Pages

*'మహా మానవి మేరీ క్యూరీ'*


*నాకు నచ్చిన📕*
*ఒక అమెరికన్ విలేఖరి  ఫ్రాన్స్ లోని ఓ మారుమూల పల్లెలోని కుటీరం దగ్గరికి వెళ్లి  కాళ్లకు చెప్పులు కూడా లేకుండా సామాన్య దుస్తుల్లో ఉన్న ఓ స్త్రీని "అమ్మగారు ఇంట్లోనే ఉన్నారా ?" అనడిగాడు."లేరు.'మనుషుల గురించి కాకుండా ఆలోచనలగురించి తహతహలాడమని ఆమె మీకు చెప్పమన్నారు." అందామె.ఆ సామాన్యస్త్రీయే రెండు నోబెల్ బహుమతులూ ,19 డిగ్రీలూ ,15 బంగారు పతకాలూ అందుకున్న  మేడం క్యూరీ అని పాపం ఆ విలేఖరికి తెలియదు. "అక్కా!నేను కష్టపడి డబ్బు సంపాదించి నిన్ను డాక్టర్ చదివిస్తాను.ఆ తరువాత నువ్వు నన్ను చదివించు" అనే చెల్లెళ్ళు ఉంటారనీ  క్యూరీ చరిత్ర చదివే వరకూ మనకూ తెలియదు.గ్రాము లక్షా యాభై వేల డాలర్లు విలువచేసే రేడియంను  కనిపెట్టి  అది కేన్సర్ చికిత్సకి అవసరం. కాబట్టి పేటెంట్ రైట్స్ తీసుకుని  ధనవంతులైపొమ్మని సలహా ఇస్తే" రేడియం కరుణా సాధనం.అది మానవాళికంతటికీ చెందుతుంది"అని చెప్పిన మహోన్నత వ్యక్తి మేడం క్యూరీ 1867 నవంబర్ 7 న పోలాండ్ లో పుట్టింది.ఆమెకి  తల్లిదండ్రులు పెట్టిన పేరు 'మేర్యా స్క్లోడోవస్కా'.* తండ్రి నాస్తికుడు.తల్లి రోమన్ కేథలిక్.

*చదువుపట్ల మేర్యా పడిన తపననీ,పట్టుదలనీ పిల్లలకు చెప్పాలి.* హైస్కూల్ చదువులోనే బంగారుపతకం పొందినా ఆరోజుల్లో పోలెండ్ లో స్త్రీలకు ఉన్నతవిద్యపై నిషేధం ఉందటంవల్ల  పారిస్ లో చదవడానికి తన అక్క తో కలిసి ఒక చిత్రమైన ఒప్పందం చేసుకుంది.మార్యా డబ్బు సంపాదించి అక్కను పారిస్ లో డాక్టర్ చదివించాలి.అక్క డాక్టరయ్యాక మార్యా ని పారిస్ కి తీసుకెళ్లి చదివిస్తుంది.ఆ ఒప్పందాన్ని ఆచరణలో పెట్టడానికి మార్యా  పడిన  పాట్లు వర్ణనాతీతం .పదిహేడేళ్ల మార్యా  ప్రయివేట్లు చెప్పింది.కుటుంబాన్ని విడిచిపెట్టి ధనవంతుల ఇళ్లలో గవర్నెస్ గా పనిచేసింది.తన ఖర్చులకోసం ఆలోచించకుండా సంపాదన అక్కకు పంపించేది.ఖాళీ సమయాల్లో సైన్స్ ,గణితం,సాహిత్యం చదివేది.అలా ఏడేళ్లు కష్టపడ్డాక ఫ్రాన్స్ వెళ్లగలిగింది.

