Pages

ఎంత చిత్రమో ఈ జీవిత సత్యాలు

  *_పట్టీల విలువ వేల రూపాయల్లో... కాని వేసేది కాళ్ళకి..! కుంకుమ విలువ రూపాయలలో... కానీ పెట్టుకొనేది నుదుటిపైన.. విలువ ముఖ్యము కాదు.. ఎక్కడ పెట్టు కుంటామనేది ముఖ్యము..!_*


*_ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు... చక్కెర లాగ మాట్లాడి మోసగించే వాడు నీచుడు._*

   

*_ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు.. తీపిలో పురుగులు పడని రోజూ లేదు..!_*


*_హే మానవా ! ఈ జీవితం అంత విలువైనదేమి కాదు.. ఏడుస్తూ ఈ లోకంలో అడుగిడుతావు. ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోతావు..!_*


*_రమ్మన్నా సన్మార్గములోకి యెవ్వరు రారు.. వద్దన్నా చెడు మార్గమున్నే యెంచుకుంటారు._*


*_పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి.. సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు._*


*_పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు.. ఖరీదైన సారాయిలో నీళ్ళు కలిపి తాగుతారు._*


*_ఆహాహా యేమి ఈలోకం..!_*

  

*_పెళ్ళి ఊరేగింపులో బంధు మిత్రులు ముందు.. వరుడు వెనకాల !_*

*_శవయాత్రలో శవము ముందు.. బంధు మిత్రులు వెనకాల !_*


*_శవాన్ని ముట్టి నందుకు స్నానం చేస్తారు. మూగ ప్రాణులను చంపి భుజిస్తారు !_*


*_కొవ్వు వత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకొంటారు. కొవ్వు వత్తులను ఆర్పి జన్మ దినాన్ని ఆచరిస్తారు..! హే మానవా !_*


*_ఆకలి విలువ పేదవానికి తెలుసు.. కష్టము విలువ కర్షకునకు తెలుసు._*


   *_ఇదే పచ్చి నిజం_*

   *_పుట్టినపుడు జాతకం.._*

   *_మధ్యలో నాటకం.._*

   *_చావగానే సూతకం.._*

   *_ఐనా ఆగదు జనుల మధ్య కౌతుకం..!_*


*_సకల జీవులకు అన్నమే పరబ్రహ్మమని పెద్దలు అన్నారు. అది తెలుసు కోకుండా మూఢులైనవారు చాలామంది ఉన్నారు.._*


*_కళ్ళతో ఈ జగత్తును చూస్తే కనిపించేవి దృశ్యాలే... హృదయంతో చూడగలిగితే జగత్తంతా సుందరమే..!_*


మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు

 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!


పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.!


భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!


సహజీవనాన్ని సంసారమంటున్నారు.!


గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!


డూప్ ల పోరాటాన్నిహీరోయిజం అంటున్నారు.!


పదవుల పోరాటాన్నిప్రజాస్వామ్యమంటున్నారు


అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!


ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!


సరదాలను సంస్కృతి అంటున్నారు.!


భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!


కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!


ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!


మందు పోయిస్తేనే...మిత్రుడు అంటున్నారు.!


కట్నం తెస్తేనే...భార్య అంటున్నారు.!


సొమ్ములు తెస్తేనే...సంసారం అంటున్నారు.!


కాసులు తెస్తేనే...కాపురం అంటున్నారు.!


అవినీతి చేయకపోతే... అసమర్ధుడంటున్నారు.!


అక్రమాలు చేయకపోతే... అమాయకుడంటున్నారు.!


అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చినవాడంటున్నారు.!


నిజం పలికితే...బ్రతక నేర్వని వాడంటున్నారు.!


న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!


అన్యాయంగా బ్రతికితే...ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!


అన్యాయాన్ని ఎదిరిస్తే...అతనికెందుకు అంటున్నారు.!


నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!


మాయకమ్మిన జీవితాన్నిశాశ్వతమనుకుంటున్నారు.!


మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!


