Pages

నీ అంతులేని స్వార్థం

నీ అంతులేని స్వార్థం ,నీ నిర్దయలే
నీ పాలిటి శతృవులై నిన్ను చుట్టుముడతాయని
నీవు తెలుసుకోక తప్పని రోజొచ్చింది.
                             -భార్గవ జి
-----------------------------
మన సొంత పిల్లలనే ప్రేమించేందుకు మనకు టైం లేదు.
పిల్లలను మన కలలు నెరవేర్చే 
సాధనాలుగా మార్చుకుని చాలా కాలం అయింది.
ఇక మంది పిల్లలను మనం ఎప్పుడు ప్రేమిస్తాం !
కుటుంబమే లేని అనాధ బాలల 
ఉనికే మనకు తెలియనప్పుడు
వారెట్ల పెరుగుతున్నారో మనకేం పట్టింది?
పేదరికం కాటుకు చిక్కి 
వివక్షతల ,నిర్లక్ష్యాల కోరలకు బలై
ప్రేమలేక ,ఆదరణ దొరకక , 
దయగల ఒక మాట నోచుకోక  
ఎండిపోయిన గుండెల గురించి 
మనకు పట్టింపు లేదు.
బండచాకిరితో చిన్నప్పుడే కాయలు కాచిన చేతులను మనం ఎప్పుడు చూస్తాం ?
హింస ,దౌర్జన్యం ,బలప్రయోగం తప్ప
బతకడానికి వేరే నియమాలుంటాయని 
అనుభవంలోకి రాని పసి హృదయాలు
ఏ వ్యక్తిత్వాలు సంతరించుకుంటాయో 
మనకేమి తెలుసు.?
మనం కట్టుకున్న అద్దాల మేడలపై 
రాళ్ళు పడినప్పుడు
మనం భద్రంగా పెంచుకుంటున్న పూలకుండీలను
ఎవరో పగల గొట్టినపుడు
మన భద్ర జీవితాల్లో కలకలం రేగినప్పుడు మాత్రమే
మనం ఉలికి పడి నిద్రలేస్తాం.
మన చుట్టూ సమాజం కూడా 
ఒకటుందని కనుగొంటాం.
నీకు రక్షణ ఇవ్వడానికే తప్ప , 
నీకు అవకాశాలివ్వడానికే తప్ప,
నీకు సేవలందివ్వడానికే తప్ప
సమాజమెందుకు అని నీవనుకుంటుంటావు. 
సమాజానికి నీవుకూడా తిరిగి ఏమైనా 
ఇవ్వాల్సుంటుందని నీకెవరూ చెప్పలేదు కద.
సమాజమంటే నీ ఇష్టానుసారం వాడుకుని వదిలేసే ఒక ఉచిత వనరు అనే కద నీ అవగాహన.
అయితే నీవు వాడుకుని వదిలేసే 
సమాజం నీ సమస్యగా మారుతుందనీ
నీవు పట్టించుకోని సమాజమే
నీకు ప్రమాదాలు తెచ్చిపెడుతుందనీ 
నీకెవరూ చెప్పలేదు కద.
అంతా నా తెలివే ,అంతా నా చాకచక్యమే 
అంతా నా లౌక్యమే అని విర్రవీగే నీకు
నీ భద్రతా ,నీ శాంతి ,నీ సుఖాలూ
సమాజం వేసిన భిక్ష అనీ ,
ఏ సుఖాలూ నోచని జనాల చాకిరీ వల్లే 
నీకీ భద్ర జీవితమనీ నీవు తెలుసుకోవలసిన రోజొచ్చింది.
నీపిల్లలతో పాటూ అందరు పిల్లలూ 
సంతోషంగా ,ప్రేమగా ఎదిగినప్పుడే 
అందరూ బాగుంటారని నీవు గ్రహించాల్సిన రోజొచ్చింది. 
నీ ఇంట్లో చెత్త వీధిలో పారేస్తే చాలదు.
నీ వీధిలోని చెత్త కూడా నీవు ఎత్తేయాల్సి వుంటది.
నీ ఒక్కడివి సంతోషంగా , గౌరవంగా ఉంటే చాలదు.
అందరికీ ఆ సంతోషం, గౌరవం ఎలా దక్కుతాయో 
నీవు ఆలోచించాల్సి ఉంటుంది.
నీ అంతులేని స్వార్థం ,నీ నిర్దయలే
నీ పాలిటి శతృవులై నిన్ను చుట్టుముడతాయని

నీవు తెలుసుకోక తప్పని రోజొచ్చింది.
(మిత్రుడు భార్గవ జి వాల్ నుండి)

జాతీయవిద్యా దినోత్సవం...