 *పారిస్ వెళ్ళాక  ఫ్రెంచ్ భాషకు అనుగుణంగా తనపేరును మేరీగా మార్చుకుంది. యూనివర్సిటీ లో 1825 మంది విద్యార్థుల్లో కేవలం 23 మంది మాత్రమే స్త్రీలు.భౌతిక శాస్త్రంలో అయితే ఆమె ఒక్కతే స్త్రీ.యూరప్ లో విజ్ఞానశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళ కూడా ఆమే.ఐదు నోబెల్ బహుమతులందుకున్న కుటుంబం కూడా ఆమెదే.*

*వెంటాడిన కష్టాలు:* పారిస్ కి రైలెక్కి నాల్గవ తరగతి టిక్కెట్ లో నిలబడి ప్రయాణం చేసింది.పెళ్ళైపోయిన అక్కదగ్గర ఉండటం ఇష్టం లేక యూనివర్సిటీ దగ్గర అద్దె తక్కువని ఒక భవన ఐదవ అంతస్తులో అటకగది అద్దెకు తీసుకుంది.ఆమె పరిస్థితి ఎంత దయనీయం అంటే బొగ్గుల బస్తాను అంతపైకి స్వయంగా మోసుకెళ్లేది.ఒకోసారి రెండు రొట్టెముక్కలూ,టీ తో ఆకలితీర్చుకునేది.అప్పుడప్పుడు భోజనం మాట మర్చిపోవడంవల్ల స్పృహ తప్పి పడిపోయేది. సాయంత్రం ప్రైవేట్లు చెప్పేది. గ్రంద్యాలయానికెళ్లి రాత్రి 9 గంటలవరకూ చదివి ఇంటికొచ్చి నూనె దీపపు కాంతిలో రెండింటివరకూ చదివేది..రాత్రుళ్ళు చలికి తట్టుకోలేక తనదగ్గరున్న బట్టలన్నీ మీద వేసుకుని పడుకునేది.

*ఉన్నతమైన వ్యక్తిత్వం :*  మతం మీదా దేవుడిమీదా పూర్తిగా నమ్మకం పోయిన మేరీ చర్చిలో కాకుండా వేరేచోట, నిశ్చితార్ధపు ఉంగరం,గౌను లాంటివి కూడా లేకుండా అతి నిరాడంబరంగా *పియరీ క్యూరీ* ని పెళ్ళిచేసుకుంది.బంధువులిచ్చిన డబ్బులతో దంపతులిద్దరూ రెండు సైకిళ్ళు కొనుక్కుని గ్రామసీమలకు హనీమూన్ కి వెళ్లారు.మొదటి నోబెల్ బహుమతి అందుకున్న దుస్తులతోనే రెండో నోబెల్ నీ కూడా అందుకుని నిరాడంబరత్వంలో తనకు తానే సాటి అనిపించుకుంది. *భర్త చనిపోయినపుడు ఫ్రెంచ్ ప్రభుత్వం  పింఛను ఇస్తానంటే "తనకు పనిచేసే శక్తి ఉందనీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు అవసరంలేదనీ చెప్పడమే కాకుండా యుద్ధ సమయంలో తన బంగారువెండి పతకాలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించిన త్యాగమయి.క్యూరీ ఫౌండేషన్ స్థాపించి ఆరువేల మంది కేన్సర్ రోగులను ఆదుకున్న అమృతమూర్తి మేడం క్యూరీ.*

*రేడియం కనిపెట్టిన ఆనందంలో క్యూరీ దాన్ని పరీక్ష నాళికలో వేసి కోటుజేబులో పెట్టుకుని తిరిగేది.పియరీ చిన్న రేడియం ముక్కను చేతికి కట్టుకునేవాడు.నిప్పుతో చెలగాటమని వారికి ఆ తరువాతే అర్ధమయింది.రేడియో ధార్మికత కారణంగా మహామానవి మేరీక్యూరీ 1934 జూలై 4 న తుదిశ్వాస విడిచింది.*
*ప్రతిరోజూ జ్ఞానాన్ని పొందాలనే తీవ్రతపనే మానవుణ్ణి ఈనాడు అతడున్న అద్వితీయ స్థితికి లేవనెత్తింది* ------మేడం క్యూరీ.
*'మహా మానవి మేరీ క్యూరీ'* పుస్తకం నుంచి.(పీకాక్ బుక్స్ ప్రచురణ.పేజీలు 96,ధర 60రూ )

*---
ప్రకాష్ 🖋*

*కిచకిచల*పిచ్చుకలేవీ*?