పరిస్థితులకనుగుణంగా..పాత అర్ధం చెరిగిపోయి

ప్రయోజనాలకు అండగా...పరమార్ధం ఆవిర్భవిస్తోంది!


స్వార్ధకాంక్షాణుగుణంగా విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది!🤔🤔


Must Read - ఒక అద్భుతమైన కథ

     రాత్రి 11 గంటలకు.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.  ఇదే చిరునామా.  మీరూ ..." అని అడిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను.  నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


    అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు.  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు.  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


    నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు.


    నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను.  నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు.  అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


    "ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది.  అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది.  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


    "సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము.  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను.  చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.  


    ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.  


    అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు అరవింద్.  మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి.  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆ మిత్రుడికి విషయం చెప్పాను.  అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది.  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.  


    ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.  


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు.  మిగిలినవన్నీ

 దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి 


ఈ కథ మీ కూడా నచ్చితే మీ స్నేహితులకు

అవసరం లో ఉన్నవారికి సాయ పడదాం.




రేప్ లు ఎందుకు జరుగుతున్నాయి????

 

ఎన్ని  చెట్టాలు తెచ్చినా ఆడవారి మీద జరుగుతున్న అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి అసలు లోపం ఎక్కడ ఉంది??? 


సెక్స్ ఎడ్యుకేషన్  లేకపోవడం 


మన విద్యావ్యవస్థ,  ఆచార వ్యవహారాలూ,  రాజకీయాలు అన్నీ ప్రక్షాళన చేస్తే తప్ప ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.   "సెక్స్ ఎడ్యుకేషన్ " అనేది చిన్నతనం నుంచి తప్పనిసరిగా ఉండాలి.  లేత మెదళ్లను అర్థం కానీ అయోమయం స్థితిలో పడేయడం  వల్లే సమస్యలు వస్తున్నాయి . 1st క్లాస్ పిల్లలికి సైన్స్ పాఠం చెప్పేటప్పుడు  "పార్ట్స్ ఆఫ్ ది బాడీ"  అంటూ చిత్రపటాన్ని చూపిస్తూ కళ్లు,  ముక్కు,  నోరు అని నేర్పిస్తారు. కానీ జెనిటల్ ఆర్గాన్స్ మాత్రం కవర్ చేసి వాటి గురించి అసలు చెప్పరు. ఎందుకు?  అవి మన శరీరంలో భాగం కాదా? !  అలా వదిలేసి చెప్పేది హిపోక్రసి అవుతుందే తప్ప సైన్స్ అవ్వదు. అభంశుభం తెలియని వయసులోనే కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదు అనే ఒక విషసంస్కృతికి అక్కడే బీజం పడుతుంది.  

పిల్లలు పెరుగుతున్న దశలో ఇలాంటి విషయాలపట్ల వాళ్లకు ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటిని తీర్చడానికి తల్లిదండ్రులు కానీ,  టీచర్లు కానీ ఇష్టపడరు.  పైగా అలాంటి ప్రశ్నలు వేసినందుకు తిట్టిపోస్తారు.  ( డౌట్ రావడమే తప్పైనట్టు ) కొన్ని విషయాలు కొందరితో అస్సలు మాట్లాడనే కూడదు అనే అభిప్రాయాన్ని పెద్దలే కలగజేస్తారు.  9th,  10th క్లాస్ కి వచ్చేసరికి సైన్స్ లో  'సెక్స్  డిటెర్మినేషన్ ' లాంటి లెసన్స్ చెప్పడానికి అటు టీచర్లు,  వినడానికి ఇటు పిల్లలూ ఇబ్బంది పడుతూ ఉంటారు.  సందేహాలు తీరకపోగా మరింత పెరుగుతాయి. తెలుసుకోవాలన్న ఆసక్తీ పెరుగుతుంది. దానికి ఈ ఆధునిక ప్రపంచంలో లెక్కలేనన్ని దారులు.  చిన్నతనం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా జ్ఞానాన్ని జ్ఞానంగా నేర్చుకున్నప్పుడు  మంచి ఏదో,  చెడు ఏదో తెలుసుకునే విచక్షణ ఏర్పడుతుంది. అలా కాక తప్పుడు భావనతో,  తప్పుడు మార్గాల్లో  తెలుసుకునే పిల్లల ఆలోచనలు తప్పు దారిలో వెళ్లే అవకాశముంది.  


