకాలం మీ నాన్నగారితో గడిపావు? ఆయన పక్కనే ఎంతకాలం కూర్చున్నావు?” ముఖం కందగడ్డలా మారిన విలేకరి కాగితంపై పిచ్చిగీతలు గీయడం మొదలుపెట్టాడు. స్వామీజీ : “నీవు ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి భోజనంచేసావా? ఆయన ఎలా ఉన్నారని ఎప్పుడైనా అడిగావా? మీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో అడిగావా?” విలేకరి కంటినుంచి కన్నీరు కారటం స్పష్టంగా కనిపించింది. అప్పుడు స్వామీజీ విలేకరి చేతిని ప్రేమతో అందుకని ఇలా అన్నారు “బాధపడకు. నిన్ను తెలియకుండా బాధించి ఉంటే క్షమించు. కానీ నీవడిగిన బంధం అనుబంధాలకు సమాధానం ఇదే. మీ నాన్నగారితో నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు. అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసిపోవడం. కలిసి ఉండడం. కలిసి భోజనం చేయడం. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం; స్పర్శించటం.. చేతులు కలపడం… కళ్ళలోకి సూటిగా చూడగలగటం… కలిసి సమయాన్ని గడపడం. మీ సోదరులందరితో కూడా నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు.” ఆ విలేకరి కన్నీళ్ళు తుడుచుకుంటూ స్వామీజీతో అన్నారు “బంధం అనుబంధాల గురించి ఇంత అద్భుతమైన బోధన చేసినందుకు ధన్యవాదాలు.”

ఇదీ నేటి వాస్తవికత. సమాజంలో గానీ, ఇంటిలోగానీ అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కానీ అనుబంధాలు కనుమరుగయ్యాయి. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం. పరస్పర ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉందాం,

 ఒక ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం 🙏🙏🙏
సౌ జ న్య  o - whatup message

దేవుడు - మతం


"దేవుడు - మతం" "కులం - వర్గం" ఇదేనా..?
జన జీవన మంత్రం..!

జీవ పరిణామ క్రమంలో శిఖరాగ్రాన్ని చేరినవాడు మానవుడు. నేడు మనిషి మనిషిగా జీవించేందుకు ఎంతమాత్రం అవకాశం లేదు..!

            ఇందుకు కారణాలు నాలుగు. 1) దేవుడు 2) మతం 3) కులం 4) వర్గం ఇవి మనిషిలోని మానవత్వానికి మత్తుమందు జల్లి అతని చైతన్యాన్ని మంటగలిపాయి. మానవుల్ని ఛిన్నాభిన్నం చేసి, వారిని చెక్క ముక్కల కింద చీల్చి వేశాయి. మానవ జీవిత స్వేచ్ఛను అరికట్టి, అవి మానవత్వానికి ఊపిరిపోశాయి.

       మానవ అజ్ఞానంలోంచి పుట్టినవాడే దేవుడు. ప్రకృతిలో తన దృష్టికి కనిపించే వస్తువుల్నీ, జరిగే సంఘటనల్నీ శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోలేని నాటి ఆదిమ మానవుడు తనకన్న పూర్తి భిన్నమైన ఏదో మహాశక్తియో, మహాశక్తులో ప్రకృతి ఉనికికి కారణమై ఉంటాయని భావించాడు. అతడు అప్పటికింకా ప్రకృతి గర్భం నుంచి బొడ్డు కోసుకుని బైటపడలేదు. ఇంకా ప్రకృతిలో భాగంగానే ఉంటున్నాడు. నిప్పు, నీరు, గాలి, నేల ఇత్యాది ప్రకృతి శక్తులకు దైవత్వమారోపించడం ద్వారా ఆదిమ మానవుడు మొట్టమొదటి దేవుళ్లను సృష్టించాడు.

         మానవుడు మృగదశలో ఉన్నప్పుడు కొండగానో, బండగానో, ఏరుగానో, చెట్టుగానో వెలసిన దేవుడు, మానవ విజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ కొండ- బండ రూపాన్ని వదిలి - మృగమై, ఆ పిదప మనిషై, ఆ తర్వాత నిరాకారుడై నిరంజనుడై నిర్వికల్పుడై చిట్టచివరికి అదృశ్యమైపోయాడు. అంటే మత సిద్ధాంతాలు అభివృద్ధి చెందిన కొద్దీ, ఈ దేవుళ్ళు ప్రకృతి శక్తులతో తమకున్న సంబంధాన్ని వదిలించుకుని ఊహాప్రపంచంలోకి అమాంతం వెళ్లిపోయాడు.

          దేవుడికి మళ్లీ పూజారి వర్గం ఒక ఆకారం కల్పించింది. పూజాపుస్కారం, నామకరణం, అన్నప్రాశన, పెళ్ళీ పేరంటం, వ్యభిచారం, ఇత్యాది అమాంబాపతు లక్షణాలన్నీ పూజారివర్గం దేవుళ్ళకు అంటగట్టింది. తిండిపోతు దొంగలైన పూజారులు, దేవుడనే బూచిని తమస్వార్థ సంకుచిత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తత్ఫలితంగా మనుషులు చేసిన దేవుళ్ళ చేతిలో మనుషులే బానిసలుగా మారిపోయారు.
దేవుడనే బూచిని చూపి, మనిషి మెదడుపై జల్లిన మత్తుమందే - మతం. ఈ మతం పేరిట, మానవుల మధ్య అభేద్యమైన కోటగోడలు కట్టారు. ఈ మతం పేరిటే, మతకర్తలు, మతోన్మాదులూ మారణహోమం గావించి, మానవ రుధిరాన్ని ఏరుల్లా పారించారు. మానవ శిరసుల్ని కోట గుమ్మాలకు చట్టారు. ఆది శంకరుడు లాంటి మత దురహం కారులు , జైన- బౌద్ధ- చార్వాకుల చెవుల్లో సీసం కాసిపోశారు. ఆర్యులు అనార్యుల్నీ, యూదులు క్రైస్తవుల్ని, కేధలిక్కులు ప్రొటెంస్టెంట్లనీ, మతం పేరిటే క్రూర మృగాలకన్న దారుణంగా చిత్రవధ చేశారు.

         గొరికి పారేసిన వెంట్రుకలిస్తే దేవుడు మురిసిపోయి, కోరిన వారాల్నీ శిరిసంపదలను ఇస్తాడనేంతదాకా, ఈ మతమే నేడు జనంలో ప్రచారం చేస్తోంది. ఈ లోకంలోని మానవుల కష్టసుఖాల్తో సంబంధంలేని మతం, చచ్చింతర్వాత స్వర్గాన్ని చూపి బెల్లిస్తోంది. అంచేత, ఈ మతం నల్లమందు. ఈ మతం - తిండిపోతు దొంగల కేంద్రం. ఈ మత కర్మల్ని ఆసరాచేసుకున్న పూజారి వర్గం, అమాయక ప్రజల జేబులు గొడుతోంది. అంచేత, ఈ మత పిచ్చిని నాశనం జేయనంతదాకా , మానవుడు మానవుడుగా మనలేడు. మానవత్వానికి చోటులేదు.