నేడు (నవంబర్‌ 11) జాతీయవిద్యా దినోత్సవం... విద్యా భారత నిర్మాత "మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌" గారి జయంతి.. ఈ సందర్భంగా కొన్ని విషయాలు🌹*_

👉దేశ స్వాతంత్రోద్యమ సాఫల్యంలో, స్వతంత్ర భారత విద్యా, వైజ్ఞానిక, కళల వికాసానికి బహుముఖప్రజ్ఞతో విసుగు విరతి లేకుండా ప్రవహించే ఉత్తేజంలా శ్రమించిన దార్శనికుడు, పోరాటకారుడు, కవి, రచయిత, జర్నలిస్టు, విద్యావేత్త, పరిపాలకుడు, బహుభాషోకోవిదుడు, భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌. బాల్యదశ నుంచే సాహిత్యం, తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు, మానవ విమోచనాల ఉద్యమ చరిత్రపై ప్రత్యేక అభినివేశం ఏర్పరచుకొని భారతీయ విద్యావికాసాన్ని గొప్ప ముందడుగు వేయించిన నవ్య మానవవాది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉ఆజాద్‌ 1888 నవంబర్‌ 11 వ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జన్మించారు. ఆజాద్‌ అసలు పేరు మొహిద్దీన్‌ అహ్మద్‌. ఆజాద్‌ అనునది కలం పేరు. మౌలానా చిన్నతనం నుండే కవిత్వం రాసేవారు. ఆ విధంగా ఆయన పేరులో ఆజాద్‌ చేరింది. మౌలానా తండ్రి పేరు మహమ్మద్‌ ఖైరుద్దీన్‌. కాగా వీరి పూర్వీకులు భారతీయులు. మౌలానా పూర్వీకుల్లో కొంత మంది అరబ్బీ, పారశీక భాషల్లో గొప్ప పండితులు కావడం వల్ల మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ తన పరిపాలనా కాలంలో వీరిని ఘనంగా సత్కరించారు. మౌలానా తండ్రి 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు అనంతరం అరేబియా దేశానికి వలస వెళ్లడం జరిగింది. మౌలానా 10 సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి భారత దేశానికి తిరిగి వచ్చాడు. మౌలానా కోల్‌కటా (కలకత్తా)లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. కాగా 1905 లో ఈజిప్టు రాజధాని కైరోలోని అజహస్‌ విశ్వ విద్యాలయానికి వెళ్లి ఉన్నత విద్యను పూర్తి చేసుకొని 1908 లో భారత దేశానికి తిరిగి వచ్చారు. మౌలానా మాతృభాష అరబ్బీ అయినప్పటికీ అరబ్బీతో పాటు పారశీక భాషలో కూడా సాటి లేని మేటి పాండిత్యాన్ని సంపాదించి మత, ధర్మ శాస్త్రాల్లో మంచి పట్టు సాధించారు. ఇతని పాండిత్యం వల్ల మౌలానా అనే బిరుదును పొందారు. మౌలానా అనగా పండితుడు అని, అబుల్‌ కలాం అనగా భాషా జనకుడు అని అర్థం. ఈ విధంగా మొహిద్దీన్‌ అహ్మద్‌ కాస్తా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌గా మారారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉మౌలానా తన పదహారవ ఏట లిసానస్‌ సిదిక్‌ ( సత్యవాణి ) అనే పత్రికను స్థాపించారు. ఆ పత్రికలో ధార్మిక, సారస్వత విషయాలకు సంబంధించిన సంపాదకీయాలు రాసేవారు. వాటిని చదివిన పాఠకులు ఆ పత్రిక సంపాదకుడు వయో వృద్ధుడైన గొప్ప విద్వాంసుడేమోనని భావించారు. ఈ నేపథ్యంలో ఒక సాహిత్య సభకు మౌలానాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సభా నిర్వాహకుల్లో కొంతమంది ముఖ్య అతిథి రాక కోసం ప్రవేశద్వారం వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక యువకుడు నిరాటంకంగా వేదిక వద్దకు చేరుకొనగా నిర్వాహకులు అతనిని ఆపి అతడే ఆజాద్‌ అని తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ రోజుల్లో ఖాజీ అల్తాఫ్‌ హుస్సేన్‌ అలీ గొప్ప విద్వాంసుడుగా పేరు గాంచాడు. అయితే ఆయన రచనలను ఆజాద్‌ తన పత్రికలో నిశితంగా విమర్శించారు. దీంతో అతడు ఆజాద్‌ను కలిసి మాట్లాడి ఆయన పాండిత్యానికి అలీ మంత్రముగ్ధుడయ్యాడు. కాగా 1912 లో ఆజాద్‌ అల్‌ హిలాల్‌ ( చంద్రరేఖ ) అనే ఉర్దూ వార పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ఉర్దూ సాహిత్యంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. హిందూ ముస్లింల సమైక్యతను ప్రోత్సహిస్తూ మౌలానా తన పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. అందులో బ్రిటిషు వారి అక్రమాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడం జరిగింది. దీంతో బ్రిటిషు ప్రభుత్వం అల్‌ హిలాల్‌ పత్రికను నిషేధించడమే కాకుండా మౌలానాను నాటి బీహార్‌ లోని రాంచీలో నిర్బంధించింది. బ్రిటిషు వారి బెదిరింపులకు ఏమాత్రం భయపడని మౌలానా అల్‌ బలాగ్‌ ( సందేశం ) అనే మరొక పత్రికను స్థాపించి తన రచనా పరంపరను కొనసాగించారు. బ్రిటిషు ప్రభుత్వం ఆ పత్రికపై కూడా నిషేధాన్ని విధించి పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించింది. మౌలానా అరెస్టై బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా 1920లో మౌలానా మహాత్మాగాంధీని మొదటిసారిగా ఢిల్లీలో కలుసుకున్నారు. గాంధీ మార్గంలో నడచి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమ ప్రచారానికై దేశ సంచారం చేసి నాయకుల్లోని భేదాభిప్రాయాలను నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో గాంధీజీకి ముఖ్య అనుచరుడుగా మారారు. కాగా 1923 లో మౌలానాఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జమియత్‌ ఉల్‌ ఉలేమాకు 1924 లో అలాగే 1929 లో జాతీయ వాద ముస్లిం సదస్సుకు అధ్యక్షత వహించారు. 1937 లో పార్లమెంటరీ బోర్డ్‌ సభ్యుడుగా కాంగ్రెస్‌ మంత్రిత్వ శాఖల పనితీరును నిర్దేశించారు. కాగా 1940 నుండి 1946 వరకు తిరిగి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా వ్యవహరించారు. 