ప్రశ్న తిరస్కరించే వారికి ప్రశ్నించే హక్కు లేదు 



 పిల్లలు ఎలాంటి ప్రశ్నలు వేసినా విసుక్కోకుండా,  తిట్టకుండా తల్లిదండ్రులు ఎలాంటి సంకోచం లేకుండా (ఇది పిల్లలకు అనవసరం అనే ఆలోచన లేకుండా ) అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పగలిగితే,  తాము చేసే ప్రతీ పనిని నిస్సంకోచంగా తల్లిదండ్రులకు చెప్పుకునే స్వేచ్ఛ పిల్లలికి ఏర్పడుతుంది. అలా పేరెంట్స్ తో ఎలాంటి విషయమైనా చెప్పగలిగే పిల్లలు తప్పుడు పనులు చేయలేరు.  చాలా మంది పేటెంట్స్ టీనేజ్ లో ఉన్న తమ పిల్లలు ఏ విషయాలూ చెప్పరని అన్నీ దాచిపెడుతూ ఉంటారని అంటూ ఉంటారు.  మరి వీళ్ళు ఆ పిల్లలికి చిన్నతనం నుండి దాచకుండా అన్నీ చెప్పగలిగారా?  వీళ్ళు దాచిపెట్టినప్పుడు పిల్లలు దాచకుండా చెప్పాలని ఆశించడం ఎంతవరకు కరెక్ట్??  


ఆ జ్ఞానం పేరెంట్స్ కే లేదు 


అసలు దేన్ని ఆమోదించాలి ,  దేన్నీ తిరస్కరించాలి అనే జ్ఞానం పేరెంట్స్ కే లేనప్పుడు పిల్లలకి ఎలా వస్తుంది!!!  'అసలు పిల్లలు ఎలా పుడతారు'?  పిల్లలికి వచ్చే అతి సాధారణమైన సందేహాన్ని  (నేర్చుకోవడంలో భాగం ) చెప్పడానికి తిరస్కరిస్తారు.  ఇప్పుడు వస్తున్న అల్లరి చిల్లరి వల్గర్ సినిమాలు పిల్లలతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మెదడులో ఎంతో కాలంగా ఉన్న చిక్కుముడులు అశ్లీలంతో కలిసి విడిపోతుంటే తెలిసీ తెలియని వయసులో పిల్లల ఆలోచనలు తప్పుదారి పట్టకుండా ఎలా ఉంటాయి.??  మెదడు కలుషితం కాకుండా ఎలా ఉంటుంది??!!  రేప్ లు జరగకుండా ఎలా ఉంటాయి!?  

విలువలతో కూడిన అవగాహన కల్పించే సెక్స్ ఎడ్యుకేషన్ ని పెద్దలు అసహ్యించుకుని పిల్లలికి దూరం చేస్తే...  అసహ్యించుకోవాల్సిన అశ్లీల, అసభ్యకర విషయాలకు అవగాహనారాహిత్యంతో పిల్లలు దగ్గరవుతున్నారు. 


అవగాహన లేమి ప్రమాదకరం 


నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక రోజు zoology  క్లాస్ జరుగుతుండగా  NACO (National Aids Control Organisation) నుండి కొందరు వచ్చారు స్టూడెంట్స్ కి  ఎయిడ్స్ పట్ల అవేర్నెస్ కల్పించడానికి. చాలా విషయాలు చెప్పారు.  తర్వాత కండోమ్స్ చూపించారు అవి ఎలా వాడాలి,  ఎలా రక్షణ కల్పిస్తాయి వివరంగా చెప్పారు. మా zoology సర్ కూడా వాళ్లకు సహకరిస్తూ మాకు వివరించారు.  వాళ్ళు వెళ్ళిపోయాక  అమ్మాయిలు గోల.  అందరి ముందు,  బాయ్స్ ముందు ఇంత చెత్తగా మాట్లాడతారా?  సర్ కి అయినా బుద్ధి ఉండాలి కదా అని ఏవేవో మాటలు అందులో తప్పేంటో నాకు అర్థం కాలేదు?  అది చదువులో భాగం కాదా? !  తెలుసుకోవలసిన అవసరం లేదా? ! 

