ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన
తీర్పుల్లో ఒకటి, శబరిమల
అయ్యప్ప దేవాలయ వేశానికి స్త్రీలకు అర్హత ఉందని చెప్పడం. 21వ శతాబ్దంలో ఒక గుడిలోకి ‘స్త్రీత్వం’ కారణంగా ప్రవేశం కల్పించాలని ఈ దేశ
ఉన్నత న్యాయస్థానమే ఆదేశించిందంటే మనం మానవ హక్కుల విషయంలో ఎంత దిగజారి ఉన్నామో ఈ
విషయం తెలపకనే తెల్పుతుంది. ఆ తీర్పుని ఎందరో స్వాగతిస్తుంటే మరోవైపున కేరళలో
కొందరు మహిళలే దాన్ని వ్యతిరేకించడం, ఊరేగింపులు తీయడం కూడా జరిగిపోయింది. మంత్రతంత్రాలున్న
విఠలాచార్య సినిమాల్లో చూశాం. నిన్న మొన్న ఇంగ్లీషు చిత్రం ‘మమ్మీ’లో చూశాం. తమ వాళ్ళను తామే చంపే ఉన్మాదిగా తయారు చేసి వదిలే
సంఘటనలు. మమ్మీలో దుష్టశక్తి నోరు తెరవగానే కొన్ని కీటకాలు వస్తాయి. ఆ కీటకాలు
కుట్టగానే ఆ కుట్టిన వ్యక్తులు దుష్టశక్తి సైన్యంగా మారిపోతారు. దుష్టశక్తిని
చంపడానికి వస్తున్న తమవాళ్ళనే చంపేస్తారు. మంత్రాలకీ, తంత్రాలకీ ఇలాంటి శక్తులు ఉండవు. కానీ, ఒక భావజాలం మాత్రం అలా మంత్రించి
వదిలేస్తుంది. అలాంటి సంఘటన నిన్న మొన్నే చూశాం. ఇదే వైదిక భావజాలాన్ని
బతికిస్తున్న మనువాదం. రళలోని
అయ్యప్ప స్వామి దేవాలయంలో ‘స్త్రీలకు
ప్రవేశం కల్పించాలి, ఇది మానవ
హక్కు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు
వ్యతిరేకంగా కేరళలో మహిళలే ఊరేగింపు చేయడం. ‘మాకు ప్రవేశం వద్దు’ అని
వారు నినదించడం. ‘దేవాలయంలోకి
మేం వెళ్ళం’
అంటే వీళ్ళేదో నాస్తికులై హేతువాద
చైతన్యంతో చేసిన ఊరేగింపు కాదు. వైదిక భావజాలాన్ని, వంటబట్టించుకున్న వాళ్ళే, మతవాదుల మాయాజాలం లో చిక్కుకున్న వాళ్ళు!
కేరళలో రాజకీయంగా బతకడం కోసం మత వాదం చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగమే కావచ్చు. అయినా, ‘మాకు ఆ హక్కు’ వద్దు అంటూ మహిళలే రావడం ఇది మనువాద మతోన్మాద మంత్ర ప్రభావమే! అంబేడ్కర్ అనే మహాశక్తి లేకపోతే ‘రిజర్వేషన్లు మేం తీసుకోం. అది తప్పుగదా!’ అని ఈ దేశ దిగువ కులాల వారితో ఎప్పుడో ‘మనమంతా ఒక్కటే’ అనే మధుర గీతాలు పాడించేవారే మనువాదులు! సమాజంలో వివక్షలు రేపి, కులభేదాలతో, లింగ అసమాన తలతో భావజాల బానిసలుగా కట్టిపడేయడమే మనువాద నీతి. దీనిలో భాగమే ‘మాకు దేవాలయ ప్రవేశం వద్దు’ అని కేరళలో మహిళలే ఊరేగింపు తీయడం. ‘నెలసరి’ మొదలు కాని ఆడపిల్లలకు, నెలసరి ఆగిపోయిన వయస్సు మళ్ళిన స్త్రీలకు శబరిమల దేవాలయ ప్రవేశం ఉంది కానీ, ‘నెలసరి’ కొనసాగే స్త్రీలకు మాత్రం ప్రవేశం లేకపోవడం నిజంగా విడ్డూరం. నెలసరి అనేది స్త్రీ శరీరతత్వం. నిజానికి నెలసరి అనేది స్త్రీ ఆరోగ్యానికి ఒక సూచిక. స్త్రీ అంటే మాతృత్వం. ఆ ప్రక్రియ తల్లితనానికి తొలి అర్హత. ప్రపంచ మనుగడకు నెలవాలమైన ఈ అర్హతనే కించపరచే విధానం ఎంత నీచమైందో ఆలోచిస్తేనే అర్థమవు తుంది.