1946 లో రాజ్యాంగ సభకు సభ్యుడుగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో జాతీయోద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. ఇండియా విన్స్‌ ఫ్రీడం అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో భారత దేశం తప్పక స్వాతంత్ర్యాన్ని సాధించితీరుతుందని మౌలానా గట్టిగా అభిప్రాయపడ్డారు. కాగా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 1947 ఆగష్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. మొట్ట మొదటి భారత ప్రధానిగా పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఏర్పడింది. నెహ్రూ తన మంత్రి మండలిలో ఆజాద్‌కు విద్యాశాఖామంత్రి గా స్థానం కల్పించి గౌరవించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ విద్యాశాఖతో పాటు సహజ వనరులు, శాస్త్ర పరిశోధన శాఖలను కూడా నిర్వహించారు. మౌలానా విద్యాశాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. మంత్రి పదవిలో ఉండగానే 1958 లో మౌలానా కన్నుమూశారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉గొప్ప వక్త, విద్యావేత్త, రచయిత, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడైన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ భారత జాతీయ జీవనంలో లౌకికవాదం, ఏకత్వ భావనలకు ప్రతీకగా నిలచారు. కాగా విద్యా రంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించి గౌరవించడం ఎంతో జరుగుతున్నది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించి, ఉద్యమక్రమంలో నాయకత్వ పెఢధోరణులను, చీలికలను నివారించి, భిన్నమైన ఆకాంక్షలున్న ఉద్యమ శక్తులను ఏకతాటిపై నడిపించాడు. ఉద్యమ జీవితంలో పదకొండు సవంత్సరాల జైలు జీవితాన్ని గడిపిన ఆజాద్‌ మాతృదేశ విముక్తి పోరులో చిరస్మరణీయ పాత్రను పోషించి, దేశభక్త లౌకకవాదానికి ప్రతీకగా నిలిచారు. 1947–52 వరకు విద్యాశాఖమంత్రిగా, 1952–58 వరకు విద్యా, ప్రకృతివనరుల, శాస్త్ర సాంకేతిక మంత్రిగా, 1956 లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్‌ అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి కృషిచేసారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉వలసపాలకుల అవసరాలకు తోడ్పడుతూ వచ్చిన విద్యావ్యవస్థను సమూలంగా మార్చడం కోసం, విద్య పునాదిని విప్లవకీకరించడం కోసం దేశీయవనరులు, అవసరాలకు అననువైన ప్రజాతంత్ర విద్యను రూపొందించడం కోసం మౌలానా నిపుణులతో కమిటీలను వేసి వారి సిఫారసులను అమలుచేసాడు. బి.జి.ఖేర్‌ కమిటీ (1947) సిఫారసుల మేరకు విద్యారంగానికి కేంద్రబడ్జెట్‌లో 10%, రాష్ట్ర బడ్జెట్‌లో 30% కేటాయింపులను అమలు చేయించారు. నళిని రంజన్‌ సర్కార్‌ కమిటీ (1947) సూచనల మేరకు శాస్త్ర సాంకేతిక రంగంలో స్వయం స్వాలంబన కోసం ప్రతిష్టాత్మక ఐఐటీలను స్థాపించాడు. లక్ష్మణస్వామి మొదలియార్‌ (1952) కమిటీ సూచనలు స్వీకరించి పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్పు చేసి, వృత్తి విద్యను, క్రీడా విద్యను ప్రవేశపెట్టాడు. విజ్ఞాన విహారయాత్రలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉రాధాకృష్ణన్‌ (1948) కమిషన్‌ సిఫారసుల మేరకు యూజీసీని ఏర్పాటుచేస్తూ ఉన్నత విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను స్థాపించాడు. ఇవి దేశ నాగరికతని అభివృద్ధి పథంలో నడపగల మేధాపరమైన మార్గదర్శకుల్ని గుర్తించి, శిక్షణ ఇచ్చి, వివిధ రంగాల నిర్వహణకు అవసరమైన నిపుణులను తయారు చేయడంలో ప్రధానపాత్ర నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను ప్రారంభిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు స్నేహితుడుగా, మార్గదరర్శకుడిగా ఉంటూ జ్ఞాన ప్రసారాన్ని, వ్యక్తిత్వ నిర్మాణం చేయాలన్నాడు. అక్షరాస్యత పెంపు కోసం వయోజన విద్యను ప్రారంభించి, పరిశోధనాభివృద్ధి కోసం కౌన్సిల్‌ అండ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ను స్థాపించి దీని పరిధిలో దేశవ్యాప్తంగా 50కి పైగా పరిశోధనా సంస్థలను నెలకొల్పి ఆధునిక విద్యా భారత నిర్మాతగా చరిత్రలో నిలిచాడు. బ్రిటిష్‌ ఇండియాలో తీవ్ర నిర్లక్ష్యానికి లోనైన భారతీయ సంస్కృతి, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి సాంస్కృతిక ఉద్యమ సేనానిగా పనిచేసారు. ప్రజల్లో సర్వవ్యాప్త ప్రేమను, అందం, ఆనందాల క్రియాశీలతనే కలిగించే సృజనాత్మక వ్యక్తీకరణే కళ అని వాటి అభివృద్ధికి స్వయం ప్రతిపత్తి గల భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమి, సాహిత్య అకాడమి, ఆర్ట్స్‌ అకాడమిలను స్థాపించాడు. స్వయంగా సాహిటీవేత్త ఐన మౌలానా గుబార్‌ఖాఅర్‌, తర్జుమన్‌ ఉల్‌ ఖురాన్‌ల ‘‘ది డాన్‌ ఆఫ్‌ హోప్‌’’తో పాటు స్వీయచరిత్రఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌ను రాసాడు. సామాజిక ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించాలనే రాజ్యాంగ లక్ష్యాల వెలుగులో ఆజాద్‌ రూపాందించి అమలుచేసిన విద్యా వ్యవస్థ మార్గదర్శక సూత్రాలను పూర్తిస్థాయిలో అమలు చేయించకోవలసిన భాద్యత పౌర సమాజం స్వీకరించాలి. అప్పుడే విద్య ప్రజాస్వామికీకరించబడి అందరికీ సమానంగా అందించబడి సామాజిక న్యాయం జరిగి, సాంఘీక ఆర్థిక అసమానతలు నివారింపబడి సృజనాత్మక, జ్ఞాన, లౌకిక భారతదేశం నిర్మింపబడుతుంది.@ Sreenivas@

పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు అభ్యర్ధన​


పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు అభ్యర్ధన​

1.
రాత్రి 8 గంటలకు టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, 8 తర్వాత TV లో మీ బిడ్డ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.

2. 30-45
నిముషాలు మీ బిడ్డ హోం వర్క్ తనిఖీ చేసి అతనికి సహాయం చేయండి

3.
రోజు అతని చదువుని పరిశీలించి వెనకబడిన సబ్జెక్టులో సహాయం చేయండి.

4. 5
వ/10 వ తరగతి లోపు చదివే ప్రాథమిక విద్య వారి జీవితానికి ములస్తంభం అని గుర్తించండి.

5.
ఉదయం ఉదయం 5:30 గంటలకు మేల్కొవడం వారికి అలవాటు చేయండి. ధ్యానం చేయడం నేర్పండి.

6.
మీరు ఏ పార్టీలు లేదా పెళ్లిళ్లకు హాజరు అయి ఆలస్యంగా మీ పిల్లలు నిద్రిస్తే మీ బిడ్డకు మరుసటి రోజు విశ్రాంతి ఇవ్వండి. లేదా మీరు వారిిని తరువాతి రోజు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటే కనీసం ఇంటికి 10:00 గంటలకు ఇంటికి రండి.

7.
చెట్లను నాటడానికి మరియు వాటిని పెంచే అలవాటును పిల్లలకు నేర్పండి.