              జీవులన్నీ ప్రకృతిలో భాగమే. ఈరోజు అనేక కారణాలవలన ప్రకృతి విధ్వంసానికి గురవుతున్నది. అభివృద్ధిపేరిట సాగే చర్యలతో పర్యావరణం పాడవుతున్నది. భూమి, గాలి, నీరు మానవ తప్పిదాలవల్ల కలుషితం అవుతున్నాయి. ఈచర్యలతో అనేక జీవరాసులు నశించిపోతున్నాయి. మనం గతంలో చూసిన సాధారణ పిచ్చుక (హౌస్ స్పారో) ఇప్పుడు అరుదుగా తప్ప కనిపించడం లేదు.పిచ్చుక బొమ్మచూపించి, అవి గతంలో మన ఇళ్ళలోనే తిరిగేవని భావితరాలకు చెప్పవలసిన దుస్థితి వచ్చింది.
 
           
పర్యావరణ వినాశనం ఏ స్థాయిలో ఉన్నదో ఈ బలహీనమైన పిచ్చుక మనలను హెచ్చరిస్తున్నది. ఇంటి కప్పులకింద, పూర్వపు రోజులలో అయితే పెంకుల అడుగుభాగంలో, పిచ్చుకలు మన ఇళ్లలోనే గూళ్లు నిర్మించుకునేవి. ఆడ, మగ పిచ్చుకలు కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లుపెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి బాధ్యత పడతాయి. వాటి కిచకిచలతో ఇళ్ళకు ఎంతో కళవచ్చేది. ప్రతిధాన్యంగింజా వలుచుకొని బియ్యం గింజని మాత్రం అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి. కానీ, ఇళ్లు ఇరుకై, వాకిలీ పెరడూ హరించుపోయి చివరకు చెట్లు కూడా లేకుండాపోతున్న కాలంలో ఇక పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుంది? ఇంధన కాలుష్యం, గృహనిర్మాణంలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న అపార్ట్‌మెంట్ల సంస్కృతి, సాంకేతికంగా వచ్చిన మార్పులు పిచ్చుకలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు. విస్తృతంగా సాగుతున్న సెల్ టవర్ల నిర్మాణం వాటి ఉసురు తీస్తున్నది. సెల్‌టవర్లనుంచి వెలువడే తరంగాలతో వాటి పునరుత్పత్తి శక్తి నశిస్తున్నదని కొందరి వాదన. పంటలపై క్రిమిసంహార మందులను ప్రయోగించి మనం చంపుతున్న పురుగులను తిని పిచ్చుకలు మరణిస్తున్నాయి.
 
పిచ్చుకలతోపాటు ఇతరపక్షులనూ రక్షించే ఉద్దేశ్యంతో మార్చి -20ప్రపంచ పిచ్చుకలదినోత్సవంజరుగుతున్నది. పర్యావరణ, పక్షిప్రేమికులు ఒకచోట కలసి తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకొనేందుకు వీలుగా సభలు సమావేశాలు జరిపి, అంతరించిపోతున్న పక్షి జాతుల రక్షణకు సంకల్పించడం దీని ఉద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కృషిలో మనమూ పాలుపంచుకుందాం. పిచ్చుకలతోపాటు అన్ని పక్షి జాతులను కాపాడుకుందాం. పక్షుల జీవనానికి అవసరమైన కృత్రిమ గూళ్ళు ఏర్పాటు చేయాలి. వేసవిలో పక్షులు నీరు దొరకక చాల ఇబ్బంది పడతాయి కనుక ఇంటిజాలీలపై, షేడ్‌లపై, ఇంటిముందున్న ఖాళీ జాగాల్లో నీరుపెడితే వాటికోసం వస్తాయి. అలాగే, రకరకాల పక్షుల కూతలతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణమూ ఏర్పడుతుంది. పక్షి ఏదైనా దాన్ని బ్రతికించుకోవాలి.