ఇంటర్ లోనే హిందీ సర్ ఉండేవాడు.  మాకు మహాభారత్ నాన్ డిటైల్డ్ గా ఉండేది.  అందులో ద్రౌపది వస్త్రాలు పీకడం, ఇతర ఆడవాళ్ళ పాత్రలు ఎంతో ఉత్సాహంగా,  కుళ్ళు జోకులతో,  వెక్కిలి నవ్వులతో చెప్పేవాడు. అమ్మాయిల్ని అదో రకంగా చూస్తూ...  వాడి వికృత చేష్టలు అందరూ తెగ ఎంజాయ్ చేసేవాళ్ళు అమ్మాయిలు.  వాడిని చూస్తేనే నాకు  అసహ్యం. హిందీ మీదే విరక్తి పుట్టేది. ఇలాంటి ప్రమాదకరమైన ధోరణి ఎవ్వరూ అడ్డుకోరు. చాలా మందికి ఇది తప్పుగానే అనిపించదు.  నేర్చుకోవాల్సిన దాన్ని అసహ్యించుకుంటున్నారు.  అసహించుకోవాల్సిన దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.  


విలువలతో కూడిన చదువే పరిష్కారం


పాఠ్య పుస్తకాల్లో ఎందుకూ పనికిరాని పురాణాలు కాదు పిల్లలికి కావలసింది. వాస్తవాలు, విలువలతో కూడిన జ్ఞానం.  దేశంలో ఆడపిల్లల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే చాలా మంది పేరెంట్స్ అలాంటి న్యూస్ కూడా పిల్లలికి తెలియకుండా జాగ్రత్తపడతారు.  అడిగినా చెప్పరు.  మీకెందుకు పెద్దవాళ్ళ విషయాలు అంటారు.  చిన్నతనం నుండి విలువలు, బాధ్యతలు తెలియకుండా పెంచితే పెద్దయ్యాక ఒక్కసారిగా ఎలా వస్తాయి??  

ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే,  ఆ అమ్మాయి ఎంతటి నరకాన్ని అనుభవించి ఉంటుందో, ఎలాంటి మానసిక క్షోభకు గురై ఉంటుందో పిల్లలికి కచ్చితంగా చెప్పాలి.  ముఖ్యంగా మగపిల్లలికి.  పసితనం నుంచి ఆ పెయిన్ ఫీల్ అవుతూ పెరిగే పిల్లలు ఆడవారితో అసభ్యముగా ఎప్పటికీ ప్రవర్తించలేరు. అందుకే పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి సంఘటనలు,  పర్యవసానాలు,  వాటివల్ల కలిగే బాధ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే పాఠాలు ఉండాలి.  అలాగే తల్లి తను సమాజంలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, కలిగిన బాధ మగపిల్లలికి కచ్చితంగా చెప్పాలి.   ఆ పెయిన్ మగపిల్లలు చిన్నతనం నుండి ఫీల్ అయినప్పుడే సమాజంలో ఆడపిల్లల గౌరవం నిలబడుతుంది.