ఒకటి: దైవ పూజలు చేసే రోజుల్లో భక్తులు తమ ఇతర విసర్జనల్ని మానుకుంటున్నారా? ఆ విసర్జనలు దైవదర్శనానికో, దైవపూజకో అడ్డంకి కానప్పుడు ఈ మాతృగర్భ అండ విసర్జన ఎలా అడ్డంకి అవుతుంది? ఒక విసర్జన శుద్ధం, ఒక విసర్జన అశుద్ధం ఎలా అవుతుంది? రెండు: వేదం చెప్పింది కాబట్టి వేద వాక్కుగా భావిద్దామా? అంటే... ఈ రోజున వేదంలో చెప్పినట్టు దైవాల్ని పూజించే వాళ్ళు ఒక్కరూ లేరు. వేదకాలంలో వేల సంవత్సరాలు పూజలందుకున్న ఇంద్రుణ్ణి ఇప్పుడు పూజించేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ‘వేదభూమిలో’ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి వెదికినా కన్పించరు. పైగా ఇప్పుడు ఇంద్రుడు పెద్ద వ్యభిచారి. స్త్రీలోలుడుగా మిగిలిపోయాడు. వేదాల్ని, వేద కర్మల్ని పాటించేవారు లేనేలేరు. కాబట్టి ఈ ‘నెలసరి’ విషయాన్ని పాటించాల్సిన పనేలేదు. మూడు: సాధారణంగా నెలసరి రోజుల్లో ఏ స్త్రీ కూడా దైవకార్యాలు చేయదు. కానీ ఇక్కడ శబరిమలలో నెలసరి కనిపించే ఆ మూడు నాలుగు రోజులే కాదు, పరిపూర్ణ మాతృత్వానికి ప్రతీకగా ఉండే నెలసరి చక్రపరి ధిలో ఉన్నన్నాళ్ళు (రజస్వల నుంచి మెనోపాజ్ వర కు) స్త్రీలకి ఆలయ ప్రవేశార్హతలు లేవన్నమాట. అంటే ఈ దైవం ‘మాతృత్వ విరోధి’ (ఈస్ట్రోజన్ హార్మోన్ వైరి) అన్నమాట. మాతృత్వ వైరి మనిషే కాదు. మరి దైవం ఎలా అవుతాడు? ఇది, తల్లితనాన్ని తక్కువ గా, హీనంగా చూడ్డమే. వైదిక సంప్రదాయంలో స్త్రీలకి ఆధ్యాత్మిక హక్కు లేదు. వేదాధ్యయనం, సంస్కారాలు, ఎలానూ లేవు. కనీసం దేవాలయ ప్రవేశం కూడా లేకపోవడం ఎంత దుర్మార్గం. ఇంట్లో భార్య, బిడ్డలు (కూతుళ్ళు) చేసిన వంటలు కూడా అయ్యప్పమాల ధరించిన వారు తినరు. ఇది నిష్టా! మాలాధారణ ఇందుకేనా? సొంత ఇం ట్లోనే అంటరాని తనాన్ని నెలకొల్పే దైవారాధనల్ని ఏమనాలి?