ఇకనయినా పరుగులాపి ప్రంశాతంగా జీవించండి.

సర్వరోగ నివారిని పేరుతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసిన మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అదీ ఆగిపోయింది.

తరువాత నీళ్ళ రాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్ళు తాగితే రోగాలు మాయం అన్నాడు. అదీ పోయింది.
పశువుల మాదిరి పచ్చి కూర గాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అదీ పోయింది.

ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటె కొవ్వు తగ్గుద్దని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకాయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండీ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము వారేమో యోగా చెయ్యండి రొగాలు మటు మాయమంటుంది.

అసలింతకీ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? ఇలాంటి వారిని అదుపు చెయ్యాల్సివ అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ పోషకాహార సంస్థలు నిద్ర పోతున్నాయా? ప్రజలు వత్తిడి తేవాలి, మార్పు రావాలి.

ఆ మధ్య, అంటే చాన్నాళ్ళ క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజు గారు వచ్చి, ‘ఉప్పా..! మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు. మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీఅన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు.

అంతటితో ఊరుకున్నాడా? ‘నూనా, నెయ్యా - మీరంతా నూనె తాగుతున్నారా? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా?, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు.

నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టి చెప్పాడు కూడా. సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి చుక్కనూనెతో
తాళింపులు మొదలు పెట్టారు...!

జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై, బుద్ధిగా మాటవినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక, ఒకానొక మంచిరోజు చూసుకుని కృష్ణానది పక్కన మాంచి స్థలంలోప్రకృతి ఆహార ఆశ్రమంఅని ఒకటి మొదలైంది.

అసలే బాగా బలిసిన జనాలుండే కృష్ణాజిల్లా...! ఇంకేఁవుందీ?రోజుకింత, నెలకింతని ప్యాకేజ్ రూపంలో వసూళ్లు చేస్తూ ప్రజలకి ఉప్పూ, నూనె లేని విందులు చేస్తూ, మూడు పచ్చి కూర ముక్కలూ ఆరు ఆకుకూర రసాలతో నిత్యనూతనంగా విలసిల్లుతుంది...!
                                                               ***

సరే ఇది ఇలా ఉండగా, ఇంకొకాయన ఎవరో రాగి చెంబులంట.. రాగి చెంబుల్లో నీళ్ళు నింపి చంద్రుడి ఎదురుగా పెట్టి, తెల్లారి ఆ నీళ్ళు తాగితే అసలు చావే రాదని ఘంటాపథంగా చెప్పాడు. ఇంకేవుంది, కొట్లలో పడి రాగి చెంబుల వేట...! కాస్త గట్టి బుర్రోడు, గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి, అతుకేయని రాగి చెంబు అన్నాడు..! షాపుల్లోకెళ్ళి లిప్ స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజూగ్గా అడగటం మొదలైంది.

                                                               ***

అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్ళు తాగుతూ, ఉప్పు, నూనె, పులుపూ, తీపీ లేని రాజు గారి వంటలు తింటూ, రెండు వందలేళ్ళు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్కున మళ్ళీ కృష్ణాజిల్లా నుంచే మహారాజశ్రీ మాచినేని ఉద్బవించాడు!