ఐపిసిలో సెక్షన్ ల అర్థం తెలుసుకోండి


  * సెక్షన్ 307 * = హత్యాయత్నం

  * సెక్షన్ 302 * = హత్యకు శిక్ష

  * సెక్షన్ 376 * = అత్యాచారం

  * సెక్షన్ 395 * = దోపిడీ

  * సెక్షన్ 377 * = అసహజ కదలికలు

  * సెక్షన్ 396 * = దోపిడీ  సమయంలో హత్య

  * సెక్షన్ 120 * = కుట్ర

  * సెక్షన్ 365 * = కిడ్నాప్

  * సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం

  * సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం

  * సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు

  * సెక్షన్ 378 * = దొంగతనం

  * సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్

  * విభాగం 191 * = తప్పు లక్ష్యం

  * సెక్షన్ 300 *  =  హత్య

  * సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం

  * సెక్షన్ 310 * = మోసం

  * సెక్షన్ 312 * = గర్భస్రావం

  * సెక్షన్ 351 * = దాడి చేయడానికి

  * సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు

  * సెక్షన్ 362 * = కిడ్నాప్

  * సెక్షన్ 415 * = ట్రిక్

  * సెక్షన్ 445 * = దేశీయ వివక్ష

  * సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి 

               జీవితంలో పునర్వివాహం

  * సెక్షన్ 499 * = పరువు నష్టం

  * సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.

   

 మన దేశంలో, మనకు తెలియని కొన్ని చట్టాలు ఉన్నాయి.


*ఐదు ఆసక్తికరమైన విషయాలు*  

ఆ సమాచారం తెలుసుకుందాం,  ఇది జీవితంలో ఎప్పుడైనా    ఉపయోగపడుతుంది.


 *(1) సాయంత్రం 6 గం,,తర్వాత    ఉదయం 6గం,, లోపు  మహిళలను అరెస్టు చేయలేము* -


  క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత మరియు ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు.  పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు.  ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.


  *(2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు*


  పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు.  గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు.  కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.


  *(3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు మరియు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు* -


  ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు మరియు త్రాగవచ్చు మరియు ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.  హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు.  హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు.  మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.


   *(4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు* -


  ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు.  గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు మరియు ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి.  అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.  ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


  *(5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు*


  ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు.  అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.


  ఇవి ఆసక్తికరమైన వాస్తవాలు, ఇవి మన దేశ చట్టం ప్రకారం వస్తాయి, కాని వాటి గురించి మనకు తెలియదు.  మీ జీవితంలో ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలను మీకు అందించడానికి  నేను నా వంతు ప్రయత్నం చేస్తాను.


  *ఈ సందేశాన్ని మీ వద్ద ఉంచుకోండి, ఈ హక్కులు ఎప్పుడైనా చెల్లుతాయి*.



మాయదారి జబ్బు - కరోన


1 ప్రశ్న :-.  కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు?

 జవాబు :-    కరోనా మన శరీరం లో ప్రవేసంచాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.

మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు. 

Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది. 

అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది. 

అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు. 

 

2  ప్రశ్న :-. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?

 జవాబు:-    శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. 

మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా  చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో  పోరాడ గలదు.

 

3వ ప్రశ్న:-.  Glycin ఎలా తయారవుతుంది?

జవాబు:+ Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm వరకు తీసుకోవాలి. 

Glycin కి ఉపయెాగ పడేవి

 1.  తోటకూర

 2. . ఆవాలు

 3.   నువ్వులు

పోషకాహారాలు

 4.    కరివేపాకు

 5.    మునగాకు

  సి విటమిన్

 6.   నిమ్మ

 7.    ఉసిరి

వీటి ద్వారా proteins Amino Acids తయారవుతాయి. వీటి ద్వారావెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే Glycin తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్  ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి

పైన చెప్పిన పదార్దములు   ప్రతి రోజు   తినడం ద్వారా కరోనా నుంచి  మనల్ని మనం కాపాడుకో గలం.

-------------------------------------

 

 

భాగ్యనగరి వచ్చి బాగు పడతమని

బయలుదేరె జనము బాట బట్టి

మాయదారి జబ్బు మాయ మాయగ రాగ

 ఆగమాగమాయె ఆశలన్ని

 

దారులన్ని మూసె దా రితెన్ను యు లేదు

దరువు చెడ్డ మనసు దరిని జేర్చ

దయ గలిగిన వారు దారిచూపుదురని

ధీరులైనజనముదీను లైరి

 

యెట్లు పోదు మనచు  యేడ వుందు మనచు

ఏడ్చె చుండె జనము ఎదలు పగిలి

వలస జీవి ఆశ వడగండ్ల పాలయె

మాన్యులార వినుడి మధుర వాక్కు

 

పిల్ల పాపలంత పల్లెల నుండగ

ముసలి తల్లి కింత ముద్ద లేదు

దయ గలిగిన వారు దారిచూపు తురంచు

ధీరులైనజనులు దీనులైరి

 

కట్ల మధుసూదన్ -   తెలుగు పండిట్

-------------------------

 

*ప్రణామాలు*

దిగులో ... బాధో

ఎదో తెలియని

వెలితి మనసంతా...