స్త్రీలకి ఆధ్యాత్మిక రంగంలో స్థానం కల్పించిన మొదటి వ్యక్తి బుద్ధుడే. వారి కోసం ఒక ప్రత్యేక భిక్షు ణీ సంఘాన్ని ఏర్పాటు చేసిన వారికి ధార్మిక జీవనా న్ని అందించిన మానవీయుడు ఆయనే! మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు, ఉద్యోగపు హక్కు ఎలాగో ఆధ్యాత్మిక హక్కు కూడా అలాంటిదే! దైవాన్ని పూజించడం, పూజించకపోవడం, దర్శించుకోవడం, దర్శించుకోకపోవడం అది ఆస్తిక, నాస్తిక భావజాల అంశం. ఇష్టం వచ్చిన దైవాన్ని పూజించుకోవడం లౌకిక అంశం. కానీ, వివక్షతో దేవాలయ ప్రవేశం లేదని చెప్ప డం అమానవీయం. అనైతికం. ఒకప్పుడు స్త్రీలకు ఆ స్తి హక్కు లేదు. ఓటు హక్కు లేదు. విద్యను పొందే హక్కు లేదు, ఉద్యోగపు హక్కు లేదు ఇవ్వన్నీ హక్కు లే! ఇవేవీ వైదిక మతం ప్రసాదించిన వరాలు కాదు. ఈ ఊరేగింపు తీసినవారు, తీయించినవారు మా మత ధర్మాన్ని మంటగలిపారు. స్త్రీలకి ఎన్నోహక్కులు కల్పించారు. ఇది వైదిక ధర్మ విరుద్ధం. కాబట్టి ‘ఆ హక్కులూ’ మాకు వద్దు అని అనిపించగలరా? అరిపించగలరా? ఇలాంటి ఊరేగింపుల్ని చూస్తే ‘ఎప్పటి నుంచైతే స్త్రీని గౌరవించడం భారతదేశం మానేసిందో, అప్ప టి నుంచే మన పతనం ప్రారంభమయ్యింది. ఎప్పుడై తే అన్నిరంగాల్లో, అన్ని విషయాల్లో స్త్రీలను తీర్చిదిద్ద గలమో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుంది’ అని ఎలుగెత్తి చాటిన వివేకానందుడు తల్లడిల్లడా? మనుషులంతా సమానమే అయినప్పుడు... కుల, మత, జాతి, లింగ వివక్షలు లేని మన సమాజంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించాల్సిందే! ఇది తల్లితనానికి తెచ్చిన గౌరవంగా కీర్తించాల్సిందే!

జీవ పరిణామం ప్రకారం జీవులు పుట్టి ఈ
భూమ్మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాలు కావొస్తుంది. ఆ తర్వాత 350 కోట్ల సంవత్సరాలు గడిచాక (నేటికి 50 కోట్ల సం॥నాడు) స్త్రీ, పురుష
విభజన జరిగింది. స్త్రీ జీవులు గర్భం ధరించి, సంతానాన్ని కనే పరిణామం జరిగి ఏడు కోట్ల సంవత్సరాలు క్రితం మాత్రమే!
ఈ కనే జీవుల్లో కూడా రుతుచక్రం (నెలసరి) ప్రారంభమైంది కేవలం కోటి సంవత్సరాల క్రితమే.
ఈ పరిణామ క్రమంలో ఉడుత, ఎలుక, ఏనుగు, గుర్రం, పశువులు, చింపాంజీలు, మనుషులు మొదలైన క్షీరదాలన్నింటిలో
నెలసరి రుతుక్రమం ఉంది. రుతు క్రమం కనిపించడం జీవి ఆరోగ్యానికి సంకేతం. ఇది జీవ
పరిణామక్రమంలో ఉన్నత దశ. సురక్షితమైన జీవచర్య.
ఇలాంటి ఈ జీవచర్యని ‘అంటు’తో ముడి పెట్టడం ఒక్క భారతీయ సమాజంలోనే చూస్తాం. ముఖ్యంగా
వైదిక భావజాలంలో స్త్రీలందరూ శూద్రులు కిందే లెక్క. శూద్రులకు ఏ విధమైన జ్ఞానార్జన హక్కు లు లేవో ఆ
హక్కులు బ్రాహ్మణ స్త్రీలకూ లేవు. వైదిక సంస్కృతిలో
స్త్రీలకు విద్యలు, వేద
విద్యలూ నిషేధం. అందుకే ‘తల్లి శూద్రురాలు
తానెట్లు బాపడు’ అని
ప్రశ్నించాడు వేమన.