నూనె మానేసారా? పిచ్చోల్లారా! మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి, ఇక చూడండి!అన్నాడు.నేను చెప్పింది తప్ప మీరు ఇంకేవీ తినకూడదు...! నో నో అంటే నో…!” అన్నాడు కూడా. ఇంకేఁవుంది, కొబ్బరి చిప్పలు సంచిలో యేసుకుని గానుగలంట బడ్డారు జనం...! మాచినేని ప్రొడక్ట్స్ మనకందుబాటులోకొచ్చే మంచిరోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం...!
                                                                 ***

సీమ నుంచో, కర్నాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ (అనుకుంటూ) ఇంకొక సామొచ్చి, ‘పురుగుమందులు తింటున్నారా? ఇళ్ళల్లో రోగాల పంట పండిస్తున్నారా?‘ అంటూ జనాలను ఆహార జ్ఞాన దారుల్లో పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు.పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండీ! మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి!అని ఆషాడ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకి ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచి పెడుతున్నాడు.

చిరుధాన్యాలండోయ్, ‘చిరంజీవిధాన్యాలు కాదుచిరు ధాన్యాలు’, ‘సిరి ధాన్యాలుఅంటూ, ‘పాలు తాగితే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయి చస్తారు, సిరి ధాన్యాలు తినండి - చావకుండా కలకాలం బ్రతకండిఅంటున్నాడు. ఇంకేఁవుంది, తెల్లటి మొలకొలుకల అన్నం, కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బేబక్కాయిలంతాసామలున్నాయా? అరికలున్నాయా? సొజ్జలున్నాయా?” అని షాపులాల్లని పరుగులు దీయిస్తున్నారు.

                                                               ***

వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువా అంటూ, ''మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం'' అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు, పురావస్తు గృహంలో నిద్ర లేచి మట్టి కుండ యాష్ ట్యాగ్ అన్నాడు.

                                                               ***

విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్లు కాదు. ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులని మాత్రం ధాటీగా విమర్శిస్తారు.

ఆ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కానీ, ఈ వినే జనాలు కానీ మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే కానీ, ‘పురుగు మందులని బ్యాన్ చేయమని ప్రభుత్వాలను అడగరు.ఆరోగ్యానికి హానికదాలిక్కర్ బ్యాన్ చెయ్యండీఅని అస్సలు అడగరు.
ధూమపానం చెరుపు చేస్తుంది కదా, ‘సిగరెట్లు బ్యాన్ చెయ్యండీఅని కూడా అడగరు.
చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారనీ, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని, సంచులేసుకుని పరుగెడతారు?
ఇకనయినా పరుగులాపి ప్రంశాతంగా జీవించండి.

మన పూర్వీకులు అన్నీ తిని చక్కగా పని చేసుకున్నారు.

మనం పని మాని ఇలాంటి వాటి వెనుక గంతులేస్తున్నాము!
From Whatup message.

ఖుదాఫీజ్ - అలి బనాత్!!

ఖుదాఫీజ్ - అలి బనాత్!!
===================

అలీ బనాత్ - ఆస్ట్రేలియాలోని, సిడ్నీ లో  స్థిరపడిన పాలస్తీనా దంపతులకు జన్మించాడు.

20 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికే రెండు కంపెనీల్ని స్థాపించి కోటీశ్వరుడయ్యాడు. సొంతంగా తన తల్లిందండుల ఇంటి పక్కనే ఓ అధునాతన సౌకర్యాలతో ఓ పెద్ద భవంతిని నిర్మించుకున్నాడు.

అతను వాడే కారు ఖరీదు - ఫేరారీ - 4 కోట్లు.

ఖరీదైన ఇంటర్నేషనల్ బూట్లు, చలవ కల్లజోల్లు( కూలింగ్ కల్లద్దాలు) కలెక్ట్ చేయడం అతని హాబీ. ఇంటినిండా అవే ఉండేవి. కొత్తగా పెళ్ళి కూడా చేసుకున్నాడు.  జీవితం సాఫీగా గడిచిపోతున్న సమయంలో - ఓ రోజు నోట్లో ఏదో కణతలాంటిది ఉన్నట్లు అనిపించడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. బయాప్సీ, ఇంకా ఇతర టెస్ట్లు చేసిన డాక్టర్లు -దానిని స్టేజ్ 4 నోటి క్యాన్సర్ గా అభివర్ణించారు. మహా అంటే ఏడు నెలలు బతుకుతావని తేల్చేశారు.