          ప్రపంచంలో ఏ దేశంలో లేని కులం కుష్టురోగం ఈ దేశంలోని హిందువులకే దాపురించింది. చరిత్ర పరిణామ క్రమానికి చెందిన ఒకానొక దశలో , శ్రమ విభజన కోసం ఏర్పడ్డ వర్ణ వ్యవస్థ నేటి కుల వ్యవస్థగా రూపుదాల్చింది.
బ్రహ్మదేవుని తలలోంచి బ్రాహ్మలు, భుజాలలోంచి క్షత్రియులు, కడుపులోంచి వైశ్యులు, కాళ్ళలోంచి శూద్రులు పుట్టారని హిందూ, పురోహిత వర్గానికి చెందిన ధర్మశాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. అయితే, పంచములు దేవుని ఏ అంగంలోంచి జన్మించారో ఈ వంచకులు మాత్రం చెప్పలేదు.

         మొదట్లో మూడు వర్ణాలన్నారు. తర్వాత నాలుగన్నారు. నేడు 2030 కులాలూ, లక్షకి పైగా చిల్లర తెగలూ హిందువుల్లో ఉన్నాయి. అంటరానివారనీ, చెప్పరానివారనీ, ఛండాలురనే పేర్లు పెట్టిన ఈ వైదిక పురోహితులు, కోటానుకోట్ల మానవుల్ని మాల- మాదిగ గూడేలకి తరిమేశారు. తరతరాలుగా వారిని పురుగులకన్నా హీనంగా చూశారు. అస్పృశ్యత ధర్మసమ్మతమేనని పూరీ శంకరాచార్యులు లాంటి ద్రోహులు, నేటికీ సిగ్గూ బిడియం లేకుండా ప్రచారం చేస్తున్నారు. అంచేత, ఈ కుల తత్వ పిశాచాన్ని, ఏడు నిలువుల లోతున పాతెయ్యనంతదాకా ఈ జాతికి విముక్తి లేదు. ఈ జనానికి భవిషత్తు లేదు. అధికుడని, అధముడనీ కులాల్ని సృష్టించి , నేటికీ అవి ధర్మ సమ్మతమేనని వదరుతున్న వారిని ప్రజా ద్రోహులుగా పరిగణించాలి. సమస్త మానవులూ సమానమేనన్న మానవతా వాదానికి పట్టాభిషేకం చేయాలి.

       ఆదిమ మానవ సమాజంలో, ఉన్నవాడూ లేనివాడూ అనే భేదం లేకుండా, అంతా సమిష్టి కృషి ద్వారా సుఖంగా జీవించారు. సమాజంలో ప్రయివేటు ఆస్థి రావడంతో, మానవులు ధనికులుగాను, దరిద్రులుగానూ చీలిపోయారు. అతికొద్ది మంది కుబేరులు, అశేష ప్రజానీకాన్ని పీడించి కోట్లకి పడగ లెత్తుతుంటే, కోటానుకోట్ల ప్రజలు భీకర దారిద్య్రంలో హీనంగా బతుకుతు న్నారు. అంచేత, ఈ ఆర్థిక అసమానతులు లేని సమాజ నిర్మాణం జరగాలి.
- సివీ
( '' డార్విన్‌ పరిణామవాదం'' - పుస్తకం నుంచి)
సౌ జ న్య  o - whatup message

ఆత్మ - పునర్జన్మ


ప్రశ్న : ఆత్మ ఉందా? ఉంటే శాస్త్రీయంగా నిరూపితమయిందా? పునర్జన్మ వుందా? పరకాయ ప్రవేశం సాధ్యమా?

           జవాబు : ఉన్నదాన్నే ఉన్నదన్నట్లు శాస్త్రీయంగా ఋజువుల కోసం శాస్త్రజ్ఞులు అన్వేషిస్తారు. ఉన్నదనుకొన్నది ఏ విధమైన పరిశోధనల ద్వారానూ ఋజువు కానప్పుడు ఆ ఉన్నదనుకొన్నది కేవలం అబద్దమని శాస్త్రం చెబుతుంది. దాని ఉనికికి ఏ విధమైన ఆధారాలు లేవని వ్యక్తీకరిస్తుంది. ఉన్నదనుకొన్నదేదీ? దాని లక్షణాలు ఏ విధంగా వున్నాయనుకొంటున్నారు? వంటి ప్రశ్నలకు వచ్చే జవాబుల ఆధారంగానే ఉన్నదనుకొంటున్నది ఉందా లేదా అని ప్రయోగాలు చేస్తారు. అదే శాస్త్రీయ పద్దతి. ఆత్మ కూడా ఈ కోవలోకే చెందింది. 'ఆత్మ' అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం ఆధారంగానే ఆత్మ వుందాలేదా అన్న విషయం విదితం అవుతుంది. మనం విన్న కథలు, పురాణాలు, ఉపదేశాలు, విశ్వాసాలు ప్రకారం 'ఆత్మ' అనేది ప్రతి జీవిలోనూ ఉన్న జీవానికి ప్రతినిధి. 'ఆత్మ' అనేది లేకుంటే ప్రతి జీవి మృతజీవి లేదా నిర్జీవ పదార్థమే.  పని చేస్తున్న సెల్‌ఫోన్‌లోని పనితనానికి, జీవంతో వున్న మీరు, నేను మనలోని జీవన కార్యకలాపాలకి కాసేపు సంధానిద్దాం. బాగా చార్జింగ్‌ అయిన సెల్‌ఫోన్‌ ను ఆన్‌ చేసిన వెంటనే ఎన్నో కార్యకలాపాల్ని అది చేస్తుంది. అది నిర్వర్తించే కార్యకలాపాలు, పనులు, అనువర్తనాలు (applications) అన్నింటిని కలగలిపి 'పనిచేస్తున్న' సెల్‌ఫోన్‌ అంటాము. ఎవరయినా 'నీ సెల్‌ఫోన్‌ పనిచేస్తోందా ? పాడయ్యిం దా? అంటే మనం ఏమంటాము?' 'పని చేస్తోంది' అంటాము. లేదా 'పనిచేయడంలేదు పాడయ్యింది' అంటాము. ఓవరాల్‌గా ఫోన్‌ పని చేయడాన్ని 'ప్రాణి జీవం'గాను ఏ పని చేయని స్థితిని 'మరణం'గాను భావిద్దాం. మొబైల్‌ ఫోన్‌లాగే ప్రాణి ఎన్నో పనులు చేస్తుంది. నడుస్తుంది, మాట్లడుతుంది, ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఆలోచిస్తుంది, పడుకొని మళ్లీ లేస్తుంది, కోపిస్తుంది, నవ్వుతుంది. ఇవన్నీ చేసే ప్రాణిలో ఓవరాల్‌గా 'జీవం వుంది' అంటాము.  