ఐతే, ఒక నెలలోని మొత్తం రోజుల్లో 24 రోజులు స్త్రీలను శూద్రురాలిగా చూస్తూ, మిగిలిన నాలుగైదు రోజులు ‘అంటరాని’ పంచమజాతికి
చెందిన వ్యక్తిగా దూరంగా పెట్టడం అనేది కూడా ఈ వైదికంలో కనిపిస్తుంది. ఈ దురాచారం
రుతుక్రమం వల్ల వచ్చిన రోగమే! నెలసరి అయిన ఆ నాలుగైదు రోజులు స్త్రీని
అంటుకోకూడదు. అంటే స్త్రీలను ఇటు శూద్రులుగా, అటు పంచములుగా రెండు రకాల ‘హోదాలు’ కల్పించి, వారిని దూరంగా పెట్టిందీ వైదిక సంప్రదా
యం. అసలు ఈ అంటు అనే భావజాలం తొలిగా వేదంలోనే పడింది. కృష్ణయజుర్వేదం 2-5-1లో ఇలా ఉంది - త్వష్ణ
కుమారుడు విశ్వరూపుడు. విశ్వరూపుడు దేవతల పురోహితుడు. కానీ, యజ్ఞంలో లభించే హవిర్భాగాన్ని దేవతలతో
పాటు అసురులకు కూడా చెందేట్టు చూడ్డం వల్ల ఇంద్రునికి ఇతనిపై కోపం వచ్చింది. అతని
మూడు తలల్ని నరికేశాడు. దానితో ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంది. ఆ
పాపభారాన్ని మోయలేక ఇంద్రుడు భూమి దగ్గరకు వచ్చి తన పాప భారాన్ని తీసుకోమని
అడుగుతాడు. భూమి ఆ పాపం లో మూడోభాగం తీసుకుంది. ఆ కారణంగా భూమిపై కొంతభాగం ఎడారిగా
మారింది. అలాగే చెట్లదగ్గరకు వచ్చి అడిగాడు. కొన్ని చెట్లు మూడోభాగాన్ని తీసుకు
న్నాయి. ఆ ఫలితంగా ఆ చెట్ల నుంచి జిగురులు స్రవిస్తున్నాయి. చివరకు ఇంద్రుడు
స్త్రీల దగ్గరకు వెళ్ళి తన పాపభారాన్ని పంచుకోండని అర్ధిస్తాడు. అప్పుడు వారు
అంగీకరిస్తారు. ఆ పాపభారం వల్లే స్త్రీలకు ‘రజస్వల’ కలుగుతుంది.
అది పాపభార ఫలితం కాబట్టి ఆ సమయంలో స్త్రీలను తాకకూడదు. వారితో మాట్లాడకూడదు. కలసి
కూర్చోకూడదు. వారు తినే సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే రజ స్వల బ్రహ్మహత్యాఫలం
కాబట్టి ఇదే కృష్ణ యజు ర్వేదంలోని అంశం.
నెలసరికి కారణం ఏమిటో తెలియని కాలంలో అల్లిన ఒక కథే ఆ తర్వాత అదే
సామాజిక అంశంగా మారింది. సాంఘిక దురాచా రంగా, లింగవివక్షగా కరుడుకట్టుకు పోయింది. స్త్రీల నెలసరి దోషం అనే విషబీజం
ఇక్కడే పడింది. ఆ ఫలితమే స్త్రీలకు అంటుగా, శబరిమలలో అంటరాని తనంగా మారింది. ‘తల్లి’తనాన్ని కూడా వికృతంగా చూసే
మనువ్యవస్థకు మారురూపమే ఈ దేవాలయ ప్రవేశ నిషిద్ధం. మన పురాణ ఇతిహాసాల్లో కూడా
దేవుళ్ళకీ, మా తృత్వానికీ పెనవేసుకున్న
అనురాగబంధాల్ని చూడలేం. ఒక్క శ్రీకృష్ణుడు తప్ప పాకృతిక నియమాల ప్రకారం
తల్లిగర్భాన పుట్టిన దైవాలు కూడా దాదాపుగా లేరు. అందరూ చిత్రవిచిత్రంగా ప్రభవించిన
వారే! తల్లి గర్భాన ప్రసవమందినవారు దాదాపుగా లేరు. అందుకే మాతృత్వపు గొప్పదనం
అనేది
మన మానవీయ
ఆలోచనల్లో తప్ప, మన
ఆథ్యాత్మిక అంశాల్లో ఎప్పుడూ లేదు. స్త్రీని గౌరవిస్తే గదా! తల్లిని గౌర వించేది!