అప్పుడు మీకు ఏమనిపించింది- అతనిచ్చిన అనేక ఇంటర్యూల్లో అతన్ని అనేక సార్లు అడిగిన ప్రశ్న.

"ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రజియూం"( అల్లా నుండి వచ్చాము - మల్లీ అల్లా చెంతకే వెల్తాము")- నాకు నేను ఇది చెప్పుకున్నాను - ప్రతి ఇంటర్వ్యూ లోనూ అతనిచ్చిన సమాధానం ఇది.

ఇక ఆ తర్వాత, అధునాతన వైద్యం కోసం అతని రక్త నమూనాల్ని జెర్మనీ,అమెరికా,యూకే లాంటి అనేక చోట్లకు పంపారు. అందరి నుండీ ఒకటే సమాధానం -"చాలా లేటైపోయింది"

ఇక ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే లాభం లేదని అతనికి అర్థమైంది. తన కారు,విలువైన వస్తువులు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో ఆఫ్రికాకు పయనమయ్యాడు. అక్కడి గ్రామాల్లో, స్కూల్లు, ఆస్పత్రులు, మసీదులు, అనాధ శరణాలయాలు కట్టించడం మొదలు పెట్టాడు.

అక్కడి పేదల పరిస్థితుల్ని మార్చడానికి తన మొత్తం ఆస్తికూడా చాలదని అర్థమై, తన పరిస్తితిని,తను చేసున్న పనుల్ని వివరిస్తూ యూటూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.  అది కొన్ని రోజుల వ్యవధిలోనే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. వాటితోపాటే విరాళాలు వెల్లువెత్తాయి. ఆ విరాళాలతో ఇతని కార్యక్రమాలు యుద్దప్రాతిపదికన విస్తరించాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా ఇతనితో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చాయి. అనేక గ్రామాలలో రక్షిత తాగునీటి వసతులు, స్కూల్లు, ఆసుపత్రులు వందల సంఖ్యలో నిర్మించడం జరిగింది.

కేవలం ఏడు నెలలే అనుకున్నది - మూడేల్ల వరకూ బతికాడు. ఓ వైపు జబ్బుతో బాధపడుతూనే, ఆఫ్రికాలో అన్ని ఊర్లకూ వెళ్ళి పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేవాడు. ఎందుకిలా అంటే - "నన్ను నమ్మి చాలా మంది విరాళాలు ఇచ్చారు - దానిలో ప్రతిపైసా వినియోగమవ్వాలి, ఎలాంటి వృధాఖర్చులూ ఉండకూడదు, అందుకే ప్రతి పనీ దగ్గరుండి నేనే చూసుకున్నా" ననేవాడు.

మొత్తానికి తన మూడేల్ల ప్రయాణం - మొన్నటి మంగళవారంతో ( మే 30) ముగిసింది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అతన్ని సిడ్నీలో ఖననం చేశారు.

అన్నట్లు - అత్యంత పాపులర్ అయి, అతన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యూటూబ్ వీడియోకి అతను పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా-"   గిఫ్ట్ ఆఫ్ క్యాన్సర్"

ఎందుకు ఆ టైటిల్? క్యాన్సర్ గిఫ్ట్ ఏమిటి? అని అడిగిన ప్రశ్నలకు అతనిచ్చిన సమాధానం.

"జీవితమంతా కార్లు,బంగళాలు,సంపాదన, సక్సెస్ అంటూ పరిగెడుతుంటాం. చివరికి ఏదో ఒక రోజు - 'నీ సమయం ఐపోయింది, ఇంక వచ్చేయమనే' సృష్టికర్త పిలుపు వినబడగానే అప్పటి వరకూ మనం సంపాదించిన ఆస్తులు,వస్తువులూ ఎందుకూ పనికిరానివని మనకు అర్థమవుతుంది. కానీ, అప్పుడు చాలామంది చేయగలేది ఏమీ ఉండదు. కానీ, నా విషయం అలా కాదు. నాకు సృష్టికర్త 7 నెలలు గడువు ఇచ్చాడు. ఇది గిఫ్ట్ కాక మరేమిటి? "

వెల్ డన్ అలీ బనాత్. - అల్లా హఫీజ్.

ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రజియూం

ఆర్థిక వ్యవస్థ గురించి!


ఇప్పుడు నేను రాయబోయేది రాజకీయాల గురించి కాదు.. ఆర్థిక వ్యవస్థ గురించి!
మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, తాజాగా ఆంధ్ర బడ్జెట్ వివరాలు వింటున్నప్పుడు దాదాపు గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయా,  తిరోగమనం వైపు నడిపిస్తున్నాయా అన్న సందేహాలు తలెత్తుతుంటాయి.


           
ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో ఒక వాక్యం నన్ను ఆవేదనకు గురి చేసింది. తల్లిగర్భంలో ఉన్నప్పటి నుండి  చనిపోయే వరకు ఒక మనిషికి వివిధ రకాల సందర్భాల్లో రకరకాల స్కీమ్‌లను  ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆర్థిక మంత్రి చాలా గర్వంగా చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ కావచ్చు, తెలంగాణ బడ్జెట్ కావచ్చు.. దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన  బడ్జెట్లు కూడా  దాదాపు ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా ఇలాంటివే వందలాది స్కీములు మొదలు పెడుతున్నారు. అభివృద్ధితో పాటు  సంక్షేమం అనేది  ప్రభుత్వ ప్రయారిటీల్లో ఒకటిగా ఉండడంలో  తప్పేమీ లేదు. కానీ  పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తామని..  బిడ్డ పుడితే డబ్బులు ఇస్తామని,  బతుకమ్మ పండగొస్తే చీరలిస్తామనీ,  మక్కా వెళుతుంటే ఖర్చుల భరిస్తామనీ.. ఇలా  ఏవేవో కొత్త కొత్తవి క్రియేటివ్ గా ఆలోచించి మరీ ప్రజలు పన్నుల ద్వారా చెల్లిస్తున్న డబ్బుని వృధా చేయడం  ఎంతవరకు సమంజసం? సరే ఆ విషయం కాసేపు పక్కన పెట్టి, మూలాల్లోకి వెళితే ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలకు ప్రధానంగా వచ్చే ఆదాయ వనరులు.. వస్తుసేవలపై పన్నులు
దిగుమతి సుంకాలు వ్యవసాయం, పారిశ్రామిక రంగాలూ, ఇతర రంగాల ఉన్న జాతీయోత్పత్తి ద్వారా  సృష్టించబడే సంపద..  ఆ సంపద నుండి వివిధ రూపాల్లో ప్రభుత్వానికి సమకూరే వాటా!
స్పెక్ట్రమ్ కేటాయింపులు,  లైసెన్స్ ఫీజులు, వివిధ రంగాలకు సంబంధించి ఇతర రుసుములు
ప్రజలు చెల్లించే ఆదాయపు పన్ను.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం వీటితోపాటు మరికొన్ని ఆదాయ వనరులు కూడా ఉంటాయి. ఇంతవరకు అర్థమైంది కదా!  వస్తు సేవలపై పన్నుల విషయానికి వద్దాం.  ఒక చిన్న టూత్ పేస్ట్ కొన్నా అందులో మనం టాక్స్ చెల్లిస్తున్నాం. 30 వేల  రూపాయలు పెట్టి ఒక మొబైల్ ఫోన్ కొంటే 12 శాతం GST అంటే 3,600 కలుపుకుని 33,600 రూపాయలు చెల్లిస్తున్నాం.  ఇలా రోజు మన ఆదాయంలో కనీసం 10 నుండి 20 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాం. ఇందులో మళ్ళీ కేంద్రం, రాష్ట్రం వాటాలు ఎటూ పంచుకుంటారు.