                       సెల్‌ఫోన్‌లోని పదార్థాల, నిర్మాణాల, అమరికల, సర్క్యూట్ల, విద్యుత్ప్రవాహక, కాంతి విద్యుద్ధర్మాల, యాంత్రికతల తీరుతెన్నుల సమాహారంగానే సెల్‌ఫోన్‌ అన్ని విధాలయిన సంక్లిష్ట కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. అందుకే సెల్‌ఫోన్‌ 'పనిచేస్తోంది' అంటాము. మరి ఆ పని దేనివల్ల వీలయ్యింది. కేవలం బ్యాటరీల వల్లనా? అయితే బ్యాటరీలను చెంబులో పెడితే చెంబు మరి సెలఫోనలాగా పని చేయదు కదా! మరి సెల్‌ఫోన్‌ సంక్లిష్ట పనితీరుకు కారణం కేవలం ఆ సెల్‌ఫోన్‌లోని తెర మాత్రమే కారణమా? మరి బ్యాటరీలను తీసేసిన తర్వాత తెర వెలగదే? మరి తెర, బ్యాటరీలు రెండూ వుంటే సెల్‌ఫోన్‌ పనిచేస్తుందా? లోపలున్న ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు మాత్రమే సెల్‌ఫోన్‌ను పనిచేయిస్తున్నదా? ఆ ఐసిబిని తీసుకెళ్లి జామెట్రీ బాక్సులో పెడితే ఆ జామెట్రీ బాక్సు సెల్‌ఫోన్‌ లాగా పనిచేస్తుందా? పోనీ ఆ జామెట్రీ బాక్సుపైన సెల్‌ఫోన్‌ తెరను, మరో పక్క బ్యాటరీలను పెడితే అపుడయినా అది సెల్‌ఫోన్‌ అవుతుందా?       అలాగే తల మాత్రమే జీవం కాదు, గుండె మాత్రమే జీవం కాదు. కానీ గుండె లేకుండా జీవంలేదు. తెరలేకుండా సెల్‌ఫోన్‌ లేదు. కానీ తెర మాత్రమే సెల్‌ఫోన్‌ కాదు. బ్యాటరీ లేకుండా సెల్‌ఫోన్‌ పనిచేయదు. కానీ బ్యాటరీ మాత్రమే సెల్‌ఫోన్‌ కాదు. అలాగే తల లేకుండా మనిషి లేకున్నా తల మాత్రమే మనిషి కాదు. ఊపిరితిత్తులు లేకుండా మనిషి జీవంతో వుండడు. కానీ ఊపిరితిత్తులు మాత్రమే జీవంతో ఉన్నాయని కాదు. 

        కాబట్టి ఎన్నో కణ జాలాల, శరీరభాగాల, అవయవాల, జీవ రసాయనాల, జీవ భౌతిక వ్యవస్థల సమిష్టి వ్యవస్థే జీవంతో ఉన్న మనిషి. ఇందులో కీలకమైన అంశాలు లేనట్లయితే మనిషి జీవంతో వుండడు. లేదా కీలకమైన అంశాల మధ్య సమన్వయం లేకున్నా మనిషి జీవంతో వుండడు. అంటే 'జీవం' అనే పదం ఏక వచనమే అయినా జీవం ఒక వస్తువో, ఒక నిర్థిష్ట పరికరమో హద్దులు, పరిమాణాలు వున్న శిల్పం కాదు. 'దేశం' అన్న పదము ఏకవచనమే. కానీ దేశమంటే ఒక వస్తువా? 'ప్రభుత్వం' అన్న పదమూ ఏకవచనమే. కానీ 'ప్రభుత్వం' అంటే ఒక కంప్యూటరా? అలాగే జీవం అనేది కూడా సంక్లిష్ట పాదార్థిక, వివిధ శక్తి వినిమయాల, భౌతిక రసాయనిక ప్రక్రియల సమిష్టి వ్యవస్థ. అయితే 'ఆత్మ' వాదులు మనిషి లేదా జీవిలోని జీవాన్ని ఒక ఏకవచన నిర్దిష్ట పరికరం లేదా నిర్దిష్ట ఏకీకృత వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఆ వస్తువుకు రూపం వుండదు. 'జీవం' వున్న స్థితికి కూడా రూపం వుండదు. 'ఆత్మ'కు నిర్దిష్ట హద్దులు ఉండవంటారు. జీవం అన్న స్థితికి కూడా నిర్దిష్ట హద్దులు వుండవు. 'ఆత్మ'కు నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదంటారు. 'జీవం' అనే స్థితికి కూడా నిర్ధిష్ట ద్రవ్యరాశి వుండదు. ఇలా సంక్లిష్ట ధర్మాల, నిర్మాణాల, వ్యవస్థల, రసాయనాల, యాంత్రికతల సమిష్టి ప్రతినిధిగా 'జీవం' అన్న పదాన్ని పరిగణిస్తాము. అదే 'జీవం' అన్న పదానికి 'ఆత్మ' అన్న పదాన్ని పర్యాయ పదంగా వాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. వచ్చిన గొడవల్లా అక్కడ కాదు. కానీ 'ఆత్మ'వాదుల ప్రకారం 'ఆత్మ' బరువు, హద్దులు, రూపంలేని ఓ నిర్దిష్ట పరికరం. అది చెంబులో నీళ్లున్నట్లు (ఆ నీళ్లకు బరువు ఉండదనే విధంగా, ఆ నీళ్లకు ఘన పరిమాణం వుండదనే విధంగా, ఆ నీళ్లు మంటలో పోసినా ఆవిరి కావన్న విధంగా) వుంటుంది. ఆ చెంబులో నీళ్లను మరో చెంబులోనో, బకెట్లోనో, తొట్టిలోనో పోసే విధంగా 'ఆత్మ' ఒక జీవి నుంచి మరో జీవికి బదలాయించుకొంటుంది. ద్రవ్యరాశి, కాలం, రూపం (స్థల విస్తారం) అన్న రాశులు లేకుండా ఈ విశ్వంలో ఏదీ లేదన్నది శాస్త్రం.    Every thing including vacuum has one  or more of these attributes.. (ఉన్న ప్రతి వ్యవస్థకు ద్రవ్యరాశి గానీ, రూపంగానీ, కాలానుగుణ వ్యక్తీకరణ గానీ, విద్యుదావేశం గానీ ఉండితీరాలి. లేదా కొన్ని గానీ, అన్నీ గానీ వుండాలి) ఈ నిర్వచనానికి 'ఆత్మ' వాదుల 'ఆత్మ' పొసగదు. 'కుక్క' అంటే ఫలానిది అన్న తర్వాత ఓ రూపానికి తోక వుండకుండా శరీరం వుండకుండా, కాళ్లు ఉండకుండా, నోరు ఉండకుండా, మొరగకుండా, చెవులు లేకుండా ఉంటే ఆ రూపాన్ని 'కుక్క' అనలేము. అలాగే ఓ 'వ్యవస్థ'కు రూపం, స్థలం కాలానుగుణ పాదార్థిక పరిమాణం లేనట్లయితే ఆ వ్యవస్థే లేదన్నది శాస్త్రం. కాబట్టి 'ఆత్మ' అనేది కూడా లేదు. ఎందుకంటే 'ఆత్మ' వాదులు ఆపాదించిన ధర్మాలున్న వ్యవస్థకు వైజ్ఞానిక నిరూపణలు లేవు. ఒక జీవి చనిపోయాక మరో జీవికి ఆత్మ బదలాయించుకొంటుందన్నది వారి వాదన. '' అనే జీవిలో 'ఆత్మ' వుంది. అది బయటపడితే '' మరణించినట్లు అర్థం. అది 'బి' అనే పదార్థంలోకి వెళితే 'బి'లో జీవం వున్నట్లు అర్థం. 'బి' అనే రూపం సిద్ధంగా లేకుంటే '' నుంచి బయటపడ్డ 'ఆత్మ' కొంతకాలం 'దయ్యంగా' వుంటుంది. లేదా మరో కుక్క కడుపులోనో, స్త్రీ గర్భంలోనో ఉన్న 'బి' పిండంలోకో వెళ్లి 'బి' అనే జీవిగా జన్మిస్తుంది. ఇదే '' జన్మ 'బి' జన్మగా పునర్జన్మించినట్లు వారి వాదన. 

          ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైన భౌతిక (ద్రవ్యరాశి, స్థలం, కాలానుగుణ పాదార్థిక రూపం, విద్యుదావేశాల ప్రోదిక్ర రూపం DNA (Deoxy Ribonucleic Acid). లేదా కనీసంలో కనీసం RNA (Ribo Nucleic Acid) అయినా వుండాలి. DNA లేదా RNA లేకుండా జీవం అనే మాటకు అర్థం లేదు. నిర్మాణంతో సంబంధం లేకుండా ఆత్మ మాత్రమే జీవం అయినట్లయితే బల్ల రూపంలో జీవులు ఎందుకు లేవు. ఉన్నట్లుండి ఓ శిల్పంలోకి ఆత్మ వెళ్లడం వల్ల శిల్పం జీవంతో వున్న శిల్పంగా మారడంలేదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు వున్నాడు. ఎన్నడయినా మట్టిరాయి మాట్లాడిందా? కానీ మట్టి రాయి రూపంలో వున్న జీవులు వున్నాయి గానీ అందులో మట్టి రాయిలాగా ముద్దగా లేదే. అందులో కణాలు, కణాల్లో కణాంగాలు, కణాంగాల్లో ధర్మాలు, రసాయానాలు, ద్రవాలు, అణువులు, అణువులలో పరమాణు పొందికలు, పరమాణు పొందికల్లో నిర్దిష్ట అమరిక ఎందుకు ఉండాలి? ఆ నిర్మాణాల్ని అటూ యిటూ కదిపితే ఆ 'ఆత్మ' (జీవం) ఎందుకు పారిపోవాలి? (జీవి మరణించాలి?) మంటలో మండనిది, నీళ్లలో తడవనిది లేశ మాత్రం పొటాషియం సైనైడు పడగానే పారిపోయే పిరికిపందగా ఎందుకుంది? 'ఆత్మ'కు మార్పు లేనట్లయితే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఎందుకు వస్తున్నాయి? జబ్బులు ఎందుకు వస్తున్నాయి? బల్లి తోక తెగితే తోక కూడా కదులుతుంది. తోక తెంచుకున్న బల్లి కదులుతుంది. బల్లి తోకలోని కదలికలకు కారణమైన ఆత్మ ఎవరిది? తోక తెంచుకున్న బల్లి కదలికలోని ఆత్మ ఎవరిది? ఆత్మను కత్తితో కోయలే మన్నారు కదా! అది ఎలా విభజించబడింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు రవంతయినా ఆమోద యోగ్యమైన సమాధానం ఆత్మవాదులు యివ్వరు. 'ఆత్మ' అన్న ఆలోచనకు, నిర్వచనానికే అస్తిత్వంలేనపుడు, ఆత్మల బదలాయింపు తో జరుగుతాయన్న 'పునర్జన్మ' అన్న భావన పూర్తి అసంబద్ద ఆలోచన. పరకా య ప్రవేశం అన్న దానికీ అర్థం పర్థం లేదు. ఈ శరీరం నుండి ఆ శరీరానికి వెళ్లింది ఏమిటి? ఇదేమన్నా టెన్నిస్‌ బంతినా కాసేపు ఈ కోర్టులో కాసేపు ఆ కోర్టులోకి వెళ్లడానికి..

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులుచెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్