స్త్రీ గౌరవానికి చోటులేని వైదిక మనుధర్మం లో మాతృత్వ గౌరవానికీ పెద్ద ప్రాముఖ్యత
ఏముంటుంది?
శారీరక ధర్మశాస్త్రం ప్రకారం, శరీరం ఒక యంత్రం. నిరంతరం దాన్లో ఎన్నో
మలినాలు తయారవుతూ ఉంటాయి. వాటిని నిరంతరం విసర్జిస్తూ ఉండాలి. ‘విసర్జన అపచారం’ అని మడిగట్టుకుని బతికే జీవి ఏదీ ఈ
భూమ్మీద లేదు. తినడం కంటే విసర్జనే ఆరోగ్యానికి మూలం. వాహనంలో ట్యాంకు నిండా
పెట్రోలు నింపినా, మంచి పవర్
గల బ్యాటరీతో స్వి చ్ కొట్టినా, విసర్జన
అవయవమైన పొగగొట్టాన్ని మూసి ఉంచితే బండి స్టార్ట్ కాదు.
మన శరీరం కూడా అంతే... చెమటగా, గుమిలిగా, పుసిగా, పడిశంగా, మూత్రంగా, మలంగా మలి నాలూ ఎప్పుడూ బైటకు పోతూ ఉండాల్సిందే! ఇవి దైహిక
కార్యక్రమాలు. వీటికి తోడు స్త్రీలకి సంతానం కనే లక్షణం ఉంది. దానికి ‘అండం’ అవసరం. కాబ ట్టి అండాలు కూడా పుట్టిగిట్టుతూ ఉంటాయి. గిట్టిన
అండాలు అక్కడే ఉంటే గర్భాశయం కుళ్ళి తల్లికి అ నారోగ్యం కలుగుతుంది. మనకు పుట్టే
యోగం ఉండదు. జాతి నశిస్తుంది. అందుకే ఆ అండాలు బైటకు విసర్జించబడతాయి. ఈ అండ
విసర్జననే రజస్వల లేదా నెలసరి అంటాం. ఇది 28 రోజుల చక్రం. మనం పుట్టడం కోసం తల్లి గర్భాలయాన్ని శుద్ధిచేసి, మన కోసం మన జన్మ కోసం సిద్ధంగా ఉంచే అతి
పవిత్ర కార్యం ఇది. ఇక్కడ
మనం ఖచ్చితంగా కొన్ని విష యాల్ని చెప్పుకు తీరాలి.
ఒకటి: దైవ పూజలు చేసే రోజుల్లో భక్తులు తమ ఇతర విసర్జనల్ని మానుకుంటున్నారా? ఆ విసర్జనలు దైవదర్శనానికో, దైవపూజకో అడ్డంకి కానప్పుడు ఈ మాతృగర్భ అండ విసర్జన ఎలా అడ్డంకి అవుతుంది? ఒక విసర్జన శుద్ధం, ఒక విసర్జన అశుద్ధం ఎలా అవుతుంది? రెండు: వేదం చెప్పింది కాబట్టి వేద వాక్కుగా భావిద్దామా? అంటే... ఈ రోజున వేదంలో చెప్పినట్టు దైవాల్ని పూజించే వాళ్ళు ఒక్కరూ లేరు. వేదకాలంలో వేల సంవత్సరాలు పూజలందుకున్న ఇంద్రుణ్ణి ఇప్పుడు పూజించేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ‘వేదభూమిలో’ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి వెదికినా కన్పించరు. పైగా ఇప్పుడు ఇంద్రుడు పెద్ద వ్యభిచారి. స్త్రీలోలుడుగా మిగిలిపోయాడు. వేదాల్ని, వేద కర్మల్ని పాటించేవారు లేనేలేరు. కాబట్టి ఈ ‘నెలసరి’ విషయాన్ని పాటించాల్సిన పనేలేదు. మూడు: సాధారణంగా నెలసరి రోజుల్లో ఏ స్త్రీ కూడా దైవకార్యాలు చేయదు. కానీ ఇక్కడ శబరిమలలో నెలసరి కనిపించే ఆ మూడు నాలుగు రోజులే కాదు, పరిపూర్ణ మాతృత్వానికి ప్రతీకగా ఉండే నెలసరి చక్రపరి ధిలో ఉన్నన్నాళ్ళు (రజస్వల నుంచి మెనోపాజ్ వర కు) స్త్రీలకి ఆలయ ప్రవేశార్హతలు లేవన్నమాట. అంటే ఈ దైవం ‘మాతృత్వ విరోధి’ (ఈస్ట్రోజన్ హార్మోన్ వైరి) అన్నమాట. మాతృత్వ వైరి మనిషే కాదు. మరి దైవం ఎలా అవుతాడు? ఇది, తల్లితనాన్ని తక్కువ గా, హీనంగా చూడ్డమే. వైదిక సంప్రదాయంలో స్త్రీలకి ఆధ్యాత్మిక హక్కు లేదు. వేదాధ్యయనం, సంస్కారాలు, ఎలానూ లేవు. కనీసం దేవాలయ ప్రవేశం కూడా లేకపోవడం ఎంత దుర్మార్గం. ఇంట్లో భార్య, బిడ్డలు (కూతుళ్ళు) చేసిన వంటలు కూడా అయ్యప్పమాల ధరించిన వారు తినరు. ఇది నిష్టా! మాలాధారణ ఇందుకేనా? సొంత ఇం ట్లోనే అంటరాని తనాన్ని నెలకొల్పే దైవారాధనల్ని ఏమనాలి?
స్త్రీలకి ఆధ్యాత్మిక రంగంలో స్థానం కల్పించిన మొదటి వ్యక్తి బుద్ధుడే. వారి కోసం ఒక ప్రత్యేక భిక్షు ణీ సంఘాన్ని ఏర్పాటు చేసిన వారికి ధార్మిక జీవనా న్ని అందించిన మానవీయుడు ఆయనే! మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు, ఉద్యోగపు హక్కు ఎలాగో ఆధ్యాత్మిక హక్కు కూడా అలాంటిదే! దైవాన్ని పూజించడం, పూజించకపోవడం, దర్శించుకోవడం, దర్శించుకోకపోవడం అది ఆస్తిక, నాస్తిక భావజాల అంశం. ఇష్టం వచ్చిన దైవాన్ని పూజించుకోవడం లౌకిక అంశం. కానీ, వివక్షతో దేవాలయ ప్రవేశం లేదని చెప్ప డం అమానవీయం. అనైతికం. ఒకప్పుడు స్త్రీలకు ఆ స్తి హక్కు లేదు. ఓటు హక్కు లేదు. విద్యను పొందే హక్కు లేదు, ఉద్యోగపు హక్కు లేదు ఇవ్వన్నీ హక్కు లే! ఇవేవీ వైదిక మతం ప్రసాదించిన వరాలు కాదు. ఈ ఊరేగింపు తీసినవారు, తీయించినవారు మా మత ధర్మాన్ని మంటగలిపారు. స్త్రీలకి ఎన్నోహక్కులు కల్పించారు. ఇది వైదిక ధర్మ విరుద్ధం. కాబట్టి ‘ఆ హక్కులూ’ మాకు వద్దు అని అనిపించగలరా? అరిపించగలరా? ఇలాంటి ఊరేగింపుల్ని చూస్తే ‘ఎప్పటి నుంచైతే స్త్రీని గౌరవించడం భారతదేశం మానేసిందో, అప్ప టి నుంచే మన పతనం ప్రారంభమయ్యింది. ఎప్పుడై తే అన్నిరంగాల్లో, అన్ని విషయాల్లో స్త్రీలను తీర్చిదిద్ద గలమో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుంది’ అని ఎలుగెత్తి చాటిన వివేకానందుడు తల్లడిల్లడా? మనుషులంతా సమానమే అయినప్పుడు... కుల, మత, జాతి, లింగ వివక్షలు లేని మన సమాజంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించాల్సిందే! ఇది తల్లితనానికి తెచ్చిన గౌరవంగా కీర్తించాల్సిందే!
- బొర్రా గోవర్ధన్,9390600157