పైవన్నీ కలిపి  భారీ మొత్తంలో కోట్లు ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది అనుకుందాం.  తెలివిగల ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల మీద వాటిని వెచ్చిస్తాయి. అంటే  రోడ్లు,  భవనాలు, విద్య, ఆరోగ్యం,  విద్యుత్, పోలీస్,  రక్షణ రంగం.. ఇలా  అనేక అంశాలు దీంట్లో వస్తాయి.  వీటి మీద ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంతగా దేశం అభివృద్ధి చెందుతుంది, మిగతా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. కానీ ఇక్కడ మన ప్రభుత్వాలు..  బిడ్డ పుడితే డబ్బులు ఇస్తారు..  తుమ్మితే డబ్బులు ఇస్తారు..  పండగ వస్తే సరుకులన్నీ కలిపి తోఫాలు ఇస్తారు…  కులాల వారీగా కార్పొరేషన్లు, వాటి కోసం ప్రత్యేకమైన భవనాలు నిర్మిస్తారు.. అంటే పరోక్షంగా జనాల్ని పరాన్న జీవులుగా మార్చిపారేస్తున్నారు! పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలట! ఎందుకు ఇవ్వాలి?  ప్రభుత్వాలు  వ్యవస్థలను బలోపేతం చేయడం మానేసి  వ్యక్తుల స్థాయిలో సంతృప్తిపరచుకుంటే వెళితే ఇంకా వ్యక్తులు ఎక్కడ ఎదుగుతారు?  నిరుద్యోగ భృతి ఎందుకు?  ఒకప్పుడు ఉద్యోగ అవకాశాలు పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడేమైంది..? కాస్త కష్టపడితే కచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. మరి అలాంటప్పుడు నెలకు 1000, 2000, 3000 రూపాయలు ఇస్తూ యువతని డిపెండెంట్లుగా, నిర్వీర్యం చేయడం ఎంతవరకూ కరెక్ట్?
మనుషుల్ని పెంచి పోషించడం ప్రభుత్వాల బాధ్యత కాదు. అది వ్యక్తుల,  కుటుంబాల బాధ్యత! ప్రభుత్వాలు తాము చేయాల్సిన బాధ్యత వదిలేసి, జనాలకు పెళ్లిళ్లు చేస్తూ కూర్చుంటే సంక్షేమం మాట ఏమో గానీ..  పైన చెప్పుకున్న ఆదాయ వనరుల ద్వారా వచ్చిన డబ్బంతా వృధాగానే ఖర్చవుతూ ఉంటుంది. దేశం మరో 50 ఏళ్లు అయినా ఇలాగే బీదరికంలో ఉంటుంది. ప్రభుత్వాలు తీసుకు వస్తున్న రకరకాల స్కీములు..  అసలు నిజమైన వ్యక్తులకు చేరుతున్నాయా లేదా అన్నది కూడా అతి పెద్ద పజిల్!  మరి ఎవరిని ఉద్ధరించడానికి ఈ స్కీములన్నీ? కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు,  పార్టీల సానుభూతిపరులు,  అనుచరులు, గల్లీ లీడర్లు ఈ స్కీముల పేర్లు చెప్పుకుని.. బాధ్యత కలిగిన మన లాంటి వ్యక్తులు చెల్లించే పన్నులను దోచుకు తినడానికా? దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? “ఇక  ఎలాంటి  సంక్షేమ పథకాలు ఉండవు..  మీ బతుకు మీరు బతకండి  మీకు మంచి రోడ్లు వేస్తాం, నాణ్యమైన చదువులు ఉచితంగా చెప్పిస్తాం,  మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తాంఅని ఏ ప్రభుత్వం చెప్పగలుగుతుంది? పతనమవుతున్న దేశాన్ని, సమాజాన్ని చూడలేక ఆవేదనతో రాసినది ఇది!
Nallamothu Sridhar