 

రహదారులపై

రివ్వు రివ్వున

పరుగెత్తే వాహన

రొదల స్థానంలో

వలస కూలీల

రోదనల ఆక్రమణలు

చూసినప్పుడల్లా...

మలమల మండే ఎండల్లో

చంకనున్న చంటిపిల్లల్ని

చూసినప్పుడల్లా...

పాలైనా తాగుతున్నారో

లేదో ఈ పసికూనలు

అని తలచినప్పుడల్లా....

ఆపుకోలేని పూనకం...

రైలు పట్టాలు నడుమ

మొనదేలిన కంకరరాళ్ల

పైన పగులిచ్చిన

కాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా

గుండెల్లో ముల్లు

కదులుతున్న భావన..

ఉన్న చోట ఉండలేక

కడుపునిండే జాడ

తెలీక పరిగెత్తే 

ఆశా వాదుల

 ప్రయాణానికి

నిర్వచనం చెప్పలేక

తల్లడిల్లే భావన

మనసంతా...

ఎంత చెప్పినా

ఏమిచేసినా

తక్కువేననిపించే 

కష్టానికి...

కబళించే కాలానికి

కరుణ కరువైన

లోకాన్ని చూడలేక

చూస్తూ.....

చేతులెత్తి మొక్కుతున్నా

వలస కూలీలకు

క్షమించడమ్మా...

మీ కష్టం మానవాళి

సౌఖ్య ప్రతిరూపం...

మీ దైన్యజీవితం

 పాలకుల నిర్లక్ష్యానికి

సంకేతం....

73 ఏళ్ళ స్వతంత్రభారతిలో

రెండు నెలల లాక్డవున్ కే

చేతులెత్తేసిన డొల్లతనాన్ని

చుస్తున్నప్పుడల్లా 

కట్టలుతెంచుకుంటున్న

ఆవేశం....

ఇంత కష్టంలోను

బావిభారతాన్ని

చంకనెత్తుకుని

పరుగెడుతున్న

మీ ఆశావాద పయనానికి

మరోమారు

 ప్రణమిల్లుతున్నానమ్మ.. 🙏

గోలి మధు..13.5.20

మానవ వికాస మండలి

9989186883

---------------------------

 

చెప్పుల్లేని కాళ్లతో,

భుజాలపై బరువుల్తో,

జారిపోయిన గుండెల్తో,

కారిపోతున్న నెత్తుటితో,

దేశం "నడుస్తుంది".

ఆ రోడ్లపై 

ఈ ఎండలో

అన్నం లేక

పసి నోళ్ళకి

పాలు లేక,

ఆగే దిక్కు లేక

అడిగే హక్కూ లేక

ముక్కుకుంటూ

మూలుగుతూ

బతుకేదో

చావేదో

తేడా తెలియక,

పట్టాలపై 

అలసి

సొలసి

నిద్రపోతూ,

నిద్ర నటిస్తున్న

మీ కళ్ళ సాక్షిగా

ఆ వలస దేహం

చావై నడుస్తుంది.

విజయ్ మాల్యా కు, రాయపాటి కి, రాందేవ్ బాబా లకు వేల కోట్లు మాఫీ చేస్తారు.. 

కానీ మట్టి పిసికి సంపద సృష్టిస్తున్న శ్రామిక జీవులను మాత్రం గాలికి వదిలేసారు. 

దేశం "నడుస్తుంది"

దేశం "నడుస్తుంది"

అవును "నా దేశం నడుస్తూంది"!!