కల చెదిరిపోవచ్చు......
వర్షం రాకపోవచ్చు.......
సినిమా ఆడకపోవచ్చు.......
ఇవన్నీ మనం ఉహించవచ్చు......
కాని
ప్రపంచం ఆగిపోతుందని ఎవరైనా ఉహించారా ?
ఉహించనిది జరగడమే జీవితం, అనుకుంటే .....
జరిగిన, జరుగుతున్న, పరిస్థితిని,
విపత్తు అనలా, వినాశనం అనాలా, లేక మహమ్మారి వికటాట్టహాసం అనలా ?
తిన్నది అరక్క, గోడవపడితే,
కొద్ది రోజుల పాటు
కర్ఫ్వూ చూశాం.
తిండికి లేక, గొడవపడితే లాఠి చార్జ్ చూశాం.
అమ్మవారు పోసిందనో, అనుకోని జబ్బు వచ్చిందనో, అయినవారుదూరం అయ్యారనో, స్వీయ గృహ నిర్భందం చూశాం.
కాని ఇవన్నీ కలకలిపి, ఒకేసారీ అనుభవిస్తు, ఆచరించడం, బహూశా జీవితంలో ఇదే మొదటిసారెమో !
మునుపెన్నడు లేనివిధంగా,
సంస్కృతి, సాంప్రదాయలపై, చర్చలు,
శుచి, శుభ్రతలపై అవగాహనలు..
తినే తిండిపై నియంత్రణలు.......
అడుగుతీసి, అడుగు వేయడానికి నిభంధనలు,
వెరసి కొత్త లోకంలో జీవిస్తున్న అనుభూతి...........
డబ్బులేని వారికి, ఇది ఒక పాఠమా ?
అంటే ఉన్న వారికి, ఇది గుణపాఠమా ?
లేక ప్రపంచానికి ఇది ఒక సవాలు మాత్రమేనా ?
కొద్ది కాలం తర్వాత,
యథా రాజా,
తధాప్రజానేనా...
ఘంటసాల గారు చెప్పినట్టు,
"ఏ నిమిషానికి ఎమి
జరుగునో, ఎవరూహించెదరు" !!!!!
ఒక్కసారి ,
మార్చి 22 నుండి చూసుకుంటే.......
పబ్బుల్లేవు, క్లబ్బులు లేవు.
బార్లు లేవు, వైన్సులు లేవు.
అయినా జీవితం ఆగిపోలేదు.
అల్పాహారశాలలు, శాఖాహార-మాంసాహారశాలలు
పానీపూరీ, పావ్ బాజీ, మిర్చి బళ్ళు లేవు.
*అయినా జీవితం ఆగిపోలేదు*!!!!!!!!!
హర్డ్ రాక్ కేఫులు లేవు,
బరిస్థా రెస్టారెంట్లు లేవు,
బావర్చి బిర్యానిలు లేవు,
బెస్కిన్ రాబిన్సన్ ఐస్ క్రీంలు లేవు.
*అయినా జీవితం ఆగిపోలేదు*!!!!!??
బళ్ళు లేవు, బంకులు లేవు,
పెట్రోలు, డీజిలు, చింతలేలేవు.
బ్రాండెడ్ బట్టలు లేవు,
బరి తెగింపులు,అసలే లేవు.
*అయినా జీవితం ఆగిపోలేదు*!!!!!!!
చీరలు లేవు,
చీటికి మాటికి, షాపింగులు లేవు.
సినిమాలు లేవు, షికార్లు లేవు,
బాహ్య సౌదర్యానికి, బ్యూటిపార్లర్లు లేవు.
*అయినా జీవితం ఆగిపోలేదు*..........
గుళ్ళులేవు, బడులు లేవు.
చర్చిలు, మసీదులు లేవు.
పూజలు లేవు, నమాజులు లేవు,
ప్రార్ధనలూ లేవు, నమ్మకమొక్కటే మిగిలింది.
*అయినా జీవితం ఆగిపోలేదు*!!!!!!
కాలుష్యం లేదు, కలహాలు లేవు,
కల్లబొల్లి మాటలతో, టైంపాసులు లేవు.
యాత్రలు లేవు,
తీర్ధ యాత్రలు లేవు.
టూరిజం అంటూ టూర్లు లేవు.
*అయినా జీవితం ఆగిపోలేదు*!!!!!!!!
స్వీమ్మింగ్ పూల్సు లేవు,
8 బాల్ పూల్సు లేవు,
మెక్డొనాల్డ్,
పిజ్జాలు లేవు.
బర్గర్లు లేవు.
*అయినా జీవితం ఆగిపోలేదు*!!!!!
అయినదానికి, కానిదానికి, అపాయింటుమెంట్లు తీసుకుని,
వేలకి వేలు,తగలేసె రోగాలు, డాక్టర్లు చెప్పకుండానే మాయమయ్యాయి.....ఎలా ?
ఇరుగు, పొరుగు అంటు మునుపటి భాందవ్యాలు, మళ్ళీ పుట్టాయి....... ఎలా ?
పనివాళ్ళు, రాకపోయినా, పనులేవి ఆగలేదు........ఎలా ?
మంచితనం. మానవత్వం,మబ్బు పట్టిన ఆకాశంలా, ముంచెత్తె వరదలా, వెల్లువెత్తాయి.......
ఎలా?
డబ్బులున్నా ఏమి కొనలేరు.
బయటకెళ్ళె ధైర్యం చేయలేరు.
నిత్యావసరాలు తప్ప
నిర్జీవమైన వేటిని కొనలేరు........
డబ్బున్న ధనవంతుడు, సామాన్యుడు,
అంతా ఒక్కటే అని ఎవరైనా చెబుతున్నట్టుందా ?
ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిందేమిటి.....
మనకి మనమే, అంతర్మధనం చేసుకోవాల్సిన సమయమిది.. !!!!!!!
కుటుంబ వ్యవస్థ బలోపేతమైందా ?
అన్యోన్యత పెరిగిందా ?
బంధాలు, బలపడ్డాయా ?పిల్లలపై వాత్సల్యం పెరిగిందా ?
ఆరోగ్యంపై శ్రద్ద పెరిగిందా ?
ఆలోచనల్లో పదును పెరిగిందా ?
డబ్బుపై వ్యామోహం తగ్గి,
ప్రాణమున్న వాటిపై, ప్రేమ పెరిగిందా ?
ఇన్ని సంవత్సరాలుగా, మనం చేసిందేమిటి ? అనేది వ్యక్తిగతంగా, ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం బహూశా ఇదేనేమో ?
*ఆలోచించండి.*
*ఆచరించండి.*
*అనుభవించండి!*
_"ప్రకృతిని గాలి పీల్చుకోనివ్వండి"!_
** సేకరణ**