మైల మతం , ద్రోహి కులాలు
  
           డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కొలంబియా యునివర్సిటి నుండి తన ఉన్నత చదువు పూర్తి చేసుకుని భారత దేశానికి తిరిగి వచ్చినప్పుడు తన కుటుంబం మహారాష్ట్రలోని సాతారా లో ఉంటుంది.కావున డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు సాతారా రైల్వేస్టషేన్ లో దిగుతారు.తనతో రెండు పెద్ద పెద్ద షూటుకేసుల నిండా పుస్తకాల బరువు ఉంటుంది.రైల్వే స్టేషన్ నుండి తన ఇల్లు 6కి.మీ. దూరంలో ఉంటుంది.కావున డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు అక్కడ ఉన్న టాంగా(గుర్రపు స్వారీ) ని , 4 పైసలకీ ఇంటీ వరకు మాట్లాడుకుంటారు.టాంగా వాడు 2 కి.మీ.దూరంలో వెల్లీన తర్వాతడా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి కులం అడుగుతాడు ,డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మహార్ అని చెప్పడంతో టాంగా వాలా షూట్-బూట్ లో బాబాసాహెబ్ అంబేడ్కర్ ను చూసి నమ్మలేదు , మరియు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారితో ఇలా అన్నాడు ఎందుకు అబద్ధం చెబుతున్నావు నిజం చెప్పు నీ కులం ఎంటి ? అప్పుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు నేను నిజమే చెబుతున్నాను , అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు అన్నారు. వెంటనే టాంగా వాలా టాంగా దిగి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి తిట్టడం మొదలు పెట్టాడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అంటరాని వాడివనినీ వలన నేను మైల అయిపోయాను.ఇప్పుడు నా టాంగా కు గో మూత్రంతో శుద్ధి చెయ్యాలి , అయినా అంటరాని వాడివి నీకెందుకురా షుటు-బుటు, (వాడు మాసిపోయిన చిన్న గోసి , చిరిగిపోయిన బనియాన్ వేసుకుని ఉంటాడు ) నా డబ్బులు నాకు ఇవ్వు నేను తిరిగి వెలతానూ అన్నాడు.సాయంత్రం సమయం మరియు బరువు గల రెండు పెద్ద షూట్- కేసులు ఉండడంతో , బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు టాంగా వాలా తో బతిమాలారు ఈ సమయంలో ఇంత పెద్ద బరువులతో ఎలా వెళ్లగలను.నీకు రెట్టింపు పైసలు ఇస్తాను ఇంటివరకు దించమన్నారు. రెట్టింపు పైసలకీ ఆశపడ్డ టాంగావాలా రావడానికి ఒప్పుకున్నాడు కాని ఒక షరతు అన్నాడు , వస్తాను కాని టాంగాను నువ్వు నడపాలన్నాడు , బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు తప్పనిసరి పరిస్థితులో ఒప్పుకున్నారు.కాని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి టాంగా ను నడిపిన అనుభవం లేకపోవడంతో ఓకి.మీ.దూరం పొయిన తర్వాత టాంగా ఒక గుంతలో బొర్ల పడింది , టాంగావాలా దూకేసాడు , కాని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి మొకాలుకు బలమైన గాయమైంది ఇక టాంగావాలా ఎంత చెప్పిన వినకుండా తన డబ్బులు తిసుకుని అక్కడి నుండి తిరిగి వెళ్ళి పోయాడుబాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మాత్రం తప్పని పరిస్థితుల్లో నెత్తి మీదా ఒక షూట్-కేసు , చేతిలో ఒక షూట్-కేసు పట్టుకుని , మొకాలి గాయంతో కుంటుకుంటు ఇంటి వరకు వెళ్ళి ,రమాబాయి కి పిలిచారు చీకటి ఉండడంతో రమాబాయి దీపం తీసుకొని బయటకు వస్తుందిబాబాసాహెబ్ అంబేడ్కర్ గారినీ ఆ పరిస్థితిలో చూసి రక్తం కారుతున్నా మొకాలిని చూసి ,కుంటుకుంటు వస్తున్న బాబాసాహెబ్ గారినీ చూసి కంటినిండా నీళ్ళతో "ఎమయింది సాహేబ్ " అని అడిగింది , బాబాసాహెబ్ గారు దుఖ పూరితమైన కంఠంతో " ఎం చెప్పమంటావు రాము నేను ఏ దేశం నుండి వస్తున్నానో అక్కడి ప్రజలు నా జ్జానాన్ని చూసి , నా విద్దతను చూసి గర్వ పడుతుంటే నా దేశం మాత్రం నాకు కులం పేరిట ఈ విధంగా అవమాన పరుస్తోంది".అని సమాధానం ఇచ్చారు.

          చిన్నప్పుడు కటింగు తియ్యనని అవమానం పర్చిన మంగలాయన,టాంగావాలా....వీరు వెనుకబడిన కులాల వారే వీరీ ప్రగతి కొరకు బి.సి.కమీషన్ ను నియమించనందకు తన న్యాయశాఖ మంత్రి పదివికి సైతం రాజినామా చేశారు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షతో అన్నిరంగాలలో ముందుకు వస్తున్న వెనకబడిన కులాలు మాత్రం బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని అంటరానివాడుగా మాత్రమే చిత్రికరిస్తున్నారు...!!!               

               స్వేచ్ఛాసమానత్వంసోదరభావం కలిగి ఉన్న,మానవీయ విలువలు కలిగి ఉన్న బౌద్ధ ధమ్మాన్ని, 1800సంవత్సరాల పాటు తక్షశీలనలందా , విక్రమశీలదంతపురి ,వల్లాభి ...మెద. బౌద్ధ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచ దేశాలకు జ్జాన బిక్ష పెట్టిన బౌద్ధ ధమ్మాన్ని మాతృ భూమి నుండి తిరష్కరించి,బ్రహ్మణ వాదము భారత దేశమును ఈశ్వరవాదం , కర్మవాదం ,పిండదానము , పునర్జన్మఅజ్ఞానంఅంధవిశ్వాసములో నెట్టేసి ,కులమతాల అసమానతలతో దేశాన్ని వేల కులాలుగా విభజించి,చాతుర్వర్ణ సిద్దాంతం హిందూ ధర్మానికి పునాదిగా బ్రాహ్మణీయవాదము బలపడింది.        

    బ్రాహ్మణీయులను ఎదురించి నిలచిన వారిని అస్పృశ్యులుగా వెలవేసి వారిని అంటరానివారిగా ,చూడరానివారిగా చిత్రికరించి వారికి బడిని , గుడిని నిషేధించారు,అత్యధిక శాతం ప్రజలను శుద్రులుగా చిత్రికరించి వారిని బానిసలుగా మార్చి కుల వృత్తులకు పరిమితం చేశారు.కులమతాల కుళ్ళు కంపును జనం నర నరాల్లో ప్రవహింపజేసి అసమానతలను శాశ్వతం చేస్తు బ్రహ్మణవాదము ఈ దేశములో బల పడింది.
  బ్రాహ్మణీయవాదము యొక్క కుట్రలను ధ్వంసం చేయడానికి 19వ శతాబ్దం చివరిలో 14 ఎప్రిల్ 1891సంవత్సరములో భీంరావు రాంజీ అంబేడ్కర్ అనే మహా సూర్యుడు ఉదయించాడు.అగ్రకుల మనువాద కుట్రల్నీ ఎడమకాలితో తన్ని నిత్య అవమానాలకు , అణచివేతకుఅవహేళనకు గురవుతున్న ప్రజల బ్రతుకుల్లో వెలుగును తెచ్చారు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.

     బ్రాహ్మణవాద కుట్రలు వలన భారతదేశము లక్షల కులాలుగావేల జాతులుగావందల మతాలుగా , లెక్కలేనన్ని భాషలుగా , చిన్న చిన్న రాజ్యలుగా చీలిపోయిన భారత సమాజాన్ని సర్వసత్తాకప్రజాస్వామ్య దేశముగా రూపొందించడానికి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగము కారణము.కులమతలింగభాషా,భేదము లేకుండా ఈ దేశములో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ను కల్పించి పౌరులుగా సమాజములో గుర్తింపు ఇచ్చి రాహుల్ గాంధికైనలింగడికైనరామయ్యకైనా ఒకే ఓటు ఒకే విలువ కల్పించింది బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మాత్రమే.

               ఈ రోజు రాజకీయ పార్టీలురాజకీయ నాయకులు,జమిందారులు కూడు గుడ్డలేని సామాన్యుడికి కూడా వంగి వంగీ దండాలు పెడుతున్నారంటే ఆ ఓటు హక్కు కల్పించిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కారణం. భారతదేశంలో కార్మిక చట్టాల రూపశిల్పి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.

              డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మహిళలకు ఆస్తి లో సమాన హక్కుల కొరకు ఆ రోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే ఆనాటి ఫ్యూడల్ పాలకులు వ్యతిరేకించడముతో తన న్యాయ శాఖా పదివికి రాజీనామా చేసినా మహిళొద్ధారకుడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలో తెచ్చిన సామాజిక రక్షణ చట్టాలు , హక్కులు చాలానే అనుభవిస్తున్న మనందరికీ తెలుసు ఇవి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు పెట్టిన బిక్షా అని కాని ఈ బ్రహ్మణవాద హిందూ వ్యవస్థ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని కేవలం దలిత నాయకుడిగా ప్రచారం చేస్తున్నారు.

         భారత దేశానికి రాజ్యాంగం అందించి అంటరాని కులాల విముక్తి కొరకై అనేక చట్టాలను తెచ్చిన దార్శనికుడు ఈ దేశంలో ఆర్థికంగా ,సామాజికంగా , అణచివేతకు గురవుతున్నదోపిడీకి గురవుతున్న కులాలజాతుల ప్రజల ప్రధాన శత్రువు బ్రహ్మణవాదం అని ప్రకటించి ఈ దేశాన్ని స్వేచ్ఛా,సమానత్వంసౌబ్రాతృత్వం నీడ కింద తెచ్చిన నిజమైన దేశ భక్తుడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. 

 మనకోసం......

              కులమతాల వలలో చిక్కబడి ఉన్నా ఈ అస్పృశ్య బాంధవులను ఉద్ధరించడంలో నేను అసఫలీకృతమైతే నన్ను నేను తుపాకీతో కాల్చుకొని అంతమైపోతాను అంటు తన జాతి నిర్మాణం కోసం , తన జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రం కొరకు పోరాటం చెస్తున్నప్పుడు.....ఎన్ని యాతనల గాయలను సహించాడు మన కోసం ! ఎన్ని రాత్రులు మేల్కొన్నాడు మన కోసం ! ఎన్ని కష్టాలు సహించాడు మన కోసం ! కష్టాలతో కృంగిపోయిన తన భార్య శిరస్సు కింద ఏ ఒడినైతే ఇవ్వాలో ఆ ఒడిని అతను దుఖగ్రస్తులైన మన తల్లి తండ్రుల నెత్తి కింద ఇచ్చాడు ! పిడకలు చేసి పగలు రాత్రి సంసారపు పోయిలో పొగను ఊదే తన భార్య కన్నీళ్లను తుడవటానికీ ఏ చేతులైతే ఎన్నడు పనికిరాలేదో , ఆ చేతులు మన తల్లిదండ్రుల ఆనంత కన్నీళ్లను తుడవడంలో వ్యస్తమై ఉండేను.కష్ట జీవితమైన తన భార్య యొక్క పిడికెడంత శరీరాన్ని కప్పడానికి ఒంటీనిండా వస్త్రం ఇవ్వలేని ఈ మన తండ్రి తన సర్వ జీవితాన్ని మాహా వస్త్రంగా మార్చి మన చిరిగిన దేహం పై కప్పుతుండేను ఈ విధంగా తన పిల్లలు రమేష్ పొయాడు , గంగాధర్ పొయాడు,అమ్మాయి ఇందు కూడా మరణించింది , ఇంకా ఒడిలోనే రాజరత్న జారుకున్నాడు ఇంతటి దుఖాలనూ సహించాడు మన కోసం.
         మృత్యువు చేతిలో ఊయ్యాల దారానిఛ్చి జీవితపు జోలపాట పాడే ఈ తల్లిదండ్రులు ఎవరికోసం త్యాగం చేశారు ? ఎవరికోసం వారి జీవితాలను హోమం చేశారుఎకైక తనయుడైనమో యశ్వంత్ రావు కోసం ఎక్కడ సిఫారసు చేయలేదు. వ్యాధిగ్రస్త వయస్సు లో కూడా ఓర్పును పాటించే సంయమాల దీపం ఎవరికోసం కాలింది..ఒక్క బ్రెడ్ ముక్క తిని18గంటలు అభ్యాసం చేసి గ్రంథాలను రచించిన ఈ యుగంధరుడు ఎవరికోసం కష్టపడ్డాడు..?
       ఎందుకు జోహార్లు కొట్టే మన చేతుల్నీ బంధన విముక్తి చేశారు...?ఇందుకొరకే కదా మనషి మానవత్వాన్ని ధిక్కరించే నాలుకల్నీ పీకేయగలం అని , దీనికొరకే కదా మన మీదా అన్యాయాలు,అత్యాచారాలు చేసే వారి గొంతను కోయగలం అని ,......మరి ఈ చేతులు ఈ రోజు ఏమి చేస్తున్నాయి...ఈ చేతులు కావాలి పడికెల్నీ బిగించి యుధ్ధపూరిత నినాదాల్నీ ఇవ్వడానికిఈ చేతులు కావాలి శత్రువులనిర్దయుల దౌడల్ని బద్ధలు కొట్టడానికి...


అంభేధ్కర్ తన కుమారుడు రాజరత్న ఆకస్మిక మరణం తర్వాత.. స్నేహితుడు దత్తోబా రాసిన పరామర్శ ఉత్తరానికి బాబాసాహెబ్ రాసిన ప్రత్యుత్తరం...
      ...............   లేఖ .....................

దామోదర్ హాల్,
పరేల్, బోంబే 12,
19-1-26.

ప్రియమైన దత్తోబాకి..డా.బి.ఆర్ అంభేధ్కర్ రాయునది...
నీ ఉత్తరం ఒకింత ఆశ్చర్యాన్నే మోసుకొచ్చింది. శివ తర్కార్ నీకు నా కుమారుడి మరణం గురించి రాసి చాలా రోజులు గడిచిపోయినా నీ వద్ద నుండి ఎలాంటి ఉత్తరం రాకపోయేసరికి, నువ్వు నాగురించి పట్టించుకోవడం మానేసావేేమో అనుకున్నాను. కానీ అది నిజం కాదని, కనీసం ఇలాంటి విషాద సమయాల్లోనైనా నువ్వు నాకు ఓ సంతాప వాక్యం రాయగలుగుతున్నావంటే, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపొలేదని అర్ధమౌతుంది.
నేనూ నా భార్యా.. బిడ్డను కోల్పోయిన విషాదం నుంచి కోలుకున్నామని చెప్తే అది అబద్ధమే ఔతుంది. బహుశా అదెప్పటికీ జరగదేమో కూడా. ఇప్పటివరకూ మేము నలుగురు పిల్లలను సమాధిచేసాము. ఒక కూతురు, ముగ్గురు కొడుకులు, అందరూ నిజానికి చాలా చక్కటి అందమైన, ఆరోగ్యమైన బిడ్డలే. వాళ్ళు హాయిగా జీవించాల్సిన రేపటిసంగతి అలా ఉంచితే, వీళ్ళను బతికించుకోలేకపోయామన్న ఆలోచనే గుండెను పిండేసేదిగా ఉంటుంది.