8.
మీ పిల్లల పంచతంత్ర, అక్బర్ బిర్బల్, తెనాలి రాము వంటి కథలు పడుకునే సమయంలో చెప్పండి.

9.
ప్రతి సంవత్సరం వేసవి సెలవులు మీ బడ్జెట్ ప్రకారం ఒక పర్యటనకు ప్లాన్ చేయండి. (ఇది వేర్వేరు వ్యక్తులకు మరియు ప్రాంతాలకు అలవాటుపడే యోగ్యతను వారిలో మెరుగుపరుస్తుంది)

10.
మీ బిడ్డలో ప్రతిభను కనుగొని, దానిని మరింతగా మెరుగపర్చడానికి అతనికి సహాయపడండి (ఏదైనా విషయం, సంగీతము, క్రీడలు, నటన, డ్రాయింగ్, నృత్యం మొదలైన వాటికి ఆసక్తి ఉండవచ్చు) ఇది వారి జీవితాన్ని అందంగా చేస్తుంది

11.
ప్లాస్టిక్ వాడకూడదని నేర్పండి (కనీసం ప్లాస్టిక్ లో వేడి పదార్థాలు వాడకూడదని)

12.
ప్రతి ఆదివారం వారికి ఇష్టమైన వంట తయారు చేసేందుకు ప్రయత్నిoచండి. మరియు తయారుచేయడంలో సహాయం చేయమని వారిని అడగండి (వారు ఆనందిస్తారు)

13.
ప్రతి శిశువు జనమతః ఒక శాస్త్రవేత్త. వారు మనం జవాబు ఇవ్వలేని అనేక ప్రశ్నలను అడుగుతారు. కాని మా అజ్ఞానం తో వారిపై మన కోపాన్ని చూపించకూడదు (సమాధానాలను కనుగొని, వారికి తెలియజేయండి)

14.
వారిని క్రమశిక్షణ మరియు మంచి జీవన విధానాన్ని బోధించండి (తప్పుచేస్తే శిక్షించండి).

15.
పాఠశాల విద్య లేదా పాఠశాలలో పాస్ పెర్సెంటేజ్ ఆధారంగా లేదా మీ సహోద్యోగులు, మీ పొరుగువారు లేదా స్నేహితులు చెప్పారని లేదా ప్రయివేటు స్కూళ్ల ప్రచారం చూసి అత్యుత్తమ పాఠశాలగా నిర్ణయించకండి. మీ బడ్జెట్కు సరిపోయేదే మీ పిల్లలకు సరైన పాఠశాల అని గుర్తించండి. ఏ రోజుల్లో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో మీ పిల్లల విద్య కోసం మీరు మరింత ఖర్చు చేయాలి, ఈరోజు మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవాలి, నేడు మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం, మీ ప్రస్తుత బాధ్యతలు. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేయండి.

16.
తమను తాము చదవడం మరియు నేర్చుకోవడo అలవాటు చేయండి.

17.
ముఖ్యంగా మొబైల్ ఫోన్లను వారికి ఇవ్వకండి. (ఎందుకో ప్రతి ఒక్కరికి తెలుసు)

18.
మీ పనుల్లో మీకు సహాయపడమని మీ బిడ్డను అడగండి. (వంట చేయడం, ఇంటిని/బైక్/కార్ కడగడం, బట్టలు ఉతకడం లాంటివి)

మీ
శ్రేయోభిలాషి 🌷

భారత రిజర్వేషన్ల పితామహుడు

 
 *
భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్థంభం ...*
 *
ఛత్రపతి సాహు మహారాజ్ :*

(
మే 6 , 2019,
97
వ మహా పరినిర్వాణం సందర్భంగా  )
🌷🌹🌷🌹🌷🌹
భారతదేశ చరిత్రలో ( దళిత )
,
బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా , పాలనపరంగా  మహాత్మ జ్యో తిబాపూలే , ఛత్రపతి శివాజీ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ , ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు , రాజర్షి ఛత్రపతి సాహుమహారాజ్ .

1874
జూన్ 26 న రాధాబాయి , జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గే లకు జన్మించిన యశ్వంతరావు ఘాట్గే నే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్ గా  ప్రసిద్ది చెందుతాడు . ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి ( ఓబీసీ ) చెందిన   వ్యవసాయం చేసుకుని జీవించే *కున్భీ కాపు కులం* .

ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి , 17  తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి  యశ్వంత్ రావు ఘాట్గే కి ముద్దుగా  ' సాహు ' అని  పేరు పెట్టుకుంటది.


మూడేళ్ళకే తల్లిని కోల్పోయిన సాహు , 1886 మార్చి 20 న తండ్రి మరణంతో 11 ఏళ్ళకే తల్లిదండ్రులిద్దరులేని వాడైనాడు .

సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణ లో జరిగినందున ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు .

యుక్తవయసు రాగానే 1894 ఎప్రిల్ 2 న సింహాసనం అధిష్టిస్తాడు సాహు .

1900
వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం  చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం  చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడిoపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక  మంత్రాలు చదివి అవమానిస్తాడు . పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన , దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజ్ ని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైతది.

బాస్కరరావు జాదవ్ అనే ఉద్యోగిని ' సత్యశోధక్ సమాజ్ ' నడిపే బాధ్యతలు అప్పచెప్పి ' మరాఠ దీనబందు ' పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించిండు .

 
బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు , వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్దతిలో జరిగాయి.

తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో మత కర్మలలో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ  రంగాలతో పాటు వ్యాపారం , వడ్డీ వ్యాపారం లో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించిండు .

 
బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో , జీవితాల్లో మార్పు రాదని , బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని  సాహు భావించిండు .

తన ప్రైవేట్ సెక్రెటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యేట్  ( డిగ్రీ స్థాయి లేని ) అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియచేసింది. ఐతే ఆ రాజ్యంలో అప్పటికి గ్రాడ్యేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరు లేరు.

సమస్యను గుర్తించిన సాహు వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్ , హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపిండు . కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించిండు .

 
ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం.1901 లో జైన హాస్టల్ , విక్టోరియ మరాఠ హాస్టల్ , 1906 లోముస్లీంలకు , 1907 లో వీరశైవ లింగాయత్ లకు , 1908 లో అంటరానివారికి , మరాఠాలకీ 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి  నామ్ దేవ్ హాస్టల్‌ , విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు.

ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి  అందరికి , అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించిండు .

 
పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు  గ్రామాల్లోని అన్ని ఆలయాలను , చావడీలను పాఠశాలలుగా వాడాలనీ , ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీ గా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది.

 
ముస్లీంలకు వాళ్ళ మాతృ భాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి . ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే  కులపరమైన విద్యాసంస్థలని రద్దు చేస్తూ  అన్ని కులాల  , మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనెైన , విద్యా సంస్థలో నైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం .

వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి.
జులై 26 , 1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం , ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో '
 *
ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత '*  ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో *వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్* లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది .

వెనుకబడిన వర్గాలు అనగా బ్రాహ్మణ , ప్రభు , షెన్వీ , పార్శీ మరియు ఇతర అభివృద్ది చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు . ( Backward classes shall be understood to mean all castes other than brahmin , Prabhus, Shenvis , Parsees and other advanced classes .)

అంటరానివారి నుండి అన్ని మతాలలో వెనుకబడినవారు కూడా రిజర్వేషన్ కిందికే వస్తారు.

బాలగంగాధర తిలక్  లాంటి బ్రాహ్మణ జాతీయోద్యమ నాయకులు సాహు మహారాజ్ నడిపిస్తున్న పూలే వారసత్వ ఉద్యమాన్ని , పరిపాలన లో చేస్తున్న మార్పులని చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేస్తారు. దాడికి దిగుతారు.
గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే  ముఖ్యులైన పటేల్ ( పాటిల్ ) , పట్వారీ ( కులకర్ణి ) వ్యవస్థని 1918 లో రద్దు చేసిండు .

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినంకా దాదాపు 66 సంవత్సరాలకు రద్దైంది పటేల్ , పట్వారి వ్యవస్థ.

ఉపాద్యాయులుగా కూడా వారసత్వంగా పని చేయడాన్ని రద్దు చేసిండు . టీచర్ ట్రైనింగ్ మరియు పాటిల్‌ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించిండు.

 
విద్యారంగం లో సాహు కృషి కేవలం ఆక్షరాస్యత కే కాకుండా సంగీత, సాహిత్య , నాటక ప్రక్రియలన్నిoటిని ప్రోత్సా హించిండు .

సాహు ఆస్థానంలో అల్లాదియాఖాన్ అనే గొప్ప సంగీత విద్యావేత్త ఉండేవాడు .

రాజవల్లి అనే గొప్ప గాయనీ ఉoడేది.సాహు కాలంలో నాటక రంగం అభివృద్ది చెందింది. కొల్హాపూర్ జ్జ్ఞాన సమాజ్ , కిర్లోస్కర్ కంపెనీ , స్వదేశ్ - హితా చింతక్ వంటి నాటక సమాజాలకు ఉదారంగా విరాళాలిచ్చేవాడు .

భారత దేశంలో మొట్టమొదటి మహిళా నాటక సమాజమైన ' శేషశాని స్త్రీ సంగీత నాటక మండలి ' కొల్హాపూర్‌ కి చెందినదే .
సాహు ఏర్పరిచిన భూమిక పై నుండే వి.శాంతారాo , మాస్టర్ వినాయక్ షిండే లాంటి ప్రసిద్దులైన సినిమా దర్శకులు కొల్హాపూర్ ప్రాంతం నుండి వచ్చిండ్రు.

ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలిస్తే సరిపోదని తను చెప్పిన  ఆచరించి చూపిండు సాహు మహారాజ్ .

 
నిరక్షరాస్యుడైన గంగారామ్ కాంబ్లే అనే అంటరాని వక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను  టీ తాగి తన వాళ్ళందరికి తాగిస్తాడు .

 
పాలన నిర్వహణకి అవసరమైన విద్యార్హతలు లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకి తీసుకున్నాడు . రథచోదకులుగా ,మావటీలుగా ,రక్షకభటులుగా,నియమించిడు .
 *1919 ,
సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది.*

అంటరాని ఉద్యోగులతో ప్రజలు గానీ ,  ప్రభుత్వకార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే పిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు.

నేరస్తులు ఉద్యోగులైతే ఆరు వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దైపోతుంది .

60
సంవత్సరాల భారత ప్రభుత్వం తెచ్చిన ఎస్.సి. / ఎస్.టీ. అట్రాసిటీ చట్టం కూడా ఇంత బలమైనది కాదు.

1920
మే , 3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థ ని రద్దు చేస్తూ చట్టం చేసింది ప్రభుత్వం .

ఆ తర్వాత 55 ఏండ్లకు స్వాతంత్రం వచ్చినంకా 1975 లో మాత్రమే భారత ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలన చట్టం చేసింది .

గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగాలైన ' తలాతీ ' ( సుంకరి , గ్రామ రెవెన్యూ సహాయకులు ) లుగా అస్పృశ్యులే ఉంటారు కాబట్టి వాళ్ళందరికి ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు ట్రేనింగ్ స్కూల్స్ ప్రారంభించిండు.

 2010
వరకు ఆంధ్రప్రదేశ్ లో వీరికి శిక్షణ లేదు.

1919
నవంబర్ 6 న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోను , ఉద్యోగాల్లోను ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించిండు.

 
ఇప్పటికీ గ్రామీణ స్థాయి గ్రామ రెవెన్యూ సహాయకులకి ఈ సదుపాయం లేదు. కనీస వేతనాలు లేవు. గ్రామ పంచాయితీలలలో  పనిచేసే పారిశుద్య కార్మికులకు సంక్రాంతికి , దసరా పండుగకి లెక్కన బిక్షంగా లోకల్ ఫండ్ ఉంటే ఇస్తారు లేకుంటే లేదు.

ఆదివాసీ తెగలకు , అంటరాని వారికి సంబంధించి బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన ' నేరస్థ కులాల చట్టాన్ని ' 1918 లో రద్దు చేసిoడ్రు.

చమార్ ,  మహర్ , మాoగ్ , రామోషీ , బెరాద్ లాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడే కులాల ప్రజలు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చర్యతో రద్దైoది .


సాహు మహారాజ్ అంటరానివారికి ఆపద్భాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబా సాహేబ్ అంబేడ్కర్ సాహు మహారాజ్ ల మద్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటీష్ చట్టాలు మంచిచెడుల గురించి మాట్లాడుకునేవారు.

 
అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రికపెట్టాలనుకుంటున్నాననీ , ఐతే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానడంతో ఆ పత్రిక కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో ' మూక్ నాయక్ ' పత్రిక ప్రారంభమౌతది.

1920 ,
ఎప్రిల్ 15 న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు  అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు.

1920
లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహు మహారాజ్ . అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం ' మూక్ నాయక్ ' పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసిండు .

రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ , ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా,వ్యవహరించిండు సాహు .

1922
ఫిబ్రవరి 16న డిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ' ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్న మించి ఉన్న అంబేడ్కర్‌  ఇంగ్లాండ్ లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టం.

మీ జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేడ్కర్ ను మీరందరు ఆదర్శంగా స్వీకరించాలని , ఆయన స్థాయికి అందుకోవడానికి మీ అభివృద్ధికి కావలిసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన ' అంటూ మాట్లాడిండు.

పితృస్వామ్య , కుల , మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయి కి యూరోపియన్ టీచర్ ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించిండు.

సంగీతంలో , చిత్రలేఖనంలో , ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇప్పించిండు .

కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు .

ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు , ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు.

కొల్హాపూర్ రాజారాం కాలేజీ లో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పరిచిండ్రు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన , వసతి సదుపాయాలు కల్పించిండ్రు.

1919
జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టం  వచ్చింది.

1919
జులై 12న కులాంతర , వర్ణాంతర వివాహాలను  చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన ' కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ - 1918 '  ప్రకారం  ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు.

విడాకులు మంజూరు చేయడం లో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగష్ట్ 2 న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలను సృష్టించాయి.

1920
జనవరి 17న జోగిని , దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు .

ప్రభుత్వం దేవదాసీ ల పునరావాసానికి చర్యలు తీసుకుంది.

1919
జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు.

కొల్హా పూర్  ప్రాంతంలోని కోర్టులన్నిoటిలో  సివిల్ , క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండేది. రోజుకి ఎన్ని కేసులు విచారణ జరుపుతామనే అంచన లేక పెద్ద సంఖ్యలో పిలవడము చాలా మంది కేసు బెంచ్ మీదికి రాకనే తిరిగి పోవడం పదే పదే జరుగడంతో చాలా మంది పేదలు ఇబ్బంది పడేవారు.

ఈ సమస్యకి పరిష్కారంగాను 1919 అక్టోబర్ 17న చట్టం చేస్తూ రోజు కు కేవలం మూడు కేసులకి మించి విచారణకు స్వీకరించకూడదు.అక్కడ సరైన న్యాయం జరగలేదని ఏ పౌరుడైనా భావిస్తే నేరుగా మహారాజ్ ని కలవచ్చు.

 
సాహు 1920 లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రం లోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందిన ' హిందూ పర్సనల్ లా ' లో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది.


ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మద్యే ఉంటూ సమస్యలు తెలుసుకుంటా  ప్రజల భాషలో మాట్లాడేవాడు . పరిపాలనలో ప్రజలకు అర్ధం కాని , ప్రజలకు ఇబ్బంది కల్గించే బ్రాహ్మణ గుమాస్తాల , పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలన వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చి లో నిర్ణయం తీసుకున్నాడు .

 
తెలంగాణాలో నైజాం పాలన తర్వాత కూడా కొన్నాళ్ళు మోడి లిపి రెవెన్యూ రికార్డుల్లో వాడబడింది.

కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను , రుణాలని మాఫీ చేసిండు .అప్పుల కింద రైతుల ఆస్తులని , పనిముట్లనీ , పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894 లోనే చట్టం చేసిండు.

 1918
లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు  చేసిండు .

రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినపుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పని చేయించిండు. రాధానగరి , పనాలా , కరవీర్ , శిరోల్ వంటి ప్రాజెక్ట్ లని నిర్మించిండు . ' కింగ్ ఎడ్వర్ట్ అగ్రికల్చరల్ ఇన్సిట్యూట్ ' ద్వారా రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిండు.

తన తండ్రి పేరుతో ఏర్పరచిన ' జైసింగ్ రావు ఘాట్గే టెక్నికల్ ఇన్సిట్యూట్ '  ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి.చక్కరకర్మాగారాలు ,బట్టల మిల్లులు,గోనే సంచుల ఫ్యాక్టరీలు,చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి.

స్వాతంత్రo గురించి సాహు 1917 , డిసెంబర్ 27 నాసిక్ లో జరిగిన సభలో ' ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యం గానే తయారవుతుంది.

స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా , ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి.. అని అన్నాడు.

బొంబాయి ప్రెసిడెన్సి బ్రిటీష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్ కు 1917 , డిసెంబర్ 29 న లేఖ రాస్తూ ' వెనుకబడిన కులాలను , ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాoగం లో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం .

ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్ళలో వెనుకబడిన కులాలకు , అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలని  కోరిండు .

ముంబాయిలో కార్మికుల ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ' రష్యా , జర్మనీ , ఇంగ్లాండ్ లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి ' అన్నడు.


1917
లో మరాఠ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ' నేనిక్కడికి ఒక మహారాజ్ గా రాలేదు ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా , రైతుగా భావించవచ్చు.

నా పూర్వీకులు ఇదే పని చేశారు ' అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి , సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

అందుకే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఇలా అంటాడు
'
సాదారణ రైతు కుటుంబానికి , వెనుకబడిన కులానికి  చెందిన జ్యోతిబాపూలే సామాజిక ఉద్యమ కారుడు కావడంలో ఆశ్చర్యo లేదు.

కానీ ఒక రాజు  అయిన సాహు మహారాజ్ ఇoత నిబద్దతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం.కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టీస్ పార్టీ ఉద్యమంతో పాటు  భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6 , 1922 న మరణించిండు .

అతని మరణాంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతర పురోహితుల చేత జరిగాయి.
(
నేడు 97 వ మహా పరినిర్వాణం సందర్భం గా )
🌹🌹🌹🌹🌹🌹
     
ఒకరకం గా చెప్పాలంటే ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే అందుకు కారణం మన తాత సాహూ మహారాజా వారే కారణం
బాబాసాహెబ్ కి స్కాలర్ షిప్ ఇవ్వకుంటే , ఏమయి పోయేవాళ్ళమో.
🙏✊JAI SHAHUJI MAHARAJ✊🙏
🙏✊JAI BHEEM ✊🙏