మా రోజులు మబ్బులుసాగినట్టుగా నిశ్శభ్దంగా సాగిపోతున్నాయి అనడంలో సందేహంలేదు.  బైబిల్లో చెప్పినట్టు"మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు తనసారమును కోల్పోతే మరి అది దేనివల్ల సారము పొందును?"అన్నట్లుగా మా బిడ్డల మరణాలతో మేము మా జీవితపు రుచినే కోల్పోయాం. ఈ వాక్యాల్లోని నిజాన్ని నా శూన్యం నిండిన ఈ జీవితపు ప్రతీ క్షణమూ అనుభవిస్తున్నాను. నా ఆఖరి కొడుకు చాలా చక్కటివాడు, నేనలాంటి బిడ్డను ఎక్కడా చూడలేదు. వాడుపోవడంతో నాజీవితం ఇకపై  కలుపుమొక్కలతో నిండిన తోటలాంటిదే. సరే ఇక ముగిస్తాను. దుఖ్ఖం కమ్ముకొస్తుంది. ఇకరాయలేను.

        అన్నీ పోగొట్టుకున్నవాడి      శుభాశీస్సులతో.. మీ..బి.ఆర్. అంబేట్కర్.


     డా.బి.ఆర్.అంబేడ్కర్  జీవించింది  నిండా  65  యేళ్ళు మాత్రమే. అంబేడ్కర్ 6 డిశెంబర్ '1956 న మరణించారు. తన జీవితములో అంబేడ్కర్ అనేక సభలు సమావేశాలలో సందేశాలు ఇచ్చినా, తన జీవిత చరమాంకములో అనగా 18 మార్చ్ 1956 న ఆగ్రా లో ఇచ్చిన సందేశాన్ని చారిత్రాత్మక సందేశముగా చెపుతూ ఉంటారు.
      ఆ సందేశములోదళిత బహుజన ప్రజలకు, యువతకు, భూములు లేని శ్రామికులకు,రిజర్వేషన్ లతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారికివిద్యార్ధులకు, వివిధ సంఘాల నాయకులకు, విడివిడిగా సందేశమిచ్చారు. 
అందులో, ప్రాముఖ్యముగా., రిజర్వేషన్ లతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారిని ఉద్దేశించి ఈ క్రింది మాటలు చెప్పారు.
        "Our society has progressed a little bit with education. Some persons have reached high posts after getting education. But these educated persons have betrayed me. I expected that they would do social service after getting higher education. But what I see is a crowd of small and big clerks who are busy in filling their own bellies. Those who are in government service have a duty to donate 1/ 20th part of their pay for social work. Only then the society will progress otherwise only one family will be benefitted. An educated social worker can prove to be a boon for them.” 

ఈ మాటలు చెప్పినది 1956 లో.అంటే.., షుమారు 61 సంవత్సరాలు దాటిపోయింది.
ఆంబేడ్కర్ గారు ఆనాడు అన్న ఆ మాటలు నేటి తరములో ఉన్న మనకు ఎంతవరకు applicable అని ఇప్పుడు మనం అర్ధం చేసుకోవాలి.
ఆనాటి కాలములో ఉన్న మొత్తము ప్రభుత్వ ఉద్యోగాలు, నేటి సంఖ్య తో పోల్చుకుంటే చాలా తక్కువ, అప్పటికి ఇంకా ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్, బి.సి.లకు, మహిళలకు రిజర్వేషన్స్ వంటివి ఇంకా పఠిష్టం గా అమలు కాని రోజులు. అంటే, అంబేడ్కర్ గారి ఈ మాటలు అనాటి తరానికంటే నేటి తరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు  more applicable అనమాట.

అవును, అంబేడ్కర్ గారు  అన్న ఆ మాటలు లోతుగా ఆలోచించాలి., అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.
ఆ మాటలు అర్ధమవ్వాలి అంటే.,
(1) తరతరాలుగా ఉన్న తాత ముత్తాత ల చరిత్ర అర్ధమవ్వాలి.
(2) తాత ల చరిత్ర వేరు, నేను వేరు అనే ధోరణి ఉండకూడదు.
(3) ఈ దేశములో నివసిస్తున్న ప్రతి దళితుడు, మూడు తరములు వెనక్కి వెళ్ళి అప్పుడున్న ముత్తాత, అంతకుముందున్న తరముల పితృ సమానులైన వారంతా, అంటరానివారిగా జీవించి, ఎవరూ చేయలేని కులవృత్తులైన పాకిపని,పెంటపని చేసినవారనే విషయము తెలుసుకోవాలి.
(4) ఇరవయ్యొవ శతాబ్దములో., డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు పుట్టకుండా ఉంటే., మనమంతా, ఇంకా అదే కుల వృత్తులలో కొనసాగేవారమని గుర్తించాలి.
ఈ నాలుగు విషయాలు గురించి నాలుగు నిమిషాలు ఆలోచిస్తే., ఆయన చెప్పిన  payback  1/20 part యేంటి, ½ part  అయినా సమజానికి వెచ్చించాలని అనిపిస్తుంది.

అంబేడ్కర్ వ్రాసిన మరికొన్ని books చదివితే మరొక విషయము అర్ధం అవుతుంది. అదేమిటంటే..,ఆయన చెప్పిన  payback  కేవలము డబ్బును  donate చెయ్యడము గురించి కాదు. ఆయన payback  చెయ్యమని చెప్పినది మూడు వస్తువులను., అవి.,
(1) Treasure
(2) Time
(3) Talent
[All these three terms starts with ”T”]
వివరణలు:
(1) TREASURE  : నీ జీతము [Gross salary] నెలసరి రూ.30000/- అయితే షుమారు రూ.1500/- మన దళిత సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఆ రకముగా., మన  Car Loan, Home Loan లకోసం కట్టే  EMI  లను సర్దుబాటు చేసుకోవాలి.దీనర్ధం, SC.ST  సంఘాలకు  donations ఇవ్వాలనికాదు. ఈ క్రింద చెప్పిన విధముగా కూడా చెయ్యవచ్చును
(A) మీ సమీప గ్రామాలలో తినడానికి తిండి లేని దళిత కుటుంబాలలో పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు, సైకిల్  కొనిస్తే చాలు.
(B) సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న విద్యార్ధులకు స్కూల్ లేదా కాలేజ్ యూనిఫాం  కొనిస్తే చాలు.
(C) మన బంధువులలోనే ఉన్న కడుపేద కుటుంబాలకు నేలకు ఈ రూ.1500/-  donate  చేస్తే చాలు.
(2)  TIME  : ఇది చాలా విలువైనది. మన సమయాన్ని, నెలకు ఒక రోజు మన సమాజములో గడపాలి. SC/ST Associations వారు పెట్టేసభలు సమావేశాలకు హాజరవ్వాలి. అది తరువాత తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మన  “Target group”  అనేది దళిత విద్యార్ధులు అవ్వాలి.  TIME అనే విషయములో మనందరికంటే ఎంతో ధనవంతులు. వారి జీవితాలు చాలా పెద్దవి.
(3)  TALENT  : “నేలకు గట్టిగా అణిచివేయబడిన బంతి ఎక్కువ ఎత్తు ఎగురుతుంది  అనే సూక్తి, నేటి దళితులకు talent ఎక్కువ అని చెపుతుంది. వీరికి సహజంగానే క్రమశిక్షణ, పెద్దలంటే భయము, శ్రమ చెయ్యగల దేహ ధారుడ్యం ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే మించి, "మనుగడ కోసం పోరాటం" అనే అవసరం.   వీటి వలన  talent  అనేది కూడా బాగనే ఉంటుంది. ఈ  talent ను కూడా మన సమాజానికి పంచి ఇస్తే, మన యొక్క ఆ  talent పెరగడమే కాకుండా., మన సమాజం కూడా వృధి చెందుతుంది.

ఈ  Treasure,Time,Talent లను మన సమాజమునకు  5% పంచి ఇస్తే., ఆంబేడ్కర్ కలలు కన్న కులరహిత సమాజం ఎంతో దూరాన ఉండదు.

దయచేసి గమనించండి: నా ఈ పోస్ట్, ఈ మాటలు చదువుతున్న వారిని ఉద్దేశించి కాదు. ఈ పోస్ట్ చదివారు అంటే., మీరు ఇప్పటికే అంబేడ్కర్ చెప్పిన దారిలోనే ఉన్నారని అర్ధము. ఎందుకంటే., ఈ పోస్ట్ చదివి ఇప్పటికే అన్నిటికంటే అమూల్యమైన మీ సమయాన్ని payback చేశారని అర్ధం. నేనైతే, రోజుకొక్క సారైనా, మా అమ్మయి తో, నా వైఫ్ తో కలిసి అంబేడ్కరిజం గురించి చర్చించుకుంటాము.  కాని రిజర్వేషన్ లో ప్రభుత్వ ఉద్యోగం పొంది., అంబేడ్కర్ అంటే ఎవరో తెలియని మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారికి ఈ పోస్ట్ చేరాలి.

*అవి బాబాసాహెభ్ తన చివరి రచన " Buddha and his Dhamma" రాస్తున్న రోజులు...*

*ఆ సమయం లో బాబాసాహెభ్ అంబేద్కర్ ఢిల్లీ లోని అలీపూర్ రోడ్ లోని 26 నెం.*
*బంగళా లో నివాసం ఉంటుండేవారు.*
*ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత 8గంటల సమయం లో తన రీడింగ్ రూం లో కూర్చొని తన పుస్తకం రాయడం లో నిమగ్నమైపోయాడు.*
*బాబాసాహెభ్ అనుయాయుడు 'నానక్ చంద్ రత్తు' ఆరోజుకి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి, బాబాసాహెభ్ టేబుల్ దగ్గరగా నిలబడి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు.*

*కాసేపటి తర్వాత బాబాసాహెభ్ రత్తూతో "ఇక నువ్వు వెళ్లి పడుకొని పొద్దున్నే రమ్మని చెప్తారు.*
*ఎప్పటిలాగే పొద్దున్న 8 గంటలకి బాబాసాహెభ్ దగ్గరికి వచ్చిన నానక్ చంద్ రత్తూ రాత్రి వెళ్లేటప్పుడు ఎలాగైతే పుస్తక రచన లో నిమగ్నమైన బాబాసాహెభ్ అప్పటికీ కూడా అలాగే కుర్చీలో కూర్చొని పుస్తకాన్ని రాస్తూనే ఉన్నాడు అంటే గత 12 గంటలుగా పుస్తకం రాస్తూనే ఉన్నాడు.*

*నానక్ చంద్ రత్తూ గారు నిశ్శబ్దం గా బాబాసాహెభ్ పక్కనే చూస్తూ నిలబడి పోయాడు.*
*అలా నిలబడి చాలాసమయం గడిచిపోయింది కానీ బాబాసాహెభ్ తలెత్తి చూడను కూడా లేదు...తన పరిసరాలని కూడా గమనించలేనంతగా బాబాసాహెభ్ తన రచనలో నిమగ్నమైపోయారు.*
*బాబాసాహెభ్ దృష్టి మరల్చడానికి నానక్ చంద్ రత్తూ టేబుల్ మీద ఉన్న పుస్తకాలని సర్దుతూ ఉండగా బాబాసాహెభ్ చూసి "రత్తూ నువ్వింకా వెళ్లలేదా" అనగానే కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా బాబాసాహెభ్ కాళ్ళ దగ్గర కూర్చొని* *"అయ్యా...ఉదయం 8:30 అవుతుంది, గత 12 గంటలుగా రాస్తూనే ఉన్నారు...*
*అసలెందుకు ఇంతగా కష్టపడుతున్నారు" అనడం తో బాబాసాహెభ్ "రత్తూ...*
*నా ప్రజలు ఇంకా వెనకబడే ఉన్నారు, ఏ దారిలో నడవాలో స్వంతంగా నిర్ణయాలు తీసుకునేస్థితిలో కూడా లేరు, నేనుచనిపోయిన తర్వాత నా పుస్తకాలే వారికి సరైన దిశానిర్దేశం చేస్తాయి, ప్రతి ఇంటికి నేను వెళ్లలేను కానీ నా సాహిత్యం మాత్రం వెళ్తుంది.*
*నా రచనలు చదివిన వారికి నా ఆలోచనలు అర్థం అవుతాయి, నా సిద్దాంతం, ఆలోచనలు నా పుస్తకాల ద్వారానే తెలుసుకుంటారు...*

*నా ఆలోచనలు అర్థం చేసుకున్న ప్రజలు తమ కర్తవ్యం ఏంటో తెలుసుకొని పని చేస్తారు..*
*అందుకే నేనింత కష్టపడుతున్నాను"*
*(నానక్ చంద్ రత్తూ రచించిన - डॉ. अम्बेडकर - कुछ अनछुए  నుండి)*

*బాబాసాహెభ్ రచనలు చదివి, ఆలోచనలు అర్థం చేస్కొని వాటిని సాధించేదిశగా అడుగులేసేవారే నిజమైన అంబేడ్కరిస్టులు...*

*జై భీమ్ జై భారత్*

సౌ జ న్య  o